మత్స్య మహా పురాణము
290 - పురాణ విషయాను క్రమణిక
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: విశ్వ రూపుడగు మత్స్య జనార్దనుడు ఏది చెప్పెనో అట్టిదియు ధర్మకో మార్థ నామక పురుషార్ధత్రయ సాధనమునునగు మాత్స్య పురాణమును ఏ మాత్రమును వదలక సర్వమును ఇదిగో మీకు చేప్పితిని; దీని యందు 1. మొదటి అంశము మత్స్యమను నంవాదము; తరువాత వరుసగా, 2. బ్రహ్మాండ సృష్టి ప్రతి పాదనము 3. శారీరక సాంఖ్య తత్వ వివేచనము. 4. బ్రహ్మకు చతుర్ముఖోత్పత్తి. 5. దేవాసురుల ఉత్పత్తి. 6. మారు తోత్పత్తి. 7. మదనద్వాదశీవ్రతము. 8. లోక పాలుర అభి షేచనము. 9. మన్వంతరములను ఉద్దేశించుట (పేర్కొనుట) 10. వైన్య(పృథు)రాజాభివర్ణ నము. 11. సూర్యోత్పత్తి. 12. వైవస్వతోత్ప త్తి. 13. బుధుని సంగమనము. 14. పితృ వంశాను కథనము. 15. శ్రాద్దకల్ప ప్రతిపాదనము. 16. పితృతీర్థ ప్రసం) చారము. 17. సోమోత్ప త్తి. 18. సోమవంశ కీర్తనము. 19. యయాతి చరితము. 20. కార్తవీర్యుని మాహాత్మ్యము (గొప్పదనము) - 21. వృష్టివంశాను. కీర్తనము. 22. విష్ణునకు భృగుద త్తవము. 23. దైత్యులకు భృగుళాపము. 24. పూరువంశ కీర్తనము. 26, ఆగ్ని వంశ వర్ణనము. 26. పురాణ సంఖ్యాను కీర్తనము. 27. క్రియాయోగము. 28. నక్షత్ర పురుషవ్రతము. 29. మార్తాండశ యనవ్రతము. 30. కృష్ణాష్టమీవ్రతము. 31. రోహిణీ చంద్రవ్రతము. 32. తటాక నిర్మాణ విధి మాహాత్మ్యము. 33. పాదపోత్సవము. 34. సౌభాగ్యశయన వ్రతము. 35. ఆగస్య వ్రతము. 36. ఆన నతృతీయావ్రతము. 37. రనక ల్యాణినీ వ్రతము 38. ఆర్గానందతృతీయావ్రతము. 39. సారస్వత వ్రతము. 40. గ్రహణ స్నా నవ్రతము. 41. న ప్తమీ న్న పనవ్రతము. 42. భీమద్వాదశీవ్రతము. 43. ఆనంగశయన వ్రతము. 44. అశూన్యశయనవ్రతము. 45. అంగారకవ్రతము. 46. కల్యాణ స పమీ పభృతి సప్తమీ వ్రతస ప్రకము. 47. విశోక ద్వాదశీవ్రతము. 48. పది విధములగు మేరుపర్వత దానవతము. 49. గ్రహశాంతి. 50. గ్రహస్వరూప కథనము. 51. శివచతుర్దశీవ్రతము. 52. సర్వఫలత్యాగవతము. 53. సూర్యహర వ్రతము. 54. సంక్రాంత్యుద్యాపనవ్రతము. 55. విభూతి ద్వాదశీవ్రతము. 56. షష్టి(30)వ్రత మాహాత్మ్యము. 57.స్నాన విధిక్రమము. 58. ప్రయాగ మాహాత్మ్యము. 59. భువనకోశ వ్యవస్థా వర్ణనము. 60. ఐలాశ్రమ(పురూరవ ఆశ్రమ) ఫల వర్ణనము. 61. ద్వీపాను కీర్తనము. 62. ఆంతరిక్షచార వర్ణనము. 68. ధ్రువ మాహాత్మ్యము. 64. సురేంద్ర భువన వర్ణ నము. 65. త్రిపుర దాహ వృత్తాంతము. 66. పితృపిండదాన మాహాత్మ్యము. 67. మన్వంతరవి నిర్ణయము. 68. వజ్రాంగ నంభవము. 69. తార కోత్పత్తి. 70. తారకాసుర మాహాత్మ్యము. 71. బ్రహ్మదేవాను కీ ర్తనము. 72. పార్వతీ సంభవము. 78. శివతపోవన వర్ణనము. 74. మన్మథ దహనము. 75. రతిశాకము. 76. గౌరీ తపోవన స్థితి వర్ణనము. 77. శివాను గ్రహము. 78. పార్వతీ ఋషి సంవాదము. 79. పార్వతీ కల్యాణము. 80. కుమారోత్పత్తి. 81. కుమార విజయము. 82. తారకవధము. 88. నార సింహావతార వర్ణనము. 84. పాద్మకల్ప సృష్టి వర్ణనము. 85. ఆంధకవధము. 86. వారా ణసీ మాహాత్మ్యము. 87. నర్మదా మాహాత్మ్యము. 88. ప్రవరాను కీ రనము. 89. పితృగాథాను కీర్తనము. 90. ఉభయ ముఖీ గోదానము. 91. కృష్ణాజినదానము. 92. సావిత్ర్యుపాఖ్యానము. 93. రాజధర్మాను. కీర్తనము. 94. యాత్రాకాల నిమిత్తములు. 96. మంగళకర స్వప్నాను .కీర్తనము. 96. వామన మాహాత్మ్యము. 97. వారాహ మాహాత్మ్యము. 98. క్షీరసాగర మథనము. 99. కాలకూట దమనము. 100. దేవాసుర యుద్దము. 101. వాస్తువిద్య. 102. ప్రతిమాలక్షము. 103. మండప లక్షణము. 104. ప్రాసాద లక్షణము. 105. పతిషావిధి. 106. భవిష్య దాజాను కీర్తనము. 107. షోడశ మహాదానాను కీర్తనము. 108. కల్పాను కీర్తనము. 109. గ్రంథానుక్రమణి కథనము. (108 వరకే గ్రంథమందలి ప్రధానాంశములుగా పెద్దలు లెక్కించదలచిరని తోచును.) అను నివి ఈ మత్స్యపురాణమందలి ప్రధాన ప్రతిపాద్య విషయములు.
ఈ మత్స్య మహాపురాణము పవిత్రము ఆయుః ప్రదము యశోవృద్దికరము పవిత్రతరము శుభకరము, మహా పాపహరము శుభస్వరూపము; ఈ పురాణము వలన నరులకు సుకృత(సత్కర్మముల నాచరించినందువలన కలుగు) ఫల ములు లభించును; అనేక తీర్థవంక్తులయందు స్నాన మాడుటచే సమస్త ధర్మముల నాచరించుటచే కలుగు మహాఫలములు నదా లభించును; ఈ పురాణము ఉత్తమము. నర్వదోష విఘాతుకము; ఇది మత్స్యరూపుడగు హరి ఏకార్ణవమందు మనువు నకు చెప్పినట్టిది; (అత్యంతము ప్రాచీనమయినది.) ఈ పురాణమునుండి యొక శ్లోకపాదమునైన పఠించువాడు కూడ సర్వ పాపముక్తుడై నిశ్చయముగ నారాయణ స్థానము నందును; ఆ మన్మథునివలె దివ్యసుందర శ రీరుడై సుఖి యగును.
రహస్య తత్వ ప్రతిపాదకమగు ఈ పుణ్య పురాణమంతయు శ్రద్ధాయుక్తుడయి వినువాడు కూడ హరుని యను . గ్రహము వలన అశ్వమేధయాగ మాచరించి తత్పూర్తిగా అవభృథ మాచరించినవా డందు మహాఫలము నందును.
ద్విజులారా! ధర్మజ్ఞుడు (ధార్మికుడు-ధర్మము నెరిగి యనుష్ఠించువాడు) శివుని విష్ణుని బ్రహ్మను సూర్యుని, ఆర్చించిన తరువాత ప్రతిదినమందును) శ్రద్దాయుక్తుడై ఈ మహాపురాణమునుండి శ్లోక మునో శ్లోకార్థమునో శ్లోకపాదమునోఐన తాను వినునో ఇతరులకు వినిపించునో అట్టివానికి కలుగు ఫలమును వినుడు; బ్రాహ్మణుడు విద్యను క్షత్రియుడు భూమిని వైశ్యుడు ధనమును శూద్రుడు సుఖమును పొందును. ఈ పురాణమంతయు వినినచో ఆయుష్మంతుడును పుత్తవం తుడును లక్ష్మీవంతుడును పాపరహితుడును శత్రువులచే ఆపరాజితుడును నగును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున సూత ఋషి సంవాదమున మత్స్యపురాణ ప్రతిపాదిత విషయానుక్రమణియు పురాణ శ్రవణఫల ప్రతిపాదనమునను రెండు వందల తొంబదియవ అధ్యాయము.
శ్రీ మత్స్య మహాపురాణము సర్వమును సమాప్తము.
పుట. పంక్తి తప్పు ఒప్పు
651 34 దగోసౌ దగ్ధోఽసౌ
685 22 వాల్లభ్యేని వాల్లభ్యేన
685 23 పతేర పతేరజ్జ్గ
776 15 కస్సస్తి కస్స్వస్తి
780 28 రవి రవి
8881 13 జై హ్యాపుడు జై హ్మ్యపుడు
1042 11 సూర్య సూర్యసత్య
1042 17 పాదములందు పితరులును హృదయమందు. అని చదువుకొనవలెను.
1109 1 క్రియాయోగ క్రియాయోగ
