మత్స్య మహా పురాణము

Table of Contents

85 - సువర్ణ పర్వత దానము

 ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను : ఇప్పుడిక సువర్ణ పర్వత దాసమును తెలుపుదును. అది పాపహరమును ఉతమమును. దానిని చేసిన పుణ్య ప్రభావమున మానవులు బ్రహ్మలోకమున సుఖింతురు. దీని కై బంగారు వేయి పలములు కాని ఐదు వందల పలములు కాని దానిలో సగముకొని మరియు శ క్తిలేనివాడు యథాశ క్తిగ బంగారు వినియోగించ వచ్చును. ఒక పలమునకు తక్కువ కాకుండవలెను. కాని ఈ విషయమున ఇతరులతో పోటీపడరాదు. ప్రతి అంశము నందును ధాన్య పర్వతమునందువలెనే చేయవలెను. అట్లే విష్కంభ శైలములను ఋత్విక్కులకు దానమీయవలెను. సువర్ణ పర్వతమా! బ్రహ్మ విద్యా స్వరూపమవు; బ్రహ్మదేవుని గర్భమవు; (బీజమవు;) అనంత ఫలమునిచ్చు దానవు; అగ్ని కి సంతానమవు; పరమాత్ముని ఆల్ఫాంశ రూపమపు; కావున స్వర్ణ పర్వత రూపమున నీవు నన్ను రక్షించుము. ఈ విధాన మున సువర్ణ పర్వత దానము చేయువాడు - పరమానంద ప్రచ మగు బ్రహ్మ లోక మునుచేరి అచట నూరుకల్పములపాటు సుఖించి చివరకు మోక్షమునందును.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున కనక పర్వత దాన మాహాత్మ్య కథనమను ఎనుబది ఐదవ అధ్యాయము.