మత్స్య మహా పురాణము

Table of Contents

280 - హిరణ్యాశ్వ రథ దాన విధానము. 

శ్రీమత్యుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఇపుడిక అను త్తమమును పుణ్యకర మును మహాపాతక నాశనమునునగు హిరణ్యాశ్వరథ దానమను మహాదానమును వివరింతును; పుణ్యకరమగు శుభదినమందు తులాపురుష దానమందువలేనే బ్రాహ్మణులచే స్వస్తి పుణ్యాహవాచనమును లోక పాల వాహనమును జరిపించవలయును; ఋత్విజులను మండపమును సంభోరములను వస్త్రములను భూషణములను కూడ అందువలెనే సమకూర్చుకొనవలయును; కృష్ణాజినమునందు నూవు లుంచి వానిపై రథమునుంచవలెను; దానికి ఎనిమిది గాని నాలుగుగాని అశ్వములు నాలుగు చక్రములు కూబరము ధ్వజ స్థానమున ఆష్టలోకపాలుర ప్రతిమలతో పద్మరాగ దళములతో కూడిన ఇంద్రనీల కుంభమునుండవలెను; నాలుగు పూర్ణ కలశములును అష్టాదశ ధాన్యములును పట్టు వస్త్రముల జతయు వీని పై వితానకము ( మేలుకట్టు)ను పూవులును చేరకు గడలును పురుష ప్రతిమయు ఛత్రచామరములును పాదుకలు పాదరక్షలు నుండవలెను; ఎవరు ఏదేవుని భక్తులో ఆ దేవుని పేరుతో అధివాసనము జరుపవలయును; రథాదికమునకు బంగారమును మూడు వేయి పలముల నడుమ తక ముతో వాడవలెను; యథాశక్తిగ గోవులను శయనాదిక మును గూడ ఈయవలయును; ఈ రథమందు ఎనిమిది నాలుగో రెండో గురములును బంగరుతో చేసిన సింహధ్వజమును చక్రరథులుగా అశ్విదేవతలును నుండవలెను; శుభ సమయమున వేనుక చెప్పినట్లు విపులచే స్నానము చేయించుకొనిన యజమానుడు తెల్లని వస్త్రములను పూవులను ధరించి పూవులు దోసిట పట్టి దేవతాదులను బ్రాహ్మణులను ఆగ్ని ని రథమును ముమ్మారు ప్రదక్షిణించి ఇవి దాన మీయవలెను; అపుడి మంత్ర ముచ్చరించవలెను:

“పాప వినాశనుడును విశ్వాత్ముడును వేదాశ్వుడును ధామము (తేజస్సు)ల కధీరుడును పారాసులకు దావాగ్ని యు. నగు దివాకరునకు నమోనమః; దేవా! మాకు శాంతినిమ్ము; అష్ట వసువులకు ద్వాదశాదిత్యులకు మరుద్గణములకును నీవే కర్తవు-పరమాశ్రయమవు; కావున నీ దయచే మా హృదయము పాపనాశ మంది ధర్మైకాశ్రయమగుగాక !"

ఇట్లు సంసార భయనాశకమగు హిరణ్యాశ్వరథ దానమాచరించువాడు కలుష రాశి విముక్తశరీరుడై పినాక పాణియగు శివుని పరమపదమందును; దేదీప్యమాన శ రీరుడై సర్వజేతయగు ప్రభావముగల ఆఖండిత చండ భానుని మండలమాక్ర మించి సిద్దాంగనా నేత్రములను తుమ్మెదలు తన ముఖ కమలమందలి యండమను తేనెను త్రోవుచుండ బ్రహ్మతోకూడి సుచిర కాలము సుఖించును. ఇందలి ఈ హిరణ్యాశ్వ రథదాన కల్పమును చదివినను విన్న ను తత్ఫ లముగా నరక పుర మునకు పోక నరక శత్రుని పురమునకు పోవును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్యాశ్వరథ ప్రదాన విధానమను రెండు వందల ఎనుబదవ అధ్యాయము.