మత్స్య మహా పురాణము

Table of Contents

 230 - అగ్ని వైకృతశాంతి.

(* ప్రజ్వలే దప్సు మాంసం వా)

 గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను: ఏ రాష్ట్రమునందు ఇంధనములు లేక యే ఆగ్ని మండునో ఇంధనములుండియు అగ్ని జ్వలించదో ఆ రాష్ట్రమున శత్రు రాజులచే పీడ కలుగును; నీటితో తడిపిన వస్తువులును పచ్చి వస్తువులును మండు టయు నీరు పోసినను మంటలారకుండుటయు ప్రాకారములు పుర ద్వారములు ద్వారములు రాజాలయ దేవాలయములు మండు టయును మెరపుల నుండి నిప్పంటుకొని వస్తువులు కాలుటయు జరిగిన చో రాష్ట్రపు రాజునకు భయము కలుగును; రాత్రి కాక యే దూళి రేగకయే చీకట్లు క్రమ్ముట ఆగ్ని లేక యే పొగ కమ్ముట జరిగినచో మహాభయము కలుగును; ఆకాశమున మేఘము లేక యే మెరపులు కనబడుట రాత్రి గగనమున నక్షత్రములు కనబడకుండుట పగలు ఆకాశమున నక్షత్రములు కనబడుట జరిగినను భయము కలుగును; గ్రహ నక్షత్ర తారలయందు పుర వాహనయాన చతుష్పాత్ మృగపక్షులందును స్వభావ విరుద్ధములగు వైకృతములు కనబడినను అవులుదూడలు మొదలగునవి ఆస్వాభావికముగ ప్రవర్తించినను ఆయుధములు మండినను పొగలు క్రమ్మినను ఒరలనుండి తమంతతాము వెలికివచ్చినను యుద్ధము సంభవించును; అగ్ని లేక యే నిప్పురవ్వలు రేగినను ఎక్కు పెట్టకయే తమంతతామే ధనువులు పూరింపబడినను ఇట్టి వికృతములింక ను ధనువుల యందును ఆయుధములందును కనబడినను యుద్ధమగును.

ఇట్టి సందర్భములలో పురోహితుడు మూడునాళ్ళుపవసించి సునమాహితుడై పాలుగల వృక్షముల సమిధలతోను ఆవలతోను నేతితోను ఆగ్ని దేవతాక మంత్రములతో హోమము చేయవలెను; బ్రాహ్మణులకు భోజనమును గోభూ సువర్ణ వస్త్రదానమును జరుపవలయును; ఇట్లు చేయుటచే ఆగ్ని వై కృతోపద్రవము శాంతించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ఆగ్ని వైకృత శాంతి కథనమను రెండు వందల ముప్పదియవ అధ్యాయము.