మత్స్య మహా పురాణము

Table of Contents

279 - హిరణ్యాశ్వ దాన విధానము.

శ్రీమత్సుడు మనువునకిట్లు చెప్పెను: ఇపుడిక షోడశమహాదాన క్రమమునందలి పొర ణ్యాశ్వదాన విధానమునుల ఉత్తమమయినది; దీని నీచ్చీనందువలన దాత భువనములందు విలక్షణముగ ఆనంతమగు ఫలము నందును; పుణ్యకరమగు శుభతిథియందు ఏపులచే పుణ్యాహవాచనమును లోకపాలకోవాహనమును ఋత్విజులను మండప మును సంభారములను భూషణములను వస్త్రములు మొదలగు వానిని తులాపురుష దానమునందువలెనే జరుపవలెను; స్వల్ప ప్రక్రియతో జరుపదలచినవారు ఏకాగ్ని విధానముతోనే ఈ హిరణ్యాశ్వ దాన యజ్ఞమును జరుపవలేను; బంగరు గుర్రమును. తన శ క్తి ననుసరించి మూడు పలములకంటే ఎక్కువగ సహస్ర పలములకు మించని బంగారుతో చేయించి దానిని వేదీ మధ్యమందు కృష్ణాజినము పై నూవులయందు పట్టువస్త్రములతో చుట్టి ఉంచవలయును; దాని దగ్గర పాదుకలు పాదరక్షలు. ఛత్త చామరానన పొత్రములు ఎనిమిది పూర్ణ కుంభములు మాల్యములు చేరకుగడలు ఫలములు ఉపన్కరములతో కూడ శయ్య బంగరు సూర్యుడు- ఇవి యన్ని యు ఉంచవలెను; తరువాత యజమానుడు బ్రాహ్మణులచే సరౌషధీ స్నానము జరి పించుకొని దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్ర ముచ్చరించవలయును:

“నర్వదేవేశా: రూపమున వేదములను తెచ్చుటయందు ఆసక్తి కలవాడా! (హయగ్రీవ) ఆశ్వరూపముతో నీవును మమ్ము నంసార సాగరమునుండి రక్షించుము; భాస్కరా! నీవే ఛందోరూపమున ఏడుగానయి. (వేదమునందలి ప్రధాన ఛందస్సులు ఏడు మాత్రమే) లోకములను ప్రవర్తిల్లజేయుచున్నావు; కావున ఇట్టి నీవు మమ్ము రక్షించుము.”

ఇట్లుచ్చరించి ఆయశ్వమును గురువునకు అర్పించవలయును; దాని ఫలముగా పాపక్షయమగుటవలన శాశ్వత మగు భాను లోకమును పొందును; తరువాత యథాశక్తిగా గోవులతో ఋత్విజులను పూజించవలయును; నర్వధాన్యోప కరణములను గురునకు ఈయవ లేను. శయ్య మొదలగునవికూడ (పాత్రులకు) దానము చేసి తైలరహితమగు ఆహారమును భుజించవలయును; పురాణ శ్రవణమును భోజనాదికమును జరిపించవలెను.

ఈ హిరణ్యాశ్వ దాన మొనర్చినవాడు పాపముక్తుడై స్వర్గమున సిద్దులచే ఇతర దేవసంఘములచే పూజితు డగుచు నారాయణపదప్రాప్తు డగును; దీనిని పఠించువాడును సకల పాపముక్తుడై అశ్వ మేధఫలము నందును; కనకమయ విమానమున రవిలోక మేగి ఆట అప్పరః పూజితు డగును; అల్పధన పురుషుడు దీనిన వినినను చూచినను స్మరించి మెచ్చి నను అట్టివాడును పాపనాశమున శుద్ధ దేహుడై ఇంద్ర రుద్రాదులు వసించు లోకము లందును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్యాశ్వ ప్రదానీకమను రెండు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.