మత్స్య మహా పురాణము

Table of Contents

110 - ప్రయాగ మాహాత్మ్యము

నందికేశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: అంతట యుధిష్ఠిరుడు మార్కండేయ వచనమున సోదరులతోను పత్ని యగు ద్రౌపదితోను కూడి ప్రయాగ కేగి స్నానమాడి నిత్యానుస్థానముదీర్చి బ్రాహ్మణుల నమస్కరించి గురువులకు (పూర్వులగు పెద్దలకు) దేవతలకు తర్పణము ఇచ్చెను. క్షణములో వాసుదేవుడును అక్కడ కేతెంచెను. మాధవుడును వారలందరచే పూజింపబడి పిమ్మట యుధిష్ఠిరు నభి షేకించేను. అంతలోనే మార్కండేయ మహా మునియు నతనికి స్వస్తి వచనము పలికి క్షణములో తన యాశ్రమమేతెంచెను. యుధిష్ఠిరుడు మాత్రము భ్రాత్రాదులతో కూడి యటనేయుండి మహా దానము లాచరించెను. ప్రాతః కాలమున మేల్కాంచి ఈ మాహాత్మ్యమును పఠించు నరుడు సర్వపాప వినిర్ముకుడే రుద్రలోక ప్రాప్తుడగును.

 ఈ అనంతరము శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో ఇట్లనెను: యుధిష్ఠిరా! నాయందలి స్నేహముతో నొవాక్యమిది ఆచరించవలయును. నిత్యమును సంతాపర హిత చిత్తముతో ఈ ప్రయాగయందు దేవతల యజించుచు హోమములు జరుపుచుండుము. మరల మార్కండేయుడు యుధిష్ఠిరునితో ఇట్లనెను. రాజా! తరువాత కూడ నిత్యమును - ప్రయాగను స్మరించుచుండుము. నిస్సంశయముగా దాన నీవు స్వర్గ సుఖములనందగలవు. ఏలయన నరుడెవ్వడేని ప్రయాగ కేగినను నట వసించినను సర్వపాప విముక్తుడై రుద్రలోకమున పూజితుడై సుఖించును. మహీపతీ! ఋషులును దేవతలునెన్నియో యజ్ఞ క్రతువులు ప్రవచించిరి. దరిద్రుడవి చేయజాలడుక దా! యజ్ఞములకు బహూపకరణములును నానా సంభార వి సరములును కావలయును. అట్టివి భూపతులకు మాత్రముగాని ధనవంతులకుగాని లభ్యములగును. కాని దరిద్రులకును పొంద సులభమగు విధానము యజ్ఞఫలతుల్య ఫలప్రదమై పుణ్యప్రదమగునది కలదు; తేలి పెదను. ఇది ఋషులకును త త్వమెరుగరానీ గుహ్య విషయము. తీర్థయాత్రా గమనము యజ్ఞములకంటే విశిష్టతర పుణ్యప్రదము. ముప్పది కోట్ల పదివేల తీర్థములు మాఘచుసమున గంగయందు చేరియుండును. (ఇది ఎరిగి) నీవు స్వస్థతనందుము. అకంటకముగ రాజ్యము ననుభవించుము. నీవు యజమానుడవయి (యజ్ఞముల నాచరించుచు) నన్ను మరల చూతువుగాని; అని యిటు పలికి మార్కండేయుడు యుధిష్ఠిరుని పట్ల యెదుటనే అంతర్ధానమందెను. యుధిష్ఠిరుడును మరల యథావిధానముగ సపరివారముగ ప్రయాగయందలి గంగా యమునా సంగమమున స్నానమాడి పరమానందము నందెను. కావున దేవరీ! నారదా! నీవును బయలు దేరి ప్రయాగ కేగుము. ఆసీ నారదునితో పలికి నందికేశ్వరుడు అంతర్థానమందెను, నారదుడును ప్రయాగాభిముఖుడై బయలుదేరెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య పరిసమాప్తియను నూట పదియవ అధ్యాయము.

క్రియా యోగ ప్రకరణము ముగిసినది.

 [ఈ క్రియా యోగము, 52వ అధ్యాయము నారంభమునుండి 110 అధ్యాయాంతము వరకు ఇచట ఈయబడినది. మరల 267వ అధ్యాయారంభమునుండి 288వ అధ్యాయాంతము వరకు ఇది ప్రతిపాదింపబడును.

  -అనువాదకుడు]