మత్స్య మహా పురాణము
179 - వారాణసీ మాహాత్మ్యము॥ పింగళుడు గణేశుడు అన్నదాత క్షేత్రపాలకుడు-అగుట
ఋషులు సూతుని ఇట్లడిగిరి॥ సూతా! నీవు చెప్పగా అంధకవధ వృత్తాంతమును వింటిమి॥ ఇపుడు వారాణసీ వృతాంతమును వినగోరుచున్నాము॥ భగవానుడగు పింగళుడు ఏ యోగ్యతచే గణములలోనివాడు ఆయ్యెను? ఆ మహా తేజశ్శాలి ఈ వారాణసియందు అన్న దాత యు ఆ క్షేతమునకు పాలకుడును ఎట్లు అయ్యెను? శివునకు ప్రియుడే ట్లయ్యెను? బ్రహ్మసుతా! ఇది నీవు చెప్పగా వినవలయునని మాకు కుతూహలముగా నున్నది॥ అన సూతు డిట్లు చెప్పసాగెను॥
పింగళుడు గణేశు డెట్లయ్యెనో అన్న దాత ఎట్లయ్యెనో తెలి పేదను వినుడు; లోకములలో వారాణసి పూజ్యమగు ' : స్థానము; ఇది ఇట్లుండ) పరభద్రుని కుమారుడు॥ పూజ్యుడు ప్రతాపవంతుడు నగు హరి కేశుడు అను యక్షు డొక డుండెను॥ అతడు బ్రాహ్మణుడు { వేదోక విషయముల నెరిగి వాటియందు పూజ్యతా భావము కలవాడు;) ధర్మానుష్ఠాన పరుడు; అతనికి పుట్టుక మొదలు శివునియందు అత్యుత్తమభక్తి ఉండెను॥ అతడు ఎప్పుడును అతనినే నమస్కంచును; అతనియందు చిత్ర ముంచును; అతడే తనకు గమ్య మనుకొనును; కూరుచుండియు పోపుచుండియు పండుకొనియు నిలు చుండియు ఒకరి వెనుక పోపుచుండియు తినుచుండియు త్రోవుచుండియు రుదునే ఆనుచింతించుచుండును; ఇట్లు సమా హిత మనస్సుకల అతనితో తండ్రియగు పూర్ణభద్రు డిట్లనెను: నీవు నా కుమారుడవని నాకు తోచుట లేదు; నీవు మరి యొక విధముగా తప్పుగా జన్మించితివి॥ ఏలయన యక్ష జాతీయులకు॥ ఈ నడువడియుండనే ఉండదు సుమాః గుహ్యకు లగు (యములగు) మీరు (మనము) స్వభావముచే క్రూరచిత్తులుగా నుందురుము); యకులు మాంసాహారులు నీచాహారులు హింసాశీలురు నగుదురు; నీవు ఇట్లు చేయకుము; ఇది నీకు తగిన నడువడి కాదు; - మహాత్ముడు స్వయం భూ ప్రజాపతి మనకేది యాడేశించేనో దానిని విడువదగదు; మన ధర్మమేదియో అది గ్రాహ్యము; గృహస్థు లగువారు మరియొక (బ్రహ్మచర్య వానప్రస్థ సంన్యాసములవంటి ఆశ్రమ ఏధులను పాటించరు కదా! అట్లే మనమును మన జాతి ధర్మమును విడువరాదు; కనుక నీ వీ మనుష్య స్వభావమును విడిచి మనకు తగిన వివిధ కర్మల నాచరించుము; ఇట్లు నీవు (వేర గు) మార్గమునందు ఉన్నా వనిన నీవు మనుష్యుని వలన జన్మించియుందువు; నేను కూడ ఆయా కర్మల నాచరించుచున్న మాట నిజమే; కర్మము స్వజాతీయము పరజాతీయముననీ రెండు విధములు; మనుష్యు లాచరించు కర్మములు వారి జాతికి విహితములు; నేను మన జాతికి విహితములగు కర్మము లాచరించుచున్నాను; కాని నీవు నీ జాతిధర్మము విడిచి మను ష్యుల వలె ఆచరించుచున్నావు; ఇది మనకు తగదు॥
ప్రతాపవంతుడగు పూర్ణభద్రుడు ఇట్లు పలికి అనంతరము నిష్ఠురముగా “పుత్తా! త్వరగా వెడలిపొమ్ము; నీ ఇచ్చ వచ్చినచోటికి పోవచ్చును॥” అనెను॥ అంతట అతడు ఇట్లు చుట్టములను విడిచి బయలు వెడలి వారాణసి చేరి ఆట దుశ్చరతపమాచరించెను॥ అతడు మొద్దు ఆయ్యెను; ఎండిన కొయ్యవలె రాతివలే నయ్యెను; రెప్పవాల్చ కుం డెను; ఇంద్రియ నిగ్రహముతో మౌనముతో నిశ్చలుడై యుండెను॥ ఇట్లతడు అనిశము శివపరుడయి శివునే కోరుచు వేయి దివ్య వత్సరములు గడ పెను॥ అతని పై పుటలు కమ్మెను; అతనిని చేద పురుగులు తినేను; వాడి ముక్కులుగల వజ్రసూచీ ముఖములను (వజ్రపు సూదివంటి ముక్కుగల) పురుగులు కుట్టెను॥ అతని శరీరము మాంసము రక్తము లేక చర్మము మాత్రను మిగిలి శంఖమువలె చంద్రుడువలే తెల్లగ నయ్యెను; శరీరము అంతయు అస్థి శేషమయ్యెను॥ ఐన నతడు దేవుని ధ్యానించుచునే ఉండెను॥
ఈ నడుమ కాలములో పార్వతీదేవి శంకరునితో “ఈ కనబడుచున్న) ఉద్యానమును ఎప్పుడును చూచుచునే ఉండవలెననియు ఈ వారాణసీ క్షేత్ర మాహాత్మ్యము వినవలయుననియు నాకు కుతూహలము; నీ కిది అత్యంత ప్రియము అగుటను బట్టి ఈ క్షేత్రము ఉత్తమ ఫలము నిచ్చునదయియుండవలయును॥ ఇట్టి ఈ వారాణసీ మహిమము తెలియ వేడె దను॥" అని విజ్ఞప్తి చేసెను॥ హరుడు ప్రశ్నా నుగుణముగా వారాణసీ మహిమ మా మెకు చెప్పదలచెను॥ అందుల కై ముం ' దుగా దేవేశుడా శంకరుడు దేవితో కలిసి బయలుదేరి ఆ పినాకధారి దేవి కుద్యానము చూపుచు ఇట్లు వర్ణించసాగేను॥
దేవీ, చూడుము; ఈ యుద్యానము మిగుల బాగుగ వికసించిన తీగల గుబురులతోను పొదలతోను శోభితము; తీగల సమూహముతో వ్యా ప్తము; ఇది బాగుగ పూలు పూచిన ప్రియంగు వృక్షములతోను చక్కగ పూచియు తమకు స్వాభా వికమగుముండ్లతో కూడిన చెట్లతోను గగుర్పాటు చేందినదీవలే మనోహరముగా నున్న ది; మంచి వాసనల ఇచ్చు తమాలవన వాటితోను వృక్షపు గుబురులతోను విపులములగు కర్ణికారము పచ్చగన్నేరు)లతోను పూచిన ఆశోకపున్నాగ వృక్షకములతోను వ్యా ప్రమయియున్న దీ; ఇచటి పుష్ప సమూహములన్నియు తుమ్మెదల వరుసలతో కల్లోలితమయియున్నవి॥ విప్పారిన పద్మ ముల పుప్పొడితో నిండిన ఒడళ్ళు కలిగి॥ ఆస్పష్టమయియు మనోహరమగు కూతలు కూయు ఇంపగు వివిధ పక్షులు ఇట ఉన్న వి॥ మనోహరములును మిగుల మ తిల్లినవియునగు దాత్యూహములు , నల్లని కంఠముగల పక్షులు) అందమగు నెమళ్ళు ఇంపుగ కూయు చక్రవాకములు కాదంబములు ( ఒక విధమగు హంసలు) నీటి కాకులు చక్కని సువాసన లీనుపూలు అలంకరించుకొన్న దేవతాశ్రీలు పూచిన తీయ మామిడి చెట్లు వాటికి అల్లుకొన్న తీవలు తిలక వృక్షములు బిగ్గరగ ఇంపుగా పొడు విద్యాధర సిద్ద చారణులు ఆ పాటలకు సరిగా నృత్య మొనరించు అప్సరసలు మిగుల హర్షముతో ఆడుకొను నానా విధ పక్షులు మిగుల మ త్రిల్లిన హారిత పక్షులు సింహముల గర్షాధ్వనులు విని కలవర పడు వనమృగములు తమతమ ప్రియులతో ప్రియు రాండ్రతో జతలుగా తిరుగు జింకలు బాగుగ వికసించిన నానావిధములగు - మనోహర పద్మములతో శోభించు సరస్సులు తటాక ములు ఈ ఉద్యానమునకు అందమునిచ్చు చున్న వి॥ ఈ ఉద్యానము దట్టముగా ఉన్న ప్రబ్బలి చెట్లతో నీలమయి నెమిళ్ళతో మనోహరమయి మదమెక్కి సంతోషముతో ఉన్న పక్షుల గుంపుల కూతలతో ఇంపుగొలుపుచు పూచిన చెట్ల కొమ్మలందు మరుగయి ఉన్న మ తిల్లిన తుమ్మెదలతో నిండి లేత చిగురాకుల శోభలతో శోభించు కోమ్మల రెమ్మలు కలిగియున్నది॥ ఏనుగులచే తుంచబడిన అందమగు తీగలు పెనవేసికొనిన చి॥ చెట్లు ఒయ్యారపు నెమ్మది నడకలు నడచు నేమిళ్ళు కలిగినదై ఈ వనము కింపురుషులు ఎల్లప్పుడును తన్నా శ్రయించగా ఆందగించుచున్నది॥ దీనియందు దేవతా శేష్ఠుల ఇండ్లును ఎన్నియో ఉన్నవి॥ వాని అందమగు శిఖరములందు పావురములు కూయుచున్నది॥ ఆ ఇండ్లు ఆకాశమును ఒరయునంత ఎత్తయినవి॥ తెల్లనయి మనస్సునకు ఇంపుగొలుపు అందమగు రూపము కలవి; అంతటను వ్యాపించి న పుష్పరాశులు విపులమగు నవ్వుగా భాసించుచున్న వి॥ ఇచటి జలాశయములందు కలువలు వికసించి ఉన్న వి॥ ఈ సరస్సుల చుట్టును వేలకొలది ఆగురు వృక్షములుండుట చే పొని కొమ్మలు పందిరివలే వాని పై క్రిమ్మి కనబడుచున్న వి॥ అందుచే ఇచటి ఆకాశమును కడు శోభించుచున్నది॥ చెట్ల వరుసల నడుమనున్న తోవలలో జాగిపడి యున్న పూల వరునలతో పలురీతుల పట్టికలు ఏర్పడి కనబడు చున్నవి॥ వాటిచే ఇచటి పొదలును చిరు చెట్లును ఆంద ముగా ఉన్న వి॥ ఇచటి పర్వతముల శిఖరముల కొనలయందలి అశోక వృక్షములు తమయందు మరుగుపడియున్న పూవులతో నిండి బరువగు పూలగుతులతో వంగిన రేమ్మలు కల అశోక వృక్షములు తమ పూల పై మూగు మ త్రిల్లిన తుమ్మెదల గుంపుల గీతములతో చెవికింపు గొలుపుచు అందముచే కండ్ల కింపుగొలుపుచు మనోహరమయియున్నవి॥ ఈ శ్వేతాశోక పుష్పములతోను పూచిన తీలక పుష్పములతోను రాత్రులందలి వెన్నెల ఏకమయి మిగుల తెల్లగ కనబడు చుండును॥ నీడ లందు {చెట్ల సమీపమున నిదురించి మేలుకని లేచి నిలువబడిన లేడ్ళు మెల్లగా వచ్చి దర్బల మొలకల కొనలను కొరుకుచున్న॥
హంసల రెక్కల విసరులచే మిగుల కదలియాడుచున్న క మలములతో నిండి విశాలమును స్వచ్చమునునగు జలముకల సరస్సులు ఆ సరస్సుల తీరములందు మొలిచి పెరిగిన ఆరటి చెట్ల వరుసల నడుమ నృత్యము చేయు నెమిళ్ళు ఆటనట రాలిపడిన నెమలి పించేపు ఖండములతో వన్నెలు వన్నెలుగా కనవచ్చు ప్రదేశములు ఆయా ప్రదేశములందు వ్యాపించి మ త్రిల్లి మిగుల సంతసమున ఆడు హారీత పనులు కలది ఈ ఉద్యానము॥ వ్రేళ్ళు తమకాశ్రయ మొనర్చు కోని తావులతో నిండిన వన్నె లపూలతో॥ కప్పువడిన చెట్ల గుబురుల నడుమ మ త్తలయి హర్షముతో మధురముగా పాడు కిన్న రాంగనలతో ఇదీ మనోహర ము; చక్కగ ఆలికి పూవులు వెదజల్లిన మునుల ఆవాస ప్రదేశములును ఆ ఆవాసముల పరి నరములందలి వృక్షములును చెట్ల వేళ్ళ మొదలు పండ్లతో నిండి విశాలములయి ఎత్తయిన పనన వృక్షములును ఇటనున్న వి; చూడుము॥ ఇందలి అతి ము కలతా గృహములందు సిద్దులు (దేవజాతులు) విహరించుచున్నారు॥ ఇందు సిద్ద- స్త్రీల బంగరుటందేల మనోహర నాదములు వినవచ్చుచున్నవి॥ మనోహర ప్రియంగు వృక్ష పుష్ప మంజరులందు తుమ్మెదలు మోయుచు ఆడుచున్నవి॥ తుమ్మెదల క్రీడలతో కడిమి పూలందముగ కసవచ్చుచున్నవి॥ పుష్పరాసులతో నిండిన వృక్షముల కొనలు గాలిచే అందముగ కదలుచున్న ఏనుగుల మందల నాయకులు (ఆగు పెద్ద ఏనుగులు) పడగొట్టిన వెదురు పొదలు॥పొదలనడుమ దాగిన ఆడులేళ్ళు॥ కలది ఈ వనము! మోహవశులగు పాంచభౌతిక దేహధారులును॥ ఇట తపమొనరించినచో వారికి ముక్తి లభించును॥ చంద్ర కిరణములవలె తెల్లనయి ఇంపగు తిలక పుష్పములతో సిందూరము వలే కుంకుమ పూవులవలే కుసుమ పూలవలే ఉన్న రక్తాశోక పుష్పములతో బంగరువలే మేర యు కర్ణికార పచ్చగన్నేరు) పుష్పములతో నిండిన ఆయా చెట్ల విశాలములగు కొమ్మలు విప్పారిన తెల్లని ఎర్రని పచ్చని తామర పూలతో రచింపబడిన వేమోయనునట్లు కనబడుచున్న వి; చూడుము; వేంగి రేకులవలె పగడములవలే బంగరు పూలవలె మెరయు పూవులతో ఇచటి నేలలు నిండియున్న వి॥ పున్నాగ వృక్షములందలి పక్షుల మందల కూతలతో నిండి రకాశోకపు పూలగుత్తులతో వంగిన కొమ్మలు కలిగి మనోహరములగు పరిసరములందు వీదుగాలి శ్రమహరము కాగా వికసించిన పద్మముల పై ఆటలాడు తుమ్మెదలతో ఈ వనమెంత యందముగనున్న దో చూడుము॥ అని 'ఇట్లు సకల భువననాథుడును లోక నాథుడును నగు పరమేశ్వరుడు ఆపుడు పార్వతితోను తనకు ప్రీతిపాత్రులగు గణేశులతోను కూడా విహరించుచు వివిధ వృక్షములతో విశాలమయి మ త్రిల్లి ఆనందముతోనున్న కోకిలలతో నిండిన ఉ పవన వృక్ష రామణీయకమును " దేవికి చూ పెను ॥
అంతట దేవి ఈశ్వరునితో ఇట్లనెను: దేవా! పరమశోభాయుతమగు ఉద్యానమును చూపితివి; ఈ క్షేత్ర గుణ ముల నన్నిటిని మరల తెలుప వేడుచున్నాను॥ ఈ అవిముక్త క్షేత్ర మాహాత్మ్యమును ఆట్లు ఎన్ని మారులు వినినను నాకు తృప్తియగుటలేదు॥ కావున మరల తెలుప ప్రార్థించుచున్నాను॥ అనగా మహాదేవుడ నేను: ఈ వారాణసీ క్షేత్రము నాది; ఇది పరమ రహస్యమగునది; ఇది నర్వప్రాణులకును సదా మోక్ష హేతువు; దేవీ! ఇందు నాలోకము కోరి సోనా విధములగు నా చిహ్నముల దాల్చి శైవవ్రతమవలంబించిన వారెప్పుడును సిద్ధిసందుదురు; ఇంద్రియములను మనస్సును నిగ్రహించికొని వారు ఉత్తమయోగ సాధన చేయుచుందురు॥ నానావృక్ష వ్యాప్తము నానా పక్షి నాదయుతము కనుల కువలయ పుష్పపూర్ణ సరోఒలంకృతము సదా అప్సరో గంధర్వగణ సేవితమునగు ఈ శుభ స్థానమునందు సదా నివా సము నాకు ఇష్టము; దీనికి హేతువు తెలి పేద వినుము; నాయందే మనస్సుంచి నా భక్తుడై సకల క్రియలను నాయందే ఆర్పించువాడు ఇచట ముక్తినందును; మరియొక చోట ఇట్టిది కాదు॥ ఇది నాది; పురములలో దివ్యమయినది; గుహ్యములగు వానిలోనెల్ల గుహ్యతమము; చాల గొప్పది; దీని తత్వమును బ్రహ్మాది దేవతలును మముక్షువులగు సిద్దులును మాత్రమే ఎరుగుదురు; ఈ చెప్పిన కారణముల చేత నే ఇది నాకు ప్రియతమ క్షేత్రము; దీనియందు నాకు ఆస క్తియు అధికము॥ నేను దీనిని ఎన్నడును విడువను; ఇది ఆంతటి మహా క్షేత్రము; అందుచేతనే దీనికి 'ఆవిము క్తము' (విడువబడనిది) అని పేరు; నైమిశ కురుక్షేత్ర గంగాద్వార పుష్కర తీర్థ క్షేత్రములందు స్నానమాడినను వానిని సేవించినను ముక్తి లభించదు; ఇచట లభించును; కావుననే ఇది విశిష్టమయినది; నా సొంతములగుటచే ప్రయాగమునందు కానీ ఈ వారాణసి యందు కాని ము క్తిలభించును; ప్రయాగము తీర్థ శ్రేష్టమే; కాని ఇది ఆంతకం దెను గొప్పది॥
మహా తపశ్శాలియగు జై గీషవ్యుడు ఇట ఉత్తమ సిద్ధినం దేను॥ ఈ క్షేత్రపు మాహాత్మ్యమువలనను ఇచట భక్తితో నన్ను భావన చేయుటవలనను జై గీషవ్యుడు మహా శేష్టయోగి అయ్యెను; కావుననే ఈ వారాణసి యోగుల స్థాన మనబడు చున్నది॥ ఇట నన్ను సదా ధ్యానించువానికి యోగాగ్ని మిగుల దీప్తినందును; అట్టివాడు॥ దేవతలకును దుర్లభ మగు కైవల్య ము క్తినందును॥ నర్వ సిద్ధాంతవేత్తలయి బాహ్య చిహ్న ము లేవియు ధరించని (అవధూత) యోగులు అగు॥ మునులు మరెచ్చటను దుర్లభమగు ముక్తినిచట పొందుదురు॥ అట్టివారికి నేను సర్వోత్తమమగు యోగ సంపదను నాతోడి సాయుజ్యమును వారు కోరిన స్థానమును ఇత్తును॥ మహాయక్షుడగు కుబేరుడును ఆట్లు సకల క్రియలను శివునకు అర్పించి ఈ క్షేత్రమును సేవించుట చేతనే గణేశుడు అయ్యెను॥ ఇక మీదట నా భక్తుడుగా జనించబోవు సంవర్తుడును దేవీ! ఈ క్షేత్రమందు నన్నా రాధించినందుననే మహో త్తమ సిద్దినందును॥ పరాశర సుతుడు యోగి మహాతపస్వి భారతముతో ధర్మ నిర్మాత వేద వ్యవస్థా ప్రవర్తకుడు ముని పుంగవుడు అగు వ్యాసుడును పద్మాక్షి! ఈ క్షేత్రమునందే ఆనందము॥ నందును; ఓ సువతా! బ్రహ్మయు దేవర్షులును విష్ణువు వాయువు రవి దేవరాజగు ఇంద్రుడు ఇతరులగు దేవతలు ఇట్టి సర్వమహాత్ములును నన్ని చట ఉపాసింతురు॥ ఇతర యోగులును సిద్ధులును స్థాణురూపులును మహావ్రతులును అనన్య మన స్కులయినన్ని చట సదా ఉపాసింతురు॥ అలర్కుడు కాయనుగ్రహమున ఈ పురిని పొందును; ( ఆశ్రయించును॥॥ ఆతడు దీనిని తన పూర్వులవలేనే చతుర్వర్ల ప్రజలతో నిండిన దానినిగా సమృద్ధి కలదానినిగా జనపదముల గ్రామములతో చుట్టుకొనబడిన దానినిగా చేసి చాల కాలము రాజుగానుండి తన సకల గుణములను నాయందే అర్పించి నన్నే పొందును॥ మనోహరాంగీ! ఆది మొదలుకొని అటు తరువాత కూడ ) ఈ క్షేత్రమునందు నివసించువారు గృహస్థులే కాని సంన్యా సాది) చిహ్నముల దాల్చినవారే కాని నా భక్తులయి నన్నే ఆశ్రయించి నా ప్రసాదమున పరమ దుర్లభమగు ముక్తి నందుదురు॥
ఇంద్రియ విషయసుఖములం దాస క్తిగల చిత్తముగలవాడే ఐనను ధర్మమం దాస క్తిని విడిచినవాడే ఐనను మాన వుడు ఈ క్షేత్రమునందు మరణించినచో అంతమాత్రముననే మరల సంసారమున (జనన మరణ ప్రవాహమున) ప్రవే శించడు॥ ఇక మరి మమత లేక స్థిరచిత్తులయి సత్వగుణులై జితేంద్రియులయి కర్మల ననుష్ఠించువా రయినను అను ష్టించనివా రయినను వివేకవంతులయి సంగమును విడిచి నాయందు భావనను నిలిపినహా రయినచో ఇచట దేహత్యాగ మొనర్చినవారు నా ప్రసాదమున ఉత్తమ కైవల్యము క్తిని పొందియే తీరుదురని చెప్పవలసిన దేమి? వేలకొలది జన్మము లందు యోగ మనుష్టించిన యోగి॥ దేనిని పొందునో ఆ సిద్దిని) పరమ మోక్షమును ఇట మరణించినంతనే పొందును॥ దేవీ! ఇట్లు నేను నీకు రహస్య వచనమగు ఈ అవిము క్త క్షేత్ర మహాఫలమును తెలిపితిని॥ మ హేశ్వరీ! ఇంతకంటె ఉత్తమ మగు రహస్యసిద్ది మరీ లేదు॥ దీనియందలి రహస్యమును ఈ భూలోకమున యోగజ్ఞులును యోగేశ్వరులును నగువారు మాత్రమే ఎరుగగలరు॥ ఇదే పరమమగు జ్ఞానము; ఇదే పరమ శుభకరము; ఇదే పరబ్రహ్మతత్వము; ఇదే పరమపదము॥ గిరిరాజ పుత్రీ! వారాణసి లోకత్రయ సొరము; నాకు సదా ఆనందకరము; ఇచ్చటికి వచ్చినవారు వివిధ దుష్కృతముల నాచరించినవా రయినను మర్త్యులు పాపక్షయ మంది రజోదూరులయి ప్రకాశింతురు॥ అద్బుతము గొలుపు వివిధ వృక్షలతో గుల్మములును ఆందలి పూవులును కలిగి ఒప్పు ఈ క్షేత్రము దేవీ! నాకు సదా ప్రియతమము; మూర్ఖులును శాస్త్రజ్ఞానము లేనివారును ఆగు ప్రాణులు కూడ ఇట మృతినందిన మాత్రమున పరమపద మందుదురు; సంశయము లేదు॥
ఇట్లు చెప్పుచు ఇత లోనే మహాదేవుడు భక్తుడు మనకు వర మీ యదలచి గిరిరాజ పుతియగు మహాదేవితో ఇట్లనెను॥ భామీనీ! భువనేశ్వరీ ! ఆహో! వరారోహా! మహాసుందరీ!) ఇతడు మనవలన వర మందదలచి తపము చేతన పాపముల నశింపజేసికొనినాడు॥ ఇట్లు పలికి జగత్పతియగు ఆ దేవుడు దేవితో కలిసి యక్షుడు కృతుడై నాడులు మాత్రము ఎడము లేక క ॥ బడు దేహముతో నున్న చోటికి పోయెను॥ చర్మమే లేక తెల్లని వర్ణము కలిగి నన్న ని నాడులతో అమరిన ఆస్థిపంజరము మాత్రమే మిగిలియున్న ఆ గుహ్యకుని నిరీక్షించుచు దేవి ఆతనిని పరమేశ్వరునకు చూపుచు ఇట్లనెను: శంకరా! నిన్ను దేవతలు ఉగ్రుడు అందురు; ఆది సత్యమే; ఏలయన ఇత డింత తప మొనర్చినను ఇంతవర కీతనికి॥ వర మీయలేదే! పుణ్యప్రదమగు ఇటువంటి క్షేత్రమును చక్కగా సేవించియు ఈ యక్ష కుమారుడు ఇంతవర కింత పరి క్లేశ మందవలసిన పని ఏమి? ప్రసాదము చూపి పర మేశ్వరా! శీఘమే ఇతనికి వర ము నిమ్ము; మనువు మొదలగు దేవ తలును పరమ ఋషులును ఇట్లు చెప్పుదురు; ఏమనిన) “వాక్కుతో సదాశివుని దూషించినను స్తుతించి) సంతోషింప చేసినను ఈ రెండు విధముల గూడ భోగప్రాప్తియు రాజ్యమును అంతమున మోక్షమును లభించును;” ఇట్లు దేవి పలుక గా దేవు డగు ఆ జగత్పతి ఆ యక్షుడు కృతుడై ధమనులతో నిండి కూర్చుండిన - తావునకు (అతి సమీపముగా దేవితో కూడ పోయేను॥ భక్తుడగుచు ప్రణతుడు అగు అతనిని చూచుచునే హరి కేశుడు పచ్చని వెంట్రుకలు కలవాడు) వృషభ ధ్వజుడు నగు శివుడు అతనికి దివ్యనేత్ర మొనగెను॥ దానితో అత డతని చూడగలిగేను॥ అంతట యకుడును శివుని ఆదేశమున మెల్లగ కన్నులు విప్పి శ్వేత వృషభమందు ఉన్న శివుని అతని వెంట నున్న ప్రమథగణమును చూచెను॥ దేవదేవు డత నితో “నీకు అపూర్వమగు వరము నీ వడుగక యే) ఇచ్చుచున్నాను; త్రైలోక్యమందును నీవు నన్ను త్రైలోక్యము శివ మయమునుగా) చూతువు; నీ శరీర వర్ణము నా శరీర వర్ణముతో నమాన మగును॥ సంతాపరహితుడవయి నన్ను చూడుము॥” అనెను॥
అంతట అత డిట్లు వరమంది శరీరము అక్షతము (ఏ లోపమును లేనిది) కాగా శివుని పాద ములందు ప్రణలు డయి తన శిరమున దోయిలి ఘటించేను॥ నేను వర మిత్తును కోరుకొమ్మని శివు డడుగగా ఆ యక్షుడు “భగవన్! నాకు నీయందు అవ్యగ్రము (స్థిరము) అనన్యమునగు భక్తి కలుగనిమ్ము; సర్వ లోకముల వారికి అన్నము పెట్టువాడను శాశ్వతముగ నీ గణములలోనివాడను అయి నీ అవిముక్త క్షేత్రమును సదా చూచుచుండుదును గాక! దేవేశా! నీ నుండి " నేను కోరు సర్వోత్తమ వర మీడియే॥” అనెను॥ దేవదేవుడు “నీవు జరామరణములును ఏ రోగములును లేక వరదుడును సర్వపూజితుడును గణాధ్యక్షుడును ఎవరికిని ఆజయ్యుడును లోకములకు ఆన్న దాతయును క్షేత్రపాలుడును మహాబలుడును ; మహాసత్త్వుడును బ్రహ్మకును నాకును ప్రీతిపాత్రుడును త్రినేత్రుడును దండపాణియు చేతియందు దండము ధరించి , లోకరక్ష చేయువాడు) మహాయోగియు ఆగుదువు॥ ఉద్బముడు సంభ్రముడు అను గణనాయకులు నీకు పరిచారకులయి నీ ఆజ్ఞలను పాటించి లోకములకు ఉపకార మొనర్తురు॥” అనెను॥ ఇట్లు దేవేశుడగు మహేశ్వర భగవానుడు అచ్చట ఆ యముని గణేశ్వరునిగా చేసి వానితో కూడి తన నివాసమున కేగెను॥
(గమనిక: ఈ అధ్యాయమునందు చెప్పిన విషయములకు యోగపరమగు రహస్యార్థములు కలవు॥ అవి కావలసినవారు శ్రీనాధ రచిత కాశీఖండమున ద్వితీయాశ్వానమునందలి 114 నుండి 188 వరకు గల పద్యములు చూచునది॥!
ఇది శ్రీమత్స్య మహాపురాణమున అవిముక్త క్షేత్ర మాహాత్మ్యమున క్షేత్రపాలక వరప్రదానమను నూట డెబ్బది॥ తొమ్మిదవ అధ్యాయము॥
