మత్స్య మహా పురాణము

Table of Contents

188 - కావేరీ (కౌబేరీ) సంగమ మాహాత్మ్యము॥

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: యుధిష్ఠిరుడు మొదలగువారును తపోధనులగు ఋషులును, మార్కండేయ మహామునిని ఇట్లడిగిరి: భగవన్ ? లోకముల హితమునకును మాకు శుభమగుటకును సదా పాపాసక్తులయి దుష్కృతము లాచరించువారు నర్వపాపనిర్ముక్తులయి పరమపదము చేరుటకును కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మాహాత్మ్యమును మాకు చెప్పి యది తెలుప ప్రార్థించుచున్నా ము; ఆన మార్కండేయుడిట్లు చెప్పెను; యుధిష్ఠిరాదులారా! అందరును వినుడు; వీరుడును మహా విక్రమశాలియునగు కుబేరుడను మహాయకుడుండెను॥ ఈ తీర్థము నకు వచ్చినందుననే యతడు యక్షాధి పతియయ్యెను; మహారాజా! ఆతనికి సిద్ధి కలిగిన విధము తెలి పేదను వినుము; లోక విశ్రుతమగు కావేరీ (కౌబేరీ) నర్మదా నదుల సంగమము కలచోట సత్యవిక్రముడగు కు బేరుడను ఆయన శేష్టుడు స్నానమాడి శుచియై నూరు దివ్య వత్సరముల కొలముపాటు తపమాచరించెను; ఆతని విషయమున తుష్టుడయి మహాదేవుడు ఆతనికి ఉత్తమమగు వర మీయదలచివచ్చి “మహాసత్వము (శక్తి) గల యముడా! నీ యథేప్సిత వర మేమి? నీ మనస్సునందుగల కార్యము ఏదో తేలుపుము;” అనగా కుబేరుడిట్లనెను: దేవేశా! నీవు తుష్టువయి నాకు వరమీయదలచినచో ఇది మొదలు నేను యక్షులకు అధిపతియగుదుగాక!” అనెను॥ కుబేరుని వచనమును విని మహాదేవుడు పరితుష్టుడయి సరేయని యంతర్ధానమందెను; ఆ కుబేరుడను॥ యక్ష, పుంగవుడును వరమంది వెంటనే యక్ష నివాసమున కేగి సర్వయకుల పూజలనందుకొని వారిచే వారికధిపతిగా అభి షిక్తుడయ్యెను;

ఇట్టి సర్వపాప ప్రణాశ కమగు కావేరీ (కౌబేరీ) సంగమము నేరుగనివారు జీవితమున వంచితులయిన టై; కావున నిది ఎరిగి మానవుడందు సా నమాడవలయును; కావేరీ (కౌబేరీ) నర్మదలు రెండును మహాపుణ్య ప్రదములగు మహా నదులే; పాటి సంగమమందు సర్వ ప్రయత్నములతో స్నానమాడి వృషభధ్వజునర్చించినచో అశ్వమేధ ఫల మంది రుద్ర లోకమున పూజితుడయి సుఖించును; అచ్చట అగ్ని ప్రవేశముతో గాని ప్రాయోపవేశముతోగాని దేహత్యాగము చేసినచో పునరావృతి రహిత గతినందును; ఉత్తమ స్త్రీల పరిచర్యలందుకొనుచు ద్యులోకమున రుద్రునివలే సుఖించును; రుద్ర లోకమునందు నివసించుచు కోరిన చోటి కెల్ల పోవుచు సంచరించుచు ఆరువది కోట్ల అరువది వేల సంవత్సరములు రుద్ర లోకమందుండి సుఖించును; పుణ్యక్షయానంతరము రుద్రలోక మునుండి భ్రంశమునందిపడినను ధార్మి కుడు భోగవంతుడు దాన శీలుడు మహావంశ సంజాతుడునగు రాజగును; అచటి జలమును త్రాగినచో చాంద్రాయణ వ్రతమాచరించిన ఫలము లభించును; స్వర్గ ప్రాప్తియగును; కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ స్నానముచే గంగా యమునా సంగమ స్నాన ఫలము లభించును; రాజేంద్రా! కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మహ త్వము ఇట్టిది; ఇది పుణ్య కరము; మహా ఫలప్రదము; సర్వపాప ప్రణాశనకరము॥

ఇది శ్రీమత్స్య మహా పురాణ మున నర్మదా మాహాత్మ్యమున కావేరీ (కౌబేరీ) నర్మదా సంగమ మహిమాను వర్ణ నమను నూట డెబ్బది ఎనిమిదవ యధ్యాయము॥