మత్స్య మహా పురాణము

Table of Contents

258 - దేవతామూర్తి విశేష లక్షణములు – శంకర-తాండ వేశ్వర-త్రిపురదాహేశ్వర భైరవేశ్వరాది మూర్తుల లక్షణములు.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను : ఇక మీదట ఆయా దేవతారూపములను వి శేషా కారమున-వేరువేరుగా చెప్పెదను; రామమూర్తియు విరోచన పుత్రుడగు బలి మూర్తియు వరాహమూర్తియు నరసింహ మూర్తియు దశ కాల ప్రమా ణములు; వామనమూర్తి స ప్రతాళ ప్రమాణము; మత్స్య కూర్మ మూర్తులు శోభగానుండునట్లు ఎంత పరిమాణముతో నైన నిర్మించవచ్చును. అని స్వయంభూ బ్రహ్మ చెప్పెను.

ఇక మీదట రుద్రాది మూర్తుల లక్షణముల చేప్పేద ను. ఈశ్వరమూర్తి. బాగుగ బలిసిన ఊరువులు భుజములు భుజ స్కంధములు తప్తకాంచన సమాన శోభ శుక్ల రవి కిరణ రాశి ప్రకాశము చంద్రాంకిత జటాక లాపము పదునారు సంవత్సరముల వయస్సు జటా మకుట భూషణములు గజహస్త సమాన బాహువులు వృత్త జం ఘోరు మండలములు ఊర్ధ్వ కేశములు దీర్ఘాయత విలోచనములు వ్యాఘ చర్మ వస్త్రము మూడుకటి సూత్రములు హార కేయురాలంకారములుభుజగాఓఓ భరణములు నానాభరణ భూషిత బాహువులు బలిసిన విళల గండ ఫలకము కుండలాలంకారములు ఆజాను లంబీ బాహు వులు సౌమ్యమగు మూర్తి కలిగి శోభించుచుండును; ఎడమ చేతులందు ఖేటకము కపాలము సొగము ఖట్వాంగమును కుడి చేతులందు ఖడ్గశ క్తి దండత్రిశూలములు నుండును.

తాండవేశ్వర మూర్తికి-ఒక చేతియందు వరద ముద్ర రెండవ చేతియందు అక్షమాల యుండును. ఇతడు వైశాఖమను స్థానకము (నృత్యభంగి విశేషము) తో నృత్యాభినయమందు ఉండును; దశ భుజుడును గజ చర్మధారియు నై నృత్యమొనర్చుచుండును.

 త్రిపురదా హేశ్వరమూ ర్తికి షోడశ బాహువులు; దశ భుజమూర్తి యందుకంటే ఈ మూర్తియందు శంఖము చక్రము గద శార్జధనువు ఘంట పినాక ధనువు విష్ణుమయశరము అను ఆరాయుధములధీక ముగా నుండును.

యోగేశ్వర మూర్తియందు చతుర్భుజములో అష్ట భుజములో యుండును. భైరవేశ్వర మూ ర్తికి నా సాగ్రమును దంతములును తీక్షములయినవి; ముఖము భయంకరము; ఈ మూర్తిని ప్రత్యాయతనము (ఉపాలయము)నందేకాని మూలాయ తనము (ప్రధానాలయము) నందు ప్రతిష్టించరాదు.

(ఈ భైర వేశ్వరమూర్తి యే కాదు;) నారసింహ వరాహాది భయజ్కరమూర్తులు ఏవియు అధి కాంగములుగాగాని హీనాంగములుగాగానీ ఎక్కడను ఎప్పుడును చేయరాదు. భయంకరముఖముగలమూర్తులనుగా చేసినచో స్వామికినీ శిల్పికిని నాశము కలిగించును; ఆర్థనాశమును చేయును; వక్ర నాసిక గల మూర్తి దుఃఖమును తక్కువ పరిమాణముగల అవయవ ములతో నున్నచో భయమును-కృశోదరియగు మూ ర్తి దుర్భిక్షమును -మాంసము (ప్రుష్టి) లేని మూర్తి ధననాశమును చప్పిట ముక్కుగల మూర్తి దుఃఖమును రోగమును - కన్నులు లేని మూర్తి నేత నాశమును ముఖము హీనమయినచో దుఃఖమును పీలగానున్న కాలు నేతులు గలదియు హీనాంగయు హీనజంఘయు భ్రమోన్మాదములను కలిగించును; ముఖముగాని కటి గాని లోపముతోనున్న చో రాజును చంపును; కాలు నేతులలో లోపమున్న ను ఆమూర్తి అధికముగా మృత్యువును కలిగించును; ఏక్కలును మోకాళ్లును నఠిగాలేని మూర్తి శత్రువులకు క్షేమకరము; వక్షఃస్థలమున లోపమున్న చో పుత్త మి త్త వినాశకరము; సంపూర్ణావయవమూర్తి ఆయువును ఐశ్వర్యమును కలిగించును.

ఈ లక్షణ దోషములవలని హని నేరిగి అవిలేని లక్షణములతో పర మేశ్వర మూర్తిని నిర్మించవలయును. ఆమూర్తిని అన్ని వైపులయందుండి            సకల సురులును స్తుతించుచుండవలయును; ఇంద్రుడు నంది మహాకాలుడు లోక పాలురు పార్శ్వములందు గణనాయకులు ప్రణతులయియుండ నృత్యమాడుచున్న భృంగియురిటియు భూత భేతాళులును హపూర్ణులై ఆయనను స్తుతించుచున్న ట్లును గంధర్వ విద్యాధర కింగరాప్సరోరుహ్య కాది దేవతాగణములును ఆమర నాయకు లును ముని ప్రవీరులును ఆయనను నమస్కరించుచున్న ట్లును మూ ర్తిని నిర్మించవలెను. అసురులును మానవులును ఆక్ష సూత్రములను ప్రవాళములను పుష్పములను ధరించియుండి ఉపహార ములుగా ఈశ్వరునకు అవిఆర్పించుచుండ త్రినే త్రముగ పరమేశ్వర మూర్తి భేదములుండవలయునుయ.

శ్రీమత్స్యమహాపురాణము  మహా పురాణమున ఈశ్వర ప్రతీమాధి లక్షణ కథనమును రెండు వందల ఏబది ఎనిమిదవ అధ్యాయము.