మత్స్య మహా పురాణము

Table of Contents

158 - తారకుడు కుమారుడు సేనానిగానున్న దేవసేనను చూచుట॥

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఇటు తరువాత మరల దేవి వామ కుక్ష్మిని (ఉదరపు ఎడమ భాగము) చీల్చుకొని ఇంకొక శిశువు వేలికివచ్చెను॥ ఇతడును శివుని ఇంద్రియమునుండి అగ్ని నోటిలోనికి సన్న మయిన (జారిపడిన) శుక్రమునుండి జనించిన వాడే; ఇతడును చక్కని మొగములు కలవాడు; అతడు వి శేషించి (దేవ తల) శత్రువుల చంపువాడు; (షట్) కృత్తికలును ఆశిశుని ఆరు శిరస్సులను ఒకటిగా కలిపిరి॥ ఆరు మొగములుగా విస్తరిల్లిన ఈ కుమారుని రూప భేదములకే శాఖలు అని పేరు॥ (లోక సాధారణముగ కాక) విశేషించీ కూర్చబడిన (ముఖ) భేదములు కలవాడు కావున లోకములందు ఈ షణ్ముఖుడు విశాఖుడని ప్రసిద్ధుడయ్యెను॥ ఇట్లే శిశువులు 1॥ స్కంద ( శివునినుండి అగ్ని నోటియందు జారిపడిన వీర్యమునుండి జనించినవాడు; 2॥ విశాఖుడు (ముఖ శాఖలు విశేషముగా కూర్చబడినవాడు); 3॥ షడ్వక్రుడు (ఆరు మొగములు కలవాడు); 4॥ కార్తికేయుడు (కృత్తిక లకు సంతానము) అని ప్రసిద్దులేరి; మహాబలులగు ఈ శిశువులిద్దరును చైత్రమాసపు బహుళ పక్షమున పంచదశి (పదునై దవ తిథి॥ అమావాస్య యందు జనించిరి; విశాల శరవణ (రెల్లువన) మున జనించిన వీరిద్దరును సూర్యసమానులు; వీరు జన్మించిన ఆరవ దినమున చైత్ర శుక్ల పంచమినాడు (ఉత్తర భారతమున మాసములు కృష్ణపక్షము తరువాత శుక్లపక్షముగా లెక్కింతురు॥) ఇంద్రుడు ఆ బాలకులతో (కలయిక తో) ఒ కే శిశువును నిర్మించెను॥ దేవతల క్షేమమునకై ఆ ఇంద్రుడు ఇదే చైత్ర శుక్ల షష్ఠిదినమున ఈ ప్రభుని (సమర్థుని గుహునిగా (దేవ నేనా రక్షకునిగా॥గూహించు రక్షించు వానిగా) అభి షేకించెను॥ బ్రహ్మ ఇంద్రుడు॥ విష్ణువు -రవి॥ మొదలగు దేవత లెల్లరును కూడి శుభములగు గంధములు॥ మాల్యములు ధూపములు కుమారు డింకను శిశువే కావున క్రీడ నక ములు ( ఆట వస్తువులు) ఛత్తములు చామరములు భూషణములు విలేపనములు (ప్రసి కొను గంధాదికము) మొదలగు వానితో శాస్త్ర విధానమున యథావిధిగా ఆ అభి షేకమును జరిపించిరి॥ ఇంద్రుడి దేవ దేవునకు పత్ని గా తన పుత్తియగు 'దేవ సేన'ను ఇచ్చెను॥ (ఇతడు ఇట్లు దేవ సేనాపతి యయ్యెను॥) అదే సమ యమున అతనికి విష్ణువు ఆయుధములను కుబేరుడు దశలక్ష యక్షులను అగ్ని తన తేజస్సును వాయువు॥ వాహన (మయూర ) మును త్వష్ట దేవతల వడ్లంగి) అతనికి ఆట వస్తువుగా కామ రూపమగు కుక్కుటమును (కోడిని) ఇట్టే ఇంక ను దేవతలెల్లరును అనంతమగు పరివారమును (వస్తు వాహన జనములను) సూర్యతేజస్కుడగు ఈ నందునకు ముదిత చిత్తులయి ఇచ్చిరి!

సురలు మోకాళ్ళు నేలకు తాకునట్లు నేలపై నిలిచి గొంతుక విడిచి వర దుడగు ఆ షణ్ముఖుని ఈ చేప్పబోవు స్తోత్రముతో స్తుతించిరి॥

అమరులు చేసిన కుమార స్తుతి॥

గొప్ప కాంతిగలవాడును దానవులను నశింపజేయువాడును నూతన రవి బింబతేజుడును కాలరూపుడు నునగు కుమారునకు స్కందునకు షణ్ముఖునకు నమస్కారము॥ నానా భరణములను ధరించినవాడును లోకముల కధిపతియు లోక పోషకుడును రణమునందు దారుణులగు వారినికూడ చీల్చు వాడును రవి సమానతేజుడును యోగులకు తప్ప ఎరుక వడని రహస్య స్వరూపుడును దేవ సేనా రక్షకుడును అగు నీకు నమస్కారము॥ లోకముల భయము పోగొట్టువాడును కృపా పరుడును విశాలములయి దీర్ఘములగు నేత్రములు కలవాడును మహా శ్రేష్టవ్రతుడు (వ్రతము = కర్మము-కృత్యము)ను అగు బాలుడగు విశాఖునకు నమస్కారము॥ ॥ మనస్సులకొనందకారుడును సద్గుణములచే అందర మించినవాడును 'ప్రజా శించు మయూరము వాహనముగా గలవాడును భుజకీర్తుల ధరించినవాడును నగు నీకు వందనము॥ భయంకరము ఉన్న తము నగు పతాక ధరించినవాడు ప్రభావశాలుర చేత కూడ ప్రణామములందుకొనువాడు ఘంటను ధరించినవాడు వీర్యశాలి క్రియా పరులగు (పురుష కారము చేయుచుండు) వారి కై జన్మించిన మంగళ స్వరూపుడు అగు నీకు నమస్కారము॥ యజ్ఞ పతియగు కుమారుని యజ్ఞ (హవిరహణ) పరులగు ఇంద్రాదులు ఇట్లు స్తుతించి నమస్కరించిరి॥ అంత షణ్ముఖుడగు గుహుడు సంతుష్టుడయి ఆ ఇంద్రాదులగు దేవ శేష్టులను అమలములగు నేత్రములతో చూచి ఇట్లు పలికేను: మీరు హృదయ సంతాపము లను విడువుడు॥ మీ శత్రువుల చంపుదును॥ (సొమాటతో సంతృప్తి చెంది ॥ మీరు మీ కేమి కోరిక నేను తీర్చవలయునో చెప్పుడు॥ మీ హృదయ సంకల్పితము॥ ఆది మీకింపయినచో పౌలును ఆది॥ ఎంత ఆసాధ్యమయినను గొప్పదనను తీర్చెదను॥ అనగా దేవతలు నమస్కారముతో శిరస్సు వంచి మనస్సులతని యందే నిలిపి అందరును మహాత్ముడగు గుహునితో ఇట్లనిరి॥

తారకుడను దైత్యేంద్రుడున్నాడు॥ వాడు సర్వదేవతా సమూహ నాశ కుడు; బలవంతుడు -దుర్జయుడు॥దుష్టుడు॥ దురాచారుడు-అతి కోపవంతుడు; మాకు భయము కలిగించుచున్నాడు॥ వానిని చంపుటయే మా హృదయమందున్న కోరిక; ఆది తీర్చి వానివలన మా భయము పోగొట్టుము॥ అనగా కుమారుడు॥ సరే ఆనేను॥ మరియు ఆ జగన్నాధుడు సర్వామరులును తన వెంటరాగా అమరేశ్వరు లెల్ల జయ ధ్వనులతో తను స్తుతించుచుండ లోక కంటకుడగు తారకుని వధింప బయలుదేరెను॥ తనకు ఇంతటి సమాశ్రయము దొరకుటతో ఇంద్రుడును దానవసింహుడగు తారకుని కడకు పరుషాక్షరములతో మాటాడగల దూతను పం పెను॥ భయంకర రూపముగల ఆ దూతయు వాని కడకుపోయి నిర్భయు డై ఇట్లు పలికెను: తార కా! దేవేశుడు స్వర్గపతియగు ఇంద్రుడు (నా ద్వారమున నీతో) ఇట్లు చెప్పుచున్నాడు; అది విని ఇచ్చకును శ క్తికిని తగినట్లు చేయుము॥ “దానవా! నీవు లోకములను చీల్చి బాధ కలిగించి) పాపము నంపాదించితివి॥ భువనత్రయ పాలకుడనగు నేను ఇపుడు నిన్ను అదుపులో ఉంచెదను॥” (ఇది ఇంద్రుని సం దేశము)॥ తన విభవమంతయు చాలవరకు అప్పటికే నశించియున్న దుష్టాత్ముడు ఆ తారకుడు దూత వచనము విని క్రోధ సంరక్ష నేత్రుడయి ఇట్లనెను:

శక్రా! నేను వందలమారులు రణమున నీ పౌరుషమును చూచితిని॥ దుర్మతివి; నీకు బిడియమును సిగ్గును రెండును లేవు॥ కనుక ఇట్లు మాటాడుచున్నా వు; అని తారకుడు వలుకగా విని దూత వెడలిపోయెను॥ తరువాత ఆ దానవు డిట్లాలోచించేను: “ఏదియో ఆశ్రయము దొరుక నిదే ఇంద్రుడు ఇట్లు పలుక జాలడు; ఓడిపోయినవాడు ఆకస్మికముగా సంశ్రయమును దేనినో ఆశ్రయముగా పొందియుండును॥”ఇట్లనుకొనుచుండగనే వానికి (తమ) సౌశ మును తెలుపు దుర్ని మీ తములును కనబడెను॥ ధూళివానర కపాతము ఆక సమునుండి నేలపై పడుట॥( ఎడమ భుజము నేత్రము అదరుట నోరు ఎండుట మనోభ్రమము తన భార్యల ముఖ పద్మములు ( అకారణముగా)॥ వాడి పోవుట దుష్ట ప్రాణులు మరింత రౌద్రరూపములగుట దుష్ట సూచనలు ఇట్టివి వానికి కనబడెను॥ ఐనను వాడు వానిని లెక్క పెట్టక క్షణములో స్వస్థచిత్తుడై ఈ విషయములను ఆలోచించుట మానెను॥ అంతలో వాడు తన ప్రాసాదము నాగోహించగా వానికి దేవ సేన కనబడెను॥ అది గజముల మందల ఘ'టల ఘణతారరవముతో హద్దు మీరి గుర్రముల గుంపులు నలగ గొట్టిన భూమి రేణువులతో ఎరుపు కలిసిన వర్ణము కలిగి సేనా బలములతోను భయము గొల్పు ధ్వజముల శ్రేణులతోను ప్రకాశించుచు నుండెను॥ ఇంక ను ఆ సేన ఆశ్చర్యము గొలుపు ఆకృతిగల విమానములును కదలుచున్న చామరము లును భూషణాలంకార నిబంధములును కిన్నరులు బిగ్గరగా పొడుపాటలు ఆనేక ములగు స్వర్గీయ వృక్షములందు పూచిన వూలతో కూర్చిన కొప్పులు ఒరనుండి బయటకు తీసిన ఖడ్గాద్యాయుధాలంకార శోభలు వంది జనులు బిగ్గరగా పాడు స్తోత్రముల ధ్వనులు నానా వాద్య ధ్వనులు కలిగి ఉండెను॥

ఇది చూచి తారకుడు కొంచెముగా తన మనస్సు ఉద్రా స్తము కాగా నాచే ఓటమి తినని కొత్త యోధుడు ఎవ్వడై యుండును? అని ఆలోచించుచు కలత నొందసాగేను॥ ఇంతలో పానీకి॥ వికట పరుషాక్షరములతో సిద్ద (దేవతా జాతి) వంటిజనులు బిగ్గరగా పొడుచుండిన హృదయ దారణమగు ఈ “గాథ " వినబడేను:

గాథార్థము

సాటిలేని శ క్తియను ఆయుధపు కాంతులతో పింజర వర్ణుడా! భుజదండములతో భయంకరమగు యుద్దావేశము కలవాడా! దేవతా ముఖములనెడు కలువలకు వికాసము కలిగించు చంద్రా! కుమారులలో ! శేష్టుడా! నీకు " జయము; డైత్యవంశ మహా సముద్రమునకు బడ బాగ్నీ ! షణ్ముఖా! మధుర ధ్వనిగల నేమిలిని పూనిచిన రథము కలవాడా! దేవతల కిరీటముల కొనలతో నలిగిన కాలి గోళ్ళ మొలక లతో కూడిన మహాపీఠము కలవాడా! నీకు జయము; సుందరమగు వెంట్రుకల కొప్పను కమల వనమందు ఉండిన విమల దళములు కల కమలములతో అందమగువాడా! దైత్యరాజ వంశమునకు సహింపరాని దావాగ్నీ ! నీకు జయము; ప్రభూ! విశాఖా! ఏడు దినముల పసిపోడా! సకలలోక తార కా! నందొ! గౌరీనందనా! ఘంటా ప్రియా ప్రియా! విశాఖా? విభూ! దేవ సేనానాయకా! పతాక లను దాల్చినవాడా! చేదరి పోయి మిగుల కదలు చున్న బంగరు సొమ్ములతో ప్రకాశించువాడా! సూర్యతేజస్కా! నీకు జయము; యుద్ద సంభ్రమమున ఆవలీలగా (ఆటగా) సమస్త శత్రువులను ఖండించువాడా! సకల లోక తారకాః దితి సంతానమగు అసురులలో ! శేష్టుడగు తారకునకు యముడా! భువన సమూహ శోక వినాశ నా! జయము॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున తారకుడు దేవ సేనను చూచుటయను నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము॥