మత్స్య మహా పురాణము
61 - అగస్త్యోత్పత్తి - అగస్త్య పూజా విధానము
నారదుడు ఈశ్వరు నిట్లడిగెను: “ఇహలోకమున శుభమగు రూపమును ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్య మును పరమున క్రమముగా భూర్లోక భువర్లోక స్వర్లోక మహర్ లోక జనలోక తపోలోక సత్యలోకము లనెడి ఊర్ధ్వలోక ములను పొంది సుఖించుటకు సాధనమగు విధానమును ఉపదేశింప వేడుచున్నాను.”
ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను: పూర్వము ఇంద్రుడు అగ్ని వాయువులను అసుర నాశము చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. వారును వేలకొలదిగా దానవులను దహించిరి. తారకుడు కమలాక్షుడు కాలదంష్ట్రుడు పరావసువు విరో చనుడు సంగ్రామమునుండి తప్పించుకొనిపోయి సముద్రాంతర్భాగమున నివసింపసాగిరి. వీరు చేత కానివారు కదా! యని అగ్ని వాయువులు వారిని కాల్చక విడిచిరి. నీటినుండి వారందరును దేవ మనుష్య నాగులను మునులను బాధించి మరల నీటిలో ప్రవేశించుచుండిరి. ఇట్లు పండెండు వేల యుగములు లోకత్రయమును ఈ జలదుర్గమును దుండి బాధించిరి.
అంతట దేవేంద్రుడు అగ్ని వాయువులను మరల పిలిచి ‘ఈ దేవ శత్రువులకు సముద్రము ఆవాసముగా నున్న ది. కనుక మీరు ఈ సముద్రమును ఎండింపజేయుడు. అని కోరెను. వారును “ఇంద్రా! సగరమును శోషింప జేయుట ఎంతో అధర్మము. ఏలయన అందుచే వానియందలి ప్రాణులకు ఎన్నిటికో నాశము కలుగును. సముద్రమునందే కాదు-సముద్రమునకు యోజనముల దూరమునకూడ దాని సాధార ముగా చేసికొని వందలకొలది ప్రాణులు జీవించుచున్నవి. ఇట్టిదాని నెండింపజేయుట తగునా? ఇట్టి పాపము మేము చేయలేము.” అనిరి. ఈమాట విని . ఇంద్రుడు. కోపముతో: కను లెర్ర జేసి నిప్పులే క్రక్కుచున్నాడేమో అన్నట్లు చూచుచు రోషవచనములు ఇట్లు పలికెను: “దేవతలకు ఏ పాపమంటుట ఎక్కడనులేదు. విశేషించి మహా మహిమ వంతులగు మీకు అట్టిది లేనేలేదు. ఐనను మీరు నా ఆజ్గను ఉల్లంఘించితిరి. దీనిచేత మునులకు హింస దానవులకు రక్షణ మొదలగు దోషములెన్ని యో సంభవించును. ఇది ధర్మార్థ శాస్త్ర విరుద్ధము. కనుక మీరు ఇద్దరును మానవలోకమున ఒకే ఒక మానవ దేహముతో మునులుగా జన్మింతురుగాక! అందునను అగ్నీ : నీవు అప్పుడు కూడ నీ పుక్కిటితో సముద్రమును ఎండింప జేయుదువు. ఆపుడు మరల నీకు దేవత్వము లభించును.” అనగానే అగ్ని వాయువులు ఇద్దరును భూతలమునకు వచ్చిపడిరి. మిత్రావరుణుల (మిత్రుడు వరుణుడు అను జంట దేవతల) వీర్యమువలన కుంభమునుండి ఒకే దేహముతో జన్మించిరి. అగ్ని దేవుడు అగస్త్యమునిగా వసిష్ఠునికి తమ్ముడై జన్మించెను. నారదః : సమ్భూత స కథం భ్రాతా వసిష్ఠస్యాభవ న్మునిః ।
ఈశ్వరుడిట్లు చెప్పగా నారదుడు ‘అగస్త్యుడు కుంభమునుండి ఎట్లు జన్మించెను? వసిష్ఠునకు తమ్ము డేట్లయ్యెను? వీరికి మిత్రావరుణు లెట్లు తండ్రులై రి? ఇదంతయు తెలుపుము.’ అని వేడెను. ఈశ్వరుడిట్లు చెప్పెను: ఒకానొక సమయమున పురాణ పురుషుడగు విష్ణుడు ధర్ముని కుమారుడగు నారాయణుడను మునియై గంధమాదన పర్వతమున విస్తృత తప మాచరించెను. అతని తపమునకు భయమందిన ఇంద్రుడు అతని తపము భగ్న మొనర్పగోరి వసంతుని మన్మథుని వారి కప్పరాగణములు తోడుగా ఆటకు పం పెను. వారు ప్రయోగించిన నాట్యగీత వాద్యములతోగాని వసంత మన్మథుల ప్రవృత్తులతోకాని ఆముని విషయ సుఖముల వైపునకు ప్రవృత్తుడు కాలేదు. తమ యత్నములు వమ్ముకాగా వారందరును విషాదమందీరి. వారీ నింకను కలత పరచదలచీ సోరాయణముని తసి తొడలనుండి త్రైలోక్య జన మోహినియగు యువతిని జనింపజేసి చూ పెను. చూచి పోరును కలతపడిరి. సొ ఊరువులనుండి జనించినందున ఈమెకు ఊర్వశియను నామమున ప్రసిద్దయె (అప్సరయై యుండునని నారాయణముని వసంత మన్మథులకును అప్సరలకును ఇతర దేవతలకును చెప్పెను.
ఆమెను చూచి కామ వశీభూతుడై మిత్రుడు ఉదయించు సూర్యునకు అభిమాని యగు దేవత) తన్నా నందింప జేయుమని ఊర్వశిని కోరెను. ఆమె యంగీక రించెను. నల్లకలువలవంటి కన్నులుకల ఆ సుందరి అతని వెంట కొంచెము దూరము పోగానే వరుణుడు (అస్తమించు సూర్యున కభిమానియగు దేవత) ఆ మేను చూచి అతడును ఆమెను తన్నా నందింప జేయుమని కోరెను. నన్ను ముందుగా మిత్రుడు వరిం చెను కావున నేనిప్పుడు అతనికి భార్యగానున్నాను. (అతని కోరిక తీర్చువరకు) నేను నీకోరిక తీర్చబోలనని యామె వరుణుని కోరిక అంగీకచకపోయెను. అట్లయినచో నీవు నీచిత్తమునై న నాయందు నిలిపి పొమ్మని వరుణుడు పలికెను. ఊర్వశి సరేయని మిత్రునితో వెళ్ళెను. నీవు చేసిన ఈపని వేశ్యాధర్మము. కావున నీవు భూలోకమునకుపోయి అచట సోముని పొత్తుని (కి భార్యవై ఆతనిని) ఆశ్రయింతువు. ఆని మిత్రుడామెను శపించెను. (అతడును ఆమెతో సుఖించలేదు.) (ఊర్వశీ విషయక మయిన కామ వశమున స్థానము తప్పిన) తమ వీర్యమును మిత్రావరుణులు ఇద్దరును (అపుడచట లభించిన యొక) జలకుంభమున నిలిపిరి. (దానినుండి) లోగడ చెప్పిన ముని సత్తములు వసిష్టాగస్త్యులు జనించిరి.
(మొదట బ్రహ్మ మానసపుత్తుడుగా చెప్పబడిన వసిష్ఠుడుమరల మిత్రావరుణుల కుమారుడై అగస్త్యునితో పాటు ఎట్లు జన్మించెనను ప్రశ్నకు ఈ ఉపాఖ్యానము సమాధానముగా నున్నది, ఛాందోగ్యోపనిషత్తునందు వసిష్ట పదముతో చెప్పబడిన ముఖ్య ప్రాణత త్వమునకును వసిష్ఠుడు బ్రహ్మ మానసపుత్తడనుటకును వాయుదేవుడే ఇంద్రశాపమున జలకుంభమునుండి వసిష్ఠుడుగా, పుట్టెననుటకును వేదాంత శాస్త్రానుసారము, సమన్వయము కూడ ఈ కథవలన కుదురుచున్నది. ఇదియంతయు. తత్వ విచారణ మార్గమున ఆలోచించుటచే తెలియవలసిన విషయము. పురాణములు ఇట్లు సర్వవిధ విజ్ఞానమును అందించుచున్నవి.)
పూర్వము ఒక నాడు నిమి అనురాజు తన భార్యలతో జూదమాడుచుండెను. అట్టి సమయమున బ్రహ్మ మానసపుత్రుడు వసిష్టుడచటికి పోయెను. నిమి అతనిని ఆదరించలేదు. అందుచే నీవు విదేహుడవు (దేహము లేనివాడవు) కమ్ము-అని వసిష్ఠుడు నిమిని శపించెను. నిమికూడ పసిష్టుని శపించెను. దానిచే నిమీ విదేహుడయ్యెను. వసిష్ఠుడు చేతస్సు (చిత్తవృత్తి ప్రవృత్తులు) లేనివాడయ్యెను. (ఇద్దరును ఇట్లు కావలసియుండగా శాపనాశమున కై ఇరువురును బ్రహ్మ కడకు పోయిరి. బ్రహ్మదేవుని ఆదేశమున నాటినుండి ‘నిమి’ (భూలోక జీవుల) కన్నులయందు నివసింపసాగెను. అతని విశ్రాంతి కై అప్పటినుండి మానవులు మొదలగు ప్రాణులకు నిమే(మి)షములు ఏర్పడెను. (నిమీ-శ = నిమిః శేతే ఆస్మిన్- ‘నిమి’ దీనియందు శయనించును కనుక నీమిశ -నిమేశ>నిమిష-నిమేష) (బ్రహ్మదేవుని ఆజ్గచేతనే) వసిష్ఠుడును జల కుంభమునందు చేరి లోగడ చెప్పినట్లు మిత్రావరుణుల కుమారుడయ్యెను. ఆతనితోపాటు ఆకడవనుండియే తెల్లని మేని చాయ నాలుగు బాహువులు జపమాల కమండలువు కలిగి శాంతాత్ముడగు అగస్త్య మహర్షి ఉద్భవించెను. ఆయన మలయ పర్వత భాగమున తన భార్యతోకూడి విప్రపరివృతుడయి వైఖానస (వానప్రస్థ) విధానముతో దుష్కరమగు తప మాచరింపసాగెను.
ఇట్లు చాల కాలము గడచెను. ఈ అగస్త్యుడు తారకాది దానవులు జగములను పీడించుట చూచి కోపవశమున సముద్రమును త్రాగివేసెను. వింధ్య పర్వతవృద్దిని ఆటంక పరచెను. రెండవ మృత్యువును సృష్టించెను. కాలకూట విషమును వ్యర్థమయిన దానినిగా (శ క్తిహీనమగునట్లు) చేనేను. శ్వేత కేతువను నాతని చంపెను. ఇట్టి మహాకార్యములు చేసినందున సంతసించి శంకరుడు బ్రహ్మ విష్ణువు. మొదలగువారు అగస్త్యునకు వరమీయదలచివచ్చి “మునీ! నీకభీష్టమగు వర మేదియో కోరుము. ఇత్తుము.” అనిరి. అగస్త్యుడిట్లు వరము కోరెను. “ఇరువదియైదు కోట్ల సంవత్సరముల కాలము. నేను దక్షిణ (మలయ) మార్గమున వైమానికుడనై (అంతరిక్షమున వేలుగు జ్యోతిర్గోళమనై) ఉండవలయును. నావిమానము (జ్యోతీ రూపము) ఉదయించినపుడు నన్ను పూజించినవాడు క్రమముగా భూర్లోక మాది ఏడు ఊర్ధ్వ లోకములకు అధిపతి (వాటియందు సుఖించుటకు అధికారి) కావలయును.” అని కోరగా అట్లే యగునని వరమిచ్చి ఆదేవతలు వచ్చిన త్రోవను వెళ్ళిరి. కావున ఈ విషయము నెరిగి వివేకులై జనులు అగస్త్యునకు అర్ఘ్యము నీయవలెను.
ఈశ్వరు డిట్లు చెప్పగా విని నారదుడు అగస్త్యునకు ఆర్య మిచ్చుటకును పూజ సేయుటకును కల విధాన మేదో తెలుపుమని ఈశ్వరుని ప్రార్థించగా ఆ దేవు డిట్లు చెప్పెను: ప్రభాత కాలమున అగస్త్య నక్షత్రము ఉదయించు వేళ కు సంప్రదాయ మెరిగిన గృహస్థుడు నిద్ర మేల్కాంచి తెల్లని నూవులతో (నూవుపిండితో నూవులనూనెతో) స్నాన మాడ వలయును. తెల్లని పూలను వస్త్రములను ధరించవలేను. పూలను వస్త్రములను చుట్టును చుట్టి అలంకరించిన కలశమును (నీటితో నింపి) నిలిపి దానియందు పంచరత్నములను (ముత్యము పగడము మొదలగునవి) వేయవలెను. దాని దగ్గర ఒక నేతి పాత్ర ఉంచవలెను. బంగారుతో బొటన వేలంత పరిమాణము కలిగి పొడవయిన నాలుగు కాహువులుకల పురు షుని ప్రతిమ చేయించి ఆ ఘృతపాత్ర దగ్గర ఉంచవలయును. ఆ ప్రతిమతోపాటు ధాన్యములు రత్నములు నూతన వస్త్రములు కంచుపాత్రము అక్షతలు ముతైపు చిప్పలు చేర్చవలేను. ఇవన్నియు మంత్రపూర్వకముగా దానము చేయ వలెను. ఈ దానము చేయునపుడు దాత ఉత్తరాభిముఖుడై తన దీర్ఘ బాహువులను పైకెత్తవలయును. అనన్య చిత్తుడై యుండవలయును. శక్తియున్నచో తెల్లని వన్నె కలిగి వెండి గిట్టలు బంగరు మొగపుప ట్టె మెడలో గంటలు మొవ్వలు కలిగి దూడకల పాడి యావును కూడ దానము చేయవలెను. ఇట్లు అగస్త్యోదయదినము మొదలు ఏడు దినములు ఈ విధమగు దానముతోపాటు అర్ఘ్యము నగస్త్యున కీయవలయును.
ఇట్లు వరునగా పదునేడు సంవత్సరములు చేయవలయును. అంతకంటే ఎక్కువ కాలము వరకు కూడ చేయ వలయు(వచ్చు)నని కొందరందురు.
ఫలత్యాగమంత్రము: “తెల్లుపూవువంటి దేహప్రకాశము కలిగి ఆగ్ని మారుతుల వలన జనించినవాడ వై మీత్రా వరుణ దేవుల పుత్రుడవై జలకుంభమునుండి ఉత్సన్నుడవైన అగస్త్యా! నీకు నమస్కారము.”
సంప్రదాయ మెరిగి ప్రతి ఏడు ఇట్లర్యము నీయవలెను. తరువాత హోమము జరిపి మనః పూర్వకముగా ఫల త్యాగము చేయవలెను.
ఈ విధానానుసారము అగస్త్యునకు అర్ఘ్యము నగ్పించు పురుషుడు ఈ భూర్లోకమున రూపాయురారోగ్యములతో సుఖించును. తరువాత క్రమముగ భువర్లోకము మొదలగు ఊర్ధ్వలోకములను అన్ని టీని పొంది అచ్చటను సుఖించును.
అష్టవసువులలోని వారగు అగ్ని మారుతుల అంశ వలన జనించిన (వారి కుమారు డెయగు) అగస్త్యుని అర్ఘ్యదాన , విధానమును చదివిసను వినినను ఉత్తమ జ్ఞానమును పొంది విష్ణులోక మును చేరి అచట దేవతలచేత పూజల నందుకొనును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున అగస్త్యోత్పత్తి తదర్ష్య తత్పూజా విధానమును అరువది యొకటవ అధ్యాయము.
