మత్స్య మహా పురాణము

Table of Contents

221 - సామోపాయ విచారము. 

మహాద్యుతీ! సామము మొదలగు ఉపాయముల లక్షణములను పొని ప్రయోగ ప్రకారమును తెలుప వేడుచున్నాను; అనిన మనువుతో మత్సుడిట్లనెను: మనుజోత్తముడగు మను పార్థివా: సామము భేదము దానము దండము ఉపేక్ష మాయ ఇంద్రజాలము ఆనునవి ఏడు ఉపాయములు ప్రయోగింప దగినవి కలవు! అవి క్రమముగ నేను తెలి పెద; వినుము; సామము తథ్యము అతథ్యమునని రెండు విధములు; దీనిలో అతథ్య సొమము సాధువుల పై ప్రయోగించినచో వారాక్రోశిం కోపిం-నిందింతురు; కావున నరోత్తమా! సాధుజనులను సామము తోనే యత్నముతో సాధించవలెను; మహాకులీనులు ఋజు స్వభావులు ధర్మనిత్యులు (ధర్మనిరతులు) జితేంద్రియులు సామ(ముతో) సాధ్యులు; వారియందు అతథ్య (కపట) సామమును ప్రయోగించరాదు; తథ్యసామమునే ప్రయోగించవలెను; ఆది ఏమనగా వారి కుల శీలాదులను వర్ణించుట వారి విషయమున తనకు గల కృతజ్ఞతా భావమును తెలుపుట . ఈ విధమగు యుక్తితో ప్రయోగించు సామము తథ్యసామము; దీనితో ధర్మ తత్పరులగు ఉ త్తములను లోబరచుకొన వలయును; 'సామముతో రక్షసులను గూడ లోబరచుకొందుర'ను శుతియున్న మాట నిజమే; ఐనను దీనిని అసాధుజనులందు ప్రయోగించినచో ఉపకరించదు; తనయందు సామవచనములు పలుకు వానిని అసాధుజనులు అతి శంకితునిగా (తను జూచి చాల భయపడుచున్న వానిగా) భావన చేయుదురు; కావున వారి విషయమున ఆది విడువ వలయును. శుద్ద వంశ్యులు ఋజుస్వభావులు ధర్మస్థితులు సత్యవరులు వినీతులు అగు ప్రసిద్ధ సాధుజనులు సామసాధ్యులు: వారిని సతతము ఆనువ్రతముతో (అను కూల ప్రవర్తనముతో వశీక రించు కొనవలెను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజధర్మమున సామోపాయ కథనమను రెండు వందల ఇరువది యొకటవ అధ్యాయము.