మత్స్య మహా పురాణము
238 - గ్రహయజ్ఞవిధానము – లక్షహోమ - కోటీహోమములు.
(ఇవి లోగడ 92వ అధ్యాయమున మరియొక విధముగా తెలుపబడినవి.)
నృపులు గ్రహయజ్ఞలక్షహోమ కోటిహోమములు సర్వపాప ప్రణాశనమగునవి ఎట్లు జరుపవలయునో జనార్ధనా! సవి స్తరముగ చెప్పుమన మత్సుడిట్లు చెప్పెను: రాజా! ప్రాసంగికముగా ఇపుడు నీకు నీవడిగినది తెలి పెదను; ధర్మ ప్రసక్తుడును ప్రజాహితై షియునగు రాజు లక్షహోమ సమన్వితమగు గ్రహయజ్ఞము జరుపవలేను .
దాని కై నదీసంగమమందో దేవాలయముల ముందో సమప్రదేశమున దైవజ్ఞులను గురువులను ద్విజులను తోడుగ తీసికొనిపోయి భూపరీక్ష చేయవలెను. అచట గుంటలు మిట్టలులేని హస్తప్రనూణచతురస్రముగా కుండముత్రవ్వవలెను; ఇది అయుతహో మరూప సాధారణ గ్రహయజ్ఞమునకు; లక్షహోమమున దీనికి ద్విగుణమును.కోటిహోమమున చతుర్గుణమును అయియుండవలయును; నరిసంఖ్యతో అనగా ఎనిమిదిమంది.వేదపారగులగు ఋత్విజులనియమించవలెను; వారొకాలమున కందమూల ఫలదధిక్షిరాహారులై యుండవలయును; వేదికయందు వివిధ రత్నములను వేయవలెను; వాని పై ఇసుకతో కప్పవలెను; అగ్ని ని ప్రజ్వలింపజేసి హోమము జరుపవలెను; గాయత్రీ మంత్రముతో పదివేలు ‘మానస్తో కే' మంత్ర ముతో ఆరువేలు గ్రహదేవతాక మంత్రములతో ముప్పదివేలు విష్ణుదైవత్య మంత్రములతో నాలుగువేలు కూశ్మాండములతో ఐదువేలు కుసుమములతో వదు నారువేలు బదరీ సమిధలతో పదివేలు శ్రీ దేవతాక మంత్రములతో పదునారువేలు ఇంద్ర దైవత్య మంత్రములలో ఐదు వేలు హవనము చేయవలెను. (10+6+30+4+5+16+10+14+5=100వేలు) ఇది ఐన తత్యువాత యజమానుడు హిరణ్యసహిత షోడశ మంగళ కుంభముల జలముతో పవిత్రస్నా నమాచరించవలెను. ఇట్లు జరిపినచో శాంతియగును.
కోటిహామవీధిః.
ఈ విధముగా జరిపినచో గ్రహపీడా సముద్భవములగు ఉపద్రవములు అన్నియు శమించును; శాంతి పరిపూ ర్తికి హోమానంతరము దక్షిణల నీయవలెను; ఈయబడునది కావుననే దక్షిణయని వ్యవహారము; కావున సర్వప్రయత్నముతో శక్తివంచనలేక దక్షిణలు ఈయవలెను; ఈయవలసినవి: ఏనుగులు గుర్రములు రథములు యాసములు (బండ్లుపాలకీలు మొదలగునవి) భూములు పంచల జతలు ఎద్దులు గోవులు మొదలగునవి; ఇది మాసకాలము జరిపినచో ముగియునది; ఇట్లు నీకు లక్షహోమ విధానము తెలిపితిని.
ఇక కోటిహోమ విధానము తేలి పేదను వినుము; గంగాతటయమునాతట సరస్వతీతీర నర్మదాతీర దేవికాతీరము అందిది జరుపవలెను; దీని కై పదునారుమంది ఋత్విజులను నియమించవలెను; సర్వహోమములును ముగియగనే విప్రునకు ధనమీయవలెను; దీనికై ఋత్విజులతోను ఆచార్యునితో అధ్వర్యునితో - పురోహితునితో, నుకూది సంవత్సర కాలము సాగించు దీక్షను గ్రహించవలయును; ఈ దీక్షను చైత్రమాసమునగాని కార్తిక మాసమునగాని స్వీకరించవలెను; ఇది ఇట్లు ప్రతీవర మందును జరిపినను జరుపవచ్చును; ఈ దీక్షాకాలమున యజమానుడు పాలుపండ్లు మాత్రము ఆహారముగా గ్రహించుచుండవలెను; హోమమున కై యవలు వరిధాన్యము మినుములు తిలలు ఆవలు పలాశ సమిధలు వసుధార ఉప యోగించవలెను; బ్రాహ్మణులకు భోజనము- ప్రథమ మాసమున క్షీర భోజనము రెండవనెలలో సర్వకార్యార్ధ సాధనియగు పుల గము రెండవనెలలో సంయావము (గోధుమరవ్వతో వండిన పాలఅన్న ము) నాల్గవనేలలో లడ్డులు ఐదవనెలలో పెరుగన్న ములు ఆరవనెలలో నర్తుభోజనము ఏడవనెలలో అపూపములు(అప్పములు - బూరెలు - ఆరి నెలు) ఎనిమిదవనెలలో నేతిబూరెలు తొమ్మిదవనెలలో షష్టికము అను రెండు నెలల పంటవరి)బియ్యపు అన్న ము పదవ నెలలో షష్టిక యవల అన్న ము(యవలపిండి రొట్టె) పదునొకండవ నెలలో మినుము (మినుప గారెలు మొదలగు పిండివంటల)తో కూడిన భోజనము పండ్రెండవ నెలలో అన్ని కోరికలను తృప్తిపరచు షడ్రసోపేత భక్ష్యనహితభోజనము పెట్టించవలయును.
ప్రతిమానమందును బ్రాహ్మణులకు (ఋత్విజులకు) దక్షిణలియవలెను; యజమానుడును ఋత్విజులతో కూడి అహతవానసుడై (చించని జత వస్త్రములు - అనగా దోవతుల జతను చించక ఒక దానిని కట్టువస్త్ర ముగాను రెండవ దానిని ఉత్తరీయముగాను అమర్చికొని ధరించిన వాడు అయి)దినార్త కాలము హోమము చేయవలెను; ఇది ఇంద్రాదిదేవతా ప్రీతికరమును సర్వకామ - ప్రదమును; ఇట్లు సర్వదేవతోద్దేశకమగు ఈ యజ్ఞమును జరిపి పశువిశసన పూర్వకముగా అగ్ని షోమమును సర్వదానాది పూర్వకముగా జరుపవలయును; ఇట్లు యథావిధిగ జరుపుచు నూ రేసి హవనముల కొకసారి పూర్ణాహుతి జరుపవలెను; వేయి హవనములు కాగానే ద్విగుణదక్షిణల నీయవలెను; ఇట్లు లక్షహోమములు ముగియు వరకు చేయవలెను. తుదకు ఋత్విజులు పురోడాశమును సిద్ధపరచి దానితో దేవతోద్దేశమున హవనము జరుపవలయును. యజమానుడును మానవ యోగ్యములగు హవిష్యాన్న ములతో జితేంద్రియుడై యుండి ద్విజులను దేవతలను అర్చించి ప్రతి నందించవలెను; తరువాత పితరులనర్చించి శాస్త్రోక్త విధానమున పిండప్రదానము జరుపవలయును; ఇట్లు హోమ సమాప్తికాగానే బ్రాహ్మణులకు (ఋత్విజులకు) దక్షిణలు సమృద్ధిగా ఈయవలెను; తరువాత సరియగు తుల చేయించి దానికి రెండువైపులను రెండు ఉట్టులను వేలాడదీయ వలయును; రాజు తాను బంగారుతో తులలో తూగి. తన భార్యను వెండితో తూకము చేయించవలయును; ఈ ధనమును దానము చేయవలయును; వెండిగాని బంగారుగాని లక్ష నాణెములు ఈతులో భారమునందుండునట్లు యథాశక్తిగ ఇతర ద్రవ్యములనైన తూకముచేసి దానమీయవలెను; రాజు తనకున్న దంతయు (సర్వస్వము)నైన ఈయవచ్చును; దీనిచే రాజసూయ యాగఫలము లభించును; ఇట్లు యథావిధానముగ లక్షహోమ కోటీహోమముల జరిపి ఆ ఋత్విగాది బ్రాహ్మణులకు వీడ్కోలు ఇచ్చిపంపవలయును; యజ్ఞాంతమున పుండరీకాక్షుడును సర్వ యక్షేశ్వరుడునునగు హరీప్రీతిసందుగాక ! అను మంత్రమునుచ్చరింపవలయును; ఆతడు తుష్టుడైనచో జగత్తు సంతుష్టమగును; అతడు ప్రీణితు (ప్రీతినందించబడినవాడై నచో జగము క్షీణితమగును; దైవ హేతుకములును మానుష హేతుకములునగు - సర్వోపఘాతములందును జరుపవలసిన శాంతివిధానము ఇది; నీకు తెలిపిన ఈ యజ్ఞమాచరించినచో సుకృతమాచరించినవాడగును; జన్మమరణముల గూర్చి కాని కృతాకృతములను (నేను ఏపుణ్యమాచరించతిని ఏ పుణ్యమాచరించలేదు. అను విషయమును గూర్చి కాని విచారించ శోకింప-పనిలేదు; సర్వతీర్థ స్నానము చేతను సర్వయజ్ఞాచరణము చేతను కలుగు ఫలమంతయు ఈగ్రహయజ్ఞశ్రయము అయుత హోమలక్షహోమ -కోటిహోమముల)తో లభించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మమున గ్రహయజ్ఞ లక్షహోమ కోటిహోమ విధాన ప్రతిపాదనమను రెండు వందల ముప్పది ఎనిమిదవ అధ్యాయము.
