మత్స్య మహా పురాణము

Table of Contents

234 -  ప్రసవోత్పాత శాంతి.

గర్గుడత్రితో ఇట్లు చేప్పెను; స్త్రీలకు ఆకాలమందు ప్రసూతి జరిగినను కాలాతీతముగా ప్రసూతి ఐనను వికృత ప్రసవము (యమలకము) ప్రసవమయినను అమానుష ప్రాణులును ముక్కులు నోరు మొదలగునవి లేనివారు వ్యసనము లతో కూడినవారు హీనాంగులు అధికంగులు కలిగినను పశుపక్ష్మి నరీ నృపాదులకు ఇట్లు వికృత ప్రసవమయినను ఆదేశ మునకును ఆస్త్రీలున్న కులమునకును నాశమగును; రాజు ఆ మాతా శిశువులను స్వరాష్ట్రమునుండి వెడలగొట్టవలెను; తరు వాత స్త్రీలను పూజించవలెను; బ్రాహ్మణులకును కోరినవల్ల ఇచ్చి పూజించి తృప్తిపరచవలయును; దీనిచే ఈ దోషము శాంతించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ప్రనవోత్పాత శాంతియను రెండు వందల ముప్పది నాలుగవ అధ్యాయము.