మత్స్య మహా పురాణము

Table of Contents

93 - నవగ్రహ స్వరూప కథనము 

ఈశ్వరుడు నారదునకు నవగ్రహ స్వరూపము ఇట్లు తెలి పెను! రవి పద్మము ఆసనము (పీఠము)గా గలవాడు; చేతులయందు పద్మమునుండును. పద్మపు లోపలి భాగపు కాంతివంటి దేహకాంతికలవాడు. ఏడు గుర్రములు వాహనము అయి వాటి ఏడు తాళ్లను చేతులధరించి రెండు భుజములతో ఒప్పారును. చంద్రుడు తెల్లని దేహము వస్త్రములు గుర్రములు భూషణములు కలిగి గదాపాణియే ద్విభుజుడై ఉండును. అంగారకుడు రక్త మాల్యాంబరధరుడు మేష వాహనుడు చతుర్భు జుడు శ క్తి శూల హస్తుడు నై యుండును. బుధుడు పీత (పసపు పచ్చని మాల్యాంబర ధరుడు పచ్చగన్నేరు పూ రేకుల కాంతివంటి కాంతి కలవాడు ఖడ్గచర్మ(డాలు)గదాపాణి_సింహవాహనుడు నై యుండును. గురుశుక్రు లిరువురును చతుర్బు. జులు దండాక్ష మాలాకమండలు ధరులు; బృహస్పతి పసపు పచ్చని శుక్రుడు తెల్లని. దేహకాంతి కలవారు. శనీ ఇంద్ర నీల సమానకాంతి. శూలాయుధము.గృధ్రవాహనము కలిగి.ప్రాసధనువులు ధరించినవాడు. రాహువు భయంకరుడు. ఖడ్గము. డాలు శూలము ధరించినవాడు-నల్లనివాడు. సింహాసనస్థుడు; కేతువులు ధూమ్ర వర్ణులు.ద్విబాహువులు-గదలు దాల్చినవారు వికృతముఖులు గృధవాహనులు నయియుందురు. (ఇచట కేతువు ఒక డుగా మాత్రము కాక ధూమకేతువులు మొదలగు అనేక గ్రహములుగా భావన చేసి చెప్పబడినది.) అన్ని గ్రహములును కిరీటములు గలవిగాను రెండు భార తీయాంగుళముల ఎత్తుకలవిగాను నిర్మింప జేయవలెను. ‘ఇచట శతమష్ణోత్తరాః శుభాః’ అనునది సరిగా అవగతము చేసికొనుట కవకాశము లేకున్నది. ప్రతి మొక గ్రహమునకు సంబంధించిన మంత్రమును కనిష్ట సంఖ్యగా నూట ఎనిమిది మారులైన జపించిన యెడల శుభము కలిగింతురు అని ఆర్థము కావచ్చును.

ఇది శ్రీమత్స్య మహా పురాణమున నవగ్రహ స్వరూప కథనమను తొంబది మూడవ అధ్యాయము.