మత్స్య మహా పురాణము

Table of Contents

112 - ద్వీపాది పరిమాణ కథనము

[భారతీయులు భూగోళ స్వరూప ప్రతిపాదనమున పురాణములందు మూడు భావనలను దృష్టియందుంచుకొనినా రని తోచును. మొదటిది దేశ చతుష్టయ భావన. రెండవది సప్తద్వీప భావన. మూడవది నవవర్షవిభాగ భావన. వీనిని భావిం చుటలో నాటి వారి దృష్టి ఏమనునది విచారింపవలసియున్నది. మిగిలిన రెండు భావనల మాట ఎట్లున్న ను మొదటి భావన మాత్రము చాల విశిష్టమయినది. దీనియందు మన ఋషులు మేరువు (పామీరు పీఠ భూమి) మధ్యస్థానముగా గ్రహించి ఏర్పడు ఒక చతురస్రాకృతిగల ప్రదేశమును యజ్ఞవేదికనుగా భావనచేసిరి. ఇదియొక విలక్షణమగు భావన. ఇది మనవారి హృదయ పవిత్రతను వైదిక దృష్టిని తెలుపుచున్నది. దీనితో బాటు వారు సకల భూమండలమును ఆందలి నదీ పర్వత సముద్రాదికమును వానిచే ఏర్పడు ఆకృతి విశేషములను ప్రకృతియందు ఆయా పర్వత నవ్యాదికము ప్రాణి సమూహము నకు కలుగ జేయు ఆయా ఉపకారములను ఎంతగా ఎరిగియుండిరో కూడ దీనిచే అవగతమగుచున్నది.

ఇక సప్త దీపభావనలో యావద్భూమండలమును చేరియున్నది. నవవర్ష భావన జంబూద్వీప భావనలోని ఒక ఉపాంశము మాత్రమే అని తోచును. దీనిని ఈ అధ్యాయములందు ఎరుగగలము.]

మొఘలు సూతు సీట్లడిగిరి: ద్వీపములు సముద్రములు పర్వతములు వర్షములు నదులు ఎన్ని ? మహాభూత ప్రమాణము లోకాలోక (పర్వత)ము సూర్యచంద్రుల భ్రమణ కమము వారి పరిమాణము ఇదియంతయు యథాతథముగను సవిస్తరముగను తెలుపుము. మే మిదియంతయును మీ నోటినుండి వినగోరుచున్నాము. అన సూతు డిట్లు చెప్పసాగెను. భూమండలమున వేలకొలది ద్వీపములును నూరుల కొలది ఖండములును గలవు. సకల జగత్తును క్రమము తప్పక చెప్పుట శక్యమే కాదు. (ఐనను) ఈ భూమిని సప్త ద్వీపాత్మకముగా విభజించి చంద్రాదిత్య ప్రథృతి గ్రహముల వ్యవస్థ తోను ఖగోళ వ్యవస్థతోను తెలి పెదను. మనుష్యులు తర్కముతో వాని ప్రమాణమును తెలిసికొని చెప్పుచున్నారు. ఏలయన అచింత్యములు (సామాన్యబుద్ధితో ఆలోచించి ఎరుగ శక్యముకానివి) అగు భావములు (పదార్థ వ్యవస్థలు-Systems) వని లోకమున కలవో అవి ఆచింత్యములు. కావున అవి తర్కముతోనే ఎరుగవలయును...

(ఇచ్చటినుండి మొ త్తము భూమండలమును 1. జంబూ 2. శాక 8. కుశ 4. కారంచ 6. శాల్మల 6. గోమేద 1. పుష్కర ద్వీపములను పేర సప్త ద్వీపములుగా విభజించి వానిలో మొదట జంబూ ద్వీపమును గ్రహించి దానియందు చతుర్దేశ విభాగమును స ప్రవర్ష విభాగమును దృష్టియందుంచుకొని భారత దేశము ప్రధానముగా వర్ణనము ఈయబడును. ఈ సప్తవర్ష విభాగమునందే ఆర్ష వాజ్మయమున అత్యంత ప్రసిద్దముగా నున్న దియు శ్రీమద్భాగవతాదులందు వర్ణింపబడి నదియు నగు నవవర్గ విభాగము కూడ ఇమిడి యున్నది. ఈ భూమండల విభాగ భావనా పరంపర అత్యంత ప్రాచీనము. పురాణ రచయితృ ఋషులకు వైదిక ఋషులనుండి అనుశ్రుతముగా అను స్యూతముగా వచ్చిన భావనా వరంపర ఇదీ - యనుట యందేట్టి సందియమును లేదు. - వైదిక స్మార్త పౌరాణిక కర్మానుష్టానము లన్నిటియందును ఆయా ప్రసంగము లందు ఇదియే గ్రాహ్యము. నేడు మనకు వాడుక లోనికి వచ్చిన దేశ ఖండ ద్వీప విభాగములు దీనియం దేట్లు చేరియున్న వో పరిశీలించిన గమనించవచ్చును. .

వీని గమనిక కై మొదట ఆయా విభాగముల స్థూలరూప ప్రతిపాదనము ఇట్లుండును.

దేశ చతుష్టయ విభాగము: నట్టనడుమ మేరువు దీని సమీపమున ఇలావృతవర్షము (నేటి పామీరుముడి అను పీఠభూమి) దీనికి దక్షిణమున. 1. భారత వర్షము 2. కైలాస హిమవత్పర్వతములు 8. అలకనందానది గంధమాదన మందు) 4. నందనవనము 6. మానస సరన్ 6. కచ్చప భగవానుడు 7. జంబూవృక్షము; పశ్చిమమున- 1. కేతుమాల " వర్గము 2. ఋషభ పారియాత్ర పర్వతములు 8. స్వరమునదీ 4. వైబ్రెజవనము 5. శీతోద సరస్ - 6. వరాహ భగ వానుడు 7. అశ్వత్థ వృక్షము; ఉత్తర మున-1. ఉత్తర కురువర్షము 2. శృంగవత్.జారుధి(దేవ)పర్వతములు 8. సోమానది 4. సావిత్రవనము . మహాభద్ర సరస్ 6. మత్స్య భగవానుడు 7. వటవృక్షము; తూర్పున. 1. భద్రాశ్వవర్షము 2. దేవ పర్వతము.. సీతానది 4. చైత్రరథవనము 6. ఆరుణోద సరస్-6. హయగ్రీవ భగవానుడు 7. భద్రకదంబవృక్షము.

సప్త ద్వీపములు: 1. జంబూ 2. శాక 8. ప్లక్ష(గోమేదము అని మత్స్య పురాణమున) 4. శాల్మల 6. పుష్కర గీ. కుశ 7. క్రౌంచ ద్వీపములు.

నవవర్షములు: భారత కింపురుష హరీలావృత రమ్యక హైరణ్యక కురు భద్రాశ్వ కేతుమాల వర్షములు. (వర్షము = స్థానము)

వీనిలో దేశ చతుష్టయ విభాగమున ఇలావృత భారత కేతుమాల కురు భద్రాశ్వ వర్షములు చేరియున్నవి. భరతవర్షమందలి నవ భాగములు (ఖండములు) మత్స్య పురాణానుసార మున. 1. ఇందద్వీపము 2. క శేరు ద్వీపము 8, తామ్రపర్ణ ద్వీపము 4. గభ సీమాన్.5. నాగద్వీపము 6. సౌమ్యద్వీపము 7. గంధర్వ ద్వీపము 8. వారుణ ద్వీపము 9. భరత ద్వీపము (ఖండము).

ఇలావృత భారత భద్రాశ్వ కేతుమాల కురు రమ్యక హిరణ్యము లనెడి స ప వర్షములను జంబూ ద్వీపమును యథాస్థితముగ వివరింతును. ఈ ద్వీపముల-వర్షముల.మండలపు విస్తారమును యోజనముల లెక్కలో చెప్పెదను. జంబూ ద్వీప వైశాల్యము లక్ష చదరపు)యోజనములు. ఇది అనేక జనపదగామములతో వ్యా ప్రము; అనేకులగు సిద్దులు చార ణులు దేవతలు ఇందు వ్యాపించియున్నారు. శిలా సమూహములందు మెరయుచు నుండెడి గైరిక కొండలయందు ఏర్ప డెడి) ధాతువులతో కప్పువడిన పర్వతము లనేకములును ఆ పర్వతములందు ప్రభవించిన నదులును దీనియందంతటను గలవు. మిగుల గొప్ప సమీప ప్రదేశములును ప్రక్క ప్రదేశములును కల ఆరు వర్ష పర్వతములు పూర్వ పశ్చిమ సము ద్రములందు చొచ్చుకొని తూర్పు పడమరలుగా వ్యాపించియున్నవి. అవి 1. చాల భాగము మంచుతో కప్పబడియుండు హిమవంతము 2. బంగారుతో వ్యా పమగు హేమకూటము.8. చక్కని ముఖము కలిగినదియు గొప్పదియునగు నిషధ పర్వ తము అనునవి మూడు. (ఇచట వర పర్వతములు ఆరని చెప్పియు మూడు మాత్రమే ఈయబడినవి. ఈ మూడును మూడు జతలను తెలుపును. వానిలో ఒక జత నీల నిషధములు; రెండవజత శ్వేత హేమకూటములు; మూడవజత హేమకూట హిమవంతములు. పైన చెప్పిన మూడును ఈ మూడు జతలలో ముఖ్యమైనవిగా నున్న వి. వర పర్వతములు అనగా ఒక వర్షమును మరియొక వర్షమునుండి వేరుపరచు అవధులు.) దేశ వర్ష) చతుష్టయ విభాగములో కేంద్ర స్థానీ యమగు మేరు పర్వతము ఉల్బమయము {ఉపలమయము-ప్రచురముగా రాళ్ళు కలది. అనగా ఇది శిలా ప్రచుర మగు ఉన్నత ప్రదేశ మేకాని అన్ని పర్వతములవంటి రూపము కలదీ కాదని తెలియదగినది. సువర్ణమయమని ప్రసిద్ధమైనను అది చాతుర్వర్ణము (నాలుగు వర్ణములు కలది.) ఇదియుగాక సగమ పురుషుడు తన అనంతశ క్తిచే , అవ్య క్రతా వ్యక్తితా దశలనొందు క్రమములో అతని నుండి ప్రజాపతి హిరణ్యగర్భుడు జసించేను. ఆ జనించిన ప్రజాపతి నామక శిశుపు నాభిస్థానమీ మేరువు. దానిపై ఆవరించిన మావి-ఉల్బపు. పొరవంటిది ఈపామీరు శిలామయ ప్రదేశము. ఇది ఇరువది నాలుగువేల చదరపు యోజనముల వైశాల్యము గలదై నాలుగు దిక్కులందును విస్తరిల్లినది. ఇది వృత్తాకృతియు చతురస్ర రూపమును కలది. ఎట్లన.తూర్పు-పడమర.ఋజు రేఖా రూపమునను దక్షిణోత్తరములందు గుండదనముతోను ఉన్నందున ఈ వృత్తాకృతిలోనే చతురస్రాకృతి ఏర్పడును. ఈ మహామేరువు తూర్పున శ్వేత వర్ణ ము దక్షిణమున పీత పర్ణము పడమర కృష్ణవర్ణము ఉత్తరమున రక్త వర్ణము కలిగి వరుసగా బ్రాహ్మణ వైశ్య, శూద్ర క్షత్రియ వర్ణముల రూపమున విరాట్పురుషుడుండుటను తెలుపుచున్నది. ఈ మహా మేరు శిలామయ ప్రదేశమునకు హమీరు పీఠభూమికి) ఆయా దిశలందు నీలవర్ణము. వైదూర్య రత్న కాంతి. శ్వేతవర్ణము-పీతవర్ణము హిరణ్యవర్ణము. నెమలిపించేపుకాంతి బంగారు కాంతి కలిగిన ఏడు పర్వతములు వెలుగొందుచుండ వీని నడుమ ఈ మహామేరువు పొగలేక జ్వలించు ఆగ్ని వలె ప్రకాశించుచుండును. ఈ ఏడు పర్వతములందును సిద్దులును చారణులును సదా సంచరించుచుందురు. (అష్ట సిద్ధులు.మహామంత్ర సిద్దులు పొందియును పొందుటకు ఆయా సాధనలు చేయుచును సాత్విక ప్రవృత్తితో సంచరించుచుండు దేవజాతీవారు సిద్దులు.తమ దివ్య శక్తులతో అంతరిక్ష ద్యులోక సంచారము చేయుచు విమానములు లేకయు ఆయా లోకములందు సంచరించుచు వింతల చూచుచు ఆనందించుచు అవి మెచ్చుచు తిరుగు దేవతలు చారణులు) ఈ పర్వతములలో ఒక దానిని మరియొక దానికిని నడుమగల అంతరములన్నియు కొలిచి కూడగా ఆగు అంతరముల మొత్తము తొమ్మిదివేల యోజనములు (ఇది వైశాల్యముకాదు.) ఈ నడుమ నున్న మహా మేరువునకు చుట్టుప్రక్కల దీనినంటియున్న వర్షమునకు ఇలావృత వర్షమని వ్యవహారము. దీని వైశాల్యము ఇరువది నాలుగువేల చదరపు యోజనములు,

సృష్ట్యాదియందు భగవత్సంకల్పాను గుణముగా దేవతలు వితత మొనర్చిన ఆది యజ్ఞమునందు ఈ ప్రజాపతి నాభిస్థానము వేదియై ఆ వేదికకు నలుమూలలందున్న నాలుగు పర్వతములును విష్కంభములు. వేదిక కు అవధిని తెలుపు గుంజలు కాగా నడుమనున్న అగ్ని స్థానమీ మహా మేరువని ఋషుల భావన. ఈ మహామేరువు (పామీరు శిలామయ ప్రదేశము) అను దేవయజ్ఞ వేదిక లో దక్షిణార్ధము ఉత్తరార్ధము అను రెండు అర్ధభాగములు ఉన్నవి. అని భావన.

ఇది భౌగోళిక సంగ్రహ ప్రతిపాదనము ఇక మీదట సప్తద్వీప-నవవర్గ-నవఖండ భావనలలో దీని వివరణము చూడనగును.

ఈ మహామేరువు ఒక గుర్తుగా చేసికొని చేయు ఈ భూగోళ సప్తవర్ష విభాగమునందు ఒక వర్షమును మరియొక వరమునుండి వేరుపరను పర్వతములు వర పర్వతములు. ప్రతి వర్షమునకును ఉత్తర దక్షిణముందు రెండేసి వర్ష పర్వతములు పొలిమేర గీతలై తూర్పు పడమరలుగా వ్యాపించిన ఈ పర్వతములలో ఒక్కొక్క దాని పొడవు ఇంచుమించుగ రెండేసి వేల యోజనములు.

1జంబూద్వీప వర్ణనము

 ఇక జంబూద్వీప విస్తారమును దానియందలి ఆయా వరముల సీమా రేఖలను ఆయా వర్ష పర్వతముల పొడవును తత్సంబంధులగు అంశములను తెలి పెదను. వీనిలో నీల నిషధ పర్వతములు అను జత మొదటిది. మిగిలిన శ్వేత-హేమకూట-హిమవత్-శృంగవత్ లను నాలుగును. వీనికంటే తక్కువ పొడవు గలవి. ఏడవదగు ఋషభ పర్వతము పొడవు జంబూద్వీపపు వైశాల్య మేన్ని యోజనములో అన్ని యే యోజనములు. హేమకూటపు పొడవు దానిలో పండెండవ వంతు తక్కువ; హిమాలయపు పశ్చిమ భాగమున (పర్వతము లేక లోయగా ఏర్పడియున్న నేటి ఖేబరు బోలన్ కనుమల భాగమువంటివి) ఈ పండ్రెండవ వంతులో పండేండవ వంతు తగ్గియున్నది. హేమకూట  మహాగిరి పొడవు ఎనుబది ఎనిమిదివేల యోజనములు; హిమవంతము ఎనుబది వేల యోజనముల పొడవున తూర్పు పడమరలుగ ఉన్నది. ఈ జంబూద్వీపపు మండలీభావము (గుండ్రని రూపము ను బట్టి ఈ అవధి పర్వతముల పొడవులో ఎక్కువ  తక్కువలు కనబడుచున్నవి. (అనగా దీనినిబట్టి వీని పొడవును కొలుచు పద్ధతిని ఎరుగవలెను.) ఈ రెండేసి వరం అవధి.పర్వతముల నడుమ ఎన్ని యోజనపదములు గలవు. (జనపదములు-గ్రామములును-మహా గ్రామములును) వాని సముదాయములే వరములు. అవి మొత్తము ఏడు. మరి రెండు ముందు చెప్పబడును.) ప్రపాతముల (నిటనిలువుగానున్న ఉన్నత శిలామరు ప్రదేశముల) తోను అంతకుమించిన పల్లములతోను నిండిన అనేక పర్వతములు ఈ వరములందును వానియందలి జనపదములందును ఆవరించియున్నవి. ఈ పర్వతముల మూలమునను అనేక నదుల మూలమునను ఇవి పరస్పరము-ఒక దానినుండి మరియొక దానికి-పోవుటకు వీలు కాకున్న వి. వానియందంతటను ఎన్ని యో ప్రాణులును మూర్తములును అచూర్తములును అగు పదార్థములును ప్యాపించియున్నవి.

తేషు హైమవతం వర్షం భారతం నామ విశ్రుతమ్

వానిలో మొదటిదగు భారతవర్షమునకు హైమవత వర్షమని పర్వతమును బట్టియు పేరు. ఇట్లే దాని కావల నున్న హేమకూట పర్వతము అవధిగాగల వర్షము కింపురుష వర ము. దాని కావల నున్న నిషధ పర్వతము అవధిగా నున్న ది హరివరము. దాని కావల మేరువు నాశ్రయించియున్నది ఇలావృతవర్షము. దీని కావల నీలపర్వతము అవధిగా గలది రమ్యకవర్షము. దానికి ఆవల శ్వేతపర్వతము అవధిగా గలది హిరణ్యక వర్షము. దాని కావల శృంగవత్ పర్వ తము అవధిగా గలది. ఉత్తర కురువర్షము. (ఇవి తమకు ఆవధిగా గల ఆయా పర్వతములను బట్టి నిషధవర్షము నీల వర్షము ఈ మొదలగు పేరులతో కూడ వ్యవహరింపబడవచ్చును.)

మేరువర్ణనము: మహామేరువునకు చుట్టును ఇలావృతవర్షము కలదు. ఇది ఉత్త రేలావృతవర్షము దక్షిణేలావృతవర్షము అని రెండుగా ఉన్నది. మేరువునకు దక్షిణమున నీషధ పర్వతము ఉత్తరమున నీలపర్వతము. ఈ రెండును తూర్పున గంధ మాదనము పడమర మాల్యవంతము అను రెండు పర్వతములును ఉత్తర దక్షిణములుగా వ్యాపించి దక్షిణమున నిషధమును ఉత్తరమున నీలమును తాకుచున్నవి. కాని నిషధ.నీల పర్వతములు రెండును మహా మేరువునకు నడుమ భాగమునకు సరి సాటిగా నున్న భాగములో నిషధము మరికొంత దక్షిణమునకును నీలము మరికొంత ఉత్తరమునకును వంపు తిరిగి ధనురాకారముగ ఉన్న వీ. ఇట్లున్న ఈ నీల గంధమాదన నిషధ మాలవత్పర్వతముల నడుమ ఇలావృతవర్షము ఉన్నది. ఈ నడుమ భాగము కొంత యజ్ఞవేదికయందలి దక్షిణో త్తరార్ధ భాగములుగాను దీనియందే జనావాసభాగము ఉత్తర దక్షిణేలా వృత భాగములుగాను ఉన్నది. ఈ చెప్పిన విధమున ఈ ఇలావృతవర్షపు (వేదరూప ప్రదేశమ దలి) రూపము తూర్పు పడమర లందు ఋజు రేఖారూపముగాను ఉత్తర దక్షిణములందు (వృత్తఖండపు) వక్ర రేఖారూపమునను ఉన్నది. ఈ మాల్యవద్దంధమాదన పర్వతములు రెండును ఒక్కొక్కటి ముప్పది రెండు వేల యోజనముల పొడవు కలిగి ఉన్న వి. ఈ నాలుగు అవధుల నడుమగా మహా మేరువునకు చుట్టును కొంత కొంత మేర వ్యాపించి సర్వరత్న విభూషితములగు విపుల సుపార్శ్వము లనెడు రెండు పర్వతములు ఉన్న వి. ఈ రెంటి నడుమను పైని తెలిపిన నీల మాల్యవత్ నిషధ గంధ మాదనములకు నడుమను ఉన్న మేరువు కనక పర్వతము అను ప్రసిద్ధితో ప్రకాశించుచున్నది. ఇది నాలుగు అగ్రములందును (ఆగ్రము = కోణము -అంచు) నాలుగు వర్ణములు కలిగి ఉన్న ది. ఎట్లన. తూర్పున తెలుపు-దక్షిణమున పీతము-పశ్చిమమున నలుపు ఉత్తరమున ఎరుపునై యున్నది. ఇట్లాయపరిమండల పర్వతాంశముల కాంతులను బట్టి దూరమునుండి చూచువారికి బంగారు కొండ గాను రత్నమయ శాఖా పర్వతములతో కూడి రత్న మయముగాను నే కనక పర్వతము రత్న సానువు రత్నమయములగు సానువులు.నె త్తములు కలది) అని కీర్తింపబడుచు భూమికి నడుమ నున్న ఈ మేరువు (పామీరు శిలామయతలము) ఎనుబది వేల యోజనముల ఎత్తు కలిగియున్నది. దీనికి గల పాతు భూమిలోనికి గల లోతు నలువది నాలుగు యోజనములు. వెడల్పునకు *మూడింతలు దీని చుట్టు కొలత. ఇట్టి ఈ మేరు పక్వతము చాల గొప్పది; దివ్యమయినది; (మన కీనాడు కానరాకున్న ను విశ్వసించదగిన అతీంద్రియ విశిష్టత కలది; దివ్యౌషధులు కలది; (తన కాంతుల ప్యోపిచే బంగారుతో అలంకరించబడినవియో అనునట్లు తో చెడి సర్వ భువనమును దీనిచుట్టు నున్నవి. ఈ శైలరాజమునందేఅంతటను గంధర్వాపరోసుర రాక్షసులును అప్సరోగణాదికముతోనర్వదేవగణములును ఆనం దించుచు విహరించుచుందురు. ఇట్లీ మేరువు సర్వ భూతముల సృష్టి స్థితులకు హేతువులగు భువనములతో చుట్టబడియున్నది.

(*ఇక్కడ చెప్పిన కొలతలు అన్ని యు ఈనాడు మనకు తెలిసిన కొలతలతో పోల్చినచో అభూతకల్పనలుగా తోచును. కాని మన ప్రాచీనుల ఆతీంద్రియ విజ్ఞానమును బట్టి వాని కొలత లేమైయుండునో జాగ్రత్తతో జించవలయును. వ్యక్తి తానొకచో నిలిచి నడుమ నున్న అవరోధ పదార్థము మీదుగా ఒక కోణములో ఊర్ధ్వ దిశగా చూచినపుడు ఈ అవ రోధము తన కావల నున్న అంతరిక్షములో ఎంత ఎత్తును చూడ నిచ్చుచున్నదో అది ఇచ్చట ఎనుబది నాలుగు వేల యోజనములు కావచ్చును. పామీరుముడిగే ప్రపంచమునందలి సర్వ ప్రధానా ప్రధాన పర్వత శాఖలకును కేంద్ర స్థానీయ మని నేటి భూత త్వవేత్తలు (Geologists) చెప్పు విషయమును గమనించి ఈ విషయముల నొలోచించి చో ఈ కొలతల యాధార్థ్యము మరికొంత తెలియగలదు. ఏమైనను మన పూర్వులు యావద్భూమండల స్వరూపమును సూక్ష్మాతి సూక్ష్మము పవిత్ర భావనాపూర్ణము భావుకతాయుతమునగు దృష్టితో చూచి మనకు అందించిన తీరు ప్రశంసనీయము గదా!)

నాలుగు వరములు: డేని నానా పార్శ్వములయందు (తూర్పున) భద్రాశ్వ వర్ష (మహాదేశ)ము (దక్షిణమున) భారతవర్ష మహాదేశము పడమట , కేతుమాల వర్ష (మహా దేశ)ము ఉత్తరమున ఉత్తర కురువర్షమహాదేశము ఉన్న వి. ఈ ఉత్తర కురువులు పుణ్యము చేసికొన్న వారికి నివాసభూములు. ఈ మేరువునకు నలు మూలల ఈ వర్షము లందు విష్కంభ (అవష్టంభ) పర్వతములు సర్వ రత్న ఏ భూషితములు ముందర గంధమాదన ఏపుల సుపార్శ్వములను నవి కలవు. అరుణోదము మానసము సితోదము భద్రము అను సరస్సులు ఈ వర్షము లందు ఈ పర్వతముల పైవరుసగా గలవు. ఇట్లే వరుసగ భద్రకదంబవృక్షము జంబూ ప్లక్ష జువ్వివృక్షములు. అశ్వత్థ వృక్షము ఎవటవృక్షము కలవు.

 కేతుమాల వర్తమ : గంధమాదన పర్వత పార్శ్వమున పశ్చిమదిశ గా మేలగు మండపము (పందిరి క్రిందవలే చల్లనిదై జనావాసయోగ్య ప్రదేశము) కలదు. శుభకర్మకారులగు కేతుమాలులు అను జను లచట ఉందురు. వారు నల్లని దేహచ్చాయయు మహానత్వమును మహాబలమును గలవారు. స్త్రీ లచట నల్లకలువలవంటి దేహచ్ఛాయ కలిగిన ప్రియ దర్శనలు (వారిని దర్శించుట కన్నులకు ప్రీతి కలిగించును.) అచట చక్కని ఆకులతో ప్రకాశించు దివ్య పనసవృక్షము గలదు. అచటీవా రా వృక్షపు పండ్లరసమును త్రోవుచు పదివేల ఏండ్లు జీవింతురు. దీని సం కేతి తార్థము ఏమయినను ఇది నేటి ఆసియా పశ్చిమభాగము); ఇక భద్రాశ్వవర్షము: మాల్యవల్ పర్వత పార్శ్వమున పౌర్వాపరాంతికులు తూర్పు కడపటి మేర యందలి జనులు) నివసింతురు. ఇచట సదా ముదిత మానసముకల థ దాశ్వము (మేలుజాతి గుర్రము కలదు. ఈ చోటి వైశాల్యము ముప్పది రెండు చదరపు యోజనములు; ఈ భ్వ వర్షమున భద్రసాలమను వనము కలదు; కాలామ (నల్లని మామిడి) మహావృక్షము గలదు. అచటి జనులు తెల్లనివారు- మహోత్సాహ మహాబలములు గలవారు; అచటి స్త్రీలు తెల్ల కలువలకాంతివండి.చంద్రుని కాంతి వంటి - దేహకాంతి చంద్రుని ప్రకాశ మువంటి లావణ్యము పూర్ణచంద్రునివంటి మొగము కలిగిన ప్రియదర్శనలగు సుందరులు; ఆ స్త్రీల శరీరములు చంద్రునీవలె చల్లనివి; కలువపూలవలే కమ్మని సువాసనలు 'కలవి; అచట - జనులు ఏ వ్యాధులును లేక పదివేల సంవత్సరములు జీవింతురు. ఈ కాలామరసపానము చే వారందరును స్థిర జీవనులై యుందురు. (ఈ భద్రేశ్వవరము నేటి చీనాది దేశ ములు); అని ఇట్లు స్వయంభూ బ్రహ్మ ఈ వరముల స్వాభావిక స్థితిని ఋషులతో చెప్పెను. ఇది వారి అనుగ్రహమున నాకు తెలిసినందున నాచే తెలుపబడినది; మరి ఇంకేమి వినగోరెదరు; ఏమి చెప్పుమందురు? అని సూతు డనగా విని సంశితప్రతులు (పవిత్ర కర్మానుష్టానము కలవారు) అగు ఆ నైమిశారణ్య ఋషులు ముద న్వితులును కుతూహలులునై జిజ్ఞాసతో ఇట్లు పలికిరి: మహామేరువునకు తూర్పు పడ మరలందుగల రెండు మహాదేశముల విషయము మాకు తెలిపితిరి; మహామతీ! ఉత్తర దిశ యందలి వర్షములును ఆచటి పర్వతముల ఉనికియు ఆ పర్వతములందు వసించు జనులును ఏవి. ఎట్టివి.ఎవరు ఎట్టివారు - అను విషయముయథాత త్వ ముగా మాకు దెలుప వేడుచున్నాము. అని ఋషులడుగ సూతు డిట్లు చెప్ప నారంభించెను:

మునులారా! మీరందరును వినుడు; నే నిదివరకు చెప్పనవాని నిపుడు తెలి పెదను. రమ్యకవర ము: నీల పర్వతమునకు దక్షిణమున నిషధపర్వత మునకు ఉత్తరమున ‘రమ్యకము’ అను వర్షము - కలదు. అదియు ఉత్తమ ప్రజా వాసము; అచటి జనులందరు జాతి ప్రధానులు (జన్మసిద్దముగా ! శ్రేష్ట తాలక్షణములు కలవారు.) నిర్మలులు; పాపరహిత మగు వంశమున పుట్టినవారు. తెల్లని ఆనువంశిక మగు దేహచ్ఛాయ కలవారు; ప్రియదర్శనులు చూడముచ్చట గొలుపు వారు); అచట గొప్పదియు పూజ్యమును నగు మర్రిచెట్టు కలదు; అచటి మహాభాగులు ఆగు నరోత్తములు ఆ పండ్లరస మును త్రోవుచు హృష్టు(సంతోషయుక్తులై పదునొకండు వేల సంవత్సరములు జీవింతురు.

 హిరణ్యక వర్షము: శ్వేత పర్వతమునకు ఉత్తరమున శృంగవత్పర్వతమునకు దక్షిణమున హిరణ్యక, వరము కలదు. అచట హైరణ్యక నది కలదు. అచటి మానవులందరును మహాబలులు మహాసత్త్వులు (సత్వము అనగా నిబ్బరము -శ్రమను ఓర్చెడి యోగ్యత) సదా సంతుష్ట మానసులు; తెల్లని దేహచ్చాయ , కలవారు; ప్రియదర్శనులు; పదునొకండువేల ఐదువందల ఏండ్లు జీవింతురు. అచట మనోహరములగు ఆకులు, కొమ్మలు రెమ్మలు గల మహాశ్వళ్ల వృక్షము కలదు. అచటివారు దాని పండ్లరసము త్రావి జీవింతురు. ఆచటి శృంగవత్పర్వతపు రమ్య మహా శిఖరము. లనేకములలో ఒకటి మణిమయమును మరియొకటి స్వర్ణమయమును చూడవది సర్వరత్న మయమును భవనోపశోభితమును.

ఉత్తరకురు వరము: శృంగవత్పర్వతపు మూడు శిఖరములలో కడపటిదగు సర్వరత్నమయ శిఖరమునకు ఉత్తరపు అంచును తాకుచు (షార జల) సముద్రమును దక్షిణపు అంచును తాకుచు ఉత్తర కురు వర్షమును ఉన్నవి. ఈ వరము సిద్ధ జనులకు ఆశ్రయము. అచటి వృక్షములు మధు (తేనెయే - లేదా తేనెవంటి) రసములు కలవి.  దవ్యమగు అమృత తుల్యమగు జలములు కల నదులచట కలవు. అచటి వృక్షములు పండ్లతో పాటు ఆభరణములను కూడ ఫలించును. అచటి కొన్ని వృక్షములు మనోరమములును సర్వకామ ప్రదములునయి వస్త్రములను షడ్రసోపేత భక్ష్యము లను ఫలించును. ఊరి వృక్షములు పాలుగల చెట్లు) అను అచటి కొన్ని చెట్లు అమృత తుల్యమగు షడ్రస భోజనము నీచ్చును. అచటి భూమియంతయు మణిమయమును సన్నని బంగారు ఇసుక కలదియు అంతటను సుఖకరమగు స్పర్శము కలదియు బురద లేనిదియు శుభకరమును బాధ కలిగించనిదియునై యుండును. తమ పుణ్యానుభవానంతరము దేవలోకమునుండి భువికి జారిపడిన శుభ మానవులు ఆచట జన్మింతురు. వారందరును తెల్లని ఆనువంశికమగు దేహచ్చాయయు స్టీర యౌవనమును కలవారు. అప్ప్సరసల వంటి ఆచ్చటి స్త్రీలకు కవల పిల్లలు దంపతులే పుట్టుదురు. ఆ కవ శిశువులు అమృతోపమమగు అచటి క్షీరి వృక్షముల క్షీరమును తావుదురు. కవలు సమముగా (సమరూప గుణ లక్షణములతో) పుట్టుదురు. పెరుగుదురు.సమశీల రూపములు కలిగి జీవించి సమముగా సమకాలమున మరణింతురు. వారు పరస్పరము అనురక్తులై చక్రవాక ములవలే జీవింతురు. వారు రోగరహితులు శోకరహితులు-నిత్యము ముదిత మానసులు. మహాసత్వులు; వారును పదునొకండువేల ఏండ్లు జీవింతురు; ఏ స్త్రీయు ఆ దంపతుల జీవితముల నడుమ ప్రవర్తించదు.

 భారత వరము మొదలగు వరముల స్వభావము ఇట్టిదియేయని పరమ తత్వజ్ఞులు దర్శించి తెలిపిరి. మీకు మరీ ఇం కేమి చెప్పవలయును. అని సూతుడు ఋషులతో పలికెను.

బుద్ధిశాలియగు సూతపుత్రుడు ఇట్లు వ్యాకరించి (విడుమరచి) చెప్పగా మరియు తరువాతి  విషయము విను కుతూహలముతో ఋషులు అతని నింకను ప్రశ్నించిరి.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళవర్ణనమున ద్వీపాది వర్ణనమసు నూట పండ్రెండవ అధ్యాయము.