మత్స్య మహా పురాణము

Table of Contents

240 - అవయవ స్పందనమును బట్టి శుభాశుభ విచారము.

సర్వ ధర్వ విదులలో శ్రేష్ఠుడవగు భగవన్! నీవు సర్వజ్ఞుడని క్షప్రసిద్ధుడవు; శుభాశుభ నిమి త్తములను తెలుపుమనిన మనువుతో మత్సుడిట్లనెను; అవయవములు గాని వీపుగాని హృదయముగాని కుడివైపున స్పందించుట శుభము; ఎడమవైపున స్పందించుట ఆశుభము. ఆనగా ఆంగస్పందనమును శుభాశుభ విచేష్టితమును " విస్తరముగ నాకు తెలిపి నన్ను ఆది ఎరిగిన పోరిలో గొప్పవానినిగా జేయుమన్న మనువుతో మత్యుడిట్లుచే ప్పెను: కుడివైపున స్పందము కూడ మూర్గమందై నచో పృథ్వీలాభము - లలాటమందు. స్థానవృద్ధి - భూదేశమందు - ప్రియ జన నంగ మము; అక్షదేశమందు - భృత్యలాభము - కంటికోనయందు ధనాగమము . నడుమునందు తహతహపాటు . కంటికొలికి యందు యుద్దమందు శీఘ్రముగా జయము కడగంటియందు శ్రీభోగము చెవి కోనయందు-ప్రియ వార్తాశ్రవణము-నాసిక యందు ప్రీతిసౌఖ్యము. పెదవులయందు ప్రియలాభము కంఠమందు భోగలాభము భుజమూలముల యందు భోగవృద్ధి- భుజ ములయందు మిత్రులతోడి స్నేహలాభము-హ సమునందు ధనాగమము - వీపునందు పరాజయము.వక్షమునందు సద్యో జయము కుశులయందు ప్రీతి స్త్రీకి స్తనమందు అయినచో సంతానప్రాప్తి - నాభిదేశమందు - స్థానభ్రంశము - జఘన మందు ధనాగమము. మోకాళ్ళ సంధులయందు బలవంతులతో సంధి. అరికాళ్ళయందు ధనలాభకర ప్రయాణము. కలు గును. గుహ్యావయవమందై నచ్.బొబ్బలును పుండ్లును అగును; పాదములయందు ఉత్తమస్థాన ప్రాప్తి.యగును; ఈ చెప్పిన స్పందములన్ని యు స్త్రీలకు ఎడమవై పున కలిగినచో మంచి ఫలములనిచ్చును; పురుషులకయినచో ఈ స్పందము కుడివైపు నందలి ప్రశస్త్రాంగమందమయినచో విశేషముగ ప్రశ సఫలము; ఎడమ వైపునందలి అప్రశస్త్రాంగమందయినచో విశేషముగ అప్రశస్త ఫలము; ఈ చేప్పినవికాక మిగిలిన అవయవముల స్పందము విషయమున ఫలము సద్రాహ్మణులవలన నేరుగ వలయును; అనిష్టచిహ్న ములు కనబడినచో బ్రాహ్మణ సంతర్పణమును బ్రాహ్మణులకు సువర్ణ దానమును చేయవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున అవయవ స్పందన నిమిత్తక శుభాశుభ విచారమను రెండు వందల నలువదియవ అధ్యాయము.