మత్స్య మహా పురాణము
118 - పురూరవసు డత్ర్యాశ్రమమున కేగుట-తపమాచరించుట
హిమాలయమునందలి ఇట్టి ప్రదేశములో చాల ఎత్తయిన రెండు శిఖరములు కలవు. వానియందు అధిక ముగా వర్షము కురియుచు మంచుపడుచు ఉండును. ఈ రేంటీ నడుమ వీనికంటె చాల ఎత్తయిన మూడవ శిఖరవి) కలదు, దాని శిలలు ఎడతెగక ఎండతో కాలు చుండును. అయినను ఆచట ! శ్రమతోచదు. ఆ శిఖరమునకు దిగువలో పడమటగా చెట్ల గుబురులో జాజి తీగలు క్రమ్మినదై చూడముచ్చటగా నున్న గొంది ఒటి కనబడగా కుతూహలము కలిగి పురూరవో రాజందు ప్రవేశించెను. చీకట్లు దట్టముగా కమ్మియున్న ఆ ప్రదేశము సర్వమాత్రము (నాలుగు వందల ధనువులు; ధనువు = నాలుగు మూరలు) పొడవుండెను. అది దాటిన తరువాత చక్కని కాంతులే ఆభరణములుగా ప్రకాశించునదిచాల ఎత్తైనది చాల లోతుక లది లోపలికి వ్యాపించినది) గుండ్రనిది ఒక చోటు కలదు. అచట సూర్యుడు తస ఎండను చంద్రుడు తన వెన్నెలను ప్రసరింపజేయరు. ఐనను అది అహర్నిశములు పగలువలె ప్రకాశించుచుండును. దానియందు క్రోశ ముకంటె ఎక్కువ వ్యాసముగల (క్రోశము = 1000 ధనువులు) సరస్సు అంద గించుచుండెను.
ఈ సరస్సునకు అన్ని వైపులను వ్యాపించి కొండను అంటుకొని వేదిక (పొదరిండ్లతో నిండిన ప్రదేశము) ఒకటి కలదు. కన్నులకింపగు కాంతులే ఆభరణములై ప్రకాశించు మణి కుసుమములుకల బంగారు, వెండి పగడపు చెట్లనుండేను. ఆ సరస్సునందలి తామర పూవుల దళములు పద్మరాగములతో కేసరములు వజ్రములతో ఆకులు మరకతములతో వైడూర్యములతో దుద్దులు బంగారుతో ఏర్పడి సుగంధ యుతములై యుండెను. ఆ సరస్సునందును పరిసరములందును ప్రదేశము బురద లేక అది నానావిధ రత్నములతో పద్మములతో గవ్వలతో శంఖములతో ము తైపు చిప్పలతో మకరమత్స్య కూర్మాదులతో వెలయుచుండెను.
పద్మరాగేంద్ర నీలమ హేంద్ర నీలకార్కోటక తుబుక.విష్ణుమణి-రాజావర్తక-రుధిరాక్ష-సూర్యకాంత చంద్ర కాంత-పీలు -వై రాతల.జ్యోతీర స సమక పురోరగబలాక్ష-స్ఫటిక -గోమేదావిత్తక.మరకత-వైదూర్య-సౌగంధిక.రాజమణి ఖంజము క్ర-బ్రహ్మమణి తారాసదృశముక్తాఫల-రత్న ఖండములట నుం డెను. ఆ కొలని నీరు స్నానమాడినంతనే చలి పోగొట్టి హాయిగొల్పునంత వేడిగా నుండును.
ఆ సరస్సు నడుమ వై దూర శిల ఉపశోభిల్లుచుండెను. దాని (ఒక్కొక్క భుజము) ప్రమాణము రెండు వందల ధనుపులు; అది చతురసమును రమ్యమునునై యుండునట్లు అత్రి మహాముని నిర్మించెను. (ఇచ్చటి, ఈ రమ్య సవిత్ర ప్రదేశములన్నియు అత్రి తపో నిర్మితములే. అచట నర స్సు నడుమ పర్వత బిలద్వార సదృశ ములగు ఉద్దే శములు చిన్న చిన్న ప్రదేశములు) గల హిరణ్మయ ప్రదేశపు ద్వీపమొకటి ఉండెను. ఆ మనోహర ద్వీపము నడుమ మిగుల ప్రకాశించు వైదూర్య శిలా తలము నడుమ కంటికింపగు చతురస్ర పుష్కరిణి కలదు. దానియందును పద్మములు కలవు. దాని మీరు మిగుల చల్లనిది స్వచ్చమయినది మధురమయినది తేలికయైనది. సుగంధయుతము. అది త్రావినచో కంఠము బాధ నొందదు; కడుపు నిండి బరువెక్కదు; కాని ఆనీరు పరమ తృ పిని శరీరమునకు మహా సుఖమును కలిగించును,
(*భోగిభోగసమాసీనస్సర్వాలజ్కార)
ఆ పుష్కరిణి నడుమ అత్రి మహాముని తన తపముచే నిర్మించిన ప్రాసాదము దేవాలయము) ఒక టీ కలదు, దాని నిర్మాణమున కై అమర్చిన చోటిని పుష్కరిణి నీటినుండి వేరుపరచుటకు నలువైపుల చతురస్రాకారమున నిర్మించిన అడ్డుకట్ట ( సేతువు) నానా రత్నములు పొదిగిన బంగారుతో న్మితమై శోభిల్లుచుండెను. ఆలయము చంద్ర కిరణములవలె వెలయు వెండితో దాని మెట్లు వైదూర్యము లతో ప్రాకారము పగడములతో లోపలి కప్పు పైనుండు మహాచక్రము బంగారు పొదిగిన ఇంద్రనీలములతో మహా సంభములు పద్మరాగములతో వేదికలు మరకతములతో నిర్మితములు; ఇట్లు ఆది రత్న కిరణరాశితో తళ తళ లాడుచు దృష్టిమనోహరము రమ్యమునై యుండెను.
ఇట్టి ఆలయమున దేవదేవుడు భగవానుడు నగు జనార్ధనుడు నారాయణుడు అర్చామూ ర్తియై ఉండెను. ఆ దేవుడు అనంతుని పడగల గమిపై పండుకొన్న వాడు. సర్వాలంకార భూషితుడు; ఆ దేవదేవుడగు చక్రి కుడి మోకాలు కొంచెముగ ముడుచుకొని రెండవ పాదము అనంతుని యందు ఉంచబడియుండెను. ఆ శేషశాయి దృష్టి లక్ష్మీ పై ఆస క్తమై యుం డేను. ఆ దేవదేవుని ఎడమ పైభుజము ఫణీంద్రుడగు ఆది శేషుని పడగల పై దిండుగా నుంచబడెను. కుడి పైభుజము పూర్తిగా చొచబడి దాని మణికట్టు దేవదేవుని ముడుచుకొనిన మో కాలి పై ప్రకాశించుచుండెను. ఎడమ దిగువ భుజమును కొంచెముగ ముడిచి ఆదేవుడు నాభి దేశమునకు ఉదరమునకు సూటిగా పాన్పు పై ఉంచుకొనెను. కుడి దిగువ చేతితో పారి జాత (కల్పవృక్ష) కుసుమమును వాసన చూచుటకై ముక్కునకు దగ్గరగా ఉంచుకొనెను. ఆ దేవదేవుని పాదములను లక్ష్మీదేవి పద్మపత్రములను బోలు కరములతో సం వాహనము చేయుచుండెను.
ఆ భగవానుడు కల్పవృక్షపు పూలతో మకుటముతో హారములతో అందేలతో భుజకీర్తులతో అంగుళీయకములతో శోభించుచుండెను. ఫణీంద్రుని పడగలయందలంకార ముగా ఉంచబడిన మనోహర రత్నశిఖలతో స్వామి ప్రకాశించు చుండెను. జ్ఞానులకును అగమ్యుడు అత్రి మహాముని చే ప్రతిష్టితుడు సిద్ధులకును సతతము అ పూజ్యుడు సతతము పూజో కుసుమాన్వితుడు దివ్య గంధానులిపొంగుడు దివ్య దూప ధూపితుడు సిద్ధులు సదా తెచ్చి కొనుక లిచ్చిన సర సములును హృదయమున కింపుగొల్పునవియునగు మంచి ఫలములతో ప్రకాశించు చుండు ఉ తమ పొర్వము కలవాడు కలువలు ఆలంకారముగానున్న శీరము కలవాడునగు ఆ నారాయణుని తన సమక్షమున గాంచి ఆ మద్రరాజగు పురూరవసుడు నిలువబడి ఉండియే నమస్కరించెను.
అంతట ఆతడు మోకాళ్ళను శిరస్సును నేలకానించి నారాయణుని నమస్కరించి సహస్ర నామములతో మధు సూదనుని స్తుతించెను. అనంతరమతడు లేచి ప్రదక్షిణమును నమస్కారమును మరల మరల చే నెను. ఆ ఆలయము అతి రమ్యముగా నుండుట చూచి ఆ ఆశ్రమమునందే తన నివాసము నేర్పరచుకొనెను. పుష్కరిణీ జలమునకు వెలుపల అతి మనోహరమగు ఒకానొక గుహను ఆశ్రయముగా ఏర్పరచుకొని దానియందే నానావిధ పుష్ప ఫలమూలము లతో గోర సముల (ఆవుపాలు పెరుగు నేయి మొదలగు వాని)తో మధుసూదన పూజా పూర్వకముగా తపమాచరించెను. ఆతడు అను దినమును త్రిషవణములందు స్నానము చేయును. అగ్నిని హోమముతో పూజించును. దేవ నిర్మితములగు (మనుష్యులు త్రవ్వియుండని) బావుల నీటితో ప్రాణధారణము చేయును. మరి ఆహారమును తీసికొనడు. ఇతరులు ఎవ్వరును ఆశ్రయించి ఉపయోగించుకొనుచుండని గుహలయందు నిద్రించును. కేవలము నియమపరుడై ఆహారగ్రహణము వీడిచియున్న ను ఆతని శరీరము శ్రమ చెందేడిది కాదు. ఇది ఆశ్చర్యము గొలుపు విషయ మగదా! ఇరాజు ధ్రువ నిశ్చయుడై దేవదేవుని విడువక సదా పూజించుచు తపమాచరించుచు స్వర్గతుల్యమగు ఆ ఆశ్రమమున ఏ దుఃఖమును ఎరుగక కొంతకాలము గడ పెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భారత వర్గాంతర్గత భరతఖండ వర్ణనమున మద్రరాజగు పురూరవుడ త్యాశ్రమమేగి తపమాచరించుటయను సూట పదునెనిమిదవ అధ్యాయము.
