మత్స్య మహా పురాణము
42 - అష్టక సోదరులు యయాతికి తమ పుణ్యలోకముల నిచ్చుట
వసుమాన్: "మహాత్మా! నేను ఉషదశ్వుని కుమారుడను. నా పేరు పసుమాన్. నీవు ధర్మ క్షేత్ర తత్వమును - ఎరిగినవాడవను విశ్వాసముతో నిన్ను ప్రశ్నించుచున్నాను. నాకు అంతరిక్ష లోకములో కాని ద్యులోక ములో కాని ఆనుభవింపదగిన పుణ్యలోకములు కలవా?" యయాతి! “సూర్యుడు తన తేజస్సుతో అంతరిక్షమునందును పృథివిమీదను దిక్కులను ఎంత మేర తపింప-ప్రకాశింప-చేయుచున్నాడో ఆలోకములన్నియును - అంత విస్తారము కలిగిన ద్యులోక స్థానములన్నియును ఆన స్తములై నవి నీవు అనుభవించదగినవి నీకు గలవు. అవి అన్నియు నీకొరకై ఎదురు చూచు చున్న వి.” వసుమాన్: “అయ్యా ! నాకుగల లోకములన్నియు నీకు దత్తము చేయుచున్నాను. తీసికొనుము. ప్రపాతము లో పడకుము. ఒక వేళ నీవు వాటిని ప్రతి గ్రహించుట దోషమని తలచినచో చిన్న గడ్డిపోచనై నను వేలగా ఇచ్చి తీసికొనుము." యయాతి: “నేనెన్నడును మిథ్యా పిక్రయముతో వస్తువును కొనినట్లు గాని పసివానినుండి ఆటలలోనైనను ఏ వస్తువును వెల ఈయక తీసికొన్న ట్లుగాని స్మృతికి వచ్చుటలేదు. అట్టిది చేయుటకు నాకు భయము కలుగును. వివేక వంతుడనై యుండి నేను ఎవడును చేసియుండని పనిని చేయరాదు." వసుమాన్: “నీకు క్రయము ఇష్టము కానిచో నేను స్వేచ్ఛతో ఇచ్చు చున్న ఆ నా లోకములనన్నిటిని తీసికొనుము. నేనా లోకములకు ఎన్నటికిని పోదలచుటలేదు. ఆ లోకములన్ని యు నీవే.” శిబి: “నేను ఉశీనర దేశాధిపతియగు శిబిని. నీవు ధర్మ తత్వజ్ఞుడవను నమ్మికతో నిన్నడుగు చున్నాను. అంతరిక్ష లోకములో కాని ద్యులోకములో కాని నాకు అనుభవించదగిన పుణ్య లోకములు గలవా?” యయాతి: “రాజా! నీవు యాచకులను ఎన్నడును వాక్కుతో గాని హృదయమున గాని ఆవమానింపలేదు. దానికి ఫలముగా నీకు ద్యులోకమునందు విద్యుద్రూపములును మనోహర ధ్వనితో (కీర్తితో కూడినవియు అగు అనంతలోకములు కలవు. అవి చాల గొప్పవి.”శిబి: “బుద్ధిమంతులగు వారు ఏ లోకములకు పోయి దుఃఖము నెరుగక సుఖింతురో అట్టి నా లోకములన్నీ యు నీకు ఇచ్చుచున్నాను. నీకు క్రయము ఇష్టముకానిచో క్రయము లేక యే అవి తీసికొనుము.” యయాతి: “నీవు ఇంద్రునివలే మహా ప్రభావము కలవాడవు. నీ లోకములో.. అన నములే నవి. కాని ఇతరులు ఇచ్చినది అనుభవించుట నాకు ఆనందము కలిగించదు. కావున నీమాట నేను అంగీక రించజాలను.” అష్టకుడు: “మాలో ఒక్కొక్కరము వేరు వేరుగా ఇచ్చిన పుణ్యలోకములను తీసికొనుట నీకు ఇష్టముకానిచో మేము అందరమును మా మొ త్తము లోకములను మీకిచ్చి మేము నరకమునకు పోవుదుము.” యయాతి: “మీరు సత్యము మొదలగు ధర్మ త త్వమును ఎరిగినవారు. నేను దేనికి తగినవాడనో తెలుపుడు. నేను చేసియుండని పుణ్యఫలముల స్వీకరించుట మాత్రము నాకిష్టము కాదు.” అష్ట కుడు: “అయ్యా! ఒకరు ఇచ్చినది తీసికొనుట మీకిష్టములేక ఇట్లనుచున్నారు. కాని అట్లనవలదు. మేము చేసిన ఈ దానమునకు ఎంత ఫలము కలదో అదియంతయు నీకే చెందునుగాక! ఇంతేకాక నరులను తమ పై నెక్కించి కొని శాశ్వత లోకములకు తీసికొనిపోవు ఐదు బంగారు రథములు కనబడుచున్నవి. ఇవి ఎవరివి?" యయాతి: “మండెడు ఆగ్ని శిఖలవలె పైవైపునకు ప్రజ్వలించుచు ప్రకాశించేడు ఈ ఐదు బంగారు రథములును మీ కొరకును నా కోరకును వచ్చియున్న వి. ఆషకా! మన మైదుగుర మును వీని పై నెక్కి వెళ్ళవలయును."
అష్టకుడు: “రాజా! నీరథమును అధిష్టించుము. ఆకాశ మార్గమున పైకి పొమ్ము. సమయము వచ్చినప్పుడు మేమును మా రథములేక్కి అక్కడకు వత్తుము.” యయాతి: “మనమందరమును ఒకేసారి స్వర్గమును జయించుకొంటిమి. కనుక అందరమును ఇప్పుడే పోవలయును. స్వర్గమునకు మీరు పోవలసిన నిర్మలమగు మార్గము కూడ ఇదుగో! కనబడుచున్నది.”
అంతట వారందరును తమతమ రథములను అధిరోహించి తమ ధర్మములతో ద్యుభూలోకముల నడుమ ప్రదేశమును నింపుచు తమ కాంతులతో ద్యులోకమును కమ్మివేయుచు బయలుదేరిపోయిరి “మహాత్ముడగు ఇంద్రుడు ఎల్ల హేతువులచే నాకే మిత్రుడనియు అందరలో నేనే మొదట స్వర్గమును చేరుదుననియు అనుకొనుచుంటిని. కాని ఇప్పుడు ఔశీనరుడగు ఈ శిబి సర్వవేగముతో మన రథములను దాటి తాను ముందుగా వెళ్ళినాడు. ఇట్లేల జరిగినది?” అని అషకుడు యయాతిని ప్రశ్నించేను. యయాతి ఇట్లు పలికెను. “ఔశీనరుడు శిబి తనకు ధనమున్నంత వరకు ఏ మాత్రమును వెనుకాడక దానము చేయుచునేయుండెను. ఆదియే ఇందులకు హేతువు. ఆతడు మన అందరలో శ్రేష్ఠుడు. దానము దమము సత్యము ఆహింస హీ (సిగ్గు బిడియములు) శ్రీ (సంపదయు-ముఖమున కాంతి కలిగి ఉండుటయు )
తితిక్ష ద్వంద్వములను ఓర్చుట) ఆనృశంస్యము (క్రూరత లేకుండుట) ఈ సద్గుణములు శిబియదు అపరిమితములై యున్నవి. అతడు సాటి లేనివాడు. మంచి బుద్ధిశాలి (వివేకి). అదికాక బిడియపడుచు ఈ పని చేయరాదేమోయని వేను కాడుట అనెడు గుణము ఈ పెచెప్పిన నడువడి కలవానిని కాపాడుచుండును. శిబి అట్టివాడు. కనుక అతడు తన రథ మును మనకంటే ముందు నడుపుకొని పోగలిగెను.”
అంతట అష్టకుడు జిజ్ఞాసువై ఇంద్రతుల్యుడగు తన మాతామహుని ఇట్లు ప్రశ్నించేను: “రాజా! నేను నిన్నో కటి అడుగుచున్నాను నిజము చెప్పుము. నీవు ఎక్కడి నుండీ (ఏ వంశము నుండి) వచ్చినవాడవు? ఎవరవు? ఎవరి కుమారుడవు? ఏలయన నీవు చేసినంత సుకృతమును లోకమందు మరియే బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని చేసియుండ లేదు.” యయాతి:- నన్ను యషతి అందురు. నహుషుని కుమారుడను. పూరుని తండ్రిని. ఈ లోకమున సార్వభౌముడనే యుంటిని. స్పష్టముగా చెప్పుచున్నాను. మీకు మాతామహుడను. గుహ్యమగు మంత్రమును (తత్వమును) నా వారికి (మీకు) చెప్పుచున్నాను. ఈ భూమినంతటిని జయించితిని. శోభనమగు రూపము కలిగి అశ్వమేధమునకు యోగ్యములగు మంచి లక్షణములు కలిగిన అశ్వములను నూరిటీని ప్రస్థమునందు కట్టివేసి బ్రాహ్మణులకు దానము చేసితిని. అవి స్వర్గమును అనుభవించు పుణ్యమునకు పాతములయినవి. సర్వరత్నములతో గోవుల తో బంగారములతో ముఖ్యములగు ఇతర ధనము లతో నిండిన ఈ భూమినంతటిని నూర్ల అర్బుదముల సంఖ్యగల ధనములనుగా బ్రాహ్మణులకు దానము చేసితిని: నా సత్య ముతో ద్యులోకము గానీ భూమికాని మనుష్య లోకములందలి అగ్ని కాని ప్రజ్వలించుచున్నవి. నేను వ్యర్థము అయథార్థ మునగు వాక్యము ఏదియు పలుకనే లేదు. సజ్జనులు సత్యమును ఆదరింతురుగదా! అష్టకాః ప్రతర్దనా! వసుమన్! మీకంద రకును చక్కగా సత్యము చెప్పుచున్నాను. సర్వ దేవులును సర్వ మునులును సర్వ లోకములును సత్యముతో (సత్యశబ్ద వాచ్యుడగు పరమాత్మ అను బుద్ధితో) పూజింపబడవలయును. అని నామనోగతమగు అభిప్రాయము. (ఇదియే యయాతి తన వారికి చెప్పదలచిన గుహ్య మంత్రము.)
స్వర్గమును స్వయముగా జయించిన మన ఈ వృత్తాంతమును అసూయా (దోషదృష్టి రహితుడై ద్విజ శ్రేష్ఠులకు వినిపించు నట్టివాడు మనతో సాలోక్యమును పొందును.”
శౌనకుడు శతానీకునితో చివరకు ఇట్లు చెప్పెను: రాజా! మహాత్ముడగు యయాతి ఇట్లు తన దౌహిత్రులచే తరింపజేయబడెను. అతడు మిత్రసాహుడు (మిత్రులను గెలుచుకొనువాడు. ఇతరులకు తన యందు మైత్రికలుగునట్లు చేసికొను సుగుణములు కలవాడు.) ఉదారములగు కర్మలను ఆచరించినవాడు. అతడిట్లు భూమిని విడిచి తన కర్మలతో భూమియందంతటను వ్యాపించి తుదకు స్వర్గమును చేరుకొనెను.
ఇట్లు నీకు విస్తరముగ యయాతి చరితమును యథాస్థితముగ చెప్పితిని. ఈ వంశము లోకమున ప్రసిద్ది పొందినది. దానియందే నీవు జన్మించితివి.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యయాతి చరిత మున యయాత్యష్టకాది స్వర్గప్రాప్తియను నలువది రెండవ అధ్యాయము.
