మత్స్య మహా పురాణము

Table of Contents

 186 - జ్వాలేశ్వ తీర్థ మహిమాను వర్ణనము - బాణాసుర త్రిపుర దాహకథ॥  

మార్కండేయు డిట్లనెను: పాండవా? నదీ శేష్టయు నర్మద పుణ్యమగు వానిలో పుణ్యతమమయినది; దానిని ధర్మకాంక్షులు మహాభాగులునగు మునులు యజ్ఞోపవీతములంత నన్న ని ప్రవాహములుగాను తీర్థములుగాను విభజించిరి॥ వాటియందు స్నానమొనర్చినవారు సర్వపాపముక్తులగుదురు॥ జ్వాలేశ్వరము త్రిలోక విశ్రుతమగు పరమ తీర్థ ము; దాని యుత్ప త్తిని తెలి పెదను వినుము; పూర్వము సర్వమునులును ఇంద్రాది మరుత్ (దేవగణములును మహాత్ముడు దేవదేవుడు॥ నగు మహేశ్వరుని స్తుతింపసాగిరి॥ వారుస్తుతించునంతలో మహేశ్వర దేవుడటకు వచ్చెను॥ ఇంద్రాది దేవతలు భయో ద్వేగము లతో దేవేశుడగు విరూపాక్షునకు ప్రభూ! మమ్ముల రక్షించుమని మనవిచేసిరి॥ ఈశ్వరుడు వారితో “ముని, శేషు లారా! మీకు స్వాగతము॥ మీరేల ఇటకు వచ్చితిరి? దుఃఖమేమి? సంతాపమేమి? దేనివలన మీకు భయమగుచున్నది? మహాభాగులారా! నేనది తెలియగోరుచున్నాను; చెప్పుడు;” అనగా రుద్రవచనమునువీని ప్రశ స్తనియమవంతులగు ఆమునులు ఇట్లనిరి: అతి ఘోరుడు మహాధీరుడు బలదర్పితుడునగు బాణుడను దానవుడు వీఖ్యాతుడు కలడు; త్రిపుర మును ఈ పురము పోనిది; ఇది వానీ తేజము చే నతతము గగనమున తిరుగుచుండును; వానివలన నుండి భయపడి విరూపాక్షి! నిన్ను శరణం దితిమి; మాకు పరమగతివి నీవే కావున మమ్మీ మహాదుఃఖమునుండి రక్షించుము; ఈ విధముగానే దేవేశా! నీవందరను అనుగ్రహింప వేడుచున్నా ము; దేనిచే దేవతలును గంధర్వులును సుఖముగ వర్ధిల్లుదురోశంకరా! ప్రభూ! పరమ సుఖ మందుదురో అట్టి అనుగ్రహమును తాము చూపవలయును;” అనెను

ధర్మజా! ఇట్లు వారినందర॥ నోదార్చి దేవేశుడు నర్మదాతీరమందు కూర్చుండి పొనిని పోని త్రిపురములను నేను ఎట్లువధించి నశింపజేయవలయు నాయని ఉపాయమాలోచించెను॥ అంత వృషభధ్వజూడగు మహాదేవుడు బ్రహ్మర్షియగు నారదుని స్మరించెను॥ స్మరించినంతటనే వచ్చి ఆముని ప్రణతుడై “మహాదేవా! ఆజ్ఞనిమ్ము; నన్నేల స్మరించితీరి? మహ్మాదేవా! నేజేయవలసిన పనిఏమి? నాకు సెలవిండు॥” అనెను॥ ఈశ్వరుడిట్లనెను: నారదా! నీవీ మహాత్రిపురములున్న చోటికి పొమ్ము ॥ దానవేంద్రుడగు బాణుని ఈ పురములకు పోయినే జెప్పినట్లు చేయుము; అందలి స్త్రీలందరు పతిని దేవతగా భావించు ఉత్తమలును సౌందర్యము నందప్సరసలవంటివారును; :రి తేజముననే త్రిపుర ము గగనమున తిరుగుచున్నది; విపేంద్రా! నీవటకుపోయి వారికి మతిభేదమును ప్రబోధించుము; అనగా వినినారదుడు ఆచటి స్త్రీలకు బుద్ధి భ్రంశము కలిగించుట కై బయలుదేరి - త్వరితగతితో ఆపురమునకు పోయెను; ఆ దివ్యపురము నానా రత్నములతో శోభిల్లుచుండెను॥ నూరు యోజనముల వెడల్పు రెండువందల యోజనముల పొడవుతో నుండెను॥ అంతట అతనికచట బలదర్పీతుడగు బాణుడు కనబడెను॥ వాడు॥ మణి కుండలములతో భుజకీర్తులతో కిరీటముతో వందలకొలది బంగరు హారములతో చంద్రుని మనోహరములగు రత్నములతో రత్న సమృద్ధిగల మొలనూలితో కనకాభరథములుగల బాహువులతో ప్రకాశించు చుండెను॥ చంద్రకాంతములతో మహావజ్రములతో మణులతో పగడములతో అలంకృతమయి పండ్రెండుగురు ఆదిత్యు లతో సమమయి వెలుగు ఉత్తమాసనమునవాడు కూర్చుండియుండెను॥ మహాబలుడగు ఆదానవేంద్రుడు నారదుని చూచిలేచి దేవరీ! నీవు స్వయముగా వచ్చితివి; అర్య పాద్యముల నమర్పింతును; అనుచు ఆవి ఆర్పించేను॥ శాస్త్ర న్యాయానుసారము అభివందనము చేసేను॥  ద్విజోత్తమా! నేనేమి చేయవలయును? చాల కాలమునకు వచ్చితిరి; విప్రాః కూర్చుండుడు; ఇదిగో ఆననము;” అని ఇట్లు పలుకరించెను; తరువాత ఋషి సత్తముడగు నారదునితో అతని భార్యయును మహాదేవియు (పట్టపురాణి) ఆగు ' అనౌపమ్య' ఆనునా మె॥ “నారదా! ఏ ధర్మముచే వ్రతముచే నియమము చే దానముచే తవముచే దేవతలు నంతుష్టులగుదురు?” ఆని యడిగెను॥

అనౌపమ్యాయై నారదోక్తదానవి శేషాః - నారదుడు అనౌపమ్యకు దాన విశేషములు తెలుపుట॥

నారదుడు అనౌపమ్యకు ఇట్లు చేప్పెను: వేద పారంగతుడగు విప్రునకు తిలధేను దానము (ఇది లోగడ చెప్పబడినది) చేసినచో సముద్రవన ద్వీప సహితముగా భూమినంతను దానమిచ్చినట్లగును; దీని దాతలు తమ శాసనము అందర పై చెల్లుచుండ కోటి సూర్య సమతేజము గలిగి అన్ని కోరికలను తీర్చు విమానములపయి సంచరించుచు అతి చీర కాలము ఆనందింతురు॥ తీయమామిడి ఉసిరిగ వెలగ రేగు కదంబము సం పెంగ ఆశోకము పున్నాగము పిప్పలము ఆరటి మర్రి దానిమ్మ పిచుమందము ఇప్ప మొదలగు వృక్షములను - ఉపవాస పూర్వకముగా దానమీయవలయును॥ వెలగ (దానము)చే వెలగ పండ్లవంటి స్తనములు ఆరటిచే అరటికంబములవంటి తోడలు కలుగును; దానిచే ఆందర వంద నము లందుకొనును॥ పిచుమందవృక్షముచే సుగంధి దేహము సంపెంగచే ఆ పూవువంటి చాయ అశోకముచే శోక రాహిత్యము ఇప్పచే తీయని మాటలు మరిచే మృదు శరీరము రేగుచే స్త్రీలకు సౌభాగ్యము సిద్ధించును; కుక్కుటియు కర్కటి దోస)యు దానయోగ్యములే; ద్రవ్య షష్టి ? ప్రశ స్తముకాదు; (దానవ్రత సందర్భములో) కడిమి పూలతో కలిపిన ఉమ్మెత్త పూలతో వూజ చేయవలయును; అగ్ని యందు పక్వము కాని యాహారమును కొబ్బరికాయను తినవలయును, ఇతర ఫలములు తినక విడువవలయును; సంధ్యా సమయములందు మౌనముతో నుండవలయును; అందును మొదట యథాశక్తిగా క్షేత్ర పాలుని పూజించవలయును; ఇట్లు జరిపిన స్త్రీకి భర్తవశుడై సదా ఆమె ఆజ్ఞకే ఆమె మొగమువై పు చూచుచుండును; అష్టమి చతుర్థి పంచమి ద్వాదశి సంక్రాంతి (రవిరాశి ప్రవేశ దినము) విషువత్ (రాత్రింబవళ్ళు సమాన పరిమాణముతో నుండు దినము) ఛిద్ర తిథుల (ఆష్టమి-ద్వాదశి-షష్ఠి-చతుర్ధి-చతుర్థశి) ఆరంభకాలము॥ ఇవి దివ్యదినములు; దీనియందువవ సించి ధర్మము నాచరించు స్త్రీకి నిస్సంశయముగా స్వర్గవానము లభించును; ఇట్టి స్త్రీలు కలిదోష॥ ము కల నర్వపాప రహితలగుదురు; ఇట్లు ఉపవాసములయందాన క్తిగల స్త్రీదగ్గరకు యముడు రానై న రాజాలడు; అని నారదుడు అనౌ పమ్యతో చెప్పెను॥

అది విని ఆమే యతనినిట్లడిగెను॥ విపేంద్రా ! నారదమునీ! నేను ఈ జన్మమందును పూర్వజన్మమందును చేసిన పుణ్యఫలముగా మీరు ఇటకు వచ్చితిరి; చిన్న మాట అడుగుచున్నాను; బలిచక్రవర్తికి పత్నియు కీ - శాలినియు ఆగు వింధ్యా వళి యున్న దిక దా! ఆమె మాయ త్తగారు; ఆమెకు నా విషయము  సంతోష మేలేదు; మా మామగారును నన్నెప్పుడును చూచుచు (నాగుణము లెరిగి) ఉండియు నాయందు సంతుష్టుడు/ కాడు; కుంభీనసియను నా ఆడుబిడ్డ యున్నది; ఆమె చేయునవన్నియు పాపపు పనులే; నేను కనబడిన చాలు॥ నిరతము ఆమె మెటికలు విర చుచుండును? (ఇవి తొలగిస్తే దివ్య మార్గమున నాకు సౌఖ్యము లభించు ఉపాయము తెలుపుము; చవుటి పర్రలో విత్తనములు ఎట్లును ఎన్న డును మొలకెత్తవు గదా! నేను మీకు దాస్యమయిన చేయుదును; ఏవ్రతమాచరించినచో వీరందరు నా వశవర్తులగుదురో విపేంద్రా! నాకు ఆ వ్రతము తెలుపుము; అనెను॥

నారదుడు అనౌపమ్యతో ఇట్లు పలికేను : శుభాననా! నేను ఇంతవరకును నీకు చెప్పిన వ్రతము ఏది కలదో దానిని పార్వతి యాచరించి ఓవర వర్షినీ! శంకరుని అర్ధ శ రీరమందుండగలిగేను॥ లక్ష్మి విష్ణుని శరీరమందును సావిత్రి బ్రహ్మ శ రీరమందును ఆరుంధతి వసిష్ట శరీరమందును ఉండగలిగిరి; ఈ ఉపవాసవ్రత ఫలముగా నీభర్త నీవశ మందుండును; నీ య త్తమామల నోళ్ళు మూతపడును; నేను చెప్పినదిది వింటివికదా! ఇక నీకు తోచినట్లు చేయుము; అనగా నారదుని వచనమును విని రాణి ఇట్లు పలికెను; విపేంద్రా! నాయందనుగ్రహము చూపుము; నీకిష్టమయినన్నీ దానములు స్వీకరింపుము; విప్రాః బం గారము మణులు రత్నములు వస్త్రములు ఆభరణములు-ఇవియే కాదు-ఇంకను దుర్లభమగునవి ఏవియున్న ను అవన్ని యు నీకిత్తును; ద్విజ శేష్టా! హరి శంకరులు ప్రీతినందునట్లు అవి గ్రహించుము॥ ఆన నారదుడిట్లనెను: శుభరూపా! జీవనాధార ములేని మరెవరికై న విప్రునకుఇమ్ము; ఆన్ని విషయములందును నంపన్ను డను; నాయందుభ క్తిమాత్రము చూపుము; అని ఇట్లు నారదుడు పతివ్రత మునుండి వారందర మసస్సులను హరించి పెడతోవ పట్టించి భరత శ్రేష్ఠా! ధర్మజా! మరల తన స్థానమునకు పోయెను; తరువాత నుండి ఆత్రిపుర స్త్రీలు హర్షము లేని (అసంతృప్త) హృదయములతో కూడినవారును మరి ఇతరములందు వ్యా ప్రములగు మనస్సులుగల వారును యిరి॥ దానిచే మహాత్ముడగు ఆ బాణాసురుని త్రిపుర మునందు ఛిద్రములు (లోపములు) ఏర్పడేను॥

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున జ్వాలేశ్వర మాహాత్మ్యమున నారదుడు బాణపుర స్త్రీల మనస్సులు విరచుటయను నూట ఎనుబది యారవ అధ్యాయము॥