మత్స్య మహా పురాణము
190 - శూల భేదాది తీర్థ మహిమాను వర్ణనము॥
(*తథా ఘృతమధుస్రవం)
(*సఘృతం శ్రీఫలం జగ్ధ్వా)
మార్కండేయుడిట్లు చెప్పెను; ధర్మరాజా! ఆది మొదలుకొని బ్రహ్మాది దేవతలును తపోధనులును రాగక్రోధాది॥ దోషరహితులై నర్మదను సేవింతురు; అనగా ముని సత్తమా! ఏ ప్రదేశమునందు మహా దేవుని శూలము పడినదిగా కన బడునో ఆ ప్రదేశపు మాహాత్మ్యము ఉన్న దియున్నట్లు చెప్పమని ధర్మజుడడుగ ముని మరల ఇట్లు చెప్పెను: అది శూల భేదమను పుణ్మతమ మహా తీర్థము; అందు స్నానమాడి శివునర్చించినచో గోసహనదాన ఫలము లభించును; అచట॥ తిరాత దీక్షతో మహా దేవునర్చించినచో పునర్జన్మముండదు॥ తరువాత వరుసగా భీమేశ్వర నారదేశ్వరాదిత్యేశ్వర నంది॥ కేశ్వర వారుణేశ్వర తీర్థములు కలవు: ఆందు స్నానమాడుట మహా పాతక నాశకము; తరువాత స్వతంత్రేశ్వరము; ఆందు స్నానమాడి ఆచటనున్న పంచాయతన (ఆది త్యాంబికా విష్ణుగణనాధ మహేశ్వర) మూర్తులదర్శించినచో సర్వ తీర్థ యాత్రా ఫలమబ్బును; తరువాత కోటి తీర్థము; అచ్చట పూర్వము దేవదానవ యుద్ధము జరిగెను; ఆందు బలదర్పితు॥ లగు దానవుల అనేకుల శిరస్సులను దేవతలు ఖండించి అచట శూలపాణి యగు మ హే కోటీశ్వరుని ప్రతిష్టించిరి॥ ఆచట కోటి మంది దానవులు వినిహతులగుట చే ఆదికోటి తీర్థమనబడెను॥ దాని దర్శన మాత్రముననే మానవులు స్వర్గ మారోహించు॥ చుండుట చూచి ముదబుద్దిగల ఇంద్రుడు ఆ మార్గమును వజముతో కీలించి ఆటంక పరచెను; నాటినుండి మానవులకు దీనివలన లభించు స్వర్గపు మార్గము నివారింపబడెను; అచట నేయి॥మారేడుపండు దానమొనర్చి పర్వతమును ప్రదక్ష్మి ణించి పర్వతముపై దీపము వెలిగించి దానితో కూడ కొండను శిరస్సునందు నిలుపుకొనవలయును; దానిచే సర్వకామ పూర్తి యగును; తుదకు రుద్రలోక ప్రాప్తియగును: తరువాత స్వర్గము (రుద్రలోకము) నుండి మరలి భూలోకమున రాజై పుట్టి రాజ్యమేలి మరల స్వర్గమారోహించును: తరువాత హాదేవ తీర్థము; అందు త్రయోదశినాడు స్నానమాడినంత మాత్రముననే సర్వయజ్ఞ ఫలము లభించును॥
తరువాత పరమ శోభనమగు రాజేంద్ర తీర్థ ము: తరువాత నరులకు పాపనాశ కమగు అగస్త్యేశ్వర ము: అందు స్నా నముచే బ్రహ్మహత్యా దోష నివృత్తి యగును; కార్తిక కృష్ణ చతుర్దశినాడు అట చిత్త సమాధితో జితేంద్రియుడై శివుని నేతితో అభిషేకించినచో అతడు తన ఇరువదియొక తరముల దారిలో కూడ శివపుర వాసియగును; ఆట చేసిన ధేనూపానత్ (చెప్పులు) ఛత మృత కంబళ వీపాన దానములు అన్ని యు ఇతరత్రకంటే కోటి గుణము ఫలము నిచ్చును; తరువాత ఉత్తమమగు బలో కేశ్వరము; అందు స్నానము చే నరుడు సింహాసనాధిపతి యగును; ఇవియన్నియు నర్మదకు ఉత్తర తీరమందలి తీర్థములు) ; నర్మదా దక్షిణ తీరమున శక్రతీర్థ ము; అచట ఒక రాత్రి (దినమంతయు) ఉపవ సించి స్నానమాడి జనార్దనునర్చించినచో గోనహస్ర దానఫలమునంది తుదకు విష్ణులోక ప్రాప్తుడగును; తరువాత నరు లకు సర్వపాపహరమగు ఋషితీర్థము: అందు స్నానమాడిన మాత్రమున శివలోకప్రాప్తి యగును; తరువాత పరమ శోభనమగు నారద తీర్థము; ఆందు స్నా నమాడుటచే గోగహనదాన ఫలమబ్బును; తరువాత దేవ తీర్థము; ఆది పూర్వము స్వయముగా బ్రహ్మచే నిర్మితము: అందు స్నానమాడినచో బ్రహ్మలోక ప్రాప్తియగును; తరువాత అమరకంటక తీర్థము : అది దేవతలే నిర్మించినది: దానియందు స్నానము చే రుద్రలోక ప్రాప్తియగును: తరువాత తురా సంగమ తీరము: అందలి పంచాయతన మూర్తి దర్శనముచే బ్రహ్మ హత్యాదోష నివృత్తియగును: తరువాత వడేశ్వర తీర్థము: దాని దర్శన మాత్ర మున జన్మ సాఫల్యమగును: తరువాత వటేశ్వరము: ఆది సర్వ వ్యాధి నాశకము: అందు స్నానము చే సర్వ దుఃఖ మోచనమగును:
తరువాత రావణేశ్వర తీర్థము; అందు స్నానము సర్వపాప మోచక ము; తరువాత నదీ సంగమ తీర్థము; తరు పోత సోమతీర్థ ము; ఇది ఉత్తమమగు చంద్ర క్షేత్రము; అందు పరమభక్తితో స్నానమాడినవారు తత్ క్షణమే దివ్య శరీరము నంది అరువదివేల సంవత్సరములు శివుని లోక మందుండి శివుని వలెనే సుఖింతురు; తరువాత పింగళేశ్వర తీర్థ ము; అచ్చట ఒక ఆహోరాత్రము ఉపవసించినచో త్రిరాత్రోపవాస ఫలము లభించును; అచట కపిలా గోదానము చేసినచో దాని శరీరమందు కల రోమములన్ని వేల సంవత్సరములు రుద్రలోకమున సుఖించును; అచ్చట ప్రాణత్యాగ మొనర్చినచో చంద్రసూర్యులున్నంత అనంత కాలము అక్షయ సుఖములందును; నర్మదా తీరమందే నివసించు మానవులు పుణ్యమాచ రించిన వారు వలేనే మరణానంతరము స్వరమందుదురు; తరువాత సురేశ్వర తీర్థము; తరువాత కర్కోట లేశ్వర తీర్థము; అందు పుణ్యదినమున గంగానది దిగివచ్చును; తరువాత నంది తీర్థము; అందు స్నానమాడిన వారు నందీశ్వరుని ఆను గ్రహమున సోమలోక ప్రాప్తులగుదురు; తరువాత ద్వీ పేశ్వర తీర్థము; తరువాత వ్యాసతీర్థ ము; అది తపోవనము; అచట వ్యాసుని హుంకారమునకు భయపడి ఆ మహానది దక్షిణమునకు మరలెను; దానిని ప్రదక్షిణించినచో చంద్రసూర్యు లున్నంతకాలము స్వర్గమందు సుఖింతురు; వ్యాసానుగ్రహమున వాంఛితార్థ ప్రాప్తియగును; వేదికపయి దీపమునుంచి దానికి దారములు చుట్టి దానమిచ్చినచో శుద్రుడువలే అక్షయకాలము సుఖించును॥
(*లిజ్గసారంతతోగచ్ఛేత్)
తరువాత ఐరండి (ఉపనదీ) నర్మదా సంగమ తీర్థము; ఇది ఉత్తమము; ఇందు స్నానమాడినచో సర్వపాపము కి యగును; త్రిలోక విఖ్యాతమును పాపనాశక మునగు ఇందు ఆశ్వయుజ శుషమినాడు స్నానమాడి శుచియై ఉపవాసము చేసి ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినను కోటిమందిని భుజింపజేసినట్లగును; భ క్తిభావముతో ఐరండి నర్మదా సంగమము నందు శిరస్సున మృతిక ఉంచుకొని స్నానమాడి ఆ సంగమ తీర్థ ప్రదక్షిణము చేసినచో సమ స భూప్రద క్షిణ ఫలము లభించును; తరువాత సువర్ణ తీర్థము; ఆందు స్నానమాడి సువర్ణ దానము చేసినచో కాంచన విమానము పై రుద్రలోక మేగును; అందు సుఖించును; తరువాత స్వర్గమునుండి జారినను వీర్యశాలియగు రాజగును; తరువాత ఇవనదీ నర్మదా సంగమ తీర్థము; ఆది త్రిలోక విఖ్యాతమగునది; శివుడచట సదా సన్నిహితుడై యుండును; అందు స్నానమాడిన వారు గణాధిపతిత్వమందుదురు; తరువాత స్కంద తీర్థము; అది సర్వపాప ప్రణాశక ము; అచటి కేగి యందు స్నానమాడిన మాత్రమున ఆజన్మ సంచిత పాపము నశించును; తరువాత ఆంగిరస తీర్థ ము; అందు స్నానమాడినచో సహస్ర గోదాన ఫలమంది రుద్రలోక ప్రాపుడగును; తరువాత సర్వపాప ప్రణాశనమగు గణతీర్థము; అందు స్నానమాడినవారు సహస్ర గోదాన ఫలమంది శివలోక మున సుఖింతురు॥ సప్త జన్మకృత పాపములనుండి ముక్తులగుదురు; తరువాత వటేశ్వర తీర్థము; ఇందు స్నానము కూడ పైదానివలెనే ఫలప్రదము॥
తరువాత సర్వదేవ నమస్కృతమగు సంగమేశ తీర్థము; ఆందు స్నానము చే ఇంద్రత్వము ప్రాప్తించును: తరు వాత సర్వ పాపహర మును ఉత్తమము మునగు కోటి తీర్థము: అందు స్నానముచే రాజ్య ప్రాప్తియగును; ఆందు చేసిన దానము కోటిగుణిత ఫలమునిచ్చును; అందు స్నానమాడిన స్త్రీ గౌరి వంటిదియగును: ఇంద్రపత్ని యగును: తరువాత ఆంగారక తీర్థము; అందు స్నానమాడినచో రుద్రలోక ప్రాప్తియు ఆంగారక చతుర్థి దినమున స్నానము చే అనంత కాలము సుఖమును కలుగును; ఆయోని (ఉపనదీ) నర్మదానదీ సంగమమున స్నానమాడిన వారికి యోని నంక టము (పునర్జన్మము) రాదు; తరువాత పాండవేశ తీర్థ ము: ఆందు స్నానము చే ఆక్షయకాల సుఖమును సురలచే కూడ ఆవధ్యత్వమును విష్ణులోక సుఖ మును సుఖానంతరము మర్వలోకమున రాజై పుటుటయు కలుగును; క ళేశ్వర తీరమందుత్తరాయణమున స్నానమాడిన వారికి సంకల్పితార్థములు సిద్దించును: తరువాత చంద్రభాగా తీర్థము; అందు స్నానమాత్రమున చంద్రలోక ప్రాప్తి యగును॥ తరువాత ప్రసిద్ధమగు శక్ర తీర్థము॥ ఆది ఇంద్రుడును దేవతలును నమస్కరించునది॥ అందు స్నానమాడి సువర్ణ దానము చేయుట పుణ్యప్రదము॥ అందు నీల వృషోత్సర్గము చేసినచో ఆ వృషభమునకును దాని సంతతికిని శ రీరములందు కల రోమములన్ని సహస్ర వర్షములు శివపుర మున వసించి భోగానంతరము వీర్యవంతుడగు రాజగును॥ వేయి తెల్లని గురములకు అధిపతియగును॥
తరువాత బ్రహ్మావర్త తీర్థము; రవి కన్యారాశియందుండగా ఇందు స్నానమాడి ఒక యహోరాత్రము ఉపవసించి యథావిధిగా పితరులకు పిండ దానము చేసి తర్పణ మిచ్చినచో అక్షయ ఫలము లభించును॥ తరువాత కపిల తీర్థ ము॥ అందు స్నానమాడి కపిలా గోదానము చేసినచో సంపూర్ణముగా భూమియంతయు దానము చేసినట్లగును; తరువాత నర్మ దేశ తీర్థము; దానివంటిది ఇదివరకులేదు; - ఇకముందు ఉండదు॥ అందు స్నానము చే అశ్వమేధ ఫలము లభించును॥ తరు॥ పాత సంగమేశ్వర తీర్థము; ఆందు స్నానమాడుటచే సర్వయజ్ఞ ఫలము లభించును॥ ఆ ఫల భోగానంతరము భూలోక మందు సర్వలక్షణ సంపూర్ణుడు ఏ వ్యాధియు లేనివాడునగు రాజై పుట్టును: తరువాత నర్మదోత్తర తీరమున ఆదిత్యాయతన తీర్థము; దీనికి ఈ పేరు ఈశ్వరుడే పెట్టెను॥ దీనియందు స్నానమాడి యథాశ క్తిగ చేసిన దానమును ఆ తీర్థ ప్రభావముచే ఆక్షయమగును: దరిద్రులును వ్యాధిగ్రస్తులును దుష్కృతమాచరించినవారును ॥ దీని స్నానము చే సర్వపాప ముక్తులయి రవి లోక ప్రాప్తులగురురు॥ మాఘ శుక్ల సప్తమినాడు ఈ తీర్థమున నిరాహారులును జితేంద్రియులునై యుండినవారికి ముసలి తనము వ్యాధి మూగతనము గ్రుడ్డితనము చెవుడు కలుగవు; వారు రూప సంపన్నులు స్త్రీలకు ప్రీతిపాత్రులునగుదురు; మార్కండేయుడిట్లు వచించిన ఈ తీర్థ మహిమనెరిగి దీనిని సేవింపనివారి జీవితము వంచితము (వ్యర్థమయిన ట్లే)॥ తరు వాత గాథేశ్వర తీర్థము॥ దానియందు స్నాన మాత్రమున పదునలుగురింద్రులంత కాలము స్వర్గలోక సుఖము కలుగును; దాని దగ్గరనే నాగేశ్వర తపోవనమను తీర్థము గలదు; అందు స్నానముచే నాగలోక ప్రాప్తుడై నలుగురు నాగకన్యలతో విహరించి సుఖించును కుబేర లోక ప్రాప్తుడునగును॥
తరువాత కుబేర స్థానమగు కాలేశ్వర తీర్థ ము; ఆందు స్నానమాడినచో నర్వ సంపదలు కలుగును; తరువాత పశ్చిమమున మారుతాలయ తీర్థము; దానియందు స్నానమాడి శుచియ నమాహిత చిత్తముతో యథాశ క్షిగ సువర్ణ దానము చేసినచో పుష్పక విమానము పై వాయు లోకమునకేగును; తరువాత యమ తీర్థము; ఆందు మాఘ కృష్ణ చతుర్దశి నాడు స్నానమాడి నక్త వ్రతము చేసినచో యోని సంకటము కలుగదు; తరువాత ఉత్తమమగు ఆహల్యా తీర్థము; అందు స్నానమాడినచో అప్సరసలతో సుఖము కలుగును; అహల్య యచట తపమాచరించి ముక్తినుదెను; చైత్ర శుక్ల చతుర్దశి కామదేవతిథి; ఆనాడు అహల్యను పూజించినవాడు తాను పుట్టినచోట నెల్ల ఎల్లరకు ఇష్టుడగును; రెండవ మన్మథుడువలె శ్రీలకు ప్రీతిపాత్రుడగును; ఆయోధ్యయను (ఒక) గ్రామమునకు దగ్గరగా రామతీర్థమను తీర్షము కలదు; దానియందు స్నా నముచే సర్వపాప ము క్తియగును; తరువాత సోమతీర్థము; చంద్రగ్రహణ సమయమున అందు స్నానమాడినంతనే సర్వపాపము క్రియగును; ఇది త్రిలోక విశ్రుతమగు మహాఫల పద తీర్తము; ఇందు చాంద్రాయణ వ్రతమాచరించినచో సర్వ పాపముకుడై సోమలోక మేగును॥ ఇందు అగ్ని ప్రవేశము చే గానీ జల ప్రవేశము గాని అనాహార వ్రతము చేగాని ప్రాణ త్యాగ మొనర్చినచో మరల మర్త్య లోకమున జన్మించరు॥ తరువాత శుభతీర్థ ము; దానియందు స్నానము చే గోలోక ప్రాప్తి యగును; తరువాత మహో తమమగు విష్ణుతీర్థము; దీనికే యోధనీపురమనియు పేరు॥ ఇందు వాసుదేవుడు కోట్లకొలదిగా అసురులతో యుద్ధము చేసెను; ఇందుచే ఇది విష్ణు స్థానమగు తీర్థమయ్యెను; ఇందు ఒక అహోరాత్రముపవాసముండినంతనే విష్ణువు ప్రీతుడయి బ్రహ్మహత్యాదోషమును కూడ పోగొట్టును॥
తరువాత తాప సేశ్వర తీర్థము; వ్యాధునివలన భయపడి ఒక ఆడులేడి ఈ తీర్థ జలమందుండి అంతరిక్షమునకు పోయెను॥ అది చూచి చిత్రమందా వ్యాధుడాశ్చర్యపడెను; ఇట్టి మహిమక ల ద తాష నేశ్వర తీర్థ ము; ఇట్టిది॥ ఇదివరకులేదు॥ ఇక ముందుండదు; తరువాత అ మోహక మను ప్రఖ్యాతిగల బ్రహ్మతీర్థము॥ ఇది చాల ఉత్తమము; దీనియందు పూర్ణిమా చూవాస్యలందు స్నానమాడి యథావిధిగా పితృ ద్ధమాచరించి పిండదాన తర్పణములు చేయవలయును; ఆచ్చట జల మధ్యమున గజరూపమగు శీల ప్రతిష్టితమయి యున్నది; వైశాఖ పూర్ణిమామావాస్యలందు ఇటపితరులకు పిండములు ఇచ్చినచో పితరులకు భూమి (సృష్టి) ఉన్నంతవరకు తృప్తి కలుగును॥ తరువాత సిద్దేశ్వర తీర్థము॥ అది చాల ఉత్తమమయినది; ఇందు స్నానమాడినచో గణపతి సాంనిధ్యము లభించును॥ తరువాత లింగతీర్థము; ఆందు విష్ణువు లింగరూపుడుగా నున్నా డు; దానియందు స్నానమాడినవారు విష్ణులోక ప్రాప్తులగుదురు॥ నర్మదా దక్షిణ తీరమందు పరమ శుభకరమగు కుసుమేశ్వరమను తీర్థము కలదు॥ పూర్వమొకప్పుడు కామదేవుడు మన్మథుడు) సహస్ర దివ్య వర్షముల కాలము అచ్చట దివ్యమగు మహాతపమాచరించి శంకరుని ఉపాసించెను॥ కానీ ఇతనిచే తనకు సమాధి భంగమయ్యేనని కోపించి మహాత్ము డగు శంకరుడు అతనినేకాక అతనితోపాటు శ్వేతపర్వన్ (వాయువు)-యముడు-హుతాశుడు (అగ్ని)॥ వీరిని కూడ శుక్లపక్షపు పర్వదినమున-పూర్ణిమ నాడు దహించెను; (వీరిని తాపమందించెను॥) వారట్లు దగ్గులయి కూడ (తాపమందుచునే) ఈ కుసు మేశ్వర తీర్థము నాశ్రయించియుండిరి॥
వారు అట్లు ఉండగా సహస్ర దివ్య వర్షముల తరువాత రుద్రుడు సంతుష్టుడయి వారికి వరము నీయదలచి ఉమతో కూడివచ్చెను; శివుడు వారినందరను తాపమునుండి విడిపించి నర్మదా తటమందు అనుగ్రహించెను॥ ఆ తీర్థ ప్రభావమున మరల వారందరు దేవత్వమందిరి॥ మహాదేవా! నీ ప్రభావమున ఈ ప్రదేశోత్తమము తీర్థమగుగాక యని వారు శివుని వేడి ఆ వరములను కూడ పొందిరి॥ అది ఆర్ష యోజన విస్తీర్ణమయి అన్ని దిక్కులందును వ్యాపించియున్నది; ఇందు స్నానమాడి ఉపవసించినవారు కుసుమాయుధ మన్మథ) రూపులయి రుద్రలోక సుఖములందుదురు; ఇట్లు మన్మథ వాయు యమాగ్నులు తపస్సిద్ధినందిన ప్రదేశము ఈ తీర్థము? దీనికి దగ్గరలో ఉన్న అంకోల వృక్షపు (ఊడుగు చెట్టు) మొదట స్నాన దానములును అచటి త్ర్యంబక తీర్థ జలముతో శ్రవణము (పాకము) చేసిన చరువుతో బ్రాహ్మణ భోజన పిండ ప్రదానములుమ జరిపినచో పితరులకు రవిచంద్రులున్నంత వరకు తృప్తి కలుగును॥ ఉత్తరాయనమందు ఇచట భగ వానునకు ఘృతాభి షేకము జరిపినచో శివలోక ప్రాప్తియగును; ఇచట సిద్దేశ్వరునకు ! పాతః కాల పూజ జరిపినవారు శుభగతి నంది శివలోక సుఖములందుదురు: ఆ పుణ్యము ముగిసిన తరువాత భూమికి దిగివచ్చినను రూపవంతుడును స్త్రీలకు ప్రీతిపాత్రుడునునయి సర్వ సముద్రాంతర్గతమగు భూమి కధిపతియగును; ఇచట గల క్షేత్రపాలుని మహాబలుడునగు దండపాణిని కర్ణకుండలుని దర్శింపనివాని యాత్ర వ్యర్థమగును: ఈ కుసుమేశ్వర తీర్థ మాహాత్మ్య ఫలముల నెరిగి సర్వదేవతలు నిటకు వచ్చుచుందురు; దీనిపయి పూలవాన కురియుచుందురు; దీనిని స్తుతించుచుందురు॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున శూల భేదాది తీర్థ మహిమాను వర్ణనమను నూట తొంబదవ అధ్యాయము॥
