మత్స్య మహా పురాణము

Table of Contents

175 - కాలనేమికృత సమరసన్నాహ వర్ణనము॥  

దేవతలకు శుభకరుడగు ఇంద్రుడు వరుణుని మాటకు సంతోషముతో నరేయని మంచు ఆయుధముగాగల చంద్రుని ముందుగ యుద్ధమునకు పొమ్మని సందేశమం పేను॥ “సోమా! నీవు వెళ్లి వరుణునకు సాయపడుము॥ అసుర వినాశమును దేవజయమును కలిగించుము॥ నీవు లోపలను వేలుపలను కూడ శ క్తికలవాడవు; జ్యోతిస్సులకు పర మేశ్వరుడవు॥ లోకములందలి రసద్రవ్యమంతయు చంద్రమయమని వేదవేత్త లందురు॥ నీమూలమున సముద్రమునకు న్న బ్లీ నీ మండలమునందును క్షయవృద్దులు కలవు॥ కాలమును జగత్తునకన్వయింప జేయుచు అహోరాత్రముల నేర్పరచు చున్నావు, ప్రపంచపు నీడ తో ఏర్పడిన గుర్తు నీయందు కుందేటివలే విలానము చూపుచున్నది॥ నక్షత్రములకును మూల భూతు (నక్షత్రాధి దేవత లగు దేవతలకు కూడ నీమహిమ తెలియదు॥ నీవు (నీ కాంతి మహిమ) ఆదిత్య పథమున కును నక్షత్రపథమునకును కూడ పైగానున్నావు॥ నున్నది॥ నీవు నీశ క్తితో చీకటిని పోగొట్టుచు అఖిల జగత్తు ప్రకా శింపజేయుదువు॥ నీకరణములు తెల్లనివి; నీ కొంతి హిమమయము; నీవు జ్యోతిస్సుల కధిపతివి; ప్రాణుల కధిక శుభము కూర్తువు; కాలపు వ్యవస్థయే నీ రూపము; యజ్ఞమందారాధింపబడు వాడవును యజ్ఞమును నీవే; అవ్యయుడవు; ఓషధుల కధీపతివి; కర్మలకు జన్మ కోరణుడవు; హరుని శిరోభూషణమును ధరించువాడవు; చల్లని కిరణములు గలవాడవు; ఆమృతమునకు నీవు ఆశ్రయమవు; చపలుడవు; ఏపనినై నను చేయవలెననుకోనగానే ఆపని చేయుటకు త్వరపడు పొడవు}; మనోహర శరీరుల శరీర కాంతి నీవే; సోమపానము చేయు యజమానులకును యాజ్ఞికులకును సోమమునీవే; సర్వభూతముల యందును సౌమ్యతగలవాడను; చీకటులనశింప చేయువాడవు; నక్షత రాజవు; ఇట్టివాడవు కావున నీవు కవచధారియైన వీరుడగు వరుణునితో కూడి మహా సేనలోనికి పొమ్ము; మమ్ములను దహింపజేయు ఆసురమాయను అణచి వేయుము;” అనగా చంద్రుడింద్రునితో నిట్లనెను॥ 'వరప్రదుడవగు దేవరాజా! నీవు స్వయముగా నన్ను యుద్దమునకై పేరించు చున్నావు కావున నీవనున బ్రే దైత్యమాయను తగ్గించు మంచును వరింతును॥ ఈ దైత్యులందరును నా మంచుచే కాల్చబడి చుట్టివేయబడి మహాయుద్దమందు మాయారహితులు మదహీనులునగుదురు; చూడుము॥

అట్లు పలికినహీమకరుడు ప్రయోగించిన మంచువానలు మేఘగణములువలె ఆ ఘోర దైత్యులను చుట్టుకోన సాగేను॥ పాశధరుడగు వరుణుడును చల్లనికిరణములు దాల్చిన చంద్రుడును॥ఈ మహాబలులిద్దరును పొశ పాతములతోను పానుపాతములతోను దానవులను:-చావగొట్టుచుండిరి॥ ఇద్దరును జలాధిపతులే; వారికి పాశమును పామమును ఆయుధ ములు; కనుకనే వారు యుద్ధమునందు కల్లోలితమయిన మహాసముద్రమువలే పొరలుచున్న నీటితో కూడి యుద్ధమున సంచరించుచుండిరి॥ ॥ వారిచే ముంచివేయబడిన ఆ దానవ సేన జగ తృళయ మేఘములు తమ నేనయందు ప్రవేశించగా వాటిచే తాము చుట్టబడి యేమోయనునట్లుండిరి॥ ఇట్లు జలాధిపతులగు చంద్రవరుణులు పరాక్రమించి మయదైత్యుడు నిర్మిం చిన మాయను శమింపజేసిరి॥ చంద్రుని శీతల కిరణములతో నిరగ్గులయియు వరుణుని పాశములతో బంధించబడియు దే త్యులు రణమున కదల లేక శిఖరములులేని కొండలవలే ఉండిపోయిరి॥ చల్లని"కిరణములతోను నీటితోను మంచుతోను బాగుగ దెబ్బతిని బాధనందుచు మంచుతో ముంచబడిన సర్వావయవములు కల వారగుచు వారు వేడిమి పోయిన అగ్ను లో యనునట్లుండిరి॥ - ఇట్లయిన ఆ దైత్యుల విమానములు అంతరిక్షమునందు పేకిని కిందికిని ఎగిరెగిరిపడుచు లేదు - చుండెను॥ మాయావియగు మయునకు తమ వారందరును, పాశములతో కట్టివేయబడుటయు శీతలకిరణములతో కప్పి వేయబడుటయు కనబడెను॥ అంతట వాడు అన్ని వైపులనుండియు పర్వత మయ మాయను సృజించెను॥ దానితో పర్వత సమూహములు వ్యాపించెను॥ ఖడ్గములు పలకలు (డాలులు) అసి (ఒక విధమగు ఖడ్గముల) సమూహము బిగ్గరగనవ్వు చున్న వో యనునట్లుండెను॥ అంతులేనన్ని చెట్లతో నిండిన శిఖరాగ్రములును కందరము లందు వ్యా ప్రమయిన 'అడవులు సింహహ్య ఘగణములు ఘీంక రించు ఏనుగుల మందను వాటి నాయక గజములను ఈహామృగగణములను ఆ పర్వతము లందంతటనుండెను॥ వాయు వశమున ఆందలి చెట్లు మోతలతో క్రిందికి ప్రక్కలకు పైకి పొరలుచున్నట్లుండెను॥ ఆ  పర్వతమాయ తన సంకల్పానుసారమంతరిక్షమున అంతట సంచరించుచుండునట్లువాడు నిర్మించేను॥

ఆ పార్వతమాయ ఖడ్గముల కదలికలతోను శిలా వరములతోను 'వృక్షపాతములతోను దేవ సంఘములను చంపుచు దానవులను జీవింపజేయు చుండెను॥ రాలతోను ఇనుప ఆయుధముల గనులతోను దేవగణములను క్రమ్మివేయు చుండ చంద్రవరుణమాయ అంతర్ధానమందెను॥ రాలతోను యంత్రములతో ప్రయోగించు ఆయుధములతోను దట్టమయి తొక్కులాటలతో ఇరు కైన ఆయుద్ద భూమి పర్వతములతో॥ -- నిండినదో యనునట్లయి సంచరించుటకే వీలుకాక పోయేను॥ దేవతలు చిన్న రాలతోను పెద్ద బండలతోను ముద్దరాయుధములతోను దేబ్బలు తినుచుండిరి॥ వృక్షములచే అడ్డగించ బడనివాడు దేవతలలో ఒక్కడును లేకుండెను॥ ఒక్క గదాధరుడు॥ (విషువు) తప్ప దేవతలందరును ధనువులు విడిచిన పొరో ఆయుధములు విరిగినందున దుఃఖముచే కాంతిహీనులో అయిపోయిరి॥ వారు ఏ ప్రయత్నమును చేయజాలక యుండిరి॥ ' శ్రీమంతుడును జగదధిపతియు అగు గదాధరుడు మాత్రము యుద్ధరంగమందే చలించక నిలిచియుండెను॥ కోపించనయినలేదు॥ ఏలయన అతడు ఈశానుడు (సర్వ కిశాలి) సహన శక్తిశాలి; కొలత త్వము నెరిగినవాడు; కావున అపుడు నల్లని మేఘమువలె ప్రకాశించు॥॥ఆ హరి యుద్దమందు తగిన సమయమునకు ఎదురు చూచుచు దేవాసురుల దొమ్మీ యుద్ధమును చూచుచు కొంత తడవు ఉండిపోయెను॥ అంత లో అతనికి అగ్ని వాయువులు కనబడగా వారు నారాయణుని చే పేరింపబడి చుయ మాయను నశింపజేయ నారంభించిరి॥ వారు ఇద్దరును ఆమహాయుద్ధమున మహావేగమున వృద్ధినంది ఆ పర్వతమాయను 'దహించి భస్మమొనర్చి నశింప జేసిరి॥ వారిద్దరును పరస్పర సహాయముతో ప్రళయ కాలమందు వలే వ్యాపించి ఆ దైత్య సేనను కాల్చివేసిరి॥

మొదట వాయువు ఆ సేనలో ఒక చోటికి పోవును; ఆంతట అగ్ని యుపోయి అచట క్రమ్మును; ఇట్లు వారిరువురు ఆటలాడుచున్నట్లా దానవ నేనయందు సంచరించిరి॥ ఇందుచే దానవ విమానములు భస్మ రేణువులయి ఎగురుచు పడుచు లేచుచుండెను॥ కొన్ని విమానములు ముక్కలై అంతటను పడుచుండెను॥ కొన్ని పాత స్కంధము (గాలిపొర)లలోనికి ఎగురగొట్టబడెను॥ ఆగ్ని తన పని తాను చేసెను॥ దేవతలు మాయాబంధ ముక్తులై 8॥ గదాధరుడు స్తుతులందు కొనుచుండెను॥ దైత్యులు ప్రయత్న హీనులయిరి॥ త్రిలోక ములును బంధము క్తినందెను॥ దేవతలందరును బాగు బాగనుచు సంతోషించుచుండిరి॥ ఇంద్రుడు జయించెను; దైత్యులోడిరి॥ దిక్కులెల్ల నిర్మలములయ్యెను॥ ధర్మము విస్తర మంది లోకమున ప్రవర్తిల్లెను॥ చంద్రుడు మరల తన స్థానమునకు మరల వచ్చెను॥ దివాకరుడు స్వస్థానమున నిలిచెను॥ మూడు లోకములును సత్ర్పవర్తనము కలిగి తమతమ స్వభావ సిద్ద ధర్మములందుండెను॥ సర్వప్రాణులును యజ్ఞములాచరించ దేవతల నారాధించ సాగేను॥ పాపములణగెను॥ మృత్యువు అదుపులో నుం డేను॥ అగ్నియందు హోమములు సాగుచుండెను॥ దేవతలు యజ్ఞ (భాగములతో శోభిల్లుచుండిరి॥ వారు యజ్ఞ ఫలములను (జనులకు) అంద జేయుచుండిరి॥ లోకపాలురందరును తమతమ ఆధిపత్యముగల దిక్కులందు తగిన విధమున వర్తిల్లుచుండిరి॥ తపఃసిద్దులు లభించుచుండెను: పాపకర్మములిచ్చటను లేక పోయెను॥ దేవపక్షమానందించెను॥ దైత్యపక్షము దుఃఖించేను॥ మూడుపాళ్ళు ధర్మము ఒకపాలు ఆధర్మము ఉం డేను॥ ధర్మాచరణమహాద్వారము తెరచుకొనెను॥ నన్మార్గము నడచుచుండెను॥ లోకమునందు ఆయా ధర్మములు జరుగుచుండెను॥ బ్రహ్మచర్యాద్యాశ్రమములందున్న జనులు తమతమ ఆశ్రమ ధర్మములందు నిలిచియుండిరి॥ రాజులు ప్రజా రవణ తత్పరులయి ప్రకాశించుచుండిరి॥ లోక మున కల్మషము ప్రశాంతమయ్యెను॥ దానవుల తమోగుణ మణగెను॥

ఇట్లు అగ్ని వాయువులు జరిపిన యుద్ధ కృత్యము ముగి నెను॥ లోక విస్తార మంతయు అగ్ని వాయు మయము లయ్యెను॥ ఈ విజయకార్యము వారు నేరవేర్చినదేకదా! ( ఆందుచే ఆన్ని లోక ములయందును ఆందరును వారినే కీర్తించుచుండిరి॥)

ఇట్లు ఆగ్ని వాయువులు దానవులకు మహా భయము కలిగించిరని విని కొలనేమియను ప్రసిద్ద దానవుడు తన రూపమందరకు కనబడ జేసెను॥ వాని కిరీటము రవివలే ప్రకాశించుచుండెను॥ వాని ఆభరణములును భుజ కీర్తులును మ్రోతలను ఈనుచుండెను॥

వాడు మందర మంథ) పర్వతమువలె వెలుగుచుండెను॥ బంగారుతో కప్పబడెనో యనునట్లు బంగరు ఆభరణములు దాల్చియుండెను॥ నూరు ఆయుధములు దాల్చి భయంకరుడై యుండెను॥ నూరు బాహువులతో నూరు మొగములతో నూరు తలలతో శోభిల్లుచు శతశృంగ పర్వతమువలే వాడుండెను॥ వేసి కాలపు ఆగ్ని వలె మహా కోపముతో నుండెను॥ పొగరంగు తలవెంట్రుకలు పచ్చని మీసములు కలిగి పెదవులు త్రైలోక్యంతర్భాగమంతయు విస్తరిల్లి నిండునంత పేద్ద శరీరము కలిగి ఉండెను॥ భుజములతో ఆకాశమును కదల్చుచుండెను॥ అడుగులతో కొండ లను విసరి నెట్టుచుండెను॥ “శ్వాసవాయువులతో వర్షించు (నీటితో నిండిన బరువగు) మబ్బులను కూడ చెదర గొట్టు చుండెను॥ అడ్డముగా ఉండి పొడవైన ఎర్రని కన్నులును సుందరమయి యుండియు తీవ్రఘు భయంకరమునైన వర్చస్సును కలిగియుండెను॥ సర్వదేవ గణములను యుద్ధమున కాల్చివేయదలచియున్నాడేమో ఆనునట్లుండెను॥ దేవ గణములను బెదరించుచుండెను॥ దశదిశలను కప్పివేయుచుండెను॥ ప్రళయ కాలమునందు దప్పిగొని ఆవేశముతో లేచి వచ్చుచు ఉండిన మూర్తీభవించిన మృత్యువే మో అనునట్లుండెను॥ చక్కని ఆర చేయి కలిగి ఎత్తయి విపులములగు వ్రేళ్ళ కణుపులు కలిగి వ్రేలాడుచున్న ఆభరణములతో నిండి కొంచెముగ కదలించబడుచున్న వస్త్రధారణము చొక్కావంటీ దుస్తులు) కలిగి పైకి ఎత్తి ఉంచబడిన సుందరమగు కుడి ముంజేతితో ఆదివరకు జరిగిన యుద్ధమున దేవతల చేతిలో మరణించిన దానవులను 'లేచి రండు॥' అని పిలుచుచు ప్రోత్సాహించుచుండెను॥ యుద్ధమున శత్రువుల విషయమున యమునివలె ప్రవర్తించి భయము గొలుపుచు నాశము కలిగించు ఆకాలనేమిని దేవతలందరును థయత్ర స్త నేతుల చూడసాగిరి॥ తన ఆడుగులతో విక్రమించుచున్న రెండవ నారాయణుడో యనునట్లుండి ముందునకు అడుగులు వేయు చున్న కాలనేమిని సర్వభూతములును చూచుచుండెను॥ మీగుల పైకెత్తుచున్న ముందటి అడుగుతో చెలరేగిన గాలితో ఆకాశమునే ఘూర్ణిల్లజేయుచు ఆకాలనేమి ఆసురుడు యుద్ధరంగమునందున్న దేవతలను మిగుల భయ పెట్టెను అనంత రము అసుర ! శ్రేష్ఠుడగు మయుడు తను ఆలింగనము చేసికొనగా ఆ కాలనేమి విష్ణువుతో కూడిన మందర మంథ), పర్వతమువలె ప్రకాశించుచుండెను॥ అట్లు రెండవ కాలయముడువలె తమ వయిపునకు వచ్చుచున్న కాలనేమిని చూచి ఇంద్రాది దేవతలు చాల వ్యథ చెందిరి,

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవదానవ సంగ్రామమున కాలనేమి దానవుడు యుద్ధ సన్నద్ధుడగుట యను నూట డెబ్బది ఐదవ అధ్యాయము॥