మత్స్య మహా పురాణము
33 - జరాప్రాప్తి విషయమున యయాతి-తత్పుత్త్రుల సంవాదము
శౌనకుడు శతానీకునితో ఇంక ను ఇట్లు చెప్పెను: ఇటు పొర్ణకమును పొందిన యయాతి తన రాజధానిని చేరి తన పెద్ద కుమారుడును అందరకీ మేలే నవాడును అగు యదుని పిలిచి ఇట్లు పలికెను. “కుమారా! కవి మునికుమారు డగు ఉశనసుని శాపమువలన నాకు శ రీరము ముడుతలు పడినది; జుట్టు నరసినది. నాకో . యావనసుఖముల విషయమున ఇంకను తృప్తి కలుగలేదు. నీవు నా దోషమును ఆదోషమునకు ఫలమగు వార్ధక లక్షణమును స్వీక రింపుము. నీ యావనముతో నేను విషయముల ననుభవింతును. వేయి సంవత్సరముల తరువాత మరల నీ యావనము నీకు ఇచ్చి నా పాపమును వార్ధకమును తీసికొందును.” యదువు: “తండ్రీ! ముసలితనము కలిగినచో దానివలన పాన భోజనాది విషయములందు ఎన్ని యో దోషములు ఏర్పడును. అందుచే నీ ముసలితనమును నేను తీసికొనను. ఇది నా నిశ్చయము. ముసలితనముచే దేహము శిథిలమగును. మీసములు తెల్లనివగును. శరీరము ముడుతలు పడును. వంగి పోవును. చూచుటకు బాగుగా నుండదు. చిక్కిపోవును. ఇట్టిపాడు పనులు చేయుటకు అశక్తు డగును. వనమునందున్న వారును తన పై ఆధారపడి జీవించువారును కూడ అవమానింతురు. ఆందుచే నాకు ముసలితనము ఇష్టము కాదు. నీకు నాకంటెను ప్రీతిపాత్రులగు కుమారులు ఇంకను చాలమంది ఉన్నారుగదా! వారిలో ఇంకెవ్వరినై న మీవార్ధకమును తీసి కొమ్మని అడుగుడు. మీరు అన్ని ధర్మములను ఎరిగినవారు.” యయాతి “నా హృదయమునుండి పుట్టినవాడవై ('హృదయాదధి జాయసే.' అని శ్రుతి.) ఉండియు నీవు నాకు నీవయస్సు నీయకున్నావు. కావున నాయనా! నీ సంతతికి రాజ్యాధికారము లేకుండును.” అని అతడు తుర్వసునితో ఇట్లనెను. “కుమారా! తుర్వసూ! నో పాపదోషమును వార్ధక మును కూడ గ్రహింపుము. నీ యౌవనముతో విషయ సుఖముల ననుభవింతును. వేయి సంవత్సర ముల తరువాత తిరిగి నీ యౌవనమును నీకిత్తును. నా పాప దోషమును ముసలితనమును తీసికొందును." తుర్వసుడు : “తండ్రీ! వార్ధకము కామ సుఖానుభవములను తదితర భోగానుభవములను కూడ లేకుండ జేయును. బలమును రూపమును బుద్ధిని ప్రాణశక్తిని నశింపజేయును. కనుక నేనది గ్రహించ ఇష్టపడను.” యయాతి: “నీవు నా హృదయమునుండి పుట్టిన వాడవై ఉండియు నీ వయస్సును నాకీయకున్నావు. కనుక నీ సంతతి తుదివరకు కొనసాగక సముచ్చిన్న మగును. నీవు సంకీర్ణమగు ఆచా రములను ధర్మములను పాటించువారు ప్రతిలోమ జాతులవారు తక్కువ వర్ణపు పురుషునకు ఎక్కువ వర్ణపు స్త్రీతో సంగమము చే కలిగినవారు) పచ్చిమాంసమునై న తినువారు అంత్య వర్ణములవారు (ఊరి చివర నివసించువారు)-ఇట్టి వారి నడుమ రాజ వగుదువు. ఇది నిశ్చయము. గురుపత్ని తో నైన తిరక్-పశుపక్ష్యాది) ప్రాణులతోనైన సంగమించువారు మేచ్చులు (స్పస్టోచ్చారణము మొదలగు వవిత్ర రూపము లేని భాషల మాటలాడు వారు) పశువులవలె జీవించు.వ్యవహ రించువారు పాపులు మొదలగు వారినడుమ ఉండు చు సంతతిని కనెదవు.” తుర్వసుని ఇట్లు శపించి యయాతి శర్మష్ణకు పెద్దకొడుకగు ద్రుహ్యునితో ఇట్లు పలికెను.
“ద్రుహ్యూ! జర అనునది దేహపువర్ణమును రూపమును నశింపజేయునదియే. ఐనను వేయి సంవత్సరములపాటు నాజరను నీవు తీసికొని నీ యౌవనమును నాకు ఇమ్ము. వేయేండ్లు కాగానే నీ యౌవనమును నీకిత్తును. నా పాపదోషమును ముసలితనమును తిరిగి తీసికొందును" ద్రుహ్యుడు: "జర చే శిథిలుడయినవాడు రాజ్యమును రథమును అశ్వమును స్త్రీలను వేటినీ కూడ అనుభవించజాలడు. వాటియందు ఇష్టము కూడ ఉండదు. కనుక నాకు అది ఇష్టము కాదు.” యయాతి: “నీవు నా హృదయమునుండి పుట్టినవాడ వై యుండియు నీవయస్సు నాకీయకున్నావు. కావున ద్రుహ్యూ! నీకు ఇష్టమగు ఏ కామమును (కోరిక యు) నెర వేరకుండుగాక ! నిత్యమును తెప్పల పై దాటియే వేరొక చోటికి పోవలసియుండు దేశమున రాజ్య భష్టుడవే జీవింతువుగాక! నీ సంతతివారును ఇట్టే అయి రాజ్యాధికారము లేకుందురుగాక!” యయాతి: “అనూ! నా పాపదోషముతో కూడ నొవార్తకమును నీవు తీసికొనుము. నీ యౌవనముతో వేయేండ్లు విహరింతును." అనువు: “జర చే శిథిలుడయినవాడు శిశువు వలెను అశుచియేమో అన్న ట్లును ఏదో సమయమున అన్న మును తినుచుండును. తగిన సమయములో అగ్ని కి హోమము చేయజాలడు. కనుక జర నాకు ఇష్టము కాదు.” యయాతి: “నాహృదయమునుండి పుట్టినవాడవై ఉండియు నీ యౌవనమును నాకీయకున్నావు. కనుక నీవు అనిన జరాదోషము నీకే ప్రాప్తించుగాక! నీ వంశము వారందరును యౌవనము రాగానే నశించుచుందురుగాక! నీపును నీవనినట్లే అగ్ని ప్రస్కందన మనస్కుడవు (అగ్ని మీదుగా దుముకుట యందు ఇష్టము కలవాడవు ఆగుదువుగాక! (ఇది మహాదోషము)”.
పిమ్మట యయాతి: “పూరూ! నీవు నా ప్రియపుత్రుడవు. అందరలో గొప్పవాడవు కూడ అయ్యెదవు. కవి మునికుమారుడగు ఉశనసుని శాపమువలన నన్ను ముడుతలును నరలును క్రమ్ముకొన్న వి. యౌవనము చే కలుగవలసిన తృప్తి నాకింకను కలుగలేదు. కనుక నీవు నాపాపదోషమును జరను గ్రహింపుము. నీవయస్సుతో కొంత కాలము విషయ సుఖముల ననుభవింతును. అట్లు నిండుగా వేయేండ్లున్న తరువాత నీ యౌవనము నీకిత్తును. నా పాప దోషమును వార్ధకమును నేను తీసికొందును." ఇట్లు పలికిన యయాతితో వెంటనే పూరు డి విధముగా ననేను: “మహారాజా! నీవు చెప్పినట్లే చేయుదును. నీ పాపదోషమును వార్తకమును నేను తీసికొందును. సోనుండి యావనము గ్రహింపుము. ఈప్సితములగు కామము లనుభవింపుము. ఇతరుల బలాత్కారము చే కాక) నా యథేచ్చతోనే నా యౌవనమును నీకిచ్చి నీవార్తకముతో కప్పబడి నీవయస్సును రూపమును ధరించి వ్యవహరింతును."
అని పలుకగా యయాతి: “నాయనా! పూరు: నేను నీ విషయమున ప్రీతుడనైతిని. నా ముసలితనమును నీకిత్తును. నీ ప్రజలు సంతతివారు) సర్వకామ సమృద్దులు అయ్యేదరు. నీకు (నీ సంతతి వారికి కూడ) రాజ్యాధికారము ఉండగలదు.”
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరిత్రమున యయాతి - తత్పుత్త్ర సంవాదము అను ముప్పదిమూడవ అధ్యాయము.
