మత్స్య మహా పురాణము
14 - (పితరుల కన్యయగు అచ్చోద చరితము) - అగ్నిష్వాత్త పితరుల చరితము
చతుర్దశాధ్యాయము (పితరుల కన్యయగు అచ్ఛోద చరితము.) అగ్ని ష్వా తపితరుల చరితము । (పురాణములందును శాస్త్రములందును చెప్పబడిన పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వీరిలో మూడు మూర్తిలేని గణములు. ఆ గణముల పేర్లు 1. వై రాజులు 2. అగ్ని ష్వాత్తులు 6. బరిషదులు; మూర్తి కలవి నాలుగు గణములు. 1. సుకాలినః 2. హవిష్మంత? 8. ఆజ్యపాః 4. సోమపాః. వీరిలో మొదటి గణము విషయము పదుమూడవ అధ్యాయమున రెప్పబడినది. ఈ అధ్యాయమున రెండవ గణమువారీ విషయము చెప్పబడును.
ప్రతి గణము విషయము ను తెలియవలసిన విషయములు -1. ఆ గణము వారు నివసించు లోకము. 2. ఆ గణము పేరు. కి. వారి తండ్రి నామము 4. ఆ గణము వారిని ఆరాధించు వారు. 5. వారి మానసీక న్యా నామము.)
సోమ పథములను లోకములు గలవు. వీనియందు మరీచి అను ప్రజాపతికి కుమారులు అగు పితృదేవతలు నివసింతురు. వీరిని దేవతలు ఆరాధింతురు. ఈ పితరులకు అగ్నిష్వాత్తులు అని పేరు. (అగ్ని షు- ఆత్త్ర = అగ్నులయందు సమగ్రముగా హవిస్సు వేల్చి యజ్ఞములను చేసినవారు. వీరందరును యజ్వలు యజ్ఞములను చేసినవారు.
వారి మానసపుత్రి అచ్చోదా అను ఆమె. ఆమె నదీరూపురాలు ఐనది. ప్వూము పితృదేవతలు అచ్ఛోదమను సరస్సును సృష్టించిరి. ఆ సర సీరమున ఈమే వేయి దివ్య సంవత్సరముల కాలము తపస్సు ఆచరించెను. పితరులు సంతుష్టులై ఆమె కడకు వచ్చిరి. నీ కే . వరము కావలెనో ఇత్తుము. కోరుకొనుము -అనిరి. వారందరును దివ్యములగు రూపముల ధరించినవారు దివ్యములగు మాలికలు పుష్పములు దాల్చి సవారు. దీవ్యగంధములు పూసికొనినవారు. యువకులు; బలశాలురు; మన్మథుని వంటివాడ. వారిలోనుండి “మావసుడు' అను పితరుని ఆమె కామపరవశురాలై వరునిగా కోరుకొనెను ఆ సుందరి ఈ వ్యభిచార దోషము చేత యోగ భ్రష్టురాలయ్యెను. అంతవరకును దేవభావమున భూమిని తాకకయున్న ఆమె భూస్థలి పై పడిపోయేను.
కాని పూవసుడు ఆ అచ్చోదను కామించక ధైర్యముతో ఉండెను. అందుచే ఆమె “మావస్య' (మావసునికి ప్రియురాలు) కాలేదు. కనుక ఆమెకు ‘అమావస్య' అను పేరు వచ్చెను (మావస్యకానిది) తన తపస్సుచే పితరులను మెప్పించినందున ఈ అచ్ఛోద లేదా ఆమావాస్య పితృదేవతలకు ఇష్టురాలు మాత్రమయినది. అందుచే అమావస్యా (అమావాస్యా) తిథియందు పితరులకు ఆర్పించినది అక్షయమగును. అనంతఫలమును ఇచ్చును.
.
తన తపస్సు తస ఈ దోషము ఏ క్షీణించుటవలన అచ్ఛోద దీనురాలయి ముఖము వంచుకొని సిగ్గుపడుచు తాను మరల తన తపస్సును సమృద్ధి నొందించుకొనుట కై ఉపాయమును తెలుపవలసినదిగా తన తండ్రులగు పితరులను వేడుకొనెను. ఆ మహాభాగులు అనుగ్రహము కలవారైరి. వారు జరుగబోవు విషయములను దేవకార్యమును తమ ధ్యాన దృష్టితో) దర్శించిరి. శుభమగు వాక్కుతో వారు ఆ తపస్విని (తపోవంతురాలు.జాలిపడదగిన దీనురాలు) తో ఇట్లు పలికిరి: సుందరియగు పు తీ: వివేకవంతులగు వారు (భూలోక సంబంధి కానటువంటి) దివ్య శ రీర ముతో చేసిన ఏ కర్మమున కై నను ఫలమును వారు అదే శరీరముతో అనుభవింతురు. మానుష శరీరములో నున్న వారు మాత్రము తాము చేసిన కర్మల ఫలములను కొన్ని చిన్ని ఆ దేహమును విడిచిన తరువాత ఆనుభవింతురు. (సవు మనుష్య స్త్రీగా అయియు "పు. కనుక) నీవు తపస్సు ఆచరించినచో దాని ఫలమును నీవు ఈ దేహమును విడిచిన తరువాత మరియొక జన్మము లో కాని దేవలోక మునకాన్ని అనుభవింతుపు.
ఇప్పుడు నీవు నీ తండ్రుల విషయమున చ్యతిక్రమము (నియమము తప్పి కామ బుద్ధిని చూపుట) చేసితివి. కనుక ఇరువది ఎనిమిదవ ద్వాపరయుగమున చేప కడుపున జన్మించి నీచమగు కులమును చేరుకొందువు. ఇది జరుగుటకే నీవు తప్పక వసుడను రాజునకు కూతురపు అగుదువు. కన్యగా ఉండి (కన్యాత్వము చెడక యే చివరకు మరల దుర్లభములగు నీతోక ములను నీవు చేరెదవు. ఎట్లన-పరాశరుని పర్యముతో ఒక కుమారుని కనేదవు. ఆతడు సాక్షాత్ అచ్యుతు నారాయణు) డే. బదరీవృక్షములు తరచుగా కల ద్వీపమున జనించుటచే అతనికి బాదరాయణుడు . అని వ్యవ హారము కలుగును. ఆ సికుమారుడు ఒకటిగా ఆయి యున్న వేదమును నాలుగుగా విభజించును. సముద్రుని అంశ చేత జనించిన పూరు వశీయు డై న శంతనుని వలస చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అసు ఈమారులను ఇద్దరను క నెదవు. భూలోకమున నీకు త్యవతి అని పేరు. పితృలోకమున నీకు అష్టకా. అని పేరు. అచట నీవు పౌష్టపదీ-అషకా-(భాద్రపద శుక్ల పూర్ణిమ గడచిన వెంటనే వచ్చు సప్తమీ తిథి) రూపముతో ఉందువు. నీవు పర (పితృ) లోకమునందుండి ప్రాణులకు ఆయురారోగ్యములను కోరిన ఫలములను ఇత్తువు.
నీవు భూలోకమున నదీ రూపమును పొంది అచ్చో ' అను పేర పుణ్యజలములుగల నదీ శ్రేష్టవేయుందువు.
ఇట్లు పలికి ఆ పితృగణము అచ్చటనే అంతర్ధానమును పొందిరి. ఆ అచ్ఛోదయను పితృ కన్య:మును వారిచే ఇంతవరకును చెప్పబడిన సత్కర్మ ఫలమును పొందెను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున పితృకన్యయగు అచ్ఛోద చరితమను చతుర్దశాధ్యాయము.
