మత్స్య మహా పురాణము
123 - ఖగోళ విషయము
భూపరిమాణమ్
సప్త ద్వీపములును సప్త సముద్రములును ఆయా భూతములును వాని సంభవ విస్తరమును ఎంతవరకు కలదో అంతవరకును (అంత మేరలో) ఈ సూర్యచంద్రులు తిరుగుచునేయుందురు. పృథివీ విస్తారము ఎంతయని విచారణ చేయవలసివచ్చినచో ఈ చంద్రాదిత్యులు మొదలగువారు పృథివీ వ్యాప్తికి వెలుపల కూడ సంచరించుచునేయు న్నారు. వారి పరిమాణము కూడ పృథివీ పరిమాణము కంటే భిన్నమై ఎక్కువదిగానో తక్కువదిగానో యున్నది. కాని వ్యవహా రార్థమై మాత్రము భూమి ఉన్నంత మేర మాత్రమే సూర్యచంద్రుల ప్యా పియున్నదని భావించి భూమికిగల పరిమాణము నకు తగినట్లే అంతరిక్షపు పరిమాణము కలదని ఎంచవలెను. 'అవ' ధాతువునకును 'ఋ' ధాతువునకును గల అర్థముల ననుసరించి.రవి “రాశినుండి రాశికి సంచరించును " లోకముల నిర్మించును రక్షించును ప్రకాశింపజేయును గావున రవి (ఋ+ఆప్+ ఇ = రవి-ఇయర్తి అవతి ఇతి రవి)' అనబడును.
ఇక మీదట సప్తద్వీప సప్త సముద్ర సహిత భూమండలమున సూర్యచంద్రులగతి ప్రకారమును వారి పరి మాణమును ఈ మొదలగునవి చేప్పెదను. ఈ ‘చంద్ర సూర్యులు' అను నర్థమునందే ‘మహః' అను శబ్దము కూడ నిష్పన్న మగుచున్నది. ‘మహ్యతే ఆయం' 'ఇతడు పూజింపబడును.' 'గొప్పవాడై యుండును.' 'మహీయంతే అనేన జ్యోతీంషి' 'ఇతని చేతనే ఇతర జ్యోతిస్సులు పూజితములగును.' అని 'మహః' అను శబ్దము వ్యుత్పన్న మగుచు న్నది.
లోగడ చెప్పిన భూమండల వైశాల్యమంత యే రవి మండల వ్యాసమని చెప్పెదరు. రవి మండల వ్యాసము తొమ్మిదివేల యోజనములు; దాని చుట్టుకొలత వ్యాసమునకు మూడింతలు; చంద్రుని ప్యాసము రవి వ్యాసమునకు రెండింతలు; భూవ్యాసము (సరాసరి) ఏబది లక్షల యోజనములు. మహా మేరు ప్రాంతమున భూవృత్తము తక్కువగా నుండును. అచ్చట భూవ్యాసము ఈ సగటు వ్యాసములో సగము మాత్రమే. అనగా ఇరువది ఐదు లక్షల యోజనము లుండును. భూగోళపు మధ్య భాగమున వ్యాసము అత్యధికముగా నుండును. అది ఒక కోటి ఎనుబది తొమ్మిది లక్షల ఏబదివేల యోజనము లుండును. భూమికి దక్షిణా త్తరాగ్రముల మధ్య దూరము మూడుకోట్ల డెబ్బది తొమ్మిది లక్షల యోజనములు; దీని (ఉత్తర దక్షిణములుగా ఏర్పడెడి భూవృత్తపు) చుట్టుకొలత పదునొకండు కోట్ల ముప్పది ఏడు లక్షల యోజనములుండును. ఇది భూమికి సంబంధించిన అన్ని విధముల మండలముల వ్యాసమును చుట్టుకొలతలును.
తారకల (నక్షత్ర గ్రహాదుల) సన్ని వేశమున (అమరిక) కై ద్యులోకమున ఎంత ముడలము కలదో పర్యాసపు (భూమి చుట్టును గ్రహాదికము తిరుగుటకు సంబంధించిన) అమరిక కై భూలోక సమీపమున ఎంత మండలము కలదో అవి రెండును ఒక దానికి మరియొకటి సరిపోవునవిగానే ఉన్న వి. మహా మేరువునకు తూర్పున మానసో తరమను శిఖరమునకు పైభాగమున ‘వస్వోకస్తారా' అను ఇంద్రుని నగరము బంగారు ఆలంకరింపబడినది కలదు. మహా మేరువు నకు దక్షిణముగా మానసో తరమునకు పైభాగముననే కల యముని నివాసమగు 'సంయమనీ'పురము కలదు. మేరువునకు పడమటగా మానసో తరమునకు పైభాగమున “సుఖా' (ప్రాచీన పారసీక నగరమునకు 'సుసా' అని పేరు.) అను నగరము కలదు. ఇట్లే మానసో తరపు పైభాగమున మేరువునకు ఉత్తరమున సోముని 'విధా' నగరము ఉన్నది. ఇట్లు లోకపాలురు నలుగురును లోక వ్యవస్థార్థము (సూర్య సంచార గణనకై) నాలుగు దిక్కులందును . ఆయా నగరము లందు ఉన్నారు. (అని భావించవలెను.) లోకపాలుర కందరకును పైగా దక్షిణాయనమున సూర్యుడు. చివరి దశలో (ఉత్తరాయనము ఆరంభము కాబోవునప్పుడు) అప మండలమున సూర్యుడు - పయనించేడు అశ్విన్యాది నక్షత్ర మార్గమునకు అప మండలమని పేరు) ధనుస్సును వదలిన బాణమువలె మహావేగమున జ్యోతిశ్చక్ర మార్గమున పోపును. అమరావతిలో మధ్యాహ్న మయినపుడు సంయమనమున ఉదయము సుఖా నగరమున అర్ధరాతము విధా నగరియందు అ సమయము జరుగును. ఇట్లే సంయమనమున మధ్యాహ్న మయినపుడు సుఖా నగరమున ఉదయము వికా నగరమున అర్ధరాత్రము అమరావతియంద సమయము. ఇట్లే సుఖా నగరమున మధ్యాహ్న మయినపుడు విధా నగరమున ఉదయము అమరావతియందు అర్ధరాత్రి-సంయమని యంద సమయము; విభా నగరమున మధ్యాహ్న మయినపుడు అమగా వతియందుదయము సంయమని యందర్ధరాత్రి సుఖా నగరమంద స్తమయము జరుగును.
ఇట్లు సూర్యుడు నిరంతరమును అలాత చక్రమువలె కోరవి గిర గిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె తిరుగుచునేయుండును. దక్షిణము వరకు గల దిక్కులందును ఈ చెప్పిన క్రమమున తిరుగుచు సొ రేవలే తిరుగు (గుండ్రముగానున్న ) నక్షత చక్రమున అతడు నడచుచుండును. పూర్వాహ్న మధ్యాహ్నా పరాష్ట్ర కాలములందు వేరు వేరు స్థితులలో ఉండు కిరణములతో భూమిని తపింప జేయును. ఎట్లన ఉదయమునుండి అతని కిరణముల తాపము అధిక మగుచు మధ్యాహ్న మునకు అత్యధికమగును. అప్పటినుండి క్రమముగా తగ్గుచు పోవును.
సూర్యోదయ సమయముల బట్టియే తూర్పు మొదలగు దిక్కుల వ్యవస్థ జరుగును. సూర్యుడుదయించు చున్నట్లు కనబడు దిశ ఉదయదిశ (అక్కడి వారికది తూర్పు). 'ఆస్తమించుచున్నట్లు కనబడు దేశ అ స్తదిశ (అక్కడి వారికది పడమర.). అన్నిటికంటే ఉత్తరమున మేరువు-ఆన్నీ టికంటే దక్షిణమునందు లోకాలోకము (పర్వతము) ఉన్నట్లు భావన చేయవలయును; భూమియందలి ఒక భాగమును పూర్తిగా వదలి మరియొక విదూర - భాగమునకు పోవుట వలన సూర్యుడు అక్కడి వారికి రాత్రులందు కనబడడు. ఏ 'భూభాగము నకు అతడు పోవునో అక్కడ నూరు వేల కిరణములు కలవాడై ఆకాశపు ఉచ్చ స్థానమున అక్కడి వారికి కనబడును. అది వారికి పట్టపగలు.
సూర్యుడు ఒక ముహూర్త కాలములో కొన్ని ‘అంశ’ (12) భాగలదూర మాకాశమున పయనించును. ఇది ముప్పది. యొక లక్షల ఏబది వేల యోజనములగును. ఇది ముహూర్త (రెండు గడియలు = 48 నిమిషములు) కాలములో రవి గమన వేగము. ఈ గతిలో పయనించుచు రవి దక్షిణ దిశకుపోయి మాఘమాసమున- దక్షిణాయన గతిని వదలి పుష్కరద్వీప మధ్య భాగమున సంచరించుచు మేరుపర్వతమున మానసోత్తర శిఖరప్రాంతమునకు వచ్చుసరికి అచ్చట క్రాంతిమండల పరిమాణము విషువ మండలమునందు ఉండుదానికి మూడింతలగును. రవి ఒక అహోరాతము లో పయనించు దూరము తొమ్మిదికోట్ల నలువది లక్షల యోజనములగును. (3150000*30=94500000)
దక్షిణదిశ నుండి మరలి సూర్యుడు విషువ మండలము (రాత్రింబవళ్ళు సమముగానుండు కాలమును ఏర్పరచు కాంతి వృత్త భాగము) లోనికి వచ్చియుండి అచటినుండి క్షీరోద సముదమునకు ఉత్తర దిశగా సంచరించ నారంభించునపుడు ఆ విషువ మండలపు యోజన పరిమాణము మూడుకోట్ల ఇరువది యొక లక్షలు; శ్రావణమాసమున రవి కాంతిమండలమునకు ఉత్తరమున గోమేద ద్వీపమునకు ఉ తరమున పయనించునపుడు అచ్చట మండలపు పరి మాణము ఒక కోటి ఎనుబది లక్షల ఏబది ఎనిమిది యోజనములు.
అప మండలము అనబడు నక్షత్రచక్రము దక్షిణ భాగము ఉత్తర భాగము మధ్య భాగము అని మూడు భాగము లగును. మధ్యభాగమునకు జరచవస్థానము-ఉత్తర భాగమునకు ఐరావత స్థానము దక్షిణ భాగమునకు వైశ్వానర స్థానము అని పేరులు. స్థానమును పథము అని కూడ వ్యవహరింతురు. ఒక్కొక్క భాగములో మరల మూడేసి ఉపభాగ ములు ( వీథులు) కలవు. వానిలో నాగ వీథి ఉత్తర భాగమందును అజవీథి దక్షిణ భాగమునందును వచ్చును. ఆశ్వని - కృత్తిక -భరణి - నాగవీథి; రోహిణి- ఆర్ద్ర-మృగశిర-గజవీథి; పుష్యమి, ఆశ్లేష-పునర్వసు-ఐరావత వీథి; ఈ మూడు వీథులును కలిసి ఉత్తర మార్గము; పుబ్బ-ఉత్తర-మఖ - ఋషభ వీథి; పూర్వాభాద్ర - ఉత్తరాభాద్ర - రేవతి - గో వీథి; శ్రవణము -ధనిష్ఠ - శతభిషము- జరద్గవవీథి; ఈ మూడును కలిసి మధ్యమమార్గము; హస్త-చిత్ర-స్వాతి-అజవీథి; విశాఖ. ఆనూరాధ జ్యేష్ఠ - మృగవీథి; మూల-పూర్వాషాడ-ఉత్తరాషాడ వై శ్వానర వీథి; ఈ మూడును కలిసి-దక్షిణమార్గము. [ఇచట ఇతర పురాణములలో వేరు విధముగా నున్న ది.ఎట్లన-మఖ-పుబ్బ-ఉత్తర-ఋషభవీథి; హస్త-చిత్ర.స్వాతి-గోవీధి; విశాఖ-అనూరాధ జ్యేష్ఠ జరద్దవవీథి; ఇది మధ్యమమార్గము; మూల-పూర్వాషాడ,ఉత్తరాషాడ-అజవీథి; శ్రవణము.ధనిష్ఠ శతభిషము -మృగవీథి; పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర-రేవతి - ఈ మూడును కలిసి వైశ్వానర వీథి అని యున్నది.
- అనువాదకుడు]
విశేషము: నాగ వీథి మొదలగు జ్యోతిర్వ్యవస్థ విషయమున శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు ఇట్లు చెప్పి యున్నారు.
'వ్యాసవాణి' (ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ వారి ప్రచురణ) యందలి ‘ఆర్ష విజ్ఞానము' అను వ్యాసము నుండి:
జ్యోతీరూపము
“ముమొదట విష్ణువాయు మత్స్య పురాణములు ఈ దేవయానమునకు రూపకల్పన మొనరించెను. పిదప భాగవ తాదులు దీని ననుసరించెను.
పథ మన నేమి? వీథి యన నేమి? ఒక్కొక్క గ్రహమునకు మూడేసి స్థానము లున్నవి. ఉత్తరమున ఐరా వతము-దక్షిణమున వైశ్వానరము-నడుమ జారదపము; ఇవి మూడును పథములు; లేక మార్గములు; ఈ మూడిటికిని మరల మూడేసి వీథులు కలవు; ఒక్కొక్క వీథిలో మూడేసి నక్షత్రము లున్న వి.
వాయు విష్ణు పురాణము లీ యెడ సమానములు; మత్స్య పురాణము 124 అధ్యాయమున 52 నుండి 60 వరకు శ్లోకములు చూచునది; అందు కొంచెము . మార్పు కలదు; నక్షత్ర వీథి మార్గములు: - ఆశ్వని-భరణి - కృత్తిక-నాగవీథి; 2. రోహిణి-మృగశిర-ఆర్గ-గజవీధి; పునర్వసు, పుష్యమి, ఆశ్లేష-ఐరావతవీథి; ఈ మూడును ఐరావతపథము; 1. మఖ - పుబ్ప. ఉత్తర వృషభవీథి; 2. హస్త.చిత్ర.స్వాతి.గోవీథి; 8. విశాఖ. అనూరాధ జ్యేష్ట-జారడవవీథి; ఈ మూడును జరద్దవ పథము; 1. మూల పూర్వాషాఢ - ఉత్తరాషాఢ అజవీధి; 2. శ్రవణము-ధనిష్ట-శతభిషము-మృగవీథి; 8. పూర్వాభాద్ర-ఉత్తరా భాద్ర, రేవతి- వైశ్వానర వీథి; ఈ మూడును వైశ్వానర పథము; ఇవి వరుసగా ఉత్తర మధ్యమ దక్షిణ పథములు;
గర్గ మతానుసారము భరణి - కృత్తిక స్వాతి. నాగ; రోహిణి-మృగశిర ఆర్ద-గజ; పున-పుష్య.ఆ శ్లే-ఐరావత; (ఉ-మా.) మఖ, పుబ్బ ఉత్తర-వృషభ, అశ్వ-రేవ-పూ- భా; ఉభా గోవీథి; శ్ర-ధశత జరద్దవ; (మధ్యమమార్గ); అనూ-జ్యే. మూల-మృగ; హస్త-విశా-చిత్ర.అజ; పూషా-ఉషా-వైశ్వానర; దక్షిణ మార్గ); భరణ్యాది మఖాంతము ఉత్తర మార్గము. పూర్వఫల్గున్యాది మూలాంతము మధ్యమమార్గము; పూర్వాషాఢాదిగ అశ్విన్యంతము దక్షిణమార్గము - అని వరాహ మిహిరుడు.” అని.
అపమండలపు రెండు ఆంచుల నడుమ దూరము లేదా అపమండల వృత్తవ్యాసము-ఇరువదియొక లక్షల మూడు వందల ముప్పది యోజనములు.
ఉత్తరాయన దక్షిణాయన రేఖల నడుమ అపమండలపు బయటి అంచులకు సమాంతరముగా ఉండుచోట ఏడు వేల ఇరువది యేడు - జనము లుండును. రవి ఆపమండలపు అంచులను దాటక ఉత్తరాయన దక్షిణాయన రేఖల నడుమ సంచరించుటతో ఉత్తరాయసమున ఈ మండలమునకు లోపలివైపుగాను దక్షిణాయనమందు ఈ మడలమునకు వెలుపలగాను సంచరించును. అతడు చేయు మండల వాస పరిమాణము పదునెనిమిది వేల ఏబది ఎనిమిది యోజనములు. సూర్యుడు పగళ్లయందు ధ్రువుని చక్ర నాభిగా చేసికొని కులాలచక్రము (కుమ్మరి-సారె) తిరుగు నపుడు .ఆ చక్రపు ఆంచు ఆ చక్రపు నాభి పై ఆధారపడియు ఒక వైపు క్రిందికి తొలుచు మరియొక వైపు పైకి లేచుచు తిరుగునట్లు తిరుగుచుండును. దానిచే రవి దక్షిణాయనమున ఎక్కువ దూరమును తక్కువ కాలములోనే అతి కమించును. అనగా పదుమూడున్నర నక్షత్రము లంత దూరమును (180 డిగ్రీలు) పండ్రెండు ముహూర్తముల కాలములోనే సంచ రించును. ఆ తరాయనమునందు గమన వేగము తగ్గి రవి ఇదే పదుడూడున్నర నక్షతముల దూరమును దాటుటకు పదు నెనిమిది ముహూర్తముల కాలము పట్టును. ఉత్తరాయనమునగాని దక్షిణాయనముగాని పగటి గతికి పోగా మిగిలిన కాలము రాత్రి గతికి పట్టును. మొ త్తము మీద అహోరాత్ర పరిమాణము ముప్పది ముహూర్తములు సరిపోవును. (30 ముహూర్తములు = 24 గంటలు).
కాలభాగాదిక థనమ్
రవి ఇట్లు కుమ్మరి చక్రపు అంచువలె క్రిందికి మీదకు వాలుచు లేచుచు తిరుగుచుండినను ఈ జ్యోతిర్మండలము నకు కేంద్ర స్థానమున చక్రపు నాభివలే నున్న ధ్రువుడు మాత్రము కుమ్మరి సారె నడుమ నాభి పై కుండ చేయుటకై ఉంచిన మట్టి ముద్దవలే వాలుట లేచుటలు అంతగా లేక గమనింప సాధ్యముకాని తక్కువ వేగమున తిరుగుచుండును. ఐనను అతడును ఆపమండలపు రెండు అంచులకు నడుమ మండలాకృతి నేర్పరచు భాగల గతితో కొలదిగ పొలుచు లేచుచు తిరుగుచుండును. అతని ఈగతి భేదము వలననే అతనితో బంధింపబడి. చక్రపుటంచువలే తిరుగు. సూర్యుని గతి ఉత్తరాయనమున పగలు మందముగను రాత్రి చురుకుగను దక్షిణాయనమున పగలు చురుకుగను రా, తులందు, మందము. గను సాగును.
ఇట్లు రాత్రింబవళ్ళను తన గతి విశేష వశమున విభజించుచు రవి దక్షిణమందలి అజ వీథియందు లోకాలోక పర్వతమునకు ఉత్తరమున లోక శ్రేణికి వెలుపలను వైశ్వానర వీథికి వెలుపలను కూడ సంచరించుచుండును. సూర్యుడు లోకాలోక పర్వతమునకు వెనుక వైపున నున్నపుడు అతని కాంతి ముందు వైపున ప్రసరించును. ఈ చెప్పిన ఆజవీథి మొదలగు వానికి ప్రక్క ఆంచుల కవతలగా లోకాలోక పర్వతము ఉన్నది. దాని ఎత్తు పదివేల యోజనములు. నక్షత్రములు చంద్రసూర్యులు గ్రహములు మొదలగు జ్యోతిర్దేశములన్నియు ఈ లోకాలోక పర్వతమునకు లోపలివై పున మాత్రమే నంచరించగలవు; తమ వెలుగును ప్రసరింపజేయగలవు. ఈ పర్వతమునకు అవతలివైపు ఆలోక ము వెలుతురు లేదు. ఇట్లు దీనికి ఒక వైపున ఆలోకము చూపు-చూచుటకు అవకాశము-(ప్రకాశము) ఉండుట చేతను నురియొక వైపున అది లేకపోవుట చేతను ఈ పర్వతమునకు లోకాలోకమని పేరు ఏర్పడేను. లోకము-వెలుతురు; ఆలోకము-చీకటి; రవీ. నంచారము ఈ రెంటికిని సంధానము కలిగించును. కనుక అతనిచే చెలుగు చీకటులకు సంధి నము కలిగించబడు సమయమును 'సంధ్యా' కాలము అందురు. ఉషా-వ్యుషా (వ్యుషి) అను ననుయముల ఆంతరమునకు (మధ్యకాలమునకు) 'సంధ్యా' అని పేరు. ఏలయన. ' ఉషా' అనగా రాత్రి; వ్యుషా అనగా పగలు; ఈ రెంటి నంది కాలము ‘సంధ్యా' కాలము; (ఇది వైదిక సంప్రదాయానుగతమగు వ్యుత్పత్తియును అర్థమును.)
ముప్పది 'కల'ల కాల పరిమాణమును ముహూర్తమందురు. పదునైదు ముహూర్తములు దీవ పరిమాణము; (ఇదీ విషువ దినమున); కానీ పగటి పరిమాణమునందు పెరుగు తరుగులు వచ్చుటచే ఈ పరిమాణములో మార్పులు ఉండును. సాధారణముగా సంధ్యా కాలము (ఇంచుమించు) ముహూర్తకాలమగును. దాని పరిమాణమునందును కాల భేదమును దేశ భేదమును రవి గతి భేదమును బట్టి మార్పులు కలుగవచ్చును.
సూర్యుడు లేఖ మీదకు (క్షితిజము = లేఖ=Horizon) వచ్చినది మొదలు మూడు ముహూర్తముల కాలము ప్రాతః కాలము; తరువాత మూడును సంగవ(మ) కాలము; తరువాత మూడును మధ్యాహ్నము; తరువాత మూడును ఆపరాహ్ణము; తరువాత మూడును సాయంకాలము; పగటి పరిమాణమునందును రాత్రి పరిమాణమునందును పెరుగు తరుగులు వచ్చినను సాధారణ విషువ దిన పరిమాణము ఈ పదునైదు ముహూర్తములే; ఉత్తరాయన దక్షిణా యన క్రమములో దీని మార్పులు లోగడ చెప్పబడినవి. ఆ అయన భేదములను బట్టి పగలు రాత్రిని తనలోనికి తీసి కోనుటయు.రాత్రి పగటిని తనలోనికి తీసికొనుటయు జరుగును. శరద్వసంత ఋతువుల నడుమను వసంత శరద్ ఋతుపుల నడుమను మొ త్తము రెండు మారులు విషువ దీనములు వచ్చును,
(*సంతత్యా తపసా చైవ మఠ్యాదాభిస్మృతేన చ)
ఆలోకము- వెలుగు- కలది- లోకము అనబడును; ప్రకాశములేని దానిని ప్రకాశముకాని దానిని అలోక మందురు. ఇట్టి రెండు స్థితులును కలది లోకాలోక పర్వతము. దీని నడుమ (లోకాలోక మనేడు చక్రవాళ పర్వతమునకు నడుమ) లోకపాలురు సలుపుచున్నారు. వీరు భూత సంప్లవ-ప్రాకృతిక ప్రళయకాలము వరకు ఉండి లోక ప్రవృత్తికి ప్రవర్తకులుగా నుందురు. వీరు ఎవరనగా1. వైరాజుడు-విరా టత్వమునుండి జనించిన సుధాముడు 2.కర్దమ ప్రజా పతి 3. హిరణ్యరోముడనేడు పర్జన్యుడు 4. కేతుమాన్- ఆను రాజశ్రేష్ఠుడు అనువారు; వీరిలో ప్రతియొక రును ద్వంద్వము లకు సంబంధించిన చిత్తవృత్తులును వానివలని బాధలును లేని ద్వంద్వాతీ-కులు; అహంకార మమకారాద్యభిమానములు లేనివారు; పరిగ్రహము.తమకు ఇదిలేదని ఏ వస్తువునైన ఒకరినుండి ఆడిగి కాని అడుగక యేకాని తీసికొనుట-లేనివారు; వీరు ఈలోక మధ్యమందు చతుర్దిశలయందుండి లోక ప్రవృత్తి నిర్వర్తించుచుందురు.
ఉత్తర దిశ యందు దేవతల .కాశ్రయమగు ఆగ స్త్య శృంగముక లదు. . ఆది వీరికాశ్రయము. వీరందరును ప్రవృత్తి మార్గ ప్రవర్తకులై పితృయాన పథ ప్రవృత్తులై యుందురు. ఆ ప్రవృత్తికి మూలమయినదే ఈ కాలవ్యవస్థ యును కాలనియమము నాశ్రయించిన కర్మ వ్యవస్థయును. ఈ ఖగోళ వ్యవస్థను తెలియుట వలన ఒక ప్రయోజనము ఈ కర్మ మార్గ ప్రవృత్తి.
ఈ యంశమును సంప్రదాయము ఇట్లు ప్రతిపాదించుచున్నది.
వైశ్వానర పథమునకు వెలుపల పితృయాణమను మార్గము కలదు. ప్రజా కాములు తమకు పుత్ర పౌత్రాది సంతతి కావలయునని కోరువారు) అగు అగ్ని హోత్రోపాసకులు (శ్రిత కర్మానుష్టాతలు) అగు ఋషులు ఆ మార్గమునందు ఉందురు. వీరు లోక సంతానకరులు సంతానము.ఎడ తెగక కొనసాగుచుండుట) గా నుందురు.. వీరు "పితృయాణ మార్గమందుండి భూతారంభకారులు (పర మేశ్వర మాయాశ కి వశమున ఆయా జీవుల కామ కర్మానుసారము భూత భౌతిక సృష్టిని కలిగించునది) అగు కర్మలను ఆచరించుచు తమతమ ఆషములను కామనలను ఆశ్రయించి తమకు ఆయా ఇహపర లోక సుఖములు కావలెనని కర్మల ననుష్ఠించుచుందురు. వీరు అనుసరించు ఈ ప్రవృత్తి మార్గము దక్షిణ మార్గము. వీరు యుగయుగమున ఉత్కృష్టమగు వైదిక ధర్మమును ఆచరింతురు. దానిని లోకమున ప్రతి ప్లింతురు. ఈ ధర్మ ప్రవర్తనమునకై తపస్సును (దీనినే జ్ఞానమని శ్రీశంకర భగవత్పాదాదులనిరి.) చోదనాభిశితమయిన కర్మానుష్టాన మార్గ మును పాటింతురు. - ('స్వర్గము కోరువారు జ్యోతిప్టోమయాగముతో దేవతల నారాధించవలెను.') ఈ మొదలగు రూపములతో నుండు కర్మాచరణ ప్రేరణమును చోదన, అందురు. ఈ చోదన నాశ్రయించిన మార్గము చోదనాభిశిత మార్గము). వీరి చిత్తములందు ఇచా ద్వేషములు. మైథున ప్రవృత్తి.కలవు. వీరు కామమునకు.కర్మాను షానమునకు వశులై విషయ సుఖములు సేవించుచు ఉ తమ జీవులు కూడ అధమ జీవుల గృహము దేహము) లందును జనింతురు; అధమ జీవులును ఉత్తమ జీవుల గృహము- (దేహము) లందు జనింతురు; ఈ విధముగ వీరు ప్రాకృతిక ప్రళయము జరుగు వరకు జన్మ మరణ పరంపర లో ఆవృత్తి. నొందుచుందురు.
కామనతో హిరణ్య గర్భోపానన చేసినందున సూర్యుని దక్షిణాంశ మగు చం దలోక మువరకు మాత్రమే పోగలుగు దక్షిణ మార్గాశ్రితులు అగు ఋషులు గృహస్థులగు వారు ఎనుబది ఎనిమిది వేలమంది యనియు వీరు ప్రాకృతిక ప్రళయ కాలమువరకు ఇట్లు సంసారమున ప్రవృత్తులగుచుందురనియు గణన చేయబడినది. వీరందరును : శ్రాత కర్మానుష్ఠాన పరులయి శ్మశానములను ఆశ్రయించిరి. ఆది ఎట్లనగా-లోక వ్యవహారమును ప్రవర్తింపజేసి జనులను ఉద్దరించుటకును భూతముల ప్రకృతి ధర్మములగు త్రిగుణములకును వశులై ఇచ్ఛా ద్వేషములకు, వశీభూతులయి మైథున ప్రవృత్తియందు ప్రవర్తిల్లీ ఆయా ఇంద్రియ ప్రవృత్తులవలన కలిగిన కోరికలకు వశులయి విషయ సుఖముల ననుభవించి వీరందరును కర్మానుష్టానము వలన కలుగు సిద్ధిని మాత్రము పొంది శ్మశానములను (జన్మ మరణ ప్రవాహరూప. సంసార గతిని మాత్రము) పొందగలిగిరి. అమృతత్వమును పొందజాలక పోయిరి. ఇట్లు ప్రజా కాములగు మరీచ్యాది సప ఋషులు (ప్రజాపతులు) ఇట్లే లోకమున ‘ద్వాపరములయందు’ (అపవర్గము కలుగు నిశ్చయము లేని మార్గమునందు) జన్మించిరి.
ఎవరు లోకమునందు తమ పుత్ర పౌతాది రూపమగు. సంతానము కొనసాగవలెనను కోరిక లేక సంతతి యనిన అసహ్యపడిరో వారు మృత్యువును జయించి అమృతత్వమును పొందిరి. . ఇట్లు ఊర్ధ్వరేతస్కులు తమ రేతస్సును అధోమార్గమున మైథునమునకై వినియోగించనివారు) కూడ ఎనుబది ఎనిమిది వేలమంది కలరు. వీరందరును లోక ప్రవృత్తి హేతువులగు శ్రాత కర్మానుష్టానములను ఆచరించక పోవుట. మైథున ప్రవృత్తిని విడుచుట ఇచ్చాద్వేషములను విడుచుట. భూతారంభమునకు హేతువులగు ప్రవృత్తులను (ఇష్టా పూ ర కర్మాచరణమును వదలుట - మొడల విధానముల ననుసరించి శుద్దులె ఉత్తరాయన మార్గమున హిరణ్య గర్భలోక మును చేరి అచ్చట ప్రాకృతిక ప్రళయకాలము వరకు నిలిచియుడి హిరణ్యగర్భునితోపాటు క్రమశః ! ముక్తులై అమృతత్వమును పొందుదురు. భూతసంప్లవకాలము (ప్రాకృతిక ప్రళయము) వరకు హిరణ్యగర్భునియందుండి తరువాత ముక్తి పొందు ఆమృతత్వమునకు ఆభూతసంప్లవస్థానమగు అమృతత్వమని వ్యవహార ము. ఈ ఊర్ధ్వ రేత సులగు నిష్కామ కర్మానుష్టాతలకు కలుగు ముక్తి ఈ విధమయినది. వీరును నపునర్మార్గగాములే-పునరావృత్తిలేని మార్గమునకు ముక్తి మార్గమునకు పోపువారే. వీరికిని తై లోక్య స్థితి హేతు భూతమగు కాల స్వరూప జ్ఞానము కావలసినదే. ఇట్టివారు చేసిన భ్రూణహత్య సాంగ వేదాధ్యయనము.త ద్విహిత కర్మానుష్టానము చేసిన ఉత్తమ బ్రాహ్మణుని చంపుట) వలన కలుగు పాపము కాని అశ్వమేధాదుల వలన సంపాదించిన పుణ్యముకాని ప్రాకృతిక ప్రళయము వరకు ఉన్న ను ఆ సమయావధితో వీరికవి నశించును. ఊర్ధ్వ లోకముల నడుమ ధ్రువుని లోకమున ఋషులతోపాటు వీరు శాశ్వత స్థితి నొందుదురు. ఇదియే అంతరిక్ష లోకమున (దానికి పైగా సువర్లోకమున) ధ్రువునితో నంబడ్డు డెన బాస్కరుని రూపమున నున్న స్థానము. ఇదియే విష్ణుని తృతీయపాదనము. ఈ విష్ణుని పరమపదమును చేరినవారు జస్మ మరణ జనితమగు శోకమును మరిపొందరు. కానీ లోక సుఖ) కాంక్ష లగువారు ధ్రువుని ధర్మప్రవృత్తికి.లోక ప్రవృత్తికి. హేతువు స్థానమును మాత్రము చేరి సుఖింతురు. ఈ తత్వమును పెరుగుటకును ఈ జ్యోతిర్వ్యవస్థా జ్ఞానముపయోగించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఖగోళ వర్ణనమున సూర్య సంచారాది కథనమను నూట ఇరువది మూడవ అధ్యాయము.
