మత్స్య మహా పురాణము

Table of Contents

121 - శాక - కుశ - క్రౌంచ శాల్మల ద్వీపముల వర్ణనము

 [వాయు పురాణము మొదలగు వానియందు 1. జంబూద్వీపము -దాని చుట్టు క్షార సముద్రము 2. ప్లక్ష (గోమేడక) ద్వీపము- దానిచుట్టు ఇక్షు సముద్రము 3. శాల్మల ద్వీపము దాని చుట్టు సురా సముద్రము 4. కుశ ద్వీపము- దాని చుట్టు ఘృత సముద్రము 5.క్రౌంచ ద్వీపము-దానిచుట్టు దధి సముద్రము 6. శాక ద్వీపము-దానిచుట్టు క్షీర సముద్రము 7. పుష్కర ద్వీపము-దాని చుట్టు స్వాదుజల (తీయని నీటి) సముద్రము-అని యున్నది. ఈ మత్స్య పురాణము నందు వరుస వేరు విధముగా నున్నది.]

శాకద్వీప వర్ణనము

 సూతుడు ఋషులతో ఇట్లు చెప్పనారంభించెను: శాక ద్వీపమునకు సంబంధించిన ఆయా విషయముల నిశ్చ యమును సంప్రదాయమందున్న విధమున చెప్పెదను. నేను చెప్పుచుండ-ద్విజోత్తములారా! శాక ద్వీప (విషయ)మును సమగ్రముగా తెలిసికొనుడు. జంబూద్వీపపు వ్యాసమునకు ద్విగుణము శాక ద్వీప వ్యాసము. వ్యాసమునకు మూడింతలు దాని చుట్టుకొలత. దీనికి రెట్టింపు పరిమాణము కల క్షీర సముద్రము దీని చుట్టు నున్నది. అచటి జనపదములు పుణ్యవంతములు. అచటి జనులు దీర్ఘాయువులు; క్షమా తేజోవంతులును; అచట కరవులు ఉండనే ఉండవు.

ఆ శాక ద్వీపమునందును మణి భూషితములును శుభములు నగుఏ డేసి పర్వతములు కలవు. దీనియందే కాదు; శాక ద్వీపాది సర్వ ద్వీపములందును ఏడు ఏడుగానే పర్వతాదికము కలదని తెలియవలెను. ఇవి ప్రతి దిక్కు నందును ఋజువులై వంకరలు లేక) ఆయతములై దీర్ఘ చతురస్రాకారమున) అమరి ఒక వర్షమును మరియక వర్షమునుండి వేరుపరచు వర్ష పర్వతములుగా ఉన్న వి. ఇవి రత్నములకు ఆకరములు గనులవంటివి. ప్రతి దానికిని రెండేసి పేరులు కలవు. ఇవి సారవంతములు; మహాబలములు. ద్వీపపు నిడివికి తగినట్లు అనుపాతములో ప్రతి దిక్కునందును సమముగా పుట్టియున్నవి. ఇవి ప్రతియొక్కటియు లోపలివై పు (జంబూ ద్వీపపు చుట్టునున్న) లవణ సముద్రమునను వెలుపలివైపు క్షీర సముద్రమునందును చొచ్చుకొనియున్న వి. శాక ద్వీపమందలి దేవర్షి గంధర్వయుత దివ్య మహాచలముల నేడింటిని చెప్పెద; వినుడు.

1.మేరువు-ఉదయము. ఇది బంగారు కొండ; తూర్పునకు పొడవుగా సాగినది. అచట వేలకొలది మేఘములు బాగుగ వానలు కురియుచుండును;  2. జలధారము-చంద్రము; ఇది మహాపర్వతము; సరౌషధియుతము; ఇంద్రుడు. దీనినుండి ఉత్తమ జలమును (తన మేఘములకై) గ్రహించుచుండును.  3. నారద-దుర్గము; ఇదియు మహా పర్వతము; పూర్వము నారద పర్వతులను గంధర్వులు దీనియందు జన్మించిరి. 4. శ్యామము -దుందుభి; ఇదియు మహాపర్వతము; నల్లనిది; దీని మూలముననే ఆ ప్రాంతపు జనులు పూర్వము నల్లని వారయిరి. దేవతలిచట దుందుభి రాక్షసుని కొట్టి-శబ్దము వానినుండి ఉత్పన్నమగుటయే మరణముగాగల ఆ దానవుని చంపిరి. ఈ కొండ నడుమ రత్న పంక్తులును శాల్మల వృక్షమును కలవు 5. ఆస్తగిరి-అమృతము; తన తల్లి దాస్యము విడిపించుట కై గరుడుడు దేవతలనుండి హరించి తెచ్చిన అమృతమును ఇచ్చటనే పాత్రయందు నింపి భద్రపర చేను.  6. ఆంబికేయము - సుమనన్; దీని యందే వరాహ విష్ణువు హిరణ్యాక్షుని సంహరించేను. 7. విభ్రాజము-కేశవము; ఇది స్పటిక మణులతో వ్య ప్రము. దీనినుండియే వాయుపు వీచుట ఆరంభమగును. విభాజతే- మిగుల ప్రకాశించునది-కావున దీనికే పేరు.

వీనితో ఏర్పడిన వరములను ద్విజోత్రము లారా! ఇదే వరుసలో చెప్పెదను; వినుడు; గిరులకువలెనే వరము లకును రెండేసి పేరులు గలవు.

1.ఉదయవర్షము -జలధార వరము; ఇది పేగునకు తగినట్లు జలధారలతో నిండి నదగుటచే ఆనావృష్టి భయము లేనిది. 2. సుకుమారము. శైశిరము 3. కౌమారము- సుఖోదయము. 4. ఆనీచకము - ఆనందకము కుసుమోత్త (త్క) రమ - సోమక ము. 6. మైనాక ము - క్షేమక ము; 7.మహాద్రుమము-ధ్రువము.

ఈ ద్వీపపు వైశాల్యము పొడవు వెడల్పులు జంబూ ద్వీపపు వైశాల్యము పొడవు వెడల్పుల నిష్పత్తి ననుసరించి అనుపాతములో గణన చేసి తెలిసికొనవలెను. ఈ ద్వీపపు నడుమ శాకము (చాగ చెట్టు) అను వనస్పతి (పూవులు పూయక యే కాయలనిచ్చు) జాతి మహావృక్షము కలదు. ఇచటి ప్రజలు దీని ననుజీవింతురు. ఈ ప్రజలతో సమముగా ఇచట దేవగంధర్వ-సిద్ద - చారణులు జీవించుచు సంచరించుచుందురు. చాతుర్వర్ణ్యులు కల పుణ్యజనపదము లిచ్చట గలవు.

ఇదే వర్ష పర్వతముల-వర్షముల - వరుసలో ఇచట రెండేసి నామములు గల నదులు గలవు. గంగయే ఏడుగా అయి ఈ సప్తనదులుగా నున్నది. ఇవి అన్ని యు హాయిగొల్పు నీరు కలిగినవి; . సముద్రములో కలియును 1. సుకుమారి-తప స్త (అనుత) ప్ర;  2. కుమారి తపస్సిద్ధ; 3. న మంద-పావని; 4. శిబిక త్రి(ద్వి) విధ; 5. ఇను- కుహూ; 6. వేణు (వైశ్య)క-అమృత; 7. సుకృత-గభ సీ.

శుభకర జలము గలిగిన మహాభాగలగు ఈనదులు శాకద్వీప నివాసియగు సర్వజనుని పవిత్రుని చేయుచున్న వి. ఎన్నో నదీనద సరస్సులు వీనితో చేరుచుండును. ఇంద్రుడు బహూచక మును స్రవించుచు వర్షించుచుండుటచే ప్రభవించి ప్రవహించు ఆ నదీనదుల నామములను పరిమాణమును చెప్పశక్యము కాదు. అవి పుణ్యకరములు - శ్రేష్టములు; బౌనిని (వాని జలమును) త్రోవుచు అచటి జనపదజనులు హరముతో నుందురు. అచటి నదములకును - దానితోపాటే అచటి జనుల వంశము వారికిని - ప్రమోద.శివ - ఆనంద-సుఖ- క్షేమక -ప్రభృతి నామములు ప్రసిద్ధములు; ఆ ఏడు దేశ (వరముల జనులును వర్ణాశ్రమాచార ములు ఆరోగ్యము బలము కలిగి అనుచిత మరణములు లేకయుందురు. అచటి జనుల యందు అవసర్పిణీ ప్రవృత్తి (ఉన్న దానికంటే దిగజారి పతనావస్థకు పోవుట) కానీ ఉత్సర్పిణీ ప్రవృత్తి (సన్మార్గ ప్రవృత్తికి ఎదురు నడచుట -త్రోవ తప్పుట) కానీ లేవు. చతుర్యుగ వ్యవస్థలేదు; శాకద్వీపాది షట్ ద్వీపములందును సదా త్రేతాయుగమునందువలె ధర్మ వ్యవస్థ ఉండును. స్వాభావికముగ మనము మన అలవాటు ననుసరించి కాల విభా గమును ఆదేశ విభాగములందును అన్వయించవలసినదే కాని వా స్తవమున అచట ఇవి లేవు. అచట వర్ణాశ్రమ సంకరము మాయ లోభము ఈర్య అసూయ విద్బయము ఇతరులు తమ కపకారము సేయుదురను భయము దండము దండ్యులు దండించువారు లేరు. స్వధర్మ వర్తనముతో ఎల్లరు ధర్మజులే పరస్పర రక్షణము చేయుచు ధర్మమును అన్యధా (విలక్షణ మగు ఏకైక విధమున) పాటించువారగుటచే అచటి జనులు ఏకాంత సుఖులు. (సుఖము తప్ప దుఃఖమును ఎరుగరు) (ఇది Scithya ప్రాంతమని గుర్తింపవచ్చును.

కుశ ద్వీపవర్ణనమ్

కుశద్వీప వర్ణనము

మూడవదగు కుశ ద్వీపము శాక ద్వీపము చుట్టును గుండ్రనై నదీజలములతో సర్వవిధ భేరిక ధాతువులతో వివిధ వర్ణములు కలవై మణులతో వృక్షములతో అలంకృతములయి ఇంకను వివిధ రూపములు కలవై మేఘములవలె కనబడు పర్వ ములతో వ్యా ప్రము. జనపదములతోను పుష్పఫలో పేతములగు వృక్షములతోను రమ్యము; అంతటను ధనధాన్య సహితము. ఎడతెగక ఎప్పుడు ఎల్లయెడల సకల పుష్పములతో సర్వరత్నములతో గ్రామ్యములు ఆరణ్య ములునగు పశువులతో కూడియుండునది. ఇది ద్వీపముల నామక్రమానుసారము న సంగ్రహము గా చెప్పదగిన విష యము. ఇక ఈ ద్వీప విషయము అంతయు విస్తరముగ చేప్పెదను; వినుడు; కుశ ద్వీపమునకు చుట్టును సురా సముద్రమున్నది; వైశాల్యములో ఇది శాక ద్వీపమునకు ద్విగుణము; దీనియందు రత్నములకు జన్మస్థానములగు వ్వోతములును అట్టివే నదులును కలవు. ఈ వర్ష పర్వతములు కల వర్ష ములును ఏడేసి చొప్పున రెండేసి పేరులు కలవిగా ఉన్న వి.

పర్వతములు: 1. సూర్యునితో సమమగు-కామదము-విద్రుమోచ్చయము;  2. సర్వధాతుమయ శృంగములతోను శిలాజాలములతోను కూడిన-ఉన్నతము- హేమము;  3. హరితాళ (ఆరిదళము) మయశృంగములతో ఆ ద్వీపము నన్ని వైపు లను కమ్మిన కాలాంజనమయమగువలాహక ము-ద్యుతి; 4. విశల్యకరణి మృతస. జీవని అను ఓషధులు కల-ద్రోణము-పుష్పవాన్; 5. సారవంతమయి దివ్య పుష్పఫలములతో దివ్యలతలతో కూడినది అగు-కంకము-కుశేశయము; 6. మేఘ సదృశము-నీటినుండి జనించిన మహిషుడను అగ్ని కి పోనస్థానము (చూ. 51 అ.) అగు మహిషము.హరి; 7. సర్వ రక ధాతు యుక్తమగు-కకుద్మాన్ -మందర ము; మన్ -అనగా జలమును-దర.చీల్చునది కావున దీనికి ఈ పేరు; ప్రజాపతి ప్రజల నిమిత్తమై స్వయముగా ఇంద్రునకు ఇచ్చిన అనేక రత్నములను అతడు ఈ పర్వతమునందుంచి కాపాడుచున్నాడు. ఈ పర్వతముల నడిమి వ్యాసము శాకద్వీప పర్వతముల ఆంతర విష్కంభము (నడిమి వ్యాసము)నకు ద్విగుణము.

వర్షములు: 1. కామదము-ఉన్నతము; 2. లోహితము-వేణు మండలకము  3. జీమూతము-రథాకారము; 4. హారికము-లింపకము; 5. కురు-మతిమత్; 6. మహిషము - ప్రభాకరము; 7. కకుద్మత్ - కపిలము.

నదులు: ఇవి అన్నియు పుణ్యజలవంతములు: 1.ధూతపాపయోని; 2. సీత-నిశ; 3. తృష్ణ-పవిత్ర; 4. హోదిని-చంద్రస్; 5. విద్యుత్ -శుక్ల; 6. షండా.విభావరి; 7. మహతీ ధృతి; వీటియందు అచట ఇంద్రుడు తరచుగా కురియించెడి వర్షముల వలన ఏర్పడేడి వందల-వేల-కొలది నదులు కలియు చుండును.

 [శాశ్వత సంప్రదాయాగతమగు శాకద్వీప విస్తారాదికము చెప్పబడినదిక దా! క్షీర సముద్రము శాక ద్వీపమును చంద్రుడువలే చుట్టియున్నది. అంటిని.]

క్రౌఞ్చద్వీపవర్ణనమ్

 శాల్మలద్వీపవర్ణనమ్

క్రౌంచ-శాల్మల ద్వీపవర్ణనము - క్రౌంచ ద్వీప వర్ణనము

ఇక మీదట క్రౌంచ ద్వీపపు యథాస్థితిని వివరింతును. కుశ ద్వీపపు వైశాల్యము కంటె క్రౌంచ ద్వీప వైశాల్యము ద్విగుణము. దీనిచుట్టు చక్రము చుట్టు నేమి బండి పట్టాయును దానికి లోపల నుండునదియు చక్రపు ఆకులను అమర్చిన పూటీలు అనబడు దారు ఖండముల అమరికతో ఏర్పడినదియు అగు వృత్తాకృతియును) వలె వృత్తాకృతి గల ఘృతోదక సముద్రము చుట్టియున్నది. ఈ సముద్రము *విస్తారము (మండలము) సందు క్షీరోదక సముద్రము నకు ద్విగుణము. దీనియందలి నరులు శ్రేష్ఠులు.

దీనియందు వర్ష పర్వతములు: 1. క్రౌంచము 2. పావకము 3. అండకారము 4. దేవ వాన్ 5. దేవకోటి 6. గోవిందము 1. పుండరీకము. ఇవన్నియు రత్న మయములును ఒక దాని నడిమి వ్యాసము కంటే ద్విగుణమగు వ్యాసము (విష్కంభము) కలవియు.

దీనియందలి వర్షములు: 1. కుశ లము 2. అనుగము 8. ఉష్ణము 4. పావనకము 5. ఆండకారము 6. ముని దేశము 1. చంద్రనిఃస్వనము.

ఈద్వీపము రక్తాంత-రంగ (Apple)-నారంగ (Orange)-ప్రియంగు-వృక్షములతో వ్యాప్తము. సిద్దులు చారణులు దేవతలు తరచుగా కలిగిన శుచియగు దేశ మీది.

ఈ ద్వీపమున ప్రతి వర్షమునందును వ్యాపించి ప్రవహించు నదు లేడు గలవు. 1. గౌరి 2. కుముద 3.సంధ్య 4. రాత్రి 8. మనోరమ 6. ఖ్యాతి 7. పుండరీక; ఇవి అన్ని యు గంగా భేదములే; దీని సమీపముగా ప్రవహించుచు ఈ ప్రధాన నదులలో కలియు చిన్న నదులు నదములు వేలకొలది అట గలవు. ఇవన్నియు బహూదక ములు; ఆచటి దేశ భేదములు. వాని స్వభావము మొదలగునవి సవిస్తారముగా చెప్పవలెననిన నూర్ల ఏండ్లయినను చాలవు. అచటి ప్రజలకు ఉపద్రవములు కాని అచటివారు ప్రళయమునకులోగా నశించుట కాని యుండదు: (ఈ క్రౌంచద్వీపమునే మధ్యధరా సముద్ర(Meditarranean sea) (ప్రాంతమని గుర్తి పవచ్చును.)

(*ఆర్ష సంప్రదాయానుసారము ఇచట శ్లొకమున విస్తార-మండల శబ్దముల పర్యాయపదములు)

శాల్మల ద్వీపవర్ణనము

ఇక మీదట శాల్మల ద్వీప విషయము తెలిపెదను; తెలిసికొనుడు. శాల్మల ద్వీప విస్తరము క్రౌంచ ద్వీప విస్తరమునకు ద్విగుణము; దీని చుట్టును దధిసముద్ర మున్నది. అచటి జనపదములు పుణ్యవంతములు; జనులు చాల కాలము జీవింతురు. వారు క్షమా తేజోవంతులు. వారు కరవులే ఎరుగరు.

దీనియందు మూడు పర్వతములు గలవు. మొదటిది సుమనస్ అనునది. ఇది సూర్యకాంతితో ప్రకాశించు చుండును. నడిమిది. రెండవది-బంగారుతో ఏర్పడి పచ్చని వన్నె తో ప్రకాశించునది; దీని పేరు సర్వసుఖము; దీనియందు సర్వౌషదులును గలవు; మూడవది రో (లో)హితమను పర్వతము; ఇదీయు బంగారుతో ఏర్పడినదే; కాని తుమ్మెద రెక్కల సంధివలె (పసిమివన్నెతో), ప్రకాశించుచుండును. ఇది మహాదివ్యమగు గిరివర ము; ఈ పేరులతోనే మూడు దేశము లా ద్వీపమున గలవు; మొదటిదగు సుమనసనను దేశము కుశలములతో కూడినది; సర్వసుఖమను దేశము సుఖములతో ఉదరము ( అన్నింటిలో గొప్పది) సుఖముల వృద్ధి కలదియును; మూడవ దేశము పర్వతపు పేరుతో రోహితము అని మాత్రమే కాక రోహిణము అనియు ప్రసిద్ధ నామము కలది.

స్వయముగా ప్రజాపతి ప్రజలయందు ప్రసన్నుడై ఇచ్చిన నవజాతులకు చెందిన రత్నము లనేక ములను ఇంద్రు డిచ్చట నుంచి కాపాడుచుండును. వరము కాని శీతము ఉష్ణము కాని ప్రాణులకు అప్రీతికరమగు మరి ఏది కాని వర్ణాశ్రమముల మాట కానీ శాల్మల గోమేద పుష్కరము లనెడు మూడు ద్వీపములందును ఉండదు. (కర్మ) దీక్ష - దండము ఈర్ష్యాసూయాభయములు అట లేవు. కొండ వాగులు సెలయేళ్లు ఇచ్చు జలమును భూగర్భము చీల్చుకొనివచ్చు ఉద్భిదజలమును ప్రాణుల కుపయోగపడును. స్వయముగ (అప్రయత్నముగ) అచటి జనులకు షడ్రసభోజనము ఎదుటికి వచ్చి లభించును. అచట ఆధమో త్తమభేద వవస్తలు లోభము పరిగ్రహము కలవారు ఇచ్చుట లేనివారు పుచ్చుకోనుట) ఆచట లేవు. (కలవారు లేనివారు అను భేదములే అచట లేవు.) అచటి జనులు శోకరహితులు బలవంతులు సుఖము తప్ప ఎరు గనివారు. మానసయోగసిద్ధి నంది వారు ముప్పదివేల సంవత్సరములు జీవింతురు. శాల్మల గోమేద పుష్కర ద్వీపముల మూడిటియందును ఇదే విధముండును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున భూగోళ వర్ణనమున శాక కుశ క్రౌంచ శాల్మల ద్వీప వర్ణనమను నూట ఇరువది యొకటవ అధ్యాయము.