మత్స్య మహా పురాణము

Table of Contents

79 - మందార సప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇక ఇప్పుడు సర్వపాపనాశకము సర్వకామప్రదము పుణ్యదము నగు మందార సప్తమీ వ్రతమును తెలి పెదను. మాఘ శుక్ల పంచమినాడు లఘువుగా భుజించవలెను. షష్టి నాడు పలు దోము కొని స్నానాదికమును చేసికొని పగలంతయు ఉపవసించి రాత్రి మందార కుసుమమును ఆహారముగా తీసికొనవలెను. సప్తమినాడు బ్రాహ్మణ భోజనము జరుపవలెను. ఆనాడు ఎనిమిది బంగరు మందార పుష్పములను.పద్మహస్తుడగు మనో హరుడగు పురుషుని బంగారు ప్రతిమను అష్టదళ సువర్ణ కమలమును రాగి పళ్లెరములో నూవులు పోసి దాని పై నుంచ వలేను. పిమ్మట ఆ అష్టదళ పద్మమునందలి దళములలో తూర్పునుండి ఈశాన్యము వరకు గల ప్రతియొక దళమును ఈ ఎనిమిది బంగారు మందార కుసుమము లతో వరుసగా- 1. భాస్కరాయ నమః-ప్రాగ్గళం పూజయామి; 2. సూర్యాయ నమః- ఆగ్నేయ దళం పూజయామి; 6. అర్కాయ నమః-దక్షిణ దళం పూజయామి; 4. అర్యమే నమః నైరృత, దళం పూజయామి; 6. వేదధామ్నే నమః పశ్చిమ దళం పూజయామి; 6. చండ భానవే నమః వాయవ్య దళం పూజయామి; 7. పూ షే నమః ఉత్తర దళం పూజయామి; 8. ఆనందాయ నమః ఈశాన్య దళం పూజయామి; ఆని పూజించవలెను. స్వర్ణ పురుష ప్రతిమను పద్మకర్ణికయందుంచి ' సర్వాత్మనే నమః' అని పూజించి నూతన శ్వేతవస్త్రము చుట్టి భక్ష్యమాల్య ఫలాదులతో అర్చించి అవి అన్ని యు వేద వేత్తయగు విప్రునకు దానమీయవలయును. ఆ రాత్రి తైల లవణములు (కారము పులుపు) లేకుండ ప్రాజ్ముఖుడై భుజించి మౌనము పాటించవలెను.

ధనమునకై లోభించక యథాశక్తిగ ఇట్లు ప్రతిమాసము సంవత్సర కాలము చేయవలెను. ప్రశాంతమున ఈ సామగ్రులను కలశముతోను గోవుతోను కూడ విప్రునకు దానము ఈయవలెను. దీనిచే సకల సంపదలు కలుగును. “మందారనాధుడు మందార కుసుమము భవనముగా కలవాడు సగు రవీ! మమ్ము సంసార సాగరమునుండి తరింప జేయుము.” అని ప్రార్థించుచు ఇట్లు మందార సప్తమీ వ్రతము చేయు నరులు పాపముక్తులై స్వర్గమున ఇంద్రునితో కూడి ఆనందింతురు: పాపము లనెడు చీకటితో నిండిన సంసార మనెడు రాత్రియందు దీపము వంటి 'ఈ వ్రతమును ఆధార ముగా తీసికొనినచో జారీ పడరు. ఈప్సితార్థ ఫలప్రదమగు దీనిని వినినను. చదివినను తెలిపినను అట్టివాడును పాపముక్తు డగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మందార సప్తమీ వ్రతమను డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.