మత్స్య మహా పురాణము
149 - తారకోపాఖ్యానము - కుబేర జంభాసుర యుద్దమ్
లేచి కాలదండమును కొండను పోలిన ముద్దరమును చేబూని ఘోర సంకల్పుడే పెదవులు కొరుకుచు రథము పై శీఘ్ర ముగా పోయి యముని సమీపించెను॥ రౌద్రమగు ముద్ధర మును మహావేగమున త్రిప్పి యముని తల పైకి విస రెను॥ ప్రకాశించుచు తన పయికివచ్చు దానిని చూచి యముడు కన్నులు తడబడ తాను మహాబలుడు కావున ఎట్లో దానిని తప్పించుకొనెను॥ అతడు తప్పించుకొని దూరము పోగా గ్రసనుడు భీమకర్ములును మహాకోపులు భయంకరులునగు వేలకొలది యమకింకరులను నలుగగొటైను॥ నానాయుధ సహితమగు తన ఘోర కింకరవాహినియు నీహతమగుట చూచి యముడు చాల క లతనందెను॥
ఐనను కింకరమయముగానున్న యమ సేనను చూచీ గ్రసనుడు యముడే తన మాయతో వేలకొలది యములను సృష్టించెనేమో అనుకొనెను॥ వాడు ఆ సేనను ఎదిరించి శరవర్ష మద్దాని పై కురిసెను॥
వాడు క్రోధమూర్చిలుడై కల్పాంతరుద్రుడయ్యెను॥ శూలముతో సూటిగపోవు బాణములతో గదతో ముద్ధర ములతో దారుణ ప్రాస ప్రహారములతో వారినందర చిలుకపైను॥ కింకరులలో కొందరు విలాసముగా తమ బాహుమండలములతోను కొందరు రాలతోను కొందరు మహోన్నత వృక్షములతోను గ్రసనుని కోటిరి॥ మరికొందరు వానిని గోళ్ళతో పీకిరి; పండ్లతో కొరికిరి॥ మరి కొందరు పిడికిళ్ళతో వీపుపయి గ్రుద్దిరి॥
వారట్లు తన వెంటబడి బాధించగా గ్రసనుడు క్రోధముతో నిండి వారిని వేలమందిని శరీరములు ఎత్తి విడిచి నేల పై నలుగరా చేను॥ మరికొందరను పిడికిళ్ళు ఎత్తి కొట్టి చం పెను॥ దానితో వాడు బడలిక చెందెను॥ వాని చేతిలో తన సేన చచ్చుటయు వాడట్లగుటయు చూచి యముడు దండమే త్తి వాని పయికి పోవుచుండ వాడది గమనించి గదతో నతనిని కొట్టెను॥ యముడది లెక్క సేయక వాని రథమును లాగు వ్యాఘములను చంపగా ॥ ఆ రథము కదలక పోయెను॥ సంశయము త్తమ పురుషుని చిత్తమును వదలినట్లు గసనుడి రథము వదల పదాతియై యమునితో॥ బాహు యుద్దమునకు తలపడెను॥ యముడును ఆయుధములను వదలి వానితో నియుద్ధమునకే సిద్దపడెను॥ గ్రసనుడు తన కటివస్త్రములతో యముని మూటకట్టి పిచ్చివానిని సంభ్రమము త్రిప్పినట్టు గిర గిర త్రిప్పెను॥ యముడుతలో తన బాహం తార కోపాఖ్యానము॥ కుబేర జంభాసుర యుద్ధము ద్వంద్వముతో వాని మెడ పట్టుకొని గిర గిర తిప్పి నేల పైకీ విసరెను॥ తరువాత వారు పరస్పరము పిడికిళ్ళతో గుద్దు కొనిరి॥ దైత్యుడతికాయుడు కావున దీనితో యముడు అల నేను॥ అతడు॥ రాక్షసుని మొగము వీపు పై ఉంచుకొని విశ్రాంతి తీసికొనదలచెను॥ వాడ దిగమనించి అతనిని నేల పై అదిమి తన బాహువులతో మోకాళ్ళతో నలుగపొడిచెను॥
కుబేర జంభాసుర యుద్దమ్॥
యముడు నిర్జీవుడగుటచూచి డి నవుడతనిని విడిచి ఉద్ధతమగు జయము పొందినందున ఆ మహాబల దైత్యుడు గర్జించి తన సైన్యమును చేరి కొండవలె అచలుడయి నిలిచెను॥ వాడు కుబేరునికి మర్మభేదకములుగా వదలిన బాణము లతో దిక్కులునిండి మూతపడెను॥ వాడు కోపించి కుబేర సేనను కూడ మిగుల నొప్పించెను॥ అది చూచి ప్రతాప వంతుడా కుబేరుడును ధనువాక ర్గాంతములాగి అగ్ని తేజసములగు వేలకొలది బాణములను వాని వక్షము పై వదలెను॥ నూరిటితో సారథిని పదింటితో ధ్వజమును డెబ్బదితో వాని కాలు సేతులను పదిటితో ధనువును కొట్టేను॥ విషతైలముతో పూయబడి నెమలి ఈకలు పింజలందు కటియుండి సూటిగా పోవు బాణములను జంభుడు కుబేరుని రొమ్మున నా టెను॥ కుబేరుడు తత్ క్షణమే దైర్యము పూని భయంకరమగు ధనుపు లాగి వాడియగు వేలకొలది బాణములతో దిక్కులను ఏదిక్కు॥ లను భూమిని జంభుని సేనను కప్పివే నెను॥ రవి మండలమును చూసెను॥ దానవ సేనను చం పెను॥ అతి పౌరుషుడగు జంభుడు కుబేరుని ప్రతియొక బాణమును తన వేలకొలది బాణములతో ఖండించెను॥ కుబేరుడు కోపించి నానా సాయక వర్షములతో వాని సేనను నశింప జేయసాగెను॥ ఆది చూచి జంభుడు న్వర్ధాలంకారములు కలది ఆయో మయము భయంకరమునగు ముద్దరచుపూని ధన దానుచరులగు యక్షులను వేలకొలదిగా నలుగగొ స్టేను॥ వాడా దెబ్బలు తినుచు తాళ లేక భయంకరముగా ఆ రధ్వనులు చేయుచు కుబేరుని రథమునకు చుట్టును మూగిరి॥ తన యనుచరులట్లు మతులగుట చూచి కుబేరుడు దారుణమగు శూలము చేబూనెను॥ వేలకొలది రాక్షసులను చం పెను॥ దానవుడు తన వారు అనేకులు నశించుచుండుటచూచి శత్రు మరనమగు పర శువు పూనీ వాడి వాదనగల ఆ గండ్రగొడ్డలితో కుబేరుని రథమును నున్నని బట్టను ఎలుక ఖండించినట్లు నూవు గింజంత ముక్కలుగా నరకెను॥
అంతట ఆ అస్త్రము క్రమముగ ఎవరికి నడ్డగింప సాధ్యము కాని నానారూపములు ధరించేను॥ ముహూర్త కాలము లోక మంధ కారావృతమయ్యేను॥ అంత లో అంతరిక్షమున పరస్పర వ్యాప్తములగు తేజస్సులు కానవచ్చెను॥ అంతట అతి పరాక్రముడగు కుజంభుడు పదాతియే కుబేరుని వైపునకు పరుగే త్రేను॥ ఆదైత్యుడు తనవైపునకు పరు॥ గెత్తి వచ్చుట చూచి కుబేరుడు తడబడుచు పారిపోవ సిద్దపడెను॥ పారిపోవు అతని రత్నాలంకృత కిరీటము అంబరము నుండి మహోల్కవలె ప్రకాశించుచు భూతలమున పడెను॥ ఎవరికి నెదిరించరానివారును నానా శస్త్రాస్త్రహస్తులునభి మానధనులునగు ధనదా (కుబేరా)ను చరులగు యక్షులు ఆ పడిన మకుటము చుట్టును మూగి తమ ప్రభువు రణమునుండి పారిపోయినపుడు అతని భూషణము రణరంగమున పడిపోయి ఉండగా దానిముందు మరణించుటయే వీరులకు ఉచిత ము అనుచు యుద్ధమునకు సంసిద్ధులయిరి॥ చండ పౌరుషుడగు దానవుడా కుజంభుడు అది చూచి యెర్చజాలక భయంక రాకృతియై కొండంత బరువయిన భుశుండిసి పట్టి మకుట రక్షకులను నలుగగొటెను॥ తరువాత వాడా కిరీటమును మూర్తిమంతములగు కుబేరుని రత్న ములను నిధులను కూడ తన రథమందుంచుకొని ఇట్లు కుబేరుని జయించి దనుజేంద్ర సంఘము నడుమనున్న తన సేనకడకు పోయెను॥ కుబేరుడు దీనుడే జుట్టు విరియబోసికొని ఇందునికడకు పోయెను॥
అంతట నిరృతి కుజంభునితో తలపడి అమోఘమగు తామసమాయనవలంబించి జగ తంతయు నంధకార మయము కొవించి ఆ దైత్యేంద్రుని మోహపరచెను॥ దాని దానవబలములు కనులు కనబడక తామున్న చోటినుండి అడుగై న కదల్చజాలకపోయిరి॥ నిరృతి సైనికులును మంచు చీకటిలో పరమాతురములయిన వాహనములతోనున్న దానవ సేనను నానాస్త్ర వర్షముతో చావగొట్టిరి॥ ఇట్లు దైత్యులు చావు దెబ్బలు తినుచుండ కుజంభుడు మూఢచేతస్కుడు కాగా ప్రళయ మేఘ సమానుడగు మహిష దానవేంద్రుడు ఉల్కలగమితో ఆలంకృతమయిన॥ సావిత్రమను అస్త్రమును సంధించి ప్రయోగించెను॥
ప్రతాపీ అగు సావిత్రమను అస్త్ర శేషము విజృంభించుచుండ వేంటనే ఘోరాంధకారము నశించెను॥ ఆకాశ మంతయు నిప్పురవ్వలతోనిండి శరత్కాలమున వికసించిన ఎర దామరలు కల నిర్మల సరస్సువలె ప్రకాశించగా అంతవరకు చీకటిలో సంభ్రాంతులయియున్న దానవులకు కన్నులు వచ్చి వారు క్రూర మనస్కులయి దేవ సేనను తరి మిరి॥ కోపముతో వారు వదలిన బాణములతో సారాస్త్రమును తొలగ గొట్టబడెను॥ అంతట భయంకర ధనువును సర్పమువంటి బాణములను తీసికొని నిరృతి రథము మీదకు కుజంభుడు పరుగే తెను॥ అతడు తన అనుచరులతో తన వైపునకు వచ్చు చుండుట చూచి నిరృతి క్రూర సర్ప విషము పూసిన నిశిత బాణములతో వారిని కొటైను॥ బాణము లను తీసికొనుట సంధించుట విడుచుట తెలియరానంత వేగముగా ప్రయోగించిన బాణములతో నిరృతి కుజంభుని బాణములను మీగుల శీఘ్రముగా ఛేదించి ఒక తీవ్ర బాణముతో వాని ధ్వజమును కూల్చి ఒక దానితో సారథిని మరికొన్ని బాణము లతో గుర్రములను చం పెను॥ కుజంభుడా యుద్ద విజృంభణలో నిరృతి ధనువును చూచి క్రోధ ర క్తనేత్రుడయి తన రథమునుండి దు మికి శరదాకాశ మువలే నిర్మలమగు ఖడ్గమును పది చంద్ర ఖండములు గల పలకను (డాలును) తీసికొని నిరృతిమీదకు పరుగే త్రేను॥ అతడు ముద్దరముతో దైత్యుని కొట్టగా వాడా దెబ్బతో నిశ్చేష్టుడి ధీరమగు పర్వతమువలె ఊరకుండిపోయేను॥ అతి దుర్జయుడగు రాక్ష సేంద్రుడా కుజంభుడు ముహూర్త కాలములో తెప్పరిల్లి నిరృతి రథమెక్కి ఎడమ చేతితో అతనిని పట్టుకొని మోకాలితో అతనిని తొక్కిపట్టి జుట్టు పట్టుకొని మహా క్రోధముతో అతని తల నరుక పూనెను॥ ఇంతలో వరుణ దేవుడు పాశముతో ఆ దానవేంద్రుని భుజద్వయమును బంధించెను॥ అట్లు దైత్యుని పౌరు షము విఫలము కాగా వరుణుడు దయమాలి గదతో వానిని కోటగా వాడా దెబ్బతో చెవులనుండి రక్తము క్రక్కుచు మెరపులతో నిండిన మేఘమువలె ప్రకాశించెను॥ కుజంభుడట్లగుట చూచి మహిషాసురుడు॥ వాడి కోరలతో భయంకరమగు నోరు తెరచుకొని నిరృతిని వరుణుని మ్రింగుటకు పూనెను॥
కుజంభుని దురాలోచనను గమనించి నిరృతి వరుణులు మహావేగియగు మహిషుని రథమార్గము విడిచి భయ విహ్వలులయి భయంకర ముఖములతో వేగముగా పారిపోయిరి॥ వారిలో నిరృతి శీఘ్రమే ఇంద్రుని శరణుజొచ్చెను॥ మహిషుడు కోపముతో వరుణుని మీదకు పరుగే తేను॥ వరుణుడట్లు యముని నోట పడ నుండుట చూచి చంద్రుడు సోమాస్త్రము ప్రయోగించి మంచురాశితో సంకటము కలిగించెను॥ వాయవ్యాస్త్రముకూడ ప్రయోగించేను॥ ఆది సాటి లేనిది॥ ఆ మంచుతోను గాలిచే కలిగిన సంశోషము (ఎండుట)తోను దానవులు వ్యథనొందిరి॥ హిమశీతముచే వారి పౌరుషములు వ్యర్థమయ్యేను॥ వారు కదలలేక పోయిరి॥ ఆస్త్రశస్త్రముల తీసికోనలే కుండిరి॥ ఆ మహా హిమపాతముతోను చంద్రుడు ప్రయోగించిన ఆస్త్రములతోను దానవ శరీరములు కాలిపోవుచుండెను॥ చలితో మొగము వణకుచుండగా మహి షుడు నిశ్చేష్టుడయి చేతులతో చంకలు ముడిచి పట్టుకొని తలవంచుకొని కూర్చుండెను॥ ఇట్లు దానవులందరు చంద్రునిచే బాధలపాలయి తేజోరహితులయి ప్రతీకార మేమియు చేయలేక యుద్ధ సంకల్పము దూరముగా వదలి ఉండి పోయిరి॥ ఆంతట కాలనేమి కోపోద్దీపితుడయి దానవులతో నిట్లనెను॥ సర్వ శస్త్రాస్త్ర పారంగతులును శృంగారులునగు దానవ శూరులారా మీలో ఒక్కోక్కరే తమ భుజములతో జగత్తంతయు ఊపివేయగలవారుగదా చరాచర జగత్తంతయు మింగగలవారు గదా దేవతలందరు కలిసియు తమ విక్రమములన్నియు కలిపినను వారు మీలో ఒక్కొక్కని శ క్తిలో పదారవవంతును పూరించుటకు కూడ చాల రే ఇట్టి మీరు పరులకు ఓడి భయార్డులయి ఊరకుందు రేల? ఇది ఏ శూరు లకును తగదు; దై త్యజాతీయులకు మొదలే తగదు॥ లోక తారకుడగు తారకుడు మన ప్రభువు; మనము ఇట్లు యుద్ధ మును చాలించి వెనుకకు వచ్చినచో అతడు కోపించి మనల చంపును॥ అతడిట్లనుచున్న ను దైత్యులు చలిచే స్మృతులు లేక వాక్య ప్రకటన శ క్తిలేక మూగవారయిరి॥ యుద్దము చూడవలెనన్నంతనే వారికి కాళ్ళు వణకుచుండెను॥
ఆ దైత్యదానవులు స్మృతిరహిత చేతస్కులగుటయు చలితో శ క్తి రహితులగుటయు చూచి మహాసురుడా కాలనేమి ఆసమయమున కుచితమగు కార్యమాలోచించుకొనెను॥ దానవమాయ నాశ్రయించి తన తేజస్సును విస్తరించి దానితో గగనమును దిక్కులను విదిక్కులను నిం పేను॥ తన శరీరమునందుండియే పది వేల భాస్కరులను నిర్మించేను॥ మాయతో దిక్కులన్నియు భయంకరాగ్నులతో నింపేను॥ దానితో తై లోక్యమును జ్వలాకులమయి॥ చంద్రుని శక్తి శమించేను॥ మంచు చల్లదనముతో ఏర్పడిన దుర్దినము తొలగెను॥ ఇట్లు కాలనేమి మాయతో దానవ సేనకు తెలివి వచ్చుటచూచి లోకైక లోచనుడగు రవి కోపించి అరుణునితో రథమును శీఘ్రమే కాలనేమి యున్న చోటికి పోనిమ్ము॥ అచ్చట గొప్ప యుదమును శూర సంక్షయమును జరుగవలయును॥ మనకు బలమువచ్చినది॥ దానితో వీడు చంద్రుని చేతిలో ఓడినట్లే॥ అనెను॥ ఇట్లు రవి పలుకగా ఆరుణుడు తెల్లని చామర ముల కుచ్చులతో అలంకృతములయిన అశ్వ ములను యత్నముతో గ్రహించి రథమును అటకు పోనిచ్చెను॥ అంతట లోక దీపుడగు సూర్యభగవానుడు ధనువు తీసి ఎక్కు పెట్టె॥ ఆ మహాభాగుడు భయంకర సర్పములవంటి రెండు శరములు తీసి ఒకటి శంబరాస్త్రముతో ఇంకొకటి ఇంద్ర జాలముతో అనుసంధించి వదలేను॥ దానితో క్షణములో రూపవిపర్యయమేర్పడి దానవులు దేవతలుగా దేవతలు దాన వులుగా కనబడసాగిరి॥ కాలనేమి ప్రళయ యమునివలే రోషించి పరులు అని తలచి తన వారినే చంపుచుండెను॥ తీక్ష ఖడ్గముతో భయజ్కర శిలావరముతో ఘోరమగు గదతో గండ్ర గొడ్డలితో అనేకుల శిర స్సులను రథికులను రథ ములులాగు ఉష్ట్రములను ఖండించేను॥ రథములను నలుగగొ టైను॥ రథములను గుర్రములను రథాశ్వముల వేగ ముతోనో పిడికిటిపోటులతోనో నలుగ పొడిచెను॥
దేవతల చేతిలో మరణించు దానవులు మృతి సమయములో స్వరూపమునే ధరించుటతో నేమియను దానవుడు కాలనేమి చేతిలో కూడ తమవారే మరణించుట గమనించెను॥ కాలనేమి మాత్రము రోషావేశములో ఇది గురుతించలేదు॥ అంతట నేమి కాలనేమితో 'దేవశత్రూ కాలనేమీ (దేవతా రూపములో కనబడు) నేను నేమినయ్యా నాతో మాటలాడుము॥ మాయా మోహితుడవయిన నీ చేతిలో మహా విక్రముడవగు నీచేతిలో దేవ దుర్జయులగు పది లక్షలమంది దానవులు మర ణించిరి॥ నీవు శీఘ్రమే బ్రహ్మాస్త్రము వదలుము॥ ఆది సర్వాస్త్రములను ప్రతిహతమొనర్చును॥' అని నేమి పేరించగా సురకంటకు డాకాలనేమి త్వరపడుచు శరమున బ్రహ్మాస్త్రమును సంధించి ప్రయోగించెను॥ అంతట ఆ ఆస్త్రపు తేజ ముతో సచరాచరమగు త్రైలోక్యమును వ్యా ప్రమయ్యెమ॥ దేవ సైన్యమంతయు రోషయుక్తమయ్యెను॥ శంబరాస్త్ర ప్రభావము శాంతించేను॥ దానితో సూర్యుడును శాంత తేజస్కుడయ్యెను॥ అంతట రవి మ హేంద్రజాలము వహించి తన శరీరమును కోట్లకొలదిగా రూపొందించేను॥ మిగుల వెలుగొందు॥ కిరణరాశితో జగత్రయ మాక్రాంతమయ్యేను॥ దానవ సేన ఉడికిపోయి మజ్జారాశి ర కరాసులు కారసాగెను॥ అంతట రవియు అన్ని వైపుల కడుదట్టమగు అగ్నిని వరించి దానవేంద్రుల నేత్రములంధ మొనరించెను॥ గజముల మేదస్సు కా రెను॥ రథములు క్రిందపడెను॥ గుర్రము లుడికిపోయేను॥ రథికులు పిచ్చే తిరి॥ దప్పిక వేసి నీరు నీరనుచు ఇటునటు పరువే తిరి॥ కొండలయందలి యడవు లకును చెట్లు దట్టమగు నీడలకును తహతహలాడిరి॥ వారు అట్లు చెట్లనడుమను క్రిందను లభించు నీడ కోరుచుండగనే ఘోరమగు దావాగ్ని వ్యాపించి చెట్లను కాల్చసాగేను॥ నీరు కావలసిన వారికి తమ ఎట్టఎదుటనే ఆలల మాలలతో నిండిన నీరు కనబడు చుండినను శమవలన దా 5వరకు పోలేకుండిరి॥ ఆచట చేర లేక హత చేత స్కులే భూమి పై చొచు కొని పడి పోవుచుండిరి॥ దానవ శేషులు రణరంగమునందచ్చటచ్చట మాత్రమే కనబడుచుండిరి॥ ఇట్లు రథములును గజము లును అశ్వములును పడిపోయెను॥ పదాతులలో మిగిలినవారును పరుగెత్తుచు గొంతుక నుండి రక్తమును కక్కుచుండిరి॥ దానవులు వేలకొలదిగ మృతులయి కనబడుచుండిరి॥
ఇట్లు దానవేంద్రులకు మహాక్షయము కలుగుచుండ కాలనేమి రోషావిష్టుడై తీవ్రకోపవశమున గ్రుడ్లు త్రిప్పుచు అనేకములగు మెరపులు మెరయుచు గంభీరములగు చరపులవంటి చటచట ధ్వనులతో ఉరుముచు ఉండు ప్రళయ మేఘమువంటి మేఘముగా ఆయ్యెను॥ లోక హృదయకంటకుడతడు ఇట్లయి గగన వైశాల్యమంతయు కప్పి రవి మాయను నశింపజేసెను॥ దానవులకు బలప్రదమగు చల్లని నీటిని వరించెను॥ దానిచే దానవులు తమ పై వరము కురియగా వాడిన వరి మొలకలు వలే క్రమముగా ఓదార్పు పొంది తెప్పరిల్లిరి॥ తరువాత ఆ మేఘరూపిగానే కాలనేమి దేవ సేనల పై దుర్జయమును ఉగ్రమునగు శస్త్ర వర్షము కురిసేను॥ మహాతేజోవంతములగు ఆ దైత్యాస్త్రముల వానతో బాధనొందుచు వేరుగతి కానరాక చలికి బాధపడు గోపులవలే అయి ఒకరి వీపులపై మరియొకరి చేతులు ఆనించుకొనిరి॥ ఒకరిలో ఇంకొకరు దాచి పెట్టుకొనిరి॥ ఏనుగులయందును గుర్రములయందును పాపము వాటి బాధ వాటియందే ఉండి పోయేను॥ అవి కొన్ని కొన్ని ఆయా ప్రాకారములయందును పర్వతావరణములందును అచ్చటచ్చట దాగెను॥ దేవ సైనికులు కొందరు చేతులతో తమతమ మొగములు కప్పుకొని శరీరములు ముడుచుకొని పోయిరి॥ మరికొందరు శత్రువుల చూచుచు సంభ్రాంతులై ఏమియు తోచక ఇటునటు పరుగెత్తుచుండిరి॥ ఇట్లు జరుగుచున్న యుద్ధమున దేవ తల కే సంక్షయమగుచుండెను॥ శస్త్రములతో తెగిన-విరిగిన అవయవ సంధులు-పగిలిన-పగులని-తలలు తెగిన తొడలు మోకాళ్ళు జారిపడిన ధ్వజ సంఘములు పిండి ఐన ధ్వజములు భూమిపై పడి కనబడుచుండెను॥ వెడలిపోవుచున్న గుర్రములతో కదలక కొండలవలెనున్న గజములతో స్రవించిన నెత్తుటి మడుగులతో భూమి వికృతమయ్యెను॥ ఇట్లు బలశాలియగు కాలనేమి దైత్యుడు ముహూర్త మాతములో పదివేల గంధర్వులను ఐదులక్షల యకులను అరువది వేలమంది (దేవపక్షమందలి) రక్ష స్పులను మూడు లక్షల మంది కింకరులను ఏడు లక్షలమంది (దేవపక్షీయ) రాక్షసముఖ్యులను లెక్క పెట్టరానంత మంది ఇతరులగు దేవ జాతీయులను కోట్లకొలదిగ క్రుద్దుడయి చంపి చిత్రములగు అస్త్రముల ప్రయోగించుచు రణ దుర్జయుడయ్యెను॥ ఇట్లు మహామరుల మహాసంఘమున భయానకమగు ప్రతిభయస్థితి ఏర్పడెను॥
అశ్విదేవతయోః కాలనే మేశ్చ యుద్దమ్॥
ఇది చూచి వీరులగు అశ్వినులు సంక్రుద్ధులయి ఆశ్చర్యము కలిగించు కవచముతో ఉజ్వలులయి ప్రళయ కాలాగ్ని సమానుడగు ఆ దైత్యుని కాలనేమినీ యుద్ధము నందు సమీపించి భయంకరాకారుడగు ఆ ఘోరుని ఒక్కోకరు అరువదేసి బాణములతో కొట్టిరి॥ వారి బాణపు దెబ్బలతో కన్నులు వానికి కొంచెము నొప్పి ఎ త్రేను॥ ఎనిమిది అరలు గలదియు రణములో అంతకుని పోలినదియు అగు చక మును తీసికొని దానితోపోడు అశ్వినుల రథకూబరమును నర కేను తరువాత పొడు ధనువు తీసికొని సర్ప సమానొకార శకులు కల శరముల ప్రయోగించి ఆకాశమును కప్పివేసి వారి తల లను నొప్పించెను॥ వారు మీగుల పొడి బాణములతో దె తుని బాణములను ఖండించిరి॥ వారి ఈకృత్వము చూచి కాలనేమీ కోపావిష్టుడయి అయోమయమును కాలదండమువలె భయంకరమును స్వయం) భీమమునునగు ముద్దరమును చేకొని అది వేగమున త్రిప్పి అశ్వినుల రథము పైకి విసరెను॥ అది తమపై పునకు వచ్చుచు ఆకాశములో కనబడగానే శీఘ్రముగా అశ్వినులు తమ రథమును ధనువులను విడిచి దుమికిరి॥ బంగారు సొమ్ములతో అలంకృతమగు కొండను పోలు ఆముద్దరము వారి రథమును పిండిచేసి భూమినికూడ చీల్చెను॥ ఆశ్చర్యకరయోధులా అశ్వినులు అది చూచి దానవేంద్రుని వారించుటకై వజ్రాస్త్రము ప్రయోగించి అతి దారుణ వజవృషి ప్రవరిల్లజేసిరి॥ ఘోర వజ్ర ప్రహారము లతో ఆదైత్యేంద్రుడు మరుగుపడుటయేకాక సర్వ సైన్యము కాంచుచుండ క్షణములో వాని రథము ధ్వజము ఛత్రము కాంచనమయ కవచము మిక్కిలిగ తిలలంత ముక్కలు చేయబడెను॥ అశ్వినుల ఆ దుష్కరకృత్యము చూచి బల శాలి భీమ విక్రముడా దైత్యుడు నారాయణాస్త్ర ప్రయోగము చేత తేజముచే వజ్రాస్త్రమణచివేసెను॥ మరి వెంటనే అశ్వినులను జీవగ్రాహముగా పట్టుటకును యత్న మారంభిం చేసు॥ అశ్వినులు భయపడి వణకుచు తమ శస్త్రములు విడిచి భీతితో ఇంద్రరథముకడకు పరువే త్తిరి॥ మహాబలుడా కాలనేమిదై త్యుడు వారిని వెంటనంటి తనవెంట దైత్యానీకము వచ్చు చుండ ఇంద్ర సేనను సమీపించేను॥
దేవాసుర సజ్గరం ప్రతి శ్రీవిష్ణోరాగమనమ్॥
దైత్యుని ఆక్రోధము చూచి సర్వభూతములును అది సర్వలోక క్షయావహమయి దొన ఇంద్రుని పరాజయమగునని తలచేను॥ ప్రధాన పర్వతములే చలించెను॥ ఆక సమునుండి ఉల్కలు పడెను॥ దిక్కులందు మేఘములురిమేను॥ సముద్రములు మిగుల పొంగెను॥ ఈ భూతస్థితి వికారమును చూచి భగవానుడు గరుడధ్వజుడు అంతవరకు తానవ లంబించియున్న యోగనిద్రను విడిచి నాగ పర్యంకమునుండి మేలు కోంచి లేచెను॥ శ్రమనందినపుడులక్ష్మి కరద్వంద్వ ముచే లాలించబడు పాదపద్మములు శరన్నీ లోత్పల సుందర దేహకాంతి కౌస్తుభోద్భాసి వక్షము భాస్వర మనో హర కేయూరములు కల మహానుభావుడాతడు అసురులు కలిగించు కల్లోలమాలోచించి గరుడుని పిలిచెను॥ నానాకారా స్త్రముల వర్షించగల గరుడుడు తన పిలుపందు కొని రాగా ఆతని నా రోహించి నారాయణుడు దివ్య నానాస్త్ర తీవ్ర జ్వాలా లంకృతుడై యుద్ధరంగమునకేగేను॥ అచట నతనికి కారు మొయిళ్ళగములను పోలి పౌరుషోత్కటులగు దానవేంద్రులు కలిగించు ఉపద్రవము లతో ఇబ్బందిపడుచు ఇంద్రుడు కనబడెను॥ వశానుగతముగా వచ్చి బాధించుచున్న ఘోర దురదృష్టములనుండి పురుషుని రక్షించుటకు అతడు ఉత్తమ దేశ కాలములందాచరించిన సుకృతఫలము కాపాడవచ్చినట్లు నారాయణుడింద్రునిపుడు కాపాడవచ్చెను॥ అంత లో దైత్యులకు వేడి వెలుగులతో ఉదయాద్రి పై ప్రకాశించు రవిని పోలిన జ్యోతిర్మండల మాకాశమున కానబడెను॥ ఆ తేజఃప్ర భావమును దానవులేరుగ గోరుచున్నంతలో వారికి ప్రళయాగ్ని భీకరుడగు గరుడుడును కాంతులతో ఒప్పు వేలకొలది మెరపులగముల సమీపమందలి మేఘమువలె అతని నౌరోహించి యున్న అచ్యుతుడును కనబడిరి॥ అతనిని చూచి దైత్యేంద్రుడా కాలనేమి హర్షపూర్ణ మనస్కుడై ఇట్లనుకొనెను॥
“దేవతలకు సర్వస్వమీనారాయణుడే॥ ఇతడోడిన దేవతలోడుదురు॥ కేశవుడని హరియని ప్రసిద్దుడగు ఈత డే దైత్య సేనలకు యముడు॥ లోకేశుడగు ఈతని నాశ్రయించియే దేవతలు యజ్ఞభాగ భో కలయియున్నారు॥” ఇట్లనుచుండగనే దానవులందరు హరి నన్ని వైపుల చుట్టిరి॥ కాలనేమి మొదలగు మహారథులగు పదిమంది దైత్యులు గరుత్మంతుని నారాయణుని కూడ వివిధాస్త్రములతో కొట్టిరి॥ వారిలో కాలనేమీ అరువదిటితో॥ నిమి నూరింటితో- మథనుడు ఎనుబ దింటితో- జంభకుడు డెబ్బదింటితో॥ శుంభుడు పదింటితో -మిగిలిన దైత్యేశ్వరులోక్కొక్కరొక్కొక్కటితో- బాణములతో విష్ణుని జనార్ధనుని ప్రహరించిరి॥ గురుడుని పదేసి బాణములతో యత్నపూర్వకముగా (బలము కొలది) కొట్టిరి॥ దానవాంతకుడది సహించక ఒక్కొక్క దానవునా రేసి బాణములతో కొట్టేను॥ మరల కాలనేమి రోషర క విలోచనుడయి చెవినంట ధనువులాగి విడిచి మూడు బాణములతో నారాయణుని రొమ్మున కో టైను॥ బంగారుతో కూడిన ఆ బాణములాతని హృదయమున స్పష్ట ద్యు తియగు కౌస్తుభరత్నపు దీప కిరణములవలె కానవచ్చెను॥ ఆ దెబ్బలతో కొంచెము శ్రమ నందియు విష్ణువు ముద్దరము తీసికొనెను॥
అతడదీ వేగముగా తిప్పి దానవేంద్రుని పై వీస రెను॥ కూరుడా దానవేంద్రుడు హస్త లాఘవము చూపుచు అది ఇంకను తను చేరక ఆకాశమందుండగనే నూవు గింజలంత ముక్కలు చేసెను॥ అంతట విష్ణువు ప్రకుపితుడై భయంకర మగు ప్రాసాయుధమును తీసికొనెను॥ ఆ ఆయుధముతో నారాయణుడు దైత్యుని హృదయమున కొట్టగా కాలనేమి క్షణములో తెలివి తెచ్చుకొని తీక్షమగు మొన కలిగి॥ బంగరు గంటల చప్పుడులతో పెద్దగ నవ్వుచున్న దో యనునట్లున్న శ క్తిని తీసి కొని దానితో విష్ణుని వామభుజము చీల్చేను॥ శ క్తితో చీల్చి రక్తము కారుచున్న విష్ణువు భుజము పద్మరాగ మణిమయమగు భుజకీర్తితో వలె ప్రకాశిం చెను॥ అంత విష్ణువు ప్రకుపితుడయి విపుల ధనువును వాడియై మర్మభేదములగు పదునేడు బాణము లను తీసికొని తొమ్మిదిటితో దైత్యుని హృదయమును నాలుగింటితో వాని సారథిని ఒక దానితో ధ్వజమును రెంటితో పొనీ ధనువును ఒక దానితో ఎడమ భుజమును కొట్టేను॥ గాఢముగా హృదయమునతగిలిన హరి బాణముల దేబ్బలతో కారుచున్న రక్తముతో ఎర్రనయిన మహా బాధాకుల మానసుడై కాలనేమి గాలితో కదల్చబడిన మోదుగు చెట్టువలె కంపించెను॥ అది చూచి ఇదే యదనని కేశవుడు గద తీసికొని వేగమున కాలనేమి రథము పైకి విస రెను॥ ఉగ్రము విపులమునగు ఆగదు॥ కాలనేమి తల పై పడగా పోని శిర ము చూర్ల మై మకుటము పిండియె వేగముగా స్రవించు రక్త ప్రవాహముతో వాడు ధాతు ద్రవము స్రవించు పర్వతమట్లు కనబడెను॥ వాడు అట్లు విరిగిన తన రథము పై తెలివి తప్పి కొనఊపిరితో పడిపోయెను॥ రథాసనము పై పడిన ఆ దైత్యుని చూచి అచ్యుతుడు చక్రాయుధుడు ప్రభుడునగు హరి చిరునవ్వుతో “అసురా! విడిచితి; పొమ్ము; ఇప్పటికి నిర్భయుడవయి బ్రతుకుము; తరువాత కోలదీకాలములో నేనే నీకు యముడనగుదును॥” అనెను॥ ఈ మాటలు విని కాలనేమీ సారథి అతని రథమును అటనుండి తొలగించి వానిని దూరముగా కోనిపోయెను॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున కాలనేమి పరాజయమను నూట నలువది తొమ్మిదవ అధ్యాయము॥
