మత్స్య మహా పురాణము

Table of Contents

272 - అధ్యాయము - భవిష్య ద్రాజాను కీర్తనము

మేధ (ఘ) స్వాతి పదునెనిమిది స్వాతి పదునెనిమిది స్కఛ స్వాతి ఏడు మృగేంద్ర స్వాతికర్ణుడు మూడు కుంతల స్వాతికర్ణుడు ఎనిమిది తరువాత పుష్ప నేనుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత సౌమ్యుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత స్వాతికర్ణుడు ఒకటి పులోమావి ఇరువది ఏడు ఆరిష్టకర్ణుడు ఇరువది ఐదు హాలుడు ఐదు మందులకుడు ఐదు తరువాత పురీంద్ర సేనుడు (ఏండ్లు ఈయలేదు) తరువాత సౌమ్యుడు ఏండ్లు ఈయలేదు) తరువాత సుందర శాంతికర్ణుడు ఒకటి చకోర స్వాతికర్ణుడు ఆర యేడు శివస్వాతి ఇరువది ఎనిమిది గౌతమీ పుత్రుడు ఇరువది యొకటి వాని కొడుకు సులోముడు ఇరువది ఎనిమిది శివశ్రీ ఏడు శాంతికర్ణుని కుమారుడు శివస్కందుడు సంఖ్య లేదు) ఏండ్లు యజ్ఞశ్రీ శాంతి కర్ణి ఇరువది తొమ్మిది విజయుడు ఆరు వాని కుమారుడు చండశ్రీ శాంతకర్ణుడు. పది కడపటివాడగు సులోముడు ఏడు సంవత్సరములు రాజ్య మేలుదురు; ఇట్లు ఇరువది తొమ్మిది మంది ఆంధ్రులు 460 ఏండ్లు భూమి ననుభవింతురు.

తరువాత ఈ ఆంధ్రుల భృత్యుల వంశములవారు (ఆంధ్ర భృత్యు లనబడు ఆంధ్రులు) ఏడు మంది ఆధీరులు వదిమంది గర్గభులు ఏడుగురు శకులు పదునెనిమిది మంది యవను లేనిమిది మంది తుషారులు పదునలుగురు గురుండులు వదుముగ్గురు హూణులు పందొమ్మిది గురు యవను లెనిమిది మంది ఈ భూమీ నేలుదురు; యవనుల పాలనకాలము ఎను బది ఏడేండ్లు; తరువాత ఏడుగురు గర్గభిల రాజులు పాలింతురు; తుషారులు ఏడువేల మూడువందల ఎనుబది ఏండ్లు పాలింతురు; పదుముగ్గురు గురుండులును వారికి సమకాలముననే కొందరు వృషలులును పదునెనిమిది వందల ఏబది. నాలుగేండ్లును ఈ భూమిని పాలింతురు; ఇచట మూలమున చాల ప్రతులయందు “శతాన్యర చతుష్కాణి' ఆని యున్నది; కాని ‘శతాధ్యర్ధ చతుష్కాణి' = 'ఆధ్యర్ధశత+చతుర్ = ఆర్ధశతము చతుర్ (అధికము) = 54 ఎక్కువగా కల వదు నేని మిది వందలుఅగును) ఈ గగు)రుండులు మ్లేచ్చజాతీ యులు; (మేచ్చులు అనగా భాషను అవిస్పష్టముగా ఉచ్చరించుచు మాటలాడు వారును ఆపళ బ్దములను కూడ వ్యవహరించువారును అని యర్థము; భారతీయులు వ్యవహరించు శుద్దగీర్వాణ

*శతాని త్రీణ్యశీలించశతాన్యష్టాద శైవతు  + భవితవ్యాస్త్రయోదశ.

వాణి మాటలాడని ఆభారతీయ జాతుల వారందరును ఇట్టివారుగా మన వాజ్మయమున పేర్కొనబడిరని తోచును;) తరు వాత మరల ఆంధ్రులు మూడువందల పదునొకండు శ్రీపర్వత ప్రాంత జాతీయులు ఏబది రెండు సంవత్సరములు పాలిం తురు; తరువాత పది మంది ఆధీరులు అరువది ఏడు ఏండ్లు పోలింతురు; కాలక్రమమున వారును నశించగా మిగిలినవారు ధరార్థ కామ ప్రవృత్తులయందు యవనులే అనదగియుందురు; జనపదములు(గ్రామములు) వీరితో మిశ్రితము లగును; అంతటను ఆర్యులును మ్లేచ్చులును కలగాపులగమయి యుందురు; వీరు తమ తమ ధర్మములు తప్పి వర్తింతురు? ప్రజలు క్షయ మందు దురు; ఆక్రమమున రాజులును లుబ్దులును ఆనృతరతులు నగుదురు; క్రమముగా అంతటను ఆర్యులును మ్లేచ్ఛులును అత్యంతము ఆధార్మికులగువారును పొషండులును కల్కి హతు లగుదురు; కలియుగ ప్రధాన పరిమాణము ముగియగా సంధికాలము రాగా నృపవంశ మును నశించగా పోయినవారు పోగా మిగిలిన కొలది మంది ప్రజలును ధర్మమును ఆచ రించనివారగుచు బాగుపడుటకు ఏ సాధనములును మనోదేహములందు సత్వమును (సత్తువనిబ్బరము) లేక వ్యాధిక పీడితులగుచు అనావృష్టిచే బాధలందుచు పరస్పర వధకాంక్షులగుచు రక్షించు వారులేక భయమందుచు ఘోరంకట మందుచు నదుల తీరములందో పర్వత ప్రాంతములందో నివసింపపోవుదురు; ఇట్లు రాజులు నశించగా ప్రజలు గృహములు విడిచి పరస్పర ప్రీతి స్నేహములు లేక నిరాసక్తులును భ్రాతృమిత్ర గణములను విడిచిన వారు నగుచు వర్ణాశ్రమ ధర్మ పరిభ్రష్టులును అధర్మనిరతులును పత్రమూల ఫలాహారులును నారలో ఆకులో చర్మములో ధరించుచు జీవనమునకై ఆహా రము మా తము దొరకిన చాలు ననుకోనుపొరునయి భూమియందంతటను తిరుగ నారంభింతురు.

O షట్త్రింశ త్తు  *మాసాదివ్వాః స్మృతాఃషట్చదివ్యై ర్వర్షైశ్చ సప్తభిః

ఇట్లు కలియుగ కాలమున ప్రజలు కష్టమును ఆధమ స్థితిని పొంది కలియుగముతోపాటు నిః శేషులగుదురు; దీవ్యవర సహస్ర పరిమాణక మగు కలియుగము తన సంధి సంధ్యాంశలతో కూడ ముగియగా కృతయుగము వచ్చును; ఇట్లు నేను మీకు వంశ క్రమమంతయు యథాక్రమముగ కీర్తించి అతీత వర్తమానాగత రాజ వంశమును తెలిపితిని; పరీ క్షిత్తుడు జన్మించినది మొదలు మహాపద్ముని యభి షేక మువరకును మొ త్తము కాలావధి ఒక వేయి ఐదువందల ఏండ్లు; మహా పద్మాభి షేకము మొదలుగ ఆంధ్రులలో కడపటి రాజుల వరకును ఎనిమిది వందల ఇరువది యా రేండ్లు; పరీక్ష్మి జన్మము. మొదలుగా ఆంధ్రుల వరకు అగుకాలము వీని మొత్తము; ఈ విషయమంతయు పురాణజ్ఞులగు వైదిక ఋషులు భవిష్య పురాణమందు లెక్కించి చెప్పియున్నా రు.

న పరులు చాల పొడవయి (ఉన్నతమయి) ప్రజ్వలించుచుండు అగ్ని తో నములై ఆకసమున కనబడుచుందురు. గదా! వీరు క్రమముగా ఆయా నక్షత్రములందు సంచరించుచు సమగ్రముగా నక్షత్ర మండల సంచారావృత్తిని ముగించి మరల మఖా నక్షత్రములోనికి వచ్చునాటికి ముందు రాబోవు ఆంధ్రుల పాలనకాలము పూర్తియగును; ఏలయన స పరులు తమ పర్యాయావృత్తిలో ఒక్కొక్క నక్షత్రమందు నూ రేసి ఏండ్లు ఉందురు; ఇట్లు ఇరువది ఏడు నక్షత్రము లందును సంచరించుటకు పట్టు కాలమును దివ్యమానముతో లెక్కించగా ఏడు #సంవత్సరముల ఆరు మాసము లగును.

• చత్వార్యష్ట

* ఇచట ఇపుడు లభించు ప్రతులయందు “నమాదివ్యాః స్మృతాః షష్టి ఫ్లిప్యాబ్దానిచన ప్రతిః (భిః)” అనియున్నది;

ఇచట స పతిః అనినచో 60470-180 దివ్య సంవత్సరములు; ఇది మనుష్యమానముతో 180x360 -_43800; లేదా 'సప్తభిః' అని గ్రహించినచో 60+7 = 67 దివ్య సంవత్సరములు; 67x860 -24120 మానవ సంవత్స రములు అగును; ఈ రెండును స పరుల న పవింశతి నక్షత్ర సంచార కాలమగు 2700 మానవ సంవత్సరములకు సరిపోవు; కావున పాఠ కారణముననో పూర్వమే పొరపాటుగా మారియుండును; ఆది “మాసా దివ్యాః న్మృతాః

 షట్చ దివ్యాన్యజ్ఞాని న వచ." ఆయియుండును. అపుడు 71/2X 360 = 15/2 x 360 = 2700 మానవ సంవత్సరములు సరిపోవును. అని యూహించి వ్రాయుటయైనది; విజ్ఞులు దీనినాలోచించి తమనినిర్ణయములు తాము చేయుదురుగాక!-అనువాదకుడు.. మత్స్య-272. ఆధ్యా-శ్లో. 48 సప్తమహర్షులు ఇరువది ఏడు నక్షత్రములందు సంచరించుటక గు 2700 వత్సరము లను దివ్య వత్సరములలో చెప్పుచు. ఇచ్చట

 1. సప్తర్షీణాం తు పర్యాయో (యః) స్మృతం (తో) వై దివ్యసంఖ్యయా!

సమా దివ్యాః స్మృతాః షష్టి ర్దివ్యాజ్ఞాని తు సప్తభిః-(కన్నడ)

 2. సప్తర్షిణా ముపర్యేతత్ స్మృతం వై దివ్యసంఖ్యయా!

సమా దివ్యాః స్మృతాః షష్టి ర్దివ్యాజ్ఞాని తు సప్తభిః- (నందలాల్ మోర్)

 3. సప్తవర్షిణాం తు పర్యాయే తత్సృతం దివ్య సంఖ్యయా!

సమా దివ్యాః స్మృతాః షష్టి ర్దివ్యాబ్దాని తు స పతిః. (పువ్వాడ వేంకటరావుగారి తెలుగుప్రతి.)

ఈ విధముగనే దివ్యులగు న పరుల చేత కాలగణన ప్రవర్తింపజేయబడుచున్నది; ఆది ఎట్లనగా రాత్రులందు ఉదయించి కనబడు న పరులలో పైగా కనబడు ఇరువురి నడుమకు సరిగా ఆకాశమందు ఏ నక్షత్రము కనబడునో ఆ నక్షత్రమందు సప్తర్షులున్నా రని నిర్ణయము; అట్లు వారొక్కొక్క నక్షత్రమునందు నూరేసి యేండ్లుందురు; ఇది యే సప్తర్షులు ఆయా నక్షత్రములతో కూడియుండుట; నక్షత్రములు ఋషులును కూడియుందురనుటకిది నిదర్శనము; పరీక్షిజన్మ కాలము నందు నూరేండ్లపాటు సప్తర్షులు మఖా నక్షత్రమందుండిరి; ఈ బ్రాహ్మణరులు ఇరువది నక్షత్రముల సంచారము ముగించు నాటికి ఆంధ్రరాజుల పాలనమారంభమయి వారు మరల మఖా నక్షత్రములోనికి వచ్చు నాటికి వీరి పాలన కాలము ముగియును.

ఆది మొదలుకొని ఈ లోక ము మిగుల వ్యాపత్తు ( క్లేశముల)లకు లోనగును; జనులు అనృతోప హతులును లుబ్దులును ధర్మ కామార్థములనుండి భ్రష్టులును శ్రోతస్మార్త ధర్మములు నశించినందునను వర్ణాశ్రమ ధర్మ ప్రవృత్తులు పాడై నందునను మోహితులలునయి వర్ల సాంకర్యములను పొందుదురు; బ్రాహ్మణులు శూద్రయోని గతులగుదురు; శూద్రులు మంత్ర యోనులగుదురు. శూద్రులు బ్రాహ్మణ ధర్మమాచరించుచు మంత్రజ్ఞానమునకు మూల హేతువులగుదురు; విప్రులు వారిని ఆశ్రయించి సేవించి వేదములను వేదార్థములను గ్రహింపగోరుదురు; కాలక్రమమున వీరు (విప్రులు) తమ వర్ణమునకును వర్ణాంతరములకును గల భేద మేమో కూడ లేకుండ ధర్మము నశింపజేయువారగుదురు.

 కృష్ణ భగవానుడేదినము నదివమేగేనో ఆనాడే కలియుగమారంభమయినది; దాని ప్రమాణమును తెలిపేదను వినుము; ఇదీ మానుష మానానుసారము నాలుగు లక్షల ముప్పది రెండు వేల సంవత్సరములు అగును; దివ్యమానాను సారము వేయి దివ్య సంవత్సరములు కలియుగమున ముగియగానే కలి సంధ్యాకాలమారంభమగును; ఇది నూరు దివ్య సంవత్సరములును దాని తరువాత కలి సంధ్యాంశము నూరు దివ్య సంవత్సరములును కాగా కలి ముగియును.

కాని వాస్తవముగ ఇది.

మాసా దివ్యాః స్మృతాః షట్చ దివ్యై ర్వర్టైశ్చ సప్రభిః

 7 గం.6 మా (దివ్య =7 1/2 X 360 = 15/2 x 360 = 15x180=2700. మానుష సంవత్సరములు. అని ఉండదగును. అనువాదకుడు

కలియుగము నిఃశేషముగా ముగియగానే మరల కృతయుగమారంభమయి ప్రవర్తిల్లును; సహదేవుడను వాడు ఐలుడగుటచే (ఇలగా మారిన ఇలుడను ఇక్ష్వాకు వంశ జుని వలన జనించిన రాజుల వంశ మందలి వాడు అగుటచే) అతడే చంద్రసూర్య వంశములకు రెంటికిని చెందిన క్షత్రియుడని చెప్పబడినది; ఏలయన వంశక్రమ విషయ తత్వవేత్తలు ఐళ (సూర్య) వంశ క్షత్రియ పరంపర సోమ వంశ పరంపర యందు సంక్రాంతమయ్యేనని కదా చెప్పిరి; ఏలయన సం స్తుత మగు ఇక్ష్వాకు వంశము సుమిత్రుడను వానితో ముగియును.

ఈ విధముగ కీర్తివర్ధనులగు వివస్వంతుని (రవి) పుత్రులును తద్వంశీయులును ఆగు అతీతానాగత వర్తమాన క్షత్రియులును వారినుండి ప్రవర్తిల్లినవారో పొలితులో యగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర జాతులును ఈ జాతుల యందు జనించి పాలకులయిన వారును చెప్పబడినారు; ఈ విధముగా వైవస్వత మన్వంతరమందు ప్రవర్తిల్లు (రాజ) వంశ పరంపర ముగియు చున్నది; తరువాత రాజత్వముతో పరిపాలించువారుండరని యర్థము;) లోగడనే చెప్పియున్న పూరు వంశ సంజాతుడగు దేవాపియను క్షత్రియుడును ఇక్ష్వాకు వంశజుడు (మనువంశ్యుడు) అగు సువర్చుడను వాడును రాబోవు ఇరువది తొమ్మిదవ మహాయుగమందు క్షత్రియవంశ ప్రవర్తకు లగుదురు; వీరు ఇరువురును అంతవరకును తమ మహాయోగశక్తి శే కలాప గ్రామమును ఆవానముగా చేసికొనియుందురు; వీరితోపాటు నపరులును నుండి మరల క్షత్రియ జాతిని కృత యుగ ధర్మమును త్రేతాయుగ ధర్మమును ప్రవర్తిల్ల జేయుదురు; ఇట్లు వీరు బీజభూతులై జాతిని ధర్మమును ప్రవర్తిల్లజేయుట ప్రతి కలియుగాంతమందును జరుగుచునే యుండును; క్షత్రజాతియు ధర్మమును లోకమున ప్రవర్తిల్లు టకై విప్రులు క్షత్రియులతో సంబంధము నందుటయే ఈ సూర్యచంద్ర వంశ క్షత్రియులగు దేవాది సువర్చసులతో సప్తర్షులు కలియుట; దీని చేతనే ధర్మనంతాన వర్ణ సంతానములు నడుచును. (సంతానమనగా అవిచ్ఛిన్న మయి కొన సాగుట(Continuity) మన్వ నరములు కొనసాగు విధానములును ధర్మ-జాతి సంతానముల ప్రకారములును వేదముల యందు చెప్పబడినవి; స్మృతులయందును స్మరింపబడినవి; వీనిని బట్టి తెలియునది యేమనగా అతిక్రాంతయుగములందును ధర్మ-జాతి వృద్దులు బ్రహ్మ-క్షత్ర జాతులలో శ్రేష్టులగు వారివలన ప్రవర్తిల్లినవే; ఆదియునుగాక సప్తర్షులు సామాన్యులు కారు; గడచిన యుగములును వానియందలి బ్రహ్మక్షత్రజాతుల ఉత్పత్తి ప్రకారములును వారి ప్రకృతులును ప్రశమ ము ( అణగారి పోవుటయు) ను క్షయమును వారికి దీరాయుః పరిమాణము కలిగించు విధమును వారి వృద్ధియు ఇన్ని యును వారెరుగుదురు.

ఈ చెప్పిన కమయోగము ననుసరించి ఐళులును (చంద్రవంశములో సం క్రాంతులయిన సూర్యవంశీయులును) ఇక్ష్వాకులును (కేవల సూర్యవంశీయులును) గడచిన త్రేతాయుగమునందు జనించిరి; పా రీ కలియుగమున క్షీణింతురు; హెరిట్లు జనించుచు వృద్ధినందుచు క్షీణించుచు మన్వంత రావసానము వరకును కొ సాగుచునే యుందురు; ఆయా యుగ ధర్మానుసారము నడుచుకొనుచుందురు. జామదగ్న్యుడగు రాముడు క్ష తజాతిని నిరవశేష మొనర్చగా ఈ వసుధ యంతయు క్షత్రియజాతిరాజశూన్య యగును: ఐనను తరువాత మరల రెండు రాజవంశములు లోకమున కొనసాగుచునే ఉండును: అది తెలి పెదను వినుము: ఈ రెండు వంశములకును ఐళవంశమును ఇక్ష్వాకు వంశమును మూల భూతములు: వీరి మూలముననే లోకమునందలి రాజవంశ పరంపరలును ఇతర క్షత్రియ జాతీయులును వర్ధిల్లుచు ప్రవర్తిల్లుచుందురు: ఐనను ఈ ఇరుతెగలలోను ఐళవంశీయుల సంఖ్య ఇక్ష్వాకు వంశీయుల సంఖ్యకంటే అధిక తరము; ఏ మయినను ఈ ఇరు తెగలవారును త్రేతాయుగమున ఉత్సన్ను లగుదురు; కలియుగమున క్షీణింతురు; (అనగా పూర్తిగా నశింతురని యర్థము కాదు.) వీరు మొత్తము ఏక శత వంశములవారు: తరువాత క్రమముగా వృద్ధి పొందినపుడు భోజులే అంతకు రెట్టింపు (202 వంశములవారు) అయిరి: మొత్తము ఉత్తమ వంశ క్షత్రియులు భోజులకు ద్విగుణ మయిరి: (అనగా 404 ప్రధాన వంశములవారు.) అనగా మూలభూతులగు ఐలై శ్వాక రాజవంశ సంఖ్యకు ఇది నాలుగు రెట్లు.

గడచిపోయిన రాజ వంశములలో వారివారి సనామత్వము ననుసరించి (వారివారి వంశ నామమును ఇంటి పేర్లను అనుసరించి పేర్కొందును వినుము; ఆయా ప్రధానవంశముల మూల కుటుంబ సంఖ్య ఇట్లుండును; 1. ప్రతి వింధ్యులు -100; 2. నాగులు-100 3. హయులు.100; 4. ధార రాములు.100; 5, జనమేజయులు-80; 6. బ్రహ్మ దత్తులు -100; 7. కురువులు.100; 8. పంచాలురు.100; 9. కాశికుశాదుల వంశమువారు ఒక్కొక్క కోవవారు నూరేసి వంశములు; 10. నీపులు శశ బిందువులు అను తెగలవారు వేయి వంశముల వారు; వారందరును యజ్ఞముల నాచరించిన వారే; లక్షల సంఖ్యలో (గోవులనో సువర్ణమునో) దక్షిణలుగా ఆ యజ్ఞములందు ఇచ్చినవారే; ఇట్టి రాజర్షులు వదల కోలదిగా గడచిపోయిరి; వీరందరును ఈ వైవస్వత మన్వంతరమున ప్రవర్తిల్లిన ప్రవర్తిల్లునున్న ప్రవర్తిల్లనున్న వారే; వారి ఉత్పత్తి క్షయములయందే లోక వ్యవస్థలు అన్ని యు ఆధారపడియున్న వి; వారి సంతానపు పరంపరల ఏ స్తర మును పారస్సరిక సంబంధ బాంధవ్యములతో కలిగిన వృద్ధిని సమగ్రముగా చెప్పుటకు పూర్వాపర యోగ సంబంధ) వృద్ధిని తెలుపుటకును నూర్ల ఏండ్లయినను చాలవు; ఈ వై వస్వత మన్వంతరమున ఇంతవరకును ఇరువది ఎనిమిది మహాయుగ ములు గడచినవి; ఇంకను నలువది మూడు మహాయుగములు గడువవలసియున్న వి; ఈ మహాయుగములతో పాటు ఎందరో దేవగణములవారును సంబద్దులే యు న్నారు; ఈ 'వంశ వృత్తాంతమనబడు పురాణాంగమగు అంశమును భవిష్య కలియుగ 'రాజవంశ' వృత్తాంతమును 'సమాస' 'వ్యాస' ' సంక్షేప’ ‘విస్తరణ' విధానములతో ఇంతవరకును తెలిపితిని; ఇంకను చెప్పుదుననినను ఆది బహు విస్తరమగుటచే నేను చెప్పజాలకున్నాను; ఇంతవరకును మీకు చెప్పబడిన రాజరు లందరును ఆయా యుగములందలి పొరు; వారు ఆయా యుగములతో పాటే గడచిపోయినారు; ఆ యుగములందు వారు మహా పురుషులుగ ప్రసిద్ధులు; రాజా! ఈ చేప్పినవి యన్ని యును యయాతి వంశ మునుదు జనించిన రాజులకు చెందిన ఆనువంశ వృత్తాంతములు; వీనిని హృదయమునందు ధరించు మానవులు తేజోవంతులగుదురు; ఆయువు కీర్తి ధనము స్వర్ణము పుత్రులు అను ఐదు విధములగు లౌకిక వర ములను ఐదింటిని పొందగలుగుదురు. దీనిని వినినవారును హృదయమందు ధరించిన వారునగు ధీమంతులకు ఉత్తమ సుఖ పద మగు స్వర్గ ము లభించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భవిష్య ద్రాజాను కీర్తనమను రెండు వందల డెబ్బది రెండవ అధ్యాయము.