మత్స్య మహా పురాణము
113 - భారత వర్ష వర్ణనము
ఋషులు సూతునిట్లడిగిరి: పరమాత్మనుండి జనించిన స్వాయంభువాది చతుర్ధశ మనువులును ప్రజలను సృజించుటకు ఆశ్రయమగు భారతవర్ష స్వరూపము తాము ప్రతిపాదించగా వినవలెనని మాకు కుతూహలమున్నది. అన గౌమ హర్షణుడగు సూత పౌరాణికుడు భావితాత్ములగు ఋషుల వచనము వినీ తన బుద్దీతో బహు విధముల విచా రణము చేసి మరల మరల విమర్శము చేసికొని వారందరును కూడి అడిగిన విషయమునందు సంతోషము కలిగి. ఇట్లు పలికెను: మీకు ఇక మీదట భారత వర్షమునందలి ప్రజల విషయమును తెలి పెదను; స్వర్గ పాతాళములకు నడుమ నుండుటచే మధ్యమ మనబడుచున్న ఈ భూలోకమందును ఈ భారత వర్షము మానవులు చేసిన కర్మలననుసరించి శు భో శంభ ఫలోదయమునకు హేతువయినది. దక్షిణ మహా సముద్రమునకు ఉత్తరమునను హిమాలయము నకు దక్షిణమునను కల ఈ దేశ మే భారత వర్షమనునది. దీనియందలి ప్రజలకు భార తులని వ్యవహారము. ప్రజలను భరించు-పోషించు. నది కావుననే దీనికి భారతము అని పేరు. ఈ దేశమునందలివారికి మాత్రమే తాము చేసిన కర్మల ఫలానుసారము స్వర్గము కలుగును. సాధనానుసారము మోక్షము కలుగును. దీనికే మధ్యమ (లోక) మను వ్యవహారము సార్థకము. ఈ భూమియందు కాక మరీ ఎచ్చటీపోరికిని (వేదిక స్మార పౌరాణిక) కర్మ విధులు ఇచట వలె విధింపబడియుండ లేదు. ఈ భారత వర్షము మరల నవద్వీప (ఖండములుగా విభక్తమయి ఉన్నది. ఆపి తెలి పెదను వినుడు. 1. ఇంద్రద్వీపము. 2. క శేరు ద్వీపము -8. తామ్రపర్ణ ద్వీపము 4. గభస్తి మాన్) మత్ ద్వీపము 5. నాగ ద్వీపము 6. సౌమ్యద్వీపము 7. గంధర్వ ద్వీపము 8. వారుణ ద్వీపము 2. భారత ద్వీపము (వీనినే ఆయా ఖండములనియు ననవచ్చును. దీనిలో భరత ఖండము సమగ్ర భారత దేశ మనియు మిగిలిన ఎనిమిదియు సింహళ ము బర్మా తూర్పు ఇండియా దీవులు మలయా అనియు గ్రహింపవలయును.)
ఈ భారతవర్షము చూడు వైపులందు సముద్రముచే చుట్టబడియున్నది. దీని దక్షిణా త్తర దైర్ఘ్యము వేయి యోజనములు; ఈ వర్గపు దక్షిణావధి కుమారీ స్థానము-ఉత్తరావధి-గంగా నది జన్మస్థానము. పొడవు వెడల్పులు పరస్పరము గుణించగా ఆగు వైశాల్యము తొమ్మిది వేల చదరపు యోజనములు. దేశపు పూర్వ పశ్చిమో త్తర దిశల ఆంతములయందు అంతటను మ్లేచ్చులగు యవనులును కిరాతులును ఉపనివేశ ముల నేర్పరచుకొని వసించుచున్నారు. ఇక నడుమయందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములవారు ఆయా తావులయందు యజనము ఆయుధవృత్తి వాణిజ్యము జీవనోపాధులుగా వర్ధిల్లుచు వ్యవహరించుచు నివసించుచున్నారు. వారియందు పరస్పర భేదముండని ఏకరూప సమాన వ్యవహారమును కలదు. ఆయా వర్ణములకును ఆశ్రమములకును విహితములగు కర్మలననుష్ఠించుచు ధర్మార్థ కామ మోక్షము ల పై సంకల్ప పూర్వకముగా యత్నము చేయుటలో వీరందర వ్యవహారమును సమముగా నుండును. ఇచటి మానవుల ప్రవృత్తియంతయు ఇహలోక జీవనము విషయమున గాక పరమున స్వరమునో అపవరము (మోక్షము)నో సాధించుటకు అభిముఖ మైయుండును. ఈ చెప్పిన తొమ్మిదింటిలో తొమ్మిదవదియగు భారత ద్వీప (భరతఖండ)మునకు తిర్యగామమని తూర్పు పడమరలుగా వ్యాపించిన వీథి నిర్మాణముగల గ్రామములు గలదియని వ్యవహారము కలదు. ఈ లోకమునంతటిని సృష్టించు సృష్టికర్తకు ‘నమ్రాట్’ అని వ్యవహారము; ఇంతియకాక-భూర్-భువర్-సువర్ అను మూడు వ్యాహృతులలో మొదటి దానికి అర్హనుగు ఈ మధ్యమ లోకమునకు సమ్రాట్ అనియు భువర్ అను వ్యాహృతికర్థమగు అంతరిక్ష లోకమునకు విరాట్ ఆనియు సువర్ అను వ్యాహృతి కర్ధమగు ద్యులోకమునకు స్వరాట్ అనియు వ్యవహారము. వీనిలో మొదటిదియు స మాట్ అనబడునదియునగు ఈ లోకపు. భరత వర్షపు. విస్తరమును ఇంకను చెప్పెదను.
గజ్గాదినదీవర్ణనమ్
ఏడ (తొమ్మిద)వదగు ఈ మహావరమునందు ఏడు విశాల కులపర్వతములు మ హేంద్రము.మలయము.సహ్యము శుక్తిమాన్ ఋక్ష వాన్.వింధ్యము . పొరియాత్రము. అనునవి కలవు. వీటికి సమీపములందు ఈ కులపర్వతములకు సంబం ధించినవి ఇవి అని గుర్తింప వీలగు లక్షణములు కలవి.పర్వములు (బుడిపేలు-ఉబ్బు-ఎత్తులు) కలవీ విశాలము లే చిత్రములై వివిధ లక్షణములు కలిగి అచ్చెరువు గొల్పు నేత్రములు (ఉన్నత సమతలములు) కలవి అగు శాఖా పర్వతములు వేలకొలదిగ కలవు. ఈ శాఖా పర్వతములకు అనుబద్దములై వీనికి పిలకలవలె పుట్టినవి.పొట్టివిఎన్వల్పమగు ఉపజీవనము (వృద్ధియు శిలాదార్ద్యమును కలవియగు చిన్న గుట్టలు మరి వేల కొలది గలవు. ఈ పర్వతములతో శాఖోపశాఖా పర్వతములతో ఏమిశ్రములగు (వీనికి చుట్టు పట్టులనో వీని నడుమనో ఉన్న) జనపదములు (పల్లెలు) న్న వి. వానియందు ఆర్యులును మ్లేచ్చులును ఆంతట నివసించుచున్నారు. వారు ఆయా ప్రదేశములందు గంగా సింధు సరస్వతీ శతద్రూ చంద్రభాగా యమునా సరయూ శరావతీ వితస్త్ర విపా పాశా). దేవికా కుహూ గోమతీ- ధూమపాపా బాహుదా దృషద్వతీ కౌశికీ తృతీయా నిశ్చారీ గండ కీ బహు లోహితా నదులనేడుహిమవత్పాదములనుండి జనించిన సదుల (జలము)ను వేదస్మృతి వేత్రవతీ వితస్తా సింధు- పర్ణాసా నర్మదా కౌబేరీ మహతీ వారా చంద్రవతీ యూపొ విదుషా వేణు జీవి ఆ శి ప్రావంతీ కౌంతీ నదుల నేడు పొరియాత్రగిరి పరిసరములనుండి జనించిన నదుల (జలము)ను శోణ మహానద నందినీ సుకృ కృశా. మందాకినీ (ఇది గంగానది కాదు.) దేవ వర్ణ చిత్ర కూటా తమసా పిప్పలా శోణా కర తోయాంబికా చిత్రోవలా విశాలా మధురా బహు వాహినీ ముక్తి మందాకినీ (ఇది మరియొకటి) లజ్జా మకుటోద్భేది కా నదులనేడు అమల జలయుతములగు ఋక్షవత్పర్వత సంజాత నదుల (జలము)ను తాపీపయోష్ఠి నిర్వీంధ్యా శ్రీపావృషభా వేణీ వైతరణీ విశ్వమాలా కుముద్వతీ తోయా మహాగౌరీ దుర్గమా శిలానదులనెడు వింధ్య పాదమునుండి ప్రభవించిన మరి కొన్ని నదుల (జలమును శుభ శీతజలములగు గోదావరీ భీమరథీ కృష్ణవేణీ వంజు తుంగభద్రా సుప్రయోగా బాహ్యా కావేరీ నదులనేడు సహ్య పర్వత పాద నంజాత దక్షిణాపథ నదుల జలము)ను కృతమాలా తామపర్ణీ పుష్ప జోత్పలా నదులనేడు శుభ శీత జలములగు మలయ పర్వత పాద సంజాత నదుల జలము)ను విషమా సర్వకుల్యేకుజ, తిదీవాచలా తామ్రపర్ణీ మూలీ శరారీ విమలా నదులనేడు శుభ ప్రవాహ యుతములగు మ హేంద్ర పర్వత - సంజాత నదుల (జలము)ను కౌశికా సుకుమారీ మందగా మంద వాహినీ కృపా - పలాశిని నదులనెడు శు శ్రీమత్పర్వత సంజాత ములును పుణ్య జలయుతములును పుణ్యకరములును సమగ్రములును సముద్రము గామినులును నగు నదుల (జలమును తావుచు జీవించుచుందురు. ఈ చెప్పిన నదులన్నియును పుణ్య జలవంత ములు.మహాద్రి సంజాతములు-విశ్వమునకు తల్లులవంటివి.సర్వ పాపహరములు - శుభకరములునై నవి. ఈ నదులలో కలి సెడి చిన్న నదులును ఉపనదులును నూరుల కొలదిగా వేలకొలదిగా గలవు.
కురుపఞ్చాలాదిదేశాః
ఆ నదుల నడుమ ఈ చెప్పబోవు దేశము లనేకములు గలవు. (అవి మధ్యదేశములు - ఉదీచ్య దేశములు - ప్రాచ్య దేశములు-దక్షిణాపథ దేశ ములు-అపరాంత దేశములు.వింధ్య పృష్టస్థ దేశములు-పార్వతీయ దేశములు అని ఆరు విధములుగా విభజింపబడినవి. వానిలో మొదట *మధ్య దేశ జనపదములు:) కురువులు పాంచాలములు సాశ్వ ములు జాంగలములు (పంటకు అంతగా పనికిరాని భూములు కల జనపదములు) శూర సేనములు కాంభోజములు ఆంధ్రములు బర్బరములు మత్స్యములు కిరాతములు కులములు కాశిజనపదములు కుంతలములు - కోసలములు ఆవంత ములు అనులింగములు మూక ములు అంబకములు - ఇవి మధ్యదేశ జనపదములలో చాలవరకు అయినవి: (మధ్య దేశము అనగా హిమాలయపు దక్షిణపు అంచునకును వింధ్యపు ఉత్తరపు అంచునకును నడుమ కురు క్షేత్రమునకు తూర్పున ప్రయాగకు పడమటగల దేశము.)
గోదావరినది ప్రవహించు దేశము ధన్యము; పృథివియంతటిలోను అది మనోరమము. ఈ - నదీతీరమునందే శ్రీరామ ప్రీతికై సుగ్రీవాది వానరులును ఋక్షులు జాంబవజాతీయులు)ను 'గోవర్ధన' అను నగరిని నిర్మించిరి. భర ద్వాజ మునియు ఆ శ్రీరామ ప్రీతి కే దివ్యౌషధులను భూమి కవతరింవజే సెను. కావుననే ఆ దేశ శేష్ణ ము మనోరమమయ్యెను.
ఇక ఉదీచ్య దేశములు: బాహ్లికములు - రాజధాన్యములు ఆభీరములు ఆకాలములు తోయక ములు పరంధములు శూద్రములు దేశ నామము) పప్లవములు ఉపఖండితములు గాంధారములు యవనములు సింధువులు సౌవీరములు మద్రకములు శశకములు హూణములు కళింగములు పాఁదములు హార ములు పూర్తికములు రామ ఠములు కర్ణికారములు కేక యములు దశ నములు అసికములు క్షత్రియ వైశ్య శూద్రుల ఉపనివేశములు ఆత్రేయములు భరద్వాజములు ప్రస్థలములు రమేరక ములు లంబక ములు స్థల బాణములు సైనికములు జాంగ లములు అను ఈ జన పదములు ఉదీచ్యములు.
ఇక ప్రాచ్యజనపదములు: అంగములు వంగములు మండుకములు ఆంతర్గెర ములు బహిర్గిరములు (పర్వతము లకు లోపల-వెలుపల ఉండునవియని ఆర్థము ) ప్లవంగములు మాతంగములు యమకములు ఆమలవర్ణకములు సహ్యోత్తర ములు ప్రవిజయములు భార్గవములు గేయములు చూళవములు ప్రార్ణ్యోతిషములు పుండ్రములు విదేహములు తామలి ప్రక ములు స్వాములు మాగధములు గోనర్ణములు అనునవి ప్రాచ్యజనపదములు.
(* శరావతీనది సీమా రేఖగా దానికి పశ్చిమో తరమునం(లం)దు ఉండిన ఉత్తర భారత దేశమునకు ఉదీచ్యదేశము అనియు ఆనది కే ప్రాగ్గక్షిణములందు ఉన్న ఉత్తర భారత దేశమునకు ప్రాచ్య దేశము అనియు పూర్వుల వ్యవ హారము. ఇట్లుత్తర భారత దేశమునందలి దేశములన్నియు ఉదీచ్యములు ప్రాచ్యములు అని రెండు విధములే అగు చున్న వి దేశ ములకు పూర్వము జనపదములనియే ఎక్కువ వాడుక. జనపదములే గ్రామములే) అధికముగా ఉండుటచే వాని సముదాయమునే ఒక పాలనా విభాగముగా గ్రహించుటచే ఈ వాడుక ఏర్పడియుండును. కనుక నే కురువులు ఇత్యాది దేశ నామములు బహువచనములు.)
ఇక దక్షిణాపథ జనపదములు: పాండ్యములు కేరళములు చోళములు కుల్యములు సేతుక ములు మూషికములు కుపథములు చార వాసికములు నవరాష్ట్రములు మాహిషకములు క శింగములు కావేర్యములు మహా శీకములు కేరములు సవరములు. ఇవి దక్షిణాపథమునందలి జనపదములు.
ఇక అపరాంత (పశ్చిమ దిశయందలి) జనపదములు: పుళిందములు (నేటి బుందేల్ ఖండ్) వింధ్యభూతములు మూషకములు దండకములు కులపములు నీరాభములు రూపసములు తారసములు సదనములు తరుణికములు సర్వాకర ములు నాసిక్యములు ఆంతర నర్మదములు భరుక చ్చములు మా హేయములు సారస్వతములు కాశ్మీరములు సౌరాష్ట్రములు ఆర్బుదములు. ఇవి అపరాంత జనపదములు (భారతదేశపు పడమటి దిశ లో పశ్చిమ సముద్రవరకు వ్యాపించిన ప్రదేశ మందలి జనపదములు.)
ఇక వింధ్య పర్వతముతో సంబంధముగల జనపదములు: మలడములు క రూశములు మేలకములు చేలక ములు అర్ధములు షోడశార్ణములు భోజములు కిష్కింధకములు గోసహ్యములు కోసలములు శ్రీపురములు వై దికములు తుసుర ములు తుంబురములు పడుమములు నై రథములు ఉత్తరములు దశములు కాంభోజములు మాగధములు కొసలములు కోసల ములు కై పురములు వేదికములు మర్మరములు ఘూర్జరములు గృహ బలములు అంతపములు తుండికా కేరములు వీతి హోత్రములు అవంతులు -ఇవి వింధ్యమును ఆశ్రయించియుండు జనపదములు.
ఇక ఇతర పర్వత ప్రాంతములందును పర్వతములందును ఉండు జనపదములు: నీహారములు హిమవర్తములు కుంతోదములు కుశ లావహములు కర్ణ ప్రావరణములు ఊర్ణములు దార్వములు మద్రకములు త్రిగర్తములు (తిర్ హుత్) మండలములు కిరాతములు చామరములు (చమరీపశువు లుండు జనపదములు)- ఇవి పర్వతాశ్రయి జనపదములు.
[ఈ చెప్పిన జనపదముల పేరులలో కొన్ని ఆయా స్థానములందలి గుణలక్షణములను బట్టి ఏర్పడినవి. కొన్ని ఆచట నివసించు జనులను బట్టి ఏర్పడినవి. కొన్ని మన కీనాడు తెలియని ఏ భాషకో చెందినవి.
ఈ జనపదములు కూడ మనకు తెలిసిన కొన్ని ఈనాడు మన మను కొనుచోట కాక మరియొక ప్రాంత మున నున్నట్లు ఇచట కనబడు చున్నది. మరికొన్ని దేశ నామములు రెండుచోట్ల వచ్చు చున్నవి. ఇందులకు హేతువులను జాగ్ర తతో.. పరిశీలించుకొన నగునే కాని అవి తోచినట్లు వ్రాసిన పుక్కిటి పురాణము, మాత్రము కాదు. ఉదాహరణమునకు ‘ఆంధ్ర’ జనపదము మధ్యదేశ జనపదములలో సున్నది. నే ఓ ఆంధ్రదేశ ము దక్షిణాపథ మునం దున్నది. నేడును మధ్య దేశమున ఆంధ్రులు చాలమంది యుండుట ప్రసిద్దము. దీనిని బట్టి చూడగా ఈ ఆంధ్రులు పూర్వము మధ్యదేశీయు లేయై యుండి వారిలో కొందరు దక్షిణాపథమున కూడ వ్యాపించి రేమో యనియు. ఆలోచింపవలయును. ఇట్లే మరికొన్ని జనపద ముల విషయమును.]
కింపురుషాదివర్షవర్ణనమ్
ఈ భారతవర్షము నందు కృత త్రేతా ద్వాపరక లులు అను నాలుగు యుగములు వ్యవహార మునం దుండునని మునులు వచించిరి. ఈ చతుర్యుగ స్వరూప లక్షణములను ఇక మీదట ఏమియు పిడువక అంతయు చెప్పెదను. ఆసగా ఋషులు ఇంతవరకు అతడు చెప్పినదే మరికొంత వినరి సంతోషముతో కూడిన కుతూహలము తో నిట్లనిరి: ద్విజో తమా! జంబూద్వీప తదితర ద్వీప విస్తర మును వానియందు వసించు మానవులయు ఉండు. వృక్షములయు వివరణ మును మాకు తెలుపుడు. మీరు భారతవరమును యథాతత్వముగ మాకు తెలిపితి. హరి కింపురుష వరములను కూడ తెలుప వేడెదము. అనగా సూతు డిట్లనెను: విప్రులారా! మీకు వినగోరిక కలదేని సావధానులై వినుడు. కింపురుష వర మున సందసవనమువంటి జంబూ(నేరేడు)వనము కలదు. అచట వారి ఆయువు పడి వేలేండ్లు. వారి దేహకాంతి మెరుగు పెట్టిన బంగారు కాంతి. ఆ ద్వీపమున తేనెలు ప్రవహించు జువ్విచెట్టు కలదు. అచటి వారు. దాని ఉత్తమ రసము తావి రోగ శోక రహితులై సదా ముదిత మానసులై ఉందురు. అచటి స్త్రీ లప్సరసలవంటి సుందరులు. దాని కవతలిది హరివరము. అచటి జనులు వెండి కాంతిబోలు దేహచ్ఛాయ కలవారు. దేవలోక పరిభ్రష్టులు అచట జనింతురు. వారు దేవతలను పోలి యుందురు. వారు చెరకు రసమును తాపి జబాధలు లేక పదునొకండు వేలేండ్లు జీవింతురు.
భారత కేతుమాల భద్రాశ్వ కురువరి ముల నడుమ నున్నదని నేను లోగా చెప్పిన ఇలావృత వర్షమున సూర్యుడు తపింపడు. అచటి వారికి శైథిల్యము కాని వార్ధకము గాని లేదు. అచట చంద్ర రవి నక్షత్ర పవనాగ్ను లతో పని లేదు. అచటీవారు పద్మ కాంతి పద్మవర్ణము పద్మపత్ర నేత్రములు పద్మ గంధ సదృశ గంధము కలిగి అచటి జంబూ ఫల రసపానముచే పదునై దు వేల ఏండ్లు జీవింతురు. వారికి వార్ధకము ఆక లిబడలికలు మృత్యువు లేవు. ఇదంతయు వారు తావు జంబూ ఫలరస మహిమమే. ఆ రసము నదియై మేరువును ప్రదక్షిణించి మరల జంబూ వృక్ష మూలమును చేరును. అచటి దేవులకును మానవులకును సహజ కనకమయ భూషణములే. అవి ఇంద్రగోప కీటముల ఆర్ద్రపురుగుల)వన్నె తో నుండును. ఏలయన అన్ని వర్షములందలి ఆయా ఫలరసము లును ప్రవహించి నిర్మలమగు బంగారయి దేవభూషణ మగును. ఆచటి వారి మూత్ర పరీషములును అష్టదిశలందును సువర్ణ మే సదా ప్రకాశించును. ఈశ్వర సంకల్ప రూపాను గ్రహమున వారిలో కొందరిని అచటి భూమి మింగివేయును. అదియే వారికి మృతి. అచట వసించు రక్షః పిశాచయములును సువర్ణవంతులే.
హేమకూట పర్వతమున గంధర్వాప్సరసలు శేషవాసుకి తక్ష కాది మహానాగులు వసింతురు. మహామేరు పర్వత మున ముప్పది ముగ్గురు దేవతలును (ఏకాదశ రుద్రులు. ద్వాదశాదిత్యులు - అష్టవసువులు. ఇద్దరు అశ్వినులు) సదా వసింతురు. నీల వైదూర్యమణియుతమగు దీనియందు సదా బ్రహ్మరులు నివసింతురు. శ్వేత పర్వతమునందు దైత్యులు దాన వులు నివసింతురు. శృంగవత్పర్వతము శ్రేష్ఠమయినదియు పితృ దేవతలకు లయాత్మకమయినదియు; (పితృ దేవతలు దీనియందు లయమునొంది అదృశ్యరూపులై యుందురు.)
ఈ విధముగ నేను మీకు భరతవర్షము మొదలుగా నవవరముల విషయము తెలిపితిని. వీనియందు ఆయా స్థిర చర భూతములు నివసించుచున్న వి. దేవమాన మానుషమానముల ననుసరించి వాని పరిమాణాదిక మును జనన వృద్దులు ఆయువు మొదలగు పరిమాణములును బహు విధములుగా పెద్దలు చెప్పుచున్నారు. దానిని స్పష్ట రూపమున ఇది ఇట్లని చెప్పుట శక్యము కాదు. కావున నేను చెప్పిన ఈ విషయము లన్నీ యు ఆస్తికతా ప్రామాణిక తా భావములతో విశ్వసింప విలసినది.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున భూగోళ వర్ణనమున సప్తద్వీప వర్ణనమున జంబూద్వీప వర్ణనమున భారతాది వర్ష వర్ణనమను నూట పదుమూడవ అధ్యాయము.
