మత్స్య మహా పురాణము

Table of Contents

4 - బ్రహ్మకు స్వపుత్త్రీ గమన దోష పరిహారము మొదలగునవి

మనువు ఇట్లు పలికెను: ప్రభూ! బ్రహ్మ తన కుమార్తెను పొందెను; అంటిరి. చీ ! ఇది ఎంత నీచమయిన పని! అతడు మరల ఏ ప్రాయశ్చిత్త కర్మము నాచరించి లోకములకు ద్వేషించ రానివాడు అయ్యేను ? అతని కుమారులు ఒకరికి ఇంకొకరు సగోత్రులగుదురు. వారిలో వారికి వైవాహిక సంబంధము జరుగుట ఎట్లు ? ఈ సంశయమును నివారించుడు.

మత్స్య భగవానుడు ఇట్లు పలికెను : నేను చేసిన ఆది సృష్టి రజోగుణముచే ఉద్భవించినది. దివ్యమయినది. (లోక సాధారణమయినది కాదు.) అతీంద్రియము. ఇంద్రియములకు అందనిది. ఇంద్రియములకు గోచరించని శరీరము కలది. దివ్య తేజోమయము. దాని రూపము దివ్యమయినది. ఉత్తమమగు జ్ఞానముచే ఉత్ప త్తి చెందినది. మర్త్యులు తమ మాంసపు కన్నులతో దానిని తుద వరకు సంపూర్ణముగా) చూడ జాలరు. సర్పములు ఆకాశమున సంచరించు వివిధ పక్షుల మార్గమును చూడ జాలవు. అట్లే దివ్యులగు వారి మార్గమును వేదములే కాని మానవులు తెలిసికొన జాలరు. అందు వలన వారి తత్వమును విచారణ చేయుటయే మానవులకు శుభకరము.

సావిత్రిని పొందుట బ్రహ్మకు దోషము కాదు.

ఈ చతుర్ముఖుడు సర్వ విద్యలకు అధిష్టాత. సర్వ విద్యా రూపయగు ఈ గాయత్రి (శబ్దరూప) ఆతని శరీరము నుండి పుట్టినదనియు అందుచే కూతురనియు చెప్పబడుచున్నది. ఆ ఇద్దరకును మూర్తి (ఆకారము - శరీరము) ఉండు గాక -లేకుండుగాక ! ఆ ఇద్దరును దంపతులే. ఇట్లు (విద్యాధిష్ఠాతయగు) బ్రహ్మ ఉన్న చోట (విద్యారూపిణిఅగు) సర స్వతి (భాషారూప - శబ్ద రూప కూడ ఉండనే ఉండును. భారతి ఉన్న చోట బ్రహ్మ ఉండి తీరును. సూర్యుడులేని ఛాయ ఎక్కడను ఉండనట్లు గాయత్రి (సర స్వతి)యు బ్రహ్మ సమీపమును విడిచి ఉండదు. బ్రహ్మ వేదరాశి రూపుడు. సావిత్రి అతనిని ఆశ్రయించి ఉండును. కనుక బ్రహ్మ సావిత్రిని పొందెను. అనుటలో దోషము ఏ మాత్రమును లేదు. ఏలయన సావిత్రితో కలియనంతవరకును బ్రహ్మ అజ్ఞానముతో కూడి ఉం డేను.

మన్మథాయ విరిజ్ఞ్చదత్తశాప స్తత్పరీహారశ్చ - బ్రహ్మ మన్మథుని శపించి అనుగ్రహించుట

(*తస్మాత్త్వద్దేహమచిరాద్రుద్రోభస్మీకరిష్యతి

*సమామకారణాచ్ఛప్తుం)

తన కుమార్తెను తాను పొందుట కారణముగా బ్రహ్మ మన్మథుని శపించెను. మన్మథా ! నాయంతటి వానీ మనస్సును కూడ నీవు నీ బాణములచే సంక్షోభింపజేసితివి. కావున రుద్రుడు నిన్ను కోపముతో భస్మము చేయును. అనగా మన్మథుడు బ్రహ్మను ఇట్లు అనుగ్రహింపజేసికొనెను: భగవన్ ! నీవు ఇక్కడ ఇప్పుడు ఇట్లు నన్ను అకారణముగా శపింపదగదు. మీరే నన్ను ఇట్టి వానినిగా . సర్వ ప్రాణులకు ఇంద్రియములను క్షోభింపజేయు వానినిగా - పుట్టించితిరి. ఈ చోట ఆ చోట ఆనక ఇప్పుడు అప్పుడు అనక ఎల్లప్పుడు ఎల్లచోట్ల హాని కలిగించు తలంపుతో ప్రయత్నించియైన నీవు స్త్రీ పురుషులమనస్సు కలత పరచవలయును. అని మునుపు మీరే నాతో పలికితిరి. మరల నాకు నా శరీరము లభించు నట్లు అనుగ్రహము చేయ వేడుచున్నాను. అని మన్మథుడు వేడగా బ్రహ్మ ఇట్లు పలి కెను : వైవస్వత మన్వంతరము వచ్చినప్పుడు యదు వంశమున నా సత్వమును బలమును పూని రాముడు అను మానవుడు జన్మించును. అట్లవతరించిన అతడు శత్రుపురముల ధ్వంసము చేయు మహా శూరుడై ద్వారక యందు నివసించును. అప్పుడు నీవు అతని తమ్ము నకు అతనితో సముడగు సుతుడవై జన్మింతువు. ఇట్లు శరీరమును పొంది అ శేష భోగముల ననుభవింతువు. పిమ్మట భరత వంశము ముగియు కాలమున వత్సరాజునకు కుమారుడవై ధర్మానుసారము దేవయోనిని (జన్మమును పొంది ప్రళయ కాలము వరకు విద్యాధరుల కధిపతివై. యుండి తుదకు నా సారూప్యమును పొందెదవు.

ఇట్లు శాపము చేతను అనుగ్రహము చేతను శోక మును ప్రమోదమును పొంది మన్మథుడు తాను వచ్చిన మార్గ మున వెళ్లెను.

శౌనకాదిఋషు లిట్లనిరి : మన్మథుడు తన దేహమును మరల పొందుటకై యదువంశమున జన్మించునంటివి. కుసుమాయుధుడు ఏల ఎట్లు రుద్రునిచే దగ్గుడు అయ్యెను? (తన భార్యనుండి) కుమారులే లేని ఈ భరథుని (బ్రహ్మ) నుండి ఏ సృష్టి మొదటగా జరిగెను? మాకు ఇది అంతయు మొదటి నుండి తప్పక చెప్పగోరెదము. అనగా సూతు డిట్లు చెప్ప నారంభించెను. బ్రహ్మదేహార్ధము నుండి జనించేనని నేను చెప్పిన గాయత్రి వేద విశారద. పండితులకును దేవతలకును తల్లియు ఆరాధ్యయగు దేవియును. శతరూప (వందలకొలది రూపములు కలది); ఇంద్రియములను జయించినది... బ్రహ్మ ప్రజాపతి శతరూపయందు రతి-మనస్సు-తపస్సు-వృద్ధి- అహస్సు (పగలు)-దిక్కు-తమస్సు (చీకటి) అను ఏడు - మందిని కనెను. సర్వ విద్యాత్మకమగు ఈలోకము బుద్ధి శాలియగు బ్రహ్మకు జనించిన మానస పుత్తులగు మరీచి మొదలగు వారికి సంబంధించినది అయ్యెను. అనగా వా రీ లోకమునకు ప్రజాపతులుగా నయిరి.

తరువాత లోక విభుడగు బ్రహ్మ త్రిశూల  శ్రేష్టమును ధరించినవాడును మొదటి , వారికంటే మొదటి వాడును అగు వామదేవుని సనత్కుమారుని కూడ సృష్టించెను. భగవానుడగు వామదేవుడును తన ముఖమునుండి బ్రాహ్మణులను బాహుపులనుండి క్షత్రియులను తొడలనుండి వైశ్యులను పాదములనుండి శూద్రులను సృష్టించేను. మెఱపులను పిడుగులను మేఘములను వంకరలేని ఇంద్ర ధనుస్సును ఇంద్రుడు , మొదలగు వారిని పర్జన్యుని సాధ్యులు అను - దేవ గణములను సృజించెను. తన మూడవ కంటినుండి జరామరణములు లేని ఎనుబది నాల్గు కోట్లమంది దేవతలను కూడ సృష్టించెను. అంతట బ్రహ్మ వామదేవునితో ఇట్లనెను. శుభా శుభములతో కూడి చావు ముసలితనములతో కూడిన సృష్టియే మేలయినది కాని ఇట్లు జరామరణములు లేనిదై ఉండరాదు. అని అతనిని వారించేను. కల్పాదియందు -- ఈశ్వరుడింత -- వరకు సృష్టించిన తరువాత అతని సృష్టి నిలిచిపోయేను.

స్థిరబుద్ది కలవాడగు స్వాయంభువ మనువు మిగుల దుస్తరమగు తపస్సాచరించి అనంత అను నామముకల భార్యను పొంది మనస్సున సంతుష్టి చెందెను. ఆ మనువు ఆమెయందు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను కుమారులను కనెను. ఉత్తానపాదునకు ధర్ముని కుమార్తెయగు సూనృత యనునామే భార్యయయ్యెను. ఆమె నేర్పరి. సౌందర్యవతి. ఇం పైన నెమ్మది నడక గలది. ఇతడు నాకు రక్షకుడు. ఇతడు నావలన కీర్తిశాలి కావలయును. అను భావము తన భర్త యందు కలది. (అయంపతి.అయంమత్తుడు-కీర్తిమాన్-ధ్రువుడు అను వారందరును ఉత్తానపాదుని కుమారులని కొందరు. చెప్పుచున్నారు. ఆమె యందు ఉత్తానపాదుడు ధ్రువుని కుమారునిగా పొందెను. పురాతనకాలముననే ఆ ధ్రువుడు దివ్య తపము ఆచరించి దివ్యమగు రూపమును బ్రహ్మ లోకమునకు దిగువగా స్థిర స్థానమును సంపాదించెను. ఈ ధ్రువుని ముందుంచుకొనియే సప్త మహర్షులు ఉన్నారు. ధ్రువునకు ధన్యయను మనుపుత్తియందు శిష్టి కుమారుడు అయ్యెను. శిష్టికి అగ్ని పుత్తియగు సుచ్చాయయందు రిపుడు రిపుంజయుడు వృత్రుడు వృకలుడు వృక తేజసుడు అను కుమారులు కలిగిరి. రిపుంజయునకు బ్రహ్మకు దౌహితి అగు వీరిణి (వే రిణి) యందు చాక్షుషుడు కుమారు డయ్యెను. ఈతనికి వీరణుని కుమార్తె యగు నడలయందు శూరులు పవిత్రులునగు ఊరువు పురుడు శతద్యుమ్నుడు తపస్వి సత్యవాక్ కవి అగ్నిష్టోముడు అతి రాత్రుడు సుదృష్టి అభిమన్యుడు అను పదిమంది కుమారులు కలిగిరి. ఊరువునకు ఆగ్నేయియందు ఆంగుడు సుమనసుడు. స్వాతి క్రతువు అంగిరుడు శిబి అను కుమారులు కలిగిరి. పితరుల కన్యయగు సునీథ అను నా మెయందు అంగునకు వేనుడు పుట్టెను.

అన్యాయియగు వేనుని విప్రులు మథించిరి. అతని చేతినుండి మహా తేజస్కు డగు పృథువు కలిగెను. అతనికి శిఖండియందు అంతర్ధానుడు హవిర్గానుడు అను కుమారులు కలిగిరి. హవిర్గానునకు ఆగ్నే యియందు ప్రాచీనబరి శుక్రుడు గయుడు కృష్ణుడు ప్రజా జినుడు అను ఆరుగురు కుమారులు కలిగిరి. భగవానుడును మహాత్ముడునగు ప్రాచీనబర్షి ప్రజా పతి అయ్యెను. ఏలయన అతనిచేత హవిర్ధానులు అను పేర అనేకులగు ప్రజలు ప్రవర్తిల్ల జేయబడిరి. బంగారు గుర్రములు కలవారు మహా భాగులును భగవద్భక్తులును అగు పదిమంది అతని కుమారులు. వారికి అందరకును ప్రాచేతసులు అని పేరు. వారందరు ధనుర్వేదము చివర వరకు నేర్చినవారు ధను ర్వేదపు తత్వము నెరిగినవారు); ఒకప్పుడు భగవంతుని ఆదేశ మున లోక మునందలి వృషోషధీ జాతులను అగ్ని దహించెను. వాటిని ఈ ప్రాచేతసులు అంతట ప్రకాశించునట్లు చేసిరి. సోముని కన్యయగు మానస అనునామే వారికందరకు పత్ని అయ్యెను. ఆమె వారివలన పూజ్యుడగు దక్షుడను కుమారుని కనెను. అతని తరువాత నల్లని ఓషధులును అన న భద్రవతి ఆను కుమార్తెలును ఆమెకు సంతానమయ్యెను. సోమాంశము వలన కలిగిన ఆ దమునకు లెక్కలేనన్ని కోట్ల సంతానము కలిగెను. లోకమునందు నిలిచియున్న ఆ సంతాన విస్తరమును తెలి పెదను వినుము. రెండు పాదములు కలవారు అనేక పాదములు కలవారు కోతి మొగము వంటి మొగము కలవారు శంకువువంటి చెవులు కలవారు కప్పువడిన చెవులు కలవారు పులి మొగము వంటి మొగము పచ్చని మొగము కుక్క మొగము వంటి మొగము పంది మొగము వంటి మొగము ఒంటే మొగము వంటి మొగము కలవారు అనేకులు మ్లేచ్చు లందరును అతనికి మానస సుతులుగా జనించిరి. అనంతరము ప్రీతి అను భార్యయందు చాలమంది స్త్రీలు అతనికి కూతు లుగా కలిగిరి. ఆ స్త్రీలనుండియే దేవతలు ఆసురులు మనుష్యాది ప్రాణులు; వీరితో జగత్తంతయు నిండిపోయేను.

ఇది శ్రీమత్స్య మహా పురాణమున బ్రహ్మకు స్వపు తీగమన దోషము లేక పోవుట మొదలగు వృత్తాంతములు కల చతుర్థాధ్యాయము.