మత్స్య మహా పురాణము

Table of Contents

156 - పార్వతి బ్రహ్మ వరమున గౌరదేహ (గౌరి) యగుట॥

వీరకా! నీవు నీయందతివాత్సల్య పరవశనయియున్న నన్ను ఖండించి (లెక్క పెట్టక) శంకరుని రహస్య సుఖ మున అన్యస్త్రీల కవకాశమిచ్చితివి కావున పరుష యు రూక్ష (టెరు సైనది)యు జడ (అచేతన) హృదయహీన యగుశిల నీకు తల్లియగును॥ అని పార్వతి వీర కుని శపించెను॥ శివ మహిమ తత్వములందు గల ప్రక్రమానుసారము ఇట్టి విచిత్ర కథాశ్రయమగు ఈ వృతాంతమే వీరకుడు శిల నుండి జనించుటకు హేతువు॥ (మరియొక జన్మమున ఈ వీర కుడు శిల నుండి జనించెనని దీనినిబట్టి ఎరుగవచ్చును॥)

ఇట్లు శపించిన తత్క్షణమే పార్వతీ ముఖమునుండి ఆమే హృద్రత మహాక్రోధము మహాబలశాలియగు సింహ మయి వేలికి వచ్చెను॥ ఆ సింహము మిట్ట పల్లములు గల ముఖము కలది; జడలు నిండిన కంఠము పైకిలేచి యాడుచు వ్రేలాడుచునుండు పొడవుతోక కోరలతో వికటమగు ముఖ విస్తారము విశాలముగా తెరచిన నోరు కదలియాడు నాలుక సన్న ని పొట్టకల దై (కనబడిన దేల్ల ఆహారముగా) తిను కోరిక తో నుండెను॥ సతియగు పార్వతియు తానే దానికాహారము కాదలచి యుండెను॥ ఆమె సంకల్పమేరిగి బ్రహ్మ సకల సంపదలకు నిలయమగు ఆమే యాశ్రమమునకువచ్చి దేవితో ఇట్లు పలికెను॥