మత్స్య మహా పురాణము

Table of Contents

76 - ఫల సప్తమీ వ్రతము

ఈశ్వరుడు బ్రహ్మకిట్లు చెప్పెను: ఫల సప్తమియను సప్తమి విషయము తెలి పెదను. ఈనాడుపవసించినవాడు పాపముక్తుడై స్వర్గమందును.

మార్గశిర శుక్ల పంచమినాడు వ్రత నియమములు పాటించి గడపి షష్టినాడు ఉపవసించవలెను. (విశోక సప్తమివలెనే సప్తమినాడు బంగారు పద్మమును శర్కరను బంగారుతో ఫలపు బొమ్మను కుటుంబియగు బ్రాహ్మణునకు రెండు పూటలందును ధర్మతత్వము నెరిగి 'భానుర్నే ప్రీయతాం 'భానుడు నాయందు ప్రీతుడగుగాక!' అనుచు దానమీయ వలెను. యథాశ క్తిగా విప్రులను పరమాన్నముతో భుజింపజేసి తానునట్లే భుజించి ఫలత్యాగము చేయవలెను. ఇట్లు కృష్ణ పక్ష సప్తమివరకు చేయుచు మరల ఆ కృష్ణ (మార్గ శిర) సప్తమినాడును ఉపవసించి హేమఫలమును సువర్ణపద్మమును శర్కరా పొత్రమును వస్త్ర మాల్యములను దానమీయవలెను. ఈ విధముగ సంవత్సరకాలము ఉభయ సప్తములందును (శుక్ల సప్తమితో ఆరంభించి కృష్ణ సప్తమివరకు) ఉపవాన పూర్వకముగా (రెండు సప్తములందును దానములు-నడుమ దినములలో నియమమును పాటించుట) క్రమముగా సూర్య దేవతాక మంత్రముల పఠించుచు చేయుచుండవలెను. ఫల త్యాగము చేయునపుడు మార్గశిరము మొదలు కార్తీకమువరకు ప్రతి మాసమునందును వరుసగా.భానుఃప్రీయతాం-ఇట్లే. అర్కః.రవిః-బ్రహ్మా-సూర్యః శక్ర 2.హరిః శివః-శ్రీమాన్-విభావసుః త్వష్టా-అరుణకి. అను నామములను ప్రియతాం' అను పదముతో చేర్చి పలుకవలయును. ప్రతిపక్షమునను -న ప్రమీనాడు ఇట్లు దానమును ఫలత్యాగమును చేయవలయును.

వ్రతాంతమునందు విప్ర దంపతులను వస్త్రభూషణములతో పూజించి శర్కరాపూర్ణ కలశమును సువర్ణఫల ప్రతిమను వారికి దానము ఈయవలెను. “రవీ! భక్తుల కోరికల సఫలము చేయు నీ దయచేత నాకును జన్మ జన్మమునందును అనంతఫలములు లభించుగాక!” అని ప్రార్థించుచు దానమీయవలయును.

అనంత ఫలప్రదయగు ఈ ఫల సప్తమీ వ్రతము చేసినవాడు సర్వపాపముక్తుడై పవిత్రత నొంది సూర్యలోక మున పూజితు డగును. వానికి సురాపానాది పాపము లేవై న ఎప్పటికైన ఉన్నను అవియు నశించును. అతని వెనుక ముందు ఇరువది యొక తరముల వారును తరింతురు. దీనిని చదివిన వినినవారికి కూడ ఈ ఫలము లభించును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఫలసప్తమీ వ్రత కథనమను డెబ్బదియారవ అధ్యాయము.