మత్స్య మహా పురాణము

Table of Contents

270 – భవిష్యద్రాజానుకీ ర్తనము.

వత్స ద్రోహో   

ఋషులు సూతునిట్లడిగిరి: సూతా! నీవు భవిష్యులగురాజులతో గూడ పూరు వంశమును మాకెరిగించితివి; సూర్యవంశమునందు రాబోవు రాజులెవరు? యాదవ వంశమునందు కలుగబోవు కీర్తి వర్గ నులను కలియుగమునందు రాబోవు వారిని వీరి వంశాంతమందు సువ్రతులగు ఏ జాతులవారు రాజ్యమునకు వత్తురో వారి భవిష్యక్రమమును సం షేపముగా తెలుపుము; అన సూతుడిట్లు చెప్పసాగేను: బృహద్బలునకు వీర రాజగు ఉరుక్షయుడు వానికి మహాతపుడగు వత్స వ్యూహుడు వానికి ప్రతివ్యోముడు వానికి దివాకరుడు కలుగుదురు; దివాకరునికి మధ్య దేశమునందు శుభయగు అయోధ్య యను నగరి ఉండును; అతనికి మహాయశుడగు సహదేవుడు అతనికి మహామనుడగు ధ్రువాశ్వుడు అతనికి మహాభాగుడగు ప్రతీపాశ్వుడు అతనికి సుప్రతీపుడు అతనికి మరుదేవుడు అతనికి సునక్షతుడు అతనికి పరంతపుడగు కింనరాశ్వుడు అతనికి మహామనుడగు అంతరిక్షుడు అతనికి సు షేణుడును శత్రుజేతయగు సుమిత్రుడునను వారును వారిలో సుమిత్రునకు బ్రహహ్రజుడు అతనికి వీర్యవంతుడును ధార్మికుడునగు కృతంజయుడును అతనికి  విద్వాంసుడగు రణేజయుడు అతనికి వీరరాజగు సంజయుడును అతనికి శాక్యుడును అతనికి శుద్ధోదనుడును అతనికి సిద్ధార్థుడును అతనికి పుష్కలుడు ఆతనికి ప్రసేనజిత్తు అతనికి తుదకుడు అతనికి కులకుడు అతనికి సురథుడు అతనికి సుమిత్రుడు కలుగుదురు: ఇతడే వీరిలో కడపటివాడు; కలియుగమున కలుగబోవు ఐక్ష్వాకులు వీరు.

బృహద్బలుని వంశమున కలిగిన పురాతన రాజులను కలుగబోవు వారిని నిః శేషముగ తెలిపితిని; ఈ విష యమందు పురాతనులగు విప్రులు గానము చేసిన ఆనువంశ శ్లోకము ఇది: ఇక్ష్వాకుల ఈ వంశము సుమీతునితో అంత మందును; అనగా ఈ సుమిత్రుడు రాజగుటతో ఈ వంశపు ఆంత్యస్థితి ఏర్పడును; లోగడనే మీకు తెలుపనారంభించిన మనువంశ వృత్తాంతము ఇది; ఇక మీదట మాగధులగు బృహద్రథవంశీయుల నెరింగింతును? లోగడ తెలిపిన జరాసంధుని పుత్రుడగు సహదేవుని వంశమునందలి భూత వర్తమాన భవిష్యరాజులను తేలి పెదను; భారత సంగ్రామము జరిగి ఆందు ఈ నహదేవుడు నిపాతితుడు (పడగొట్టబడినవాడు.మృతుడు) కాగా అతని కుమారుడు సోమాధి గిరివ్రజమున మగధ రాజయ్యేను; అతడు ఏబది ఎనిమిదేండ్లు రాజ్యమేలేను; అతని వంశమున శ్రుతప్రతుడు ఆరువది నాలుగు ఏండ్లు ఆప్రతీపి ముప్పది నాలుగేండ్లు నిరామిత్రుడు నలువది ఏండ్లు సురకుడు ఏబదియా రేండ్లు బృహత్కర్ముడు ఇరువది మూడేండ్లు రాజ్యమేలి; ఇపుడు శ్యేనజిత్ ఏలుచున్నాడు; అతడు ఏబది సండ్లు ఏలును; తరువాత శ్రుతంజయుడు నలువది ఏండ్లు విభుడు ఇరువది ఎనిమిదేండ్లు శుచి ఏబది ఎనిమిదేండ్లు క్షేముడు ఇరువది ఎనిమిది ఏండ్లు అనువ్రతుడు ఆరువది నాలుగేండ్లు సునేత్రుడు ముప్పదియైదు ఏండ్లు నిర్వృతి ఏబది ఎనిమిదేండ్లు త్రినేత్రుడు ఇరువది ఎనిమిదేండ్లు మహా సేనుడు నలువది ఎనిమిదేండ్లు మహీనేత్రుడు ముప్పది మూడేండ్లు సుబలుడు ముప్పది రెండేండ్లు రిపుంజయుడు ఏబది ఏండ్లు పాలింతురు; ఈ బృహద్రథ వంశీయరాజులు మొత్తము ముప్పది ఇద్దరును వేయియేండ్లు పాలింతురు: పులకుడను వాని కుమారుడు బాలకుడు ఆగు క్షత్రియుడు ఈ వంశపు కడపటి వాని తరువాత తాను రాజగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భవిష్యద్రాజాను కీర్తనమను రెండు పందల డెబ్బదియప యధ్యాయము.