మత్స్య మహా పురాణము
264 - క్రియాయోగవిధి - అధివానన విధానము
గురుతించి వదలివేయుట) యందు నేర్పుగలవాడును ఆయా ప్రతిష్టాది శాస్త్ర తత్త్వములను ఎరిగిన వాడును వాస్తు శాస్త్ర పారంగతుడును ఏయొక దోషములును లేనివాడును ఆచార్యుడు ప్రతిష్టాకార్య ప్రక్రియయందు ఆధ్వర్యుడు ప్రధాన ఋత్విక్ గా నుండవలయును: ‘మూర్తిపులు' కూడ సద్వంశమునందు జనించి ఋజు స్వభావము కల విప్రులై యుండ వలయును; ఈ మూర్తిపులు జ్యేష్ఠ పరిమాణక లింగప్రతిష్టయందు ముప్పది ఇరువురును మధ్యమ పరిమాణక లింగప్రతిష్ఠ యందు పదునారుమందియు కనిష్ఠ పరిమాణక లింగ ప్రతిష్ఠయందు ఎనిమిదిమందియు, ఉండవలయును.
అధివాసనవిధిః.
అనంతరము లింగమును కానీ అర్చామూర్తిని కాని స్నపన (స్నాన) మండపమునకు తీసికొనిపోయి అచట గీత మంగళశబ్దముతో పంచగవ్యముతోను కషాయ మీ, శితోదకముతోను మృ తిక తోను (హోమ) భస్మోదకముతోను స్నానము చేయించవలయును; ఆ సందర్భమునందు శాచార్గము ఈ చేప్పబోవు నాలుగు వేదమంత్రములను జపించు (బిగ్గరగా పఠించు) చుండవలయును; ఆవి.1. సముద్ర జ్యేషాః 2. యాఆపోదివ్యా ( ?) 3. యాసాంరాజ్ 4. ఆపోహిష్ణా అనునవి; ఇట్లు దేవుని స్న పనము చేయించి గంధానులేపనములతో పూజించి 'అభివస్తా' అను మంత్రముతో వస్త్రముల చాపుతో కప్పి తరువాత 'ఉతిష బ్రహ్మణస్పతే 'ఆమూరజ' 'రణేతిష్ణన్' అను మంత్రములతో దేవుని లేవదీయవలయును; మూర్తిని తెచ్చి రథమునందుకొని బ్రహ్మరథమునందు కాని శిల్పులచే ఎక్కించి రథమును లాగించికొని తీసికొనివచ్చి మండపమునందు ప్రవేశింపజేయవలయును.
అంతట ఆందు దేవుని ఆర్చామూర్తిని నెమ్మదిగా దించి ఉంచవలయును; అచట దర్బలను పరచి వాని పై పూవులను ఉంచి ఇట్లేర్పరచిన శయ్యయందు మూర్తిని ప్రాజ్ముఖముగా పండుకొన పెట్టవలయును; 'ఆపోదేవీ?' 'ఆప్కో స్మాన్ మాతర' అను మంత్రములను పఠించుచు లోపల బంగారమునుంచి పైని నూతన వస్త్రములను చుట్టిన నిద్రో కలశమును దేవుని శిరోభాగమునందుంచవలయును; తరువాత దుకూల పట్టములతో దేవుని కప్పవలయును; తరువాత ఊన్ని బట్ట పొదిగియున్న వస్త్రముతో చేసిన దిండుకొని (దొండువలె) పట్టువస్త్రమును కానీ ఉంచవలయును; తరువాత దేవుని కడ కూర్చుండి తేనెతోను నేతితోను ఆభ్యంజనము (పూయుట) చేయవలెను; తెల్ల ఆవలతో పూజించవలయును; 'ఆప్యా యస్వ' ‘యాతేరుద్ర' అను మంత్రములతో అర్చామూర్తిని అంతటను గంధ పుష్పములతో పూజించవలయును; ‘బార్ఘ స్పత్య’ అను మంత్రముతో తెల్లని ప్రతిసర మును ధరింపజేయవలెను; దూది నూలితో నిర్మించిన దుకూల పట్టములతో నో నానా విధముల చిత్రములుగల వస్త్రములతోనో దేవుని మూర్తిని కప్పవలయును; పార్శ్వములందు దగ్గరలో ఛత్తము చామరము ఆద్దము ఉంచవలయును; ఆ పడకకు పైగా పూవులతో మేలుకట్టు అమర్చవలయును; 'ఆభిత్వాళూర' అను మంత్రముతో యజమానుడు తన విభవము కొలదిని వివిధములగు పాత్రలను శయనములను ఆసనములను అచ్చట నుంచ పలయును; పొలు తేనె నేయి భక్ష్య భోజ్యాన్న పాయసములు ఇట్టివానితోను షడ్విధరనపు ఆహారములతోను 'త్ర్యంబకం యజామ ' అను మంత్రముతో పూజా పూర్వకముగా బలిని సమర్పించవలయును; తరువాత మూర్తిపులను నెమ్మదిగా ఆయా స్థానములందు నర్వదిక్కులందు కూర్చుండ బెట్టవలయును; నలుగురను ద్వారపాలురనుగా ద్వారములందు కూర్చుండ బెట్టవలయును. వీరిలో 1. తూర్పు ద్వారమందుండు బహ్వృచుడు (ఋగ్వేది ) శ్రీ-పవమాన-సోమ.శాంతి కాధ్యాయేంద్ర-రక్షోఘ్న -సూక్తములను పఠించును; దక్షిణ ద్వారమందలి అధ్వర్యుశాఖా (కృష్ణ యజుశాఖాధ్యాయి రౌద్ర సూక్త-పురుషసూక్తశుక్రియానువాకమను శ్లోకాధ్యాయములను పఠించును; పశ్చిమ ద్వారమందలి సామవే..వామదేవ - బృహత్-రథంతర జ్యేష్ఠ సామములను పురుషసూక్త రుద్ర సూక్తములను శాంతికాధ్యాయమును ధారుండ సామమును పఠించును; ఉత్తర ద్వారమందలి ఆథర్వణవేదీయుడు అథర్వాంగిరస మంత్రభాగమును నీల సూక్తమును రౌద్ర సూక్తమును అపరాజితాదేవీ నూక్ర సప్తకమును శాంతికాధ్యాయమును పఠించును.
ప్రతి యామమునందును చందనోదకము తో ఆవ సేచనమును ధూపమును నైవేద్యమును జరుపవలయును. ఆట్టే పర్యాయక్రమమున మరలమరల హోమమును జరుపుచు పోవలయును; ప్రతి పర్యాయమును యజమానుడు ఋత్విజు లకు దక్షిణలు తెల్లని వస్త్రములు ఏవిధములగు బంగారు కడియములు బంగరు హారములు బంగరు సూత్రములును సువర్లాంగుళీయక ములును పానుపులును ఈయవలయును; నూతన వస్త్రములును కట్టబెట్టవలయును: భోజములును బాగుగా జరుపుచుండవలయును; ఆధివాసనము ముగియువరకును ఇదియంతయు జరుపుచుండవలెను. మూడు సంధ్యలయందును అన్ని దిశలయందును భూతబలి వేయుచుండవలయును. ప్రతిపూటను మొదట బ్రాహ్మణులకును అనంతరము మిగిలిన వర్ణములవారికిని (జనులకు) భోజనములును యథేష్టముగా పెట్టుచుండవలయును. నృత్య గీతాది మంగళ లక్షణములతో రాత్రియందు మహోత్సవము (గొప్ప వేడుక ) జరుపుచుండవలెను; చతుర్థి కర్మ (క్రియా) ముగియువరకును ('చతుర్థి క్రియా' అనగా ప్రతిష్ఠాక్రియ అయియుండును.) ఎల్లరును ప్రయత్న పూర్వకముగా యథాశ క్తిగా పూజించుచుండ వలయును.
ఈ చేప్పిన ఈ అధ్యాయమందలి ప్రక్రియకు 'అధివాసప్రక్రియ' అనివ్యవహారము; ఇది ఒకటికాని మూడుకాని ఐదుకాని - ఏడుకాని - (ఆహో)రాత్రములపాటు జరుపవలయును; కొన్ని కొన్ని సందర్భములలో సద్యోధి వాసనము (ప్రతిష్టకు కొంచెము ముందుగానే) ఆధివాసము జరుపుటయును కలదు; ఈ ఆధివాసప్రక్రియా ప్రాముఖ్యము ఏమియనిన దీనిచే నర్వయజ్ఞఫలము లభించును.
ఇది శ్రీమత్స్య మహా పురాణమున దేవతా ప్రతిష్టా నిరూపణమునందు ఆధివాసవిధాన కథనమను రెండువందల ఆరువది నాలుగవ అధ్యాయము.
