మత్స్య మహా పురాణము

Table of Contents

37 - యయాతి స్వర్గభ్రంశము - యయాత్యష్టక సంవాదము

ఇంద్రుడు యయాతితో ఇట్లనెను: “నహుషపుత్తా: యయాతి రాజా! గృహసుడుగా సర్వకర్మములను ముగించుకొని గృహములను విడిచి వానప్రస్థుడవయి వనమును చేరుకొంటివి. అందువలన నిన్న డుగుచున్నాను. తపస్సుచే నీకు సమానుడు మరి ఎవ్వరో చెప్పుము. యయాతి: “వాసవా! దేవతలు మనుష్యులు గంధర్వులు మహర్షులు. ఈ ఎవ్వరి యందును తపస్సు చే నాకు సమానుడు మరి ఎవ్వడును కనబడడు.” ఇంద్రుడు: “నీవు వారివారి వైయక్తిక ప్రభావమును ఎరుగక యే సమానులను అధికులను హీనులను కూడ అవమానించినావు. కావున ఇవిగో! ఈ నీలోకములన్నియు అంత వంతములు ముగిసిపోయినవి) అగుచున్నవి. ఇప్పుడే పడిపోవుచున్నావు.” యయాతి: “సుర లను ఋషులను గంధర్వులను సరులను అవమానించినందున నాలోకములన్నియు క్షీణములయినచో ఇంద్రా! సురలోకమునుండి జారిపడియు సత్ జనుల నడుమ పడ గోరుచున్నాను." ఇంద్రుడు: “యయాతిరాజా! నీవు జారియును సత్ జనుల నడుమనే పడు చున్నావు. మరల వారివలననే నిలుకడను పొందగలవు. ఈ విషయమును గుర్తునందుంచుకొసి మరల ఎప్పుడును సమానులనుగాని అధికులనుగాని అవమానింపకుము.”

అంతట దేవేంద్రుడే సాక్షాత్ అనుభవించు పుణ్య లోకమునుండి పడద్రోయబడుచున్న యయాతిని చూచి రాజర్షి వరుడును ధర్మమునకు మూలతత్వమును (వేదమును వేదమార్గమును రక్షించువాడునగు అష్టకుడు అతనితో ఇట్లనెను: “నీవు ఎవరవు? యువకుడవు. ఇంద్రుని రూపమువంటి రూపముతో సున్నావు. స్వతేజముతో అగ్నివలె ప్రకా శించుచున్నావు. మేఘావరణముచే విజృంభించిన అంధకారముతో నిండిన ఆకాశమునుండి గ్రహ శ్రేష్టుడగు సూరుడు వలె పడుచున్నావు, అగ్నివలేను అరునివలేను ద్యుతి కలిగి ఇంతటివాడవు అన నలవికాని నీవు స్వరపథమునుండి పడుచుండుట చూచి ఈ పడుచున్నది ఏమియా అని అందరమును పరి మోహితులము (ఏమియు తెలియని వారము) అగు చున్నాము. స్వర్గమార్గము నధిష్టించియున్న నీవు రవి విష్ణుల ప్రభావమువంటి ప్రభావము కలిగియున్నావు. ఇట్టి నీవు పడుటకు కారణమగు తత్వము ఎరుగగోరి మేమందరమును లేచి నీకు ఎదురు వచ్చుచున్నాము. నిన్ను మేమే మొదట ప్రశ్నించుటకు సాహసించలేకున్నా ము. నీవో. మమ్ములను మీరెవ్వరని అడుగుటయులేదు. కావున ముచ్చటగొలుపు రూపముగల నిన్ను నేనే ముందుగా ప్రశ్నించుచున్నాను. నీవు ఎవ్వరివాడవు? ఏందులకే నీవు వచ్చితివి? దేవేంద్ర సమాన రూపుడవు-గాని నీవు సామాన్యుడవు కావు. నీవు ఏమాత్రమును భయమును విషాదమును మోహమును (ఏమీ చేయుటకును తోచకుండుటను) విడువుము. నీవిపుడు సత్ జనుల దగ్గర నున్నా వు. ఇంద్రుడు బలాసురునంతటివానిని చంపినవాడే అగుగాక! ఇట్టి నిన్ను అతడును ఏమియు ఎదిరింపజాలడు. అదియుగాక స్వర్గసుఖమునుండి భ్రంశము నొందిన వారికి నిలుకడ చోటయి సత్ జనులు వర్ధిల్లుచున్నారు. నీవో. దేవులతో దేవరాజుతో సమానుడవు. సజ్జనులును సత్ జనులును ఒక చోట పరస్పరము కలిసినచో స్థావర జంగమరూపమగు ప్రపంచమున కెల్ల ప్రభువులై దానిని రక్షించగలరు. నీవు ఇపుడు నీకు సాటివార గు_సత్ జనుల (మైనమా) యందు నిలుకడ పొ దీనావు. కనుక భయపడకుము. చింతింపకుము.) వేడిమినిచ్చుటలో అగ్ని యు బీజములను విత్తుటకు అనుకూలమగుటలో భూమియు ప్రకాశమునిచ్చుట లో రవియు ఆభ్యాగతులకు ఆశ్రయమునిచ్చుటలో సజ్జనులును సమర్థులు.”

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున యయాతికి స్వర్గభ్రంశము - యయాత్యష్టక సంవాదము అను ముప్పది ఏడవ అధ్యాయము.