మత్స్య మహా పురాణము

Table of Contents

260 - సూర్యాది ప్రతిమాలక్షణము-రవి ప్రతిమాలక్షణము.

వహ్ని ప్రతిమాలక్షణమ్.

యమప్రతిమాలక్షణమ్.

నిరృతి ప్రతిమలక్షణమ్.

వరుణప్రతిమాలక్షణం - వాయుప్రతిమాలక్షణం చ.

సూతుడు ఋషులకిట్లు చెప్పెను: ద్విజులారా! ఇపుడు రవి ప్రతిమను తెలి పెదను వినుడు; ఈదేవుడు రథస్థుడు. వరదహస్తుడు-సులోచనుడు. సప్తాశ్వమగు ఏక చక్రరథము ఇతనిది; ఇతడు విచిత్రముకుటధారి; తామర పూవులోపలి వన్నె కల దేహచ్ఛాయవాడు; నానాభరణ భూషిత భుజుడు; పద్మములను చేతుల ధరించును; అవి అపుడపుడు విలాసముగ భుజముల పై ఉంచుకొనుచుండును: చొక్కా ధరించునట్లును కొన్ని మూర్తులందు చూపుటకలదు; ఇతడు సాధారణముగా వస్త్రద్వయము (దోవతి- ఉత్తరీయము) ధరించును: పాదములు తేజోవృతములు; ఇతని రెండు పార్శ్వములందును దండుడు పింగళుడు అను ప్రతిహారులుందురు; వారు ఖడ్గహస్తులు; పార్శ్వమందు లేఖిని ధరించి బ్రహ్మ ఉండును; నానా దేవగణము ఈ రవిని కొలుచుచుండును. ఈ రవికి సారథియగు ఆరుణుడు తామర ఆకువంటి దేహచ్చాయ కలవాడు; అతనికి రెండు ప్రక్కలందును ఏడు ఆశ్వములు నర్ప పాశ ములతో బంధింపబడినవై కిరణములతో కూడినవై మేడలు ముందునకు ఎత్తుగా చాచి కొని బయలు దేరుచున్నట్లుండవలయును; రవి పద్మమునందు నిలిచియున్నట్లు కాని వాహన(రథ)ము నందు కూర్చున్నట్లు కాని మూర్తిని నిర్మించవచ్చును.

వహ్ని ప్రతిమాలక్షణము.

సర్వకామ ఫలప్రదమగు వహ్ని ప్రతిమాలక్షణమును తెలి పెదనుః వహ్ని కాచిన బంగారువలె ప్రకాశించు దేహము కలవాడు; ఆర్ధచంద్రాననమం దుండును; అతని ముఖము బాల సూర్య నమాన తేజసము; అతడు లంబ కూర్చమును (వ్రేలాడు గడ్డమును మీనలును) యజ్ఞోప వీతమును కలిగియుండును: ఎడమచేతియందు కమండలువును కుడి చేతియందు అక్షమాలను ధరించి జ్వాలా సమూహముతోను స్వధా స్వాహా దేవులతోను ప్రకాశించుచుండును; మేష వాహనము పయినున్నట్లు కాని హోమకుండమందున్నట్లు కాని అగ్ని మూర్తిని నిర్మించవచ్చును. ఇతని శిరము పై న ప్రజ్వాలలు మాత్రము వెలుగుచుండును.

యమ ప్రతిమలక్షణము.

విభుడగు యముడు దండపాక ధరుడు; మహా మహిషారూఢుడు; నల్లని కాటుక రాశివన్నె వంటి వన్నే వాడు; సింహా సనమందుండును; జ్వలించు ఆగ్ని వంటి కన్నులవాడు; అతనికి అన్ని వై వులను మహిషము చిత్రగుప్తుడు భయంకరులగు కింకరులు సౌమ్యమూర్తులగు రాక్షసులు నుందురు.

నిరృతి ప్రతిమాలక్షణము.

 నిరృతి నరునెక్కియుండును; మహామాయావి; బహు రక్షోగణయుతుడు; ఖడ్గహస్తుడు; మహానీలుడు; కాటుక కొండవంటివాడు; మనుష్యులను పూన్చిన విమానమందుండును; పచ్చని ఆభరణములతో అలంకృతుడు.

వరుణ వాయు ప్రతిమాలక్షణమ్.

వరుణుడు పాళహస్తుడు-మహాబలుడు-శంఖస్ఫటిక నమాన వర్ణుడు; తెల్లని హారములతో వస్త్రములతో కప్ప బడినవాడు; మత్స్యాసనమందుండును. కిరీటమును భుజకీర్తులును ధరించియుండును.

వాయువు ధూమ్రవర్ణుడు; మృగ(జింక)వాహనుడు; పలువన్నెల వింతగొలుపు వస్త్రములు ధరించియుండును: యువకుడు: మృగాధిరూఢుడును వరదుడును పతాకల (చిరుజెండాల)తోను ధ్వజముల (పెద్ద జెండాల)తోను కూడి యుండును.

కుబేరుడు హార కేయూర కుండలాలంకృతుడు. చిత్రాంబరధరుడు. శుభరూపుడు. గదాహస్తుడు. వరదుడు కిరీటధారి; నరులను పూన్చిన విమానమందు కాని మేషము పై కాని యున్నట్లు నిర్మించవలయును. ఇతడు గుహ్యక పరి వృతుడు; పీతవర్ణుడు; మహోదరుడు మహాకాయుడు అష్టనిధులతో కూడినవాడు; ధనములతో వ్యగ్రహస్తులగు గుహ్యకు లనేకు లితనిని కొలుచుచుందురు.

 ఈశానుడు తెల్లనివాడు తెల్లని కన్నులవాడు; త్రిశూలపాణి త్రిలోచనుడు వృషభవాహనుడు.

 సప్తమాతృకామూర్తి లక్షణము.

 నామానుపూర్వముగా మాతృకల లక్షణమును చేప్పెదను; బ్రహ్మాణి బ్రహ్మవలెనే యుండును; ఆమె చతుర్ముఖ ములతో చతుర్భుజములతో హంసవాహనయై ఆక్ష సూత్రమును కమండలువును ధరించియుండును.

మాహేశ్వరి మ హేశ్వరునివలె నుండును: ఆమె జటాముకుటధారిణి; వృషభవాహన- చంద్రార్ధ శేఖరయుక్తురాలు; కపాలము శూలము ఖట్వాంగము వరదముద్ర కల చతుర్భుజములతో నుండును.

కౌమారి కుమారస్వామిరూపుతో నుండును. ఆమె మయూర వాహన- రక్తవస్త్రధర-శూలశక్తిధర. హార కేయూ రాలంకృత- కుక్కుటధారిణి.

 వైష్ణవి విష్ణునివలె నుండును. ఆమె గరుడ వాహన- చతుర్భుజ వరద-శంఖచక్రగదాహస్త సింహాసనారూడ- బాలక సమన్విత.

వారాహి వరాహ సమానరూప. మహిషారూడ. ఘంటాచామర గదాచకధారిణి; దానవేం ద్రవినాశిని.

ఇంద్రాణి ఇంద్రుని పోలియుండును. ఈమె వజశూల గదాధర. గజాసనగత, బహు నేత్రసహిత. కాచిన బంగారుకొంతివంటి కాంతి గలది. దివ్యాభరణభూషిత. తీక్షఖడ్గధారిణి. దానవేంద్ర వినాశిని.

చాముండాదేవీ రూపమును ఆమె బుండు ఆయుధములను తేలి పేదను. ఆమెకు పొడవు నాలుక పొడవు కేశ ములు. మాంసఖండములతో నిండినది. కోరలతో భయంకరవదనము కలది. చిక్కిన పొట్టగలది. కపాల మాలలను ధరించినది; వామహస్తమున మెదడుతో పూయబడిన రక్తమాంస పూర్ణక పాలమును దక్షిణ హస్తమున శ క్తిని ధరించి యుండును. గృధమును కానీ పొయసమును కానీ ఆరోహించియుండును, మాంసరహిత దేహ. వంగిన ఉదరము కలది. భయంకర వదనముతో లోచనత్రయముతో నుండును. ఘంటలు శరీరమున కట్టుకొని వ్యాఘ్రచర్మము ధరించియుండును. శుభన్వరూప.

  కాశీ కాదేవి దిగంబర, గర్దభవాహన. కపాలధారిణి. మీగుల ఎర్రనీ పూవు లామెకు ఆభరణములు. ఆమె ధ్వజముతో వర్ధ నియను జలపాత్ర విశేషముతో నుండును.  

మాతృకలకు ముందుగా ఎల్లప్పుడును వినాయకుని నిలుపవలెను. వృషభ మారోహించి ధనుర్ధరుడును వీణా హస్తుడును త్రిశూలధారియునగు వీరేశ్వర భగవానుడును మాతృకలకు ముందుండును.

లక్ష్మీదేవి ప్రతిమాలక్షణమ్.

మన్మథప్రతిమాలక్షణమ్.

లక్ష్మీదేవి ప్రతిమలక్షణము.

లక్ష్మీదేవి సూతన యౌవన వయసునం దుండును. లావు చెక్కిళ్లు ఎర్రని పెదవి వంపు తిరిగిన కనుబొమలు బలిసి ఎత్తయిన స్తనద్వంద్వము మణికుండలాభరణములు చక్కని గుండ్రని ముఖ సీమంత (పాపటతో) భూషితమగు శిరము పద్మములతో స్వస్తికములతో శంఖములతో భూషితము లే మేలగు ముంగురులు కలిగియుండును. రవికలో బిగించబడిన ఆవయవములు గలిగి హారాలంకృతములగు స్తనద్వంద్వము భుజకీర్తులతోను కటకములతోను అలంకృతము లగు ఏనుగు తొండములవంటి బాహువులు ఎడమ చేతియందు పద్మము కుడి చేతియందు మారేడుపండు మేఖల (మొలనూలు- ఒడ్డాణము) ఆభరణముగా కాచిన బంగరుబోయ నాగాభరణ సంపద శోభనములగు వస్త్రములు కలది; ఆమెకు రెండు పార్శ్వములందును హ సములందు చామరములు ధరించి వీచుచుండు స్త్రీలు అనేక లు ఉందురు; పద్మ సింహాసనమందు పద్మాననముతో ఈమె కూర్చుండి ఉండును; రెండు ఏనుగులు ఈ మేను భృంగార ములను పాత్ర విశేషములతో నీరు వంచి స్నానము చేయించుచుండ మరిరెండు ఏనుగులు భృంగారములు ధరించి స్నానము చేయించుటకు వేచియుండును; ఈమెను లోకపాలురును గంధర్వులును గుహ్యకులును స్తుతించుచుందురు.

యక్షిణీ క్షేత్రపాల ప్రతిమాలక్షణములు.

 యక్షిణిని సిద్ధులును అసురులును సే నీంచుచుందురు; ఆమెకు రెండు పార్శ్వములందును రెండు కలశము లుండును, తోరణమందు దేవదానవులును నాగులును ఉందురు; నాగులకు బొడ్డునకు దిగువను సర్పాకృతియు అంతకు పై భాగమున మానవాకృతియు నుండును. వారికి రెండేసి నాలుకలు కల ఫణలు ఎన్నో యుండును.

పిశాచులు రాక్షసులు ఇట్టి వారందరును రౌద్ర వికృత రూపులు.

క్షేత్రపాలుడు జటాయుక్తుడు వికృతముఖుడు; దిగంబరుడు; కుక్కలు నక్కలు నతనిని సేవించుచుండును; శిరః కేశములతో ఆవృతమగు కపాలమాతని ఎడమచేతను దక్షిణ హస్తమందు అసుర క్షయ కారిణియగు శ క్తియునుండును.

ద్విభుజ మన్మథ ప్రతిమా లక్షణము.

 ఇక ఇపుడు మన్మథ ప్రతిమా లక్షణమును తెలి పెదను; ఇతడు ద్విభుజుడు; పూవులితని యాయుధములు; ఆతని పార్శ్వమందు మకర (మొసలి రూపుకల) ధ్వజము ధరించిన ఆశ్వముఖుడు (కింనరుడు) ఉండును. దక్షిణ హ సమున పూబాణములు వామహస్తమునందు పుష్పమయధనువునుండును. అతని దక్షిణ పార్శ్వమందు భోజనపదార్థము లతో కూడిన ప్రీతిదేవియు వామపార్శ్వమందు శయన వరికరములతో కూడిన రతిదేవియు నుందురు; ఈతని పరివారములో ఒక పటము (వస్త్రము) పటహము (తప్పెట) కామాతురమగు ఒక గాడిద ఉండును; దగ్గరలోనే నీటితోనిండిన దిగుడు బావియు నందన వనమునుండును. ఇట్లు కుసుమాయుధుని సుశోభనరూపముతోనున్న వానినిగా నిర్మించవలయును? ఆతని ఉనికి కొంచెము ప్రక్కకు వంపుతిరిగి ఉండవలయును; అతడు ఆశ్చర్యముతో చెమర్చిన కన్నులు కలిగియుండును.

బ్రాహ్మణులారా! నేను ఈ ప్రతిమా లక్షణమును ఉద్దేశ (నామగ్రహణ) మాత్రమున (సంక్షేపమున) చేప్పితిని; విస్తరించి సమగ్రముగా చెప్పుట బృహస్పతికినీ ఆశక్యము.

ఇది శ్రీమత్స్య మహా పురాణమున సూర్యప్రతిమాది లక్షణమను రెండు వందల అరువదియవ అధ్యాయము.