మత్స్య మహా పురాణము

Table of Contents

116 - హిమవత్పర్వత వర్ణనము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: మద్రరాజగు పురూరవుడు రమ్యమగు ఆ ఇరావతీ నదిని చూచుచున్నంత లోనే నదీవాయు స్పర్శచే నాతని బడలిక అంతయు తీరెను. ఆనది వెంట ఎగువకు మరికొంత దూరము పోగా మహాగిరి హిమవంతము కానవచ్చెను. దాని తెల్లని బహు శృంగము లాకాశమును ఒరయు చుండెను. వాని పై పక్షులనేకములు సంచరించుచు చూడముచ్చటయే ఉండెను. ఋషులకు తపోజ్ఞాన సిద్ధిప్రద మాకొండ. మరి వేరుశబ్దముల విననీయని చప్పుడులతో పడు శీతల జలనదీ ప్రపాతములతో ఆకొండ మనోహరముగ నుండెను. (మహాబాహువులో యనదగు) నీలములగు దేవదారు వనములతో ఒప్పు ఆ కొండ పై కనవచ్చు మేఘములు త్తరీయములుగా ఉండెను. ఆయా తావులందు తెల్లని మేఘములు తలపాగలై చంద్రర్కులు మకుటములై మంచు పొరలును గైరిక ధాతువులును గంధానులేపనములై పలువన్నెల వెలయుచు ఐదు వేళ్ళతో రాచికొనిన చందన రేఖలో యన కనవచ్చు చుండెను. వేరియందు చలువల ఇచ్చు శిలలతో విషమమును ఇరుకునునైన ఆ కొండపయి అప్సరల పొదముల లత్తుక పారాణి ముద్రలును . ఆసవ పాన ప్రసంగమున జారిపడిన గంధర్వుల అప్సరసల కాలి గుర్తులును కనబడుచుండెను. దాని కొన్ని తావులు రవి కిరణ త ప్తము కాగా మరికొన్ని కడుచల్లనై ఉండెను. కొన్ని యెడల నా పర్వతము తన భయంకర గుహలను నోళ్ళతో మహాపరిమాణ జలముల త్రోవుచుండెను. కొన్ని తావులు క్రీడించు విద్యాధర గణములతోను కిన్నర గణ ముఖ్యుల ఉపగానములతోను ఒప్పుచుండెను. కొన్ని తావులందు సస్తానకాది దివ్య (కల్ప) వృక్ష విశేషములు పూచిన పూలును మరికొన్నిట గంధర్వులనుభవించి విడువగా నలిగిపడిన కుసుమ మాలలును మనోరమములై యుండెను.  

ఆ కొండ మరియు ఆయా తావులయందు వాయువునే ముందునకు పోనీయని ఎత్తయిన నల్లని పచ్చికల బయళ్ళతోను వివిధ ; సుమములతోను అత్యంత ను నోహర మయి వివిధ మృగములయు కరులయు సంచారములతో ఆద్భుత మయి సింహమ.ల నాదములతోను అవి విసి భయమందిన మృగముల భైరవ రవములతోను భయానకమయి యొప్పుచుండెను. ఐనను అచటి గజములు మాత్రము అలయక కలతపడ కుండును. ఇంతయేల? ఆ హిమవంతమందలి పొదరిండ్లును ఆట తపమొనర్చు తాపసులతో అంకృతములు కాగా ఆ కొండనుండి ఉత్పన్న ములగు రత్న విశేషములతో తే లోక్యమును అలంకృతమగుచుండును. ఆ కొండ సదా అహీన (అహి+ ఇస-సర్ప! శ్రేష్టములకు) శరణము (వానస్థానము); అహీన (హీనులు కాని గొప్ప) జనులిద్దని సేవింతురు. సంపదలతో అహీన (యుక్త) మగు ఆగిరిని అహీనుడు మాత్రమే దర్శించును. తాపసులచట ఆల్ప తపమొనర్చియు సిద్దినందుదురు. దాని దర్శనమాత్రమున సర్వకల్మష నాశమగును. తద్దిరి ప్రదేశములు కొన్ని నదీ ప్రపాత సంపాతవశమున వేగముగ పారు జలములనుండి రేగిన వాయువుచే అటక టకు కొని రాబడిన జలముల బిందువుల)తో సంతృ ప్రములయి యుండెను. జలరహిత మేఘములతో వెలయు ఉన్నత శృంగములతో ఆగిరి నవ్వుచున్న దో యనునట్లుండెను. దాని శిఖరములు కొన్ని నిగంతర రవికిరణ త పములును విషమములును నగుట చే మనస్సుతోనై న చేరనలవి కాకుండెను. దట్టములై నిండిన ప్లక్ష జువ్వి) దేవదారు మహావృక్షముల తోను స్తంభములవలె కననగు వేదుళ్ళతోను వృక్షములతోను ఆగిరి ఉపశోభిల్లుచుండెను. ఆగిరి గుహలు సింహనాదానునాది తములు; శిఖరాగ్రములందలి పగుళ్ళతోను శబ్దము మాత్రమే లభించు జల ప్రదేశములతోను హిమముతో మూతపడిన గుహలతోను ఆగిరి కొన్ని తావుల భయానకమును విషమమును అగమ్యమునునై యుండెను. మనోహరమగు నితంబ (పర్వతమందలి చదునైన ఉన్నత) ప్రదేశములతో ఒప్పు ఆ హిమవంతమును చూచుచు పోవుచు మహానుభావుడగు ఆ మద్రరాజు పురూరవసుడు తాను వసించి తపము సేయ యోగ్యమగు తావున కై వెదకి వెదకి తుదకట్టిది చేరెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున భరత వర్షంతర్గత భరతఖండ వర్ణనమున పురూరవశ్చరితమున మద్రరాజ పురూరవో వృత్తాంతమను నూట పదునారవ అధ్యాయము.