మత్స్య మహా పురాణము
29 - శుక్ర వృషపర్వ సంవాదము
శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను : తరువాత కవిముహామునికి కుమారుడును భృగువంశ శేష్టుడును అగు శుక్రుడు మిగుల త్వర తో పోయి కొలువుదీరి యున్న వృషపర్వునితో ఇట్లు పలికేను : “రాజా! భూమిలో విత్త్రనము వేసినను వెంటనే ఫలించనట్లు ఆచరించిన అధర్మము కూడ వెంటనే ఫలించదు. మెల్లగా ఆవృత్తి చేయుచు పోగా అది వేళ్ళను కూడ పెకలించివేయును. తాను ఆచరించిన పాపకర్మము తనయందో తన కుమారులయందో మనుమలయందో ముని మనుమలయందో ఫలింపకున్న ను మూడు తరముల దాటి తరువాతివారి కే నను తగిలితీరును. తినిన బరువయిన ఆహారము ఉదరములో రోగి ముగా పరిణమించినట్లు పాపము కూడ ఫలించియే తీరును. ఆనాడు నీవు పుణ్యశీలుడును ధర్మజుడును సా శుశ్రూష చేయుచు నా యింటిలో ఉన్న వాడును అంగిరసుని మనుమడును బ్రాహ్మణుడును ఏ విధము గను చంపరానివాడును అగు కచుని చంపించుటవలనను. నా కూతును కొట్టించుట వలనను నేను నిన్ను ను నీ వారినెల్ల రను కూడ విడిచివేయు చున్నాను. నీతో కలిసి నీ దేశమునందుండ జాలను. నీవు ఇపుడు నన్ను ను మిథ్యా ప్రలాపియగు అనినంత పనిని చేయజాలని) దైత్యునిగా భావించుచున్న ట్లున్నది. ఆగదు చేతనే నీ పొగరుబోతు కుమార్తెను ఏమియు అనక ఊరకున్నావు.”
వృషపర్వుడు ఇట్ల నేను: “భార వా! నీవు స్వధర్మ పరుడవు. మృషలు పలుకవు. అని నాకు తెలియును. నీవు సత్యమునకును ధర్మమునకును ఆధారమవు. కనుక నీవు మమ్ముల ననుగ్రహింప వేడుచున్నాను. నీవు ఇపుడు మమ్ములను విడిచి వెళ్ళినచో మేము సముద్రములోనికి పోయి దాగవలసినదే. మాకంతకంటె వేరే దిక్కులేదు.”
శుక్రుడు: “సముద్రములో ప్రవేశించినను సరియే. మీరందరును దిక్కులకు పారిపోయినను సరియే. నాకు మిగుల ప్రీతిపాత్రురాలగు నా కుమా ర్తెకు అప్రియము జరిగే ననునది నేను వినజోలను. నా జీవితమునకు ఆధారమగు దేవయానిని నీవు అనుగ్రహింపజేసికొనినచో ఇంద్రునకు బృహస్పతివలె నేను నీ గ క్షేమములను చూతును.”
వృషపర్వుడు : "భార్గవా! ఈ భూగో: మున రాక్షసుల ఆ స్త్రీగా ఏనుగులు గుర్రములు గోవులు ధనము మొదలయినది ఏది యేది గలదో దానికంతటికిని రాక్షసులకును సాకును నీవే ప్రభువవు."
శుక్రుడు : “రాక్షస రాజా! మహాసురులారా! మీరశ్నట్లు దే త్యేంద్రుల ద్రవ్యమంతటికిని నేనే ప్రభుడననుట నిజమయినచో దేవయానిని బ్రతిమాలి ఆమెను అనుగ్రహింపజేసికొనుడు.''
తరువాత వెంటనే శుక్రుడు త్వరితగమనముతో వృషపర్వునితో కలిసి దేవయాని ఉన్న చోటికి వచ్చి “పు శ్రీ ! నీవు ఆదృష్టవంతురాలవు. రాజు నీ మాటను అంగీకరించినాడు.” అనెను. దేవయానియు “తండ్రీ! భార్గవా! రాజ ధన మునకంతటికిని నీవు స్వామివి అగునో కాదో నా కేమి తెలియును? నీ మాట నేనెట్లు అంగీకరింతును? రాజే నాతో స్వయ ముగా ఆ మాట చెప్పనిమ్ము." అనెను. వృషపర్వుడు! దేవయానీ! నీ హృదయము. నిర్మలమయి నీవు ఒక చిరునవ్వు నవ్విన మాకంతియ చాలును. నీవేది ఏది కోరిన సది ఎంత సుదుర్లభమయినను దానిని నెర వేర్చుదును. దేవయాని : “తన దాసీ కన్యా సహనముతో శర్మిష్ట నాకు దాసి కావలయును. నా తండ్రి నన్నే చ్చటికిచ్చిన నచ్చటి కామెయు నా వెంట రావల యును." వృషపర్వుడు : “దాడీ! నీవు పొమ్ము. శీఘమే శర్మిష్ఠను పిలిచికొని రమ్ము, దేవయాని ఏది కోరిన నది ఆమె చేయవలయును.
వెంటనే దాది శర్మిష్ఠకడకు పోయి ఇట్ల చెప్పెను: అమ్మాయీ! శర్మిష్ఠా: లెమ్ము. మీ పుట్టింటి వారికి సుఖము కలిగించుము. దేవయాని పేరణచే శుక్రుడు తన శిష్యులను ఏడు చుచు క్నాడు. అందుల కై నీవు ఇపుడు దేవయాని కోన దెల్ల చేయవలసియున్నది. నీవు ఎంతయో శోభన రూపురాలవు. ఐన దేవయానికి దాసీత్వమును అంగీక రింపవలసి యున్నది. శర్మిష్ఠ: “ఆమే ఏది కోరిన నేనిపుడది చేయుదును. నా దూల మున శుకుడుగాని దేవయానీ కాని కోపింప కుండుట కావలయును.”
వెంటనే తన తండ్రి ఆజ్ఞతో శర్మిష్ట వేయి మంది తన దాసీ కన్యలు తనవెంట రాగా పాలకి నెక్కి తన తండ్రి వురమునుండి బయలు వెడలెను. శర్మిష్ట దేవయానితో: “నేను నా దాసీ కన్యా సహస్రము నావెంట రాగా నిన్ను నీ తండ్రి ఇచ్చిన చోటికి నీ వెంట వత్తును.” దేవయాని: "స్తుతించుచు యాచించుచు ప్రతి గ్రహించుచు ఉండువాని కూతు రను నేను. స్తుతించబడు వాని కూతురు నీవు నాకు దా వెట్లగుదువు?” శర్మిష్ఠ: “ఏ విధము గనై నను కన్య తన పుట్టి నింటివారికి సుఖము కలిగి ”పవలెను. కనుక నీ తండ్రి నిన్నె చ్చటి కిచ్చిన అచ్చటికి నీ వెంట వత్తును.”
ఇట్లు వృషపర్వుని కూతురు తనకు దాసి యగుటకు అంగీకరించగా దేవయాని తన తండ్రితో ఇట్లనెను: “ద్విజ । శ్రేష్టుడవగు తండ్రీ! నేను హర్షముతో పురము లో ప్రవేశిస్తును. మీ విజ్ఞానమును విద్యాబలమును అమోఘమయినవి.” తన కూతురు ఇట్లు పలికిన మీదట మిగుల గొప్పకీర్తి కల ఆ శుక్రుడు తను రాక్షసులు ప్రశంసించుచుండ వృషపర్వుని పురము ప్రవేశించేను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున యయాతి చరితమున శర్మిష్ట దేవయానికి దాసియగుట యను ఇరువది తొమ్మిదవ అధ్యాయము.
