మత్స్య మహా పురాణము
219 - రాజకర్తవ్య స్వపుత్త్రక్షాది క్రమ కథనము - భృత్య- పౌరజానపద- బాహ్య శత్రుజయము
భృత్య- పౌరజానపద- బాహ్య శత్రుజయము
రాజు ఈ చేప్పినవారిని వశీక రించుకొని పిమ్మట బాహ్యశత్రువులను జయించవలెను; వారు సమశత్రువులు ఆధ్యంతర శత్రువులు కృత్రిమ శత్రువులు అని పలు(త్రివిధములు; ఇట్లే మిత్రులును మూడు విధములు: 1. గురువులు సరేసరి; వారి విషయమును తన విషయముకంటె ముందరిదిగా తలచి యత్న పరుడై వారి నాదరించవలేను; 2. తండ్రి తాతల తరములనుండి మిత్రులు; 3. తన శత్రువులకు శత్రువులు (వీరు కృత్రిమ మిత్రులు); వీరందరలో గురుని ఆదర పూర్వకముగ మొదట పూజించవలెను; రాజ్యాంగములు ఏడు: 1. స్వామి 2. ఆమాత్యులు 3. జనపదము. 4. దుర్గము 6. దండము 6. కోశము 7. మిత్రులు. వీనిలో స్వామి (రాజు) రాజ్యమునకు మూలము; మిగిలిన ఆంగములకును ఇత డే మూలము కావున ఆతనిని యత్నపూర్వకముగా రక్షించవలయును; అతడును యత్నముతో మిగిలిన షడంగములను రక్షించుచుండవలయును; ఇంతేకాదు; ఏ ఖలుడు కాని అల్పబుద్ది కాని ద్రోహము చేసినచో వానిని రాజు శీఘ్రమే వధించ వలేను; రా జెప్పుడును మృదువై యుండరాదు; ఉన్న చో పరాభవము నందును; అతి దారుణుడుగా ఉండరాదు: దారుణుని చూచి ఎల్లరును భయపడుదురు; సమయమెరిగి మెత్తదనమునో దారుణత్వమునో చూపు రాజునకు ఇహపరములు సిద్ధించును; రాజు తన భృత్యులతో పరిహాసములాడరాదు. హర్ష వశ గతుడగు రాజును భృత్యులు పరిఢవి(అలక్ష్యముగా చూ)తురు.
రాజు ప్రవర్తించవలసిన విధము
రాజు వ్యసనములను విడువవలయును; కాని లోక సంగ్రహమునకై (తాను ఆయా వినోదములయందు నేర్పరియని చూపుటకు) కృత్రిమముగా (నటనకై) వ్యసనములందాన క్తి చూపవలేను: రాజ శ్రేష్టుడు గర్విగానున్నను ఉద్రిక్త చిత్తుడుగానున్న ను ఇతనిని సేవించరాదనుచు జనులాతనియందు విరక్తులగుదురు; రాజు ప్రతివారితోను చిరునవ్వు తోనే మాటలాడవలయును; వధ్యుల విషయమున కూడ రాజు కనుబొమలు ముడి వేయరాదు. ధర్మభృతులలో శ్రేష్టుడవగు మనూ! రా జెల్లప్పుడును స్థూలలక్యుడు (దాతృత్వము కలవాడు-ఉదారుడు) కావలయును: అట్టివానికి భూమి (రాజ్యము) ఆంతయు వశీభూతమగును; రాజుఏపనియందును దీర్ఘ సూతుడు (అది ఏదో జరిగినప్పుడు చూచుకొందమను నాడు) కారాదు; ఆట్టివాని పనులన్నియు తప్పక చెడి పోవును: అగుగాక! కొన్ని పనులయందు రాజు దీర్ఘ సూత్రుడు తొందరపాటు లేని వాడు) కావలయును; అవి ఏవనగా-రాగము (ఆధిక ప్రీతి చూపుట) దర్పము -మానము-ద్రోహము.పాపకార్యము-ఆ ప్రీతి ద్వేషము చూపుట అనునవి; రాజైల్లప్పుడును సంవృతమంత్రుడు (తన మంత్రాలోచనమును రహస్యముగనుంచు వాడు) కావలయును; ఆట్లుండనిచో వానికి సర్వాపదలును కలుగును; రాజు చేయు పనులు అవి ముగిసిన తరువాతనే - కాని ఆరం భించునపుగితరులకు తెలియరాదు; అట్లు వర్తించు రాజునకు పృథివి అంతయు అధీనమయియుండును; ఇట్లు రాజ్య మెల్లప్పుడు మంత్రమూలక మైయుండును; కావున అది బయల్పడునే మోయను భయముతో పృథివీపాలురు మంత్రరక్షణము చేసికొనుచుండవలయును; మంత్రవేత్తయగువాడు సాధించిన మంత్రణము సర్వ సంపత్సుఖములను కలిగించును; మంత్రమునందలి దోషములచే ఎందరో రాజులు వినాశ మందిరి;
రాజుఅనుసరించవలసిన రీతులు
ఆకారములు (ముఖ నేత్రాది లక్షణములు) ఇంగితములు (వానికదలికలు . సైగలు) నడక చేష్టలు మాటలు ముఖనేత్ర వికారములు మొదలగు వానినిబట్టి ఇతరుల మనస్సు తెలిసికొన వలెను; ఇట్లు గ్రహించగల నీతి కుళ లురకు సర్వవసుంధరయు వశ గతమగును; రాజు తానొక్కడే మంత్రణము చేసికొనరాదు; చాలమందితోను మంత్రణము చేయరాదు; నావికులను పరీక్షించనిదే విషమమగు నావ నారోహించరాదు; తన భూమిని జయించు శత్రువులను సామాద్యు పాయములతో వశీక రించుకొనవలెను; తన రాజ్యమును రక్షించుకొనగోరు రాజు తన లక్ష్యముతో ప్రజలు కృతులు (కర్శితులు- క్లేశ పడువారు) కాకుండునట్లు చూచుకొనుచు. పొలించవలయును; ఏరాజు నరిగ చూచుకొనక స్వరాష్ట్ర ములను(రాష్ట్ర ప్రజలను)కృతులనుగా చేయునో అట్టిరాజు త్వరలోనే రాజ్యము నుండియు జీవితము నుండియు భ్రష్టుడగును; కోడెదూడను పోషించినచో అది బలమంది పనులకు యోగ్యమగును; అట్లే రాష్ట్రమును (రాష్ట్ర ప్రజలను) పోషించినచో వారు చక్కగా పనిచేయుచుందురు; రాష్ట్రము ను ఎవడు అను గ్రహముతో చూచునో. అతడే రాజ్యమును పరిరక్షించుకొన గలుగును; ఏ రాజు నంజాతమును (రాజ్యమందు ఉత్పన్నమగు. ధనాదికములగు వనరులను) ఉపజీవించునో అనుసరించి ప్రజాపాలనాదికము చూచునో అట్టివాడు రాష్ట్రమునుండి పారణ్యమును ధాన్యమును సురక్షితమగు . రాజ్యమును మహా ఫలముగా పొందును; ఇట్లు మహా ప్రయత్నముతో తానే ప్రజల తల్లిదండ్రులుగానే స్వరాష్ట్రమును తన దేశపు వారి నుండియు పరులనుండియు రక్షించుచు తానును తన ఇంద్రియములను ఆదుపునందు ఉంచుకొనుచు తాను ప్రజలనుండి పొందిన ఫలమును వారివే ఆగు యోగ క్షేమముల కే వినియోగించవలయును.
ఇదియంతయును దైవము (ఆదృష్టము - భగవన్నిర్ణయము) నందును మానుషము ! పురుష ప్రయత్నము ) నందును ఆయ తమై (అధీనమయి) యున్న దీ; ఈ రెండింటియందును - దైవము అచింత్యము (ఊహింపనలవి కానిది) మానుష (పౌరుష-పురుషకార)మునందు క్రియ నిలిచియున్నది; (క్రియారూపమున కనబడును); ఈ విధముగా మహీపాల సము చేయు రాజునందు ప్రజల కనురాగ మధికముగా నుండును; దానిచే లక్ష్మిక లుగును; దానిచే పరమశోభ కలుగును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మమున రాజకర్తవ్య స్వపుత్త్రక్షాది క్రమ కథనమను రెండు వందల పందొమ్మిదవ అధ్యాయము.
