మత్స్య మహా పురాణము
60 - సౌభాగ్య శయన వ్రతము
మత్స్య నారాయణుడు ఇట్లు చెప్పెను: ఇట్టిదే మరియొక వ్రతమును చెప్పెదను. వినుము. సౌభాగ్యశయన వ్రతమని దానిని పురాణవేత్తలందురు. అది సర్వ కామఫలదము.
పూర్వము ప్రళయకాలమున భూర్భువః సువరాది లోకములన్నియు దగ్గములు కాగా సర్వభూతముల సౌభాగ్య మును ఒక చో చేరి ఒకటిగానై వైకుంఠమున కేగి విష్ణు నక్షమున నిలిచేను. మరల చాలకాలమునకు సృష్టి ఆరంభము కాసాగెను. ప్రధాన పురుషాత్మకమగు లోకమంతయు మాయాకృతమయిన అహంకారముతో ఆవృతమయి యుండెను. బ్రహ్మ విష్ణులకు (తమ తమ గొప్పతనము విషయములో) పోటీ ఏర్పడెను. (ఇది భ్రహ్మదేవుని రజోగుణప్యాప్తిచే కలిగిన తపఃప్రభావము) అపుడు లింగాకృతితో మహాభయంకర వహ్ని జ్వాల ఉద్బవించేను. దాని వేడి మీతో మిగుల కాగిన విష్ణు వక్షమునుండి అంతవర కచట నిలిచిన సౌభాగ్యఘనము కరగి బయటికి వచ్చెను. ఆది అచటినుండి లేచి ఎగిరినది. అది భూమికి చేరులోపలనే అంతరిక్షమునం దుండగనే బ్రహ్మ మానసపుత్రుడును బుద్ధిశాలియు నగు దక్షుడు దానిని తోవేను. వెంటనే అతడు రూపలావణ్యబలతేజోవంతు డయ్యెను. దానిలో కొంత మిగిలినదై (చిందినదే) సర్వసౌభాగ్యదాయకములగు ఎనీమీది ఓషధులుగా నయ్యెను. 1. చెరకు 2. యవలు మొదలగు వాని నుండి చేసిన చక్కెర (Glucose) 8. జాజికాయ 4. ధనియాలు 5. విరిగిన ఆవుపాలు 6. కుంకుమ పూవు 1. బొబ్బరలు 8. ఉప్పు అను ఈ ఎనిమిదిటికిని సౌభాగ్యాష్టకము అని పేరు. ఇవియే ఆ ఓషధులు. వీటిని- పానము చేసిన దక్షుని కూతురే సతీదేవి అతిలోక లావణ్యవతి; కనుక నే ఆమెకు లలిత అని పేరు. ఆమెను శివుడు పెండ్లాడెను. ఆమె సౌభాగ్యమయియు భుక్తి ముక్తిప్రదాయినియు; ఆమె నారాధించిన స్త్రీకి కాని పురుషునకు కాని ఏమి లభింపకుండును? అనగా ఏనీ మనువు ఆ జగద్ధాత్రిని ఆరాధించు విధానమును తెలుపుమని యడుగగా మత్స్య నారాయణు డిట్లు చెప్పెను:
వసంత మాసారంభమున చైత్ర శుక్ల తృతీయా తిథియందు ఉదయమున నూవులతో నూవుపిండితో నూవుల నూనెతో) స్నానము చేయవలెను. ఆనాడు ఆమె విశ్వాత్ముడగు పర మేశ్వరుని సమంత్రకి ముగా పెండ్లాడెను. కనుక ఆనాడు శ్రీలలితా పరమేశ్వరుల ప్రతిమలను గంధోదక ముతోను పంచగవ్యములతోను స్నానము చేయించి వారిని నానా విధ ఫలపుష్పగంధ ధూపదీపములతో అర్చించవలెను. మంతక్రమము : 1. పాటలాయై నమః . శివస్య దేవాంశ్చ పాదౌ పూజయామి; 2. జయాయై - శివాయచ నమః గులే'్ఫ పూజయామి; 3. భవాన్యై-త్ర్యంబకాయచ నమః జంఘే పూజయామీ; 4. విజయాయై -భద్రేశ్వరాయచ నమః జానునీ పూజయామి; 3. వరదాయై.హరి కేశాయ నమః - ఊరూ పూజయామి; 6. ఈశానాయైశంకరాయ నమః కటిం పూజయామి; 1. కౌళిన్యై- శూలపాణయే నమః. కుక్షిధ్వయం పూజయామి; 8. మంగళాయే - మంగళాయ నమః - ఉదరం పూజయామి; 9. త! శాన్యై సర్వాత్మనేచ నమః - కుచద్వయం పూజయామీ; 10. రుద్రాక్ష్యే - వేదాత్మనేచ నమః_కంఠం పూజయామీ; 11. అనస్థాయె-త్రిపుర మ్నాయ నమః-కరౌ పూజయామీ; 12. కాలానల ప్రియాయె-త్రిలోచనాయ నమః బాహూ పూజయామి; 18. సౌభాగ్యభవనాయై సౌభాగ్య భవనాయ నమః - భూషణాని పూజయామి; 14. స్వాహాస్వధాయే - ఈశ్వరాయచ నమః. ముఖం పూజయామి; 16. అశోక మధువాసినై - అశోక మధువాసినే నమః, ఓషో పూజయామి; 26. చంద్రముఖప్రియాయైఎస్థాణ వేచ నమః ఆస్యం పూజయామి; 17. అఖిలాంగ్యే అర్ధనారీశ్వరాయ నమః నాసికాం పూజయామి; 18.. లలితాయై. ఉగ్రా యచ నమః-భ్రువా పూజయామి; 19. వానవ్యైశర్వాయ నమః. అల కాన్ పూజయామీ; 20. శ్రీకంఠ నాధాయై - శ్రీకంఠనా ధాయ నమః- కేశాన్ పూజయామి; 21. భీమోగ్రసమరూపిణె-సర్వాత్మనే నమః శిరః పూజయామి.
ఇట్లు పూజించి సౌభాగ్యాష్టద్రవ్యములను ఎనిమిదింటిని లలితా పర మేశ్వరులముందుంచి నివేదించి ఉత్తరపూజ. జరుపవలెను. గో శృంగోదకమును మాత్రము త్రాగి ఉపవాస ముండి భూమియందే శయనించి రాత్రి గడుపవలేను.
తెల్లవారిన తరువాత (చవితినాడు) స్నానజపములు చేసి శుచియై వస్త్రమాల్య విభూషణములతో విప్ర దంపతులను పూజించి లలితా పరమేశ్వరుల ప్రతిమలను సౌభాగ్యాష్టకమును ‘లలితా ప్రీయతాం’ అని వారికి దాస మీయవలెను. ఇట్లు ప్రతి మాసమున సంవత్సరము పొడవున చేయవలెను. ఉపవాసమునాడు తీసికొనవలసిన ఆహార మునను దానమంత్ర మునను భేద ముండును. ఎట్లనగా- చైత్రమానమున గో శృంగోదక మాహారము-’లలితాప్రీయతాం’మంత్రము. వైశాఖమున గోమయ మాహారము. ‘విజయాప్రీయతాం’ మంత్రము; జ్యేష్టమున మందారపుష్ప మాహారము - ‘భద్ర ప్రీయతాం’ మంత్రము; ఆషాఢమున బిల్వపత్రము ఆహారము. ’భవానీ ప్రీయతాం’ మంత్రము; శ్రావణమున పేరు గాహారము. ‘కుముదా ప్రీయతాం’ మంత్రము; భాద్రపదమున కుశోదక మాహారము - శివా ప్రీయతాం’ మంత్రము; ఆశ్వయుజమున క్షీర మాహారము - ‘వాసుదేవీ పీయతాం’ మంత్రము; కార్తిక మున పృషదాజ్యము (మీగడ, పెరుగు) ఆహారము - ‘గౌరీ ప్రీయతాం’ మంత్రము; మార్గశిరమున-గోమూత్ర దూహారము-‘మంగళా ప్రీయతాం’ మంత్రము; పుష్యమున నేయి ఆహారము-‘కమలా ప్రీయతాం’ మంత్రము; మాఘమున సల్ల నువ్వులు (నువ్వుల పొడి) ఆహారము; ‘సతీ ప్రీయతాం’ మంత్రము; ఫాల్గునమున పంచగవ్య మాహారము-‘ఉమా ప్రీయతాం’ మంత్రము; చైత్రాదిమాసములందు వరుసగా మల్లె-అశోకము-తామర-కడిమి-కలువ-మాలతీ. కుబ్జకము (గొజ్జుగి) కరవీరము (ఎర్రగన్నేరు జాతి ఎర్రని తెల్లని పూలు) రెల్లు- వాడ గన్నేరు-కుంకుమ పూవు-పేంకణము- ఈ పూవులతో పూజించవలెను. జపాపుష్పము - కుంకుమపూవు-మాలతి -నూరు రేకుల తామర-కరవీరము పూలు ఎప్పుడును ప్రశస్తములే.
ఇట్లు పండ్రెండు మాసములందును భక్తితో పూజించవలెను. వ్రతము ముగిసిన తరువాత ఉమా మహేశ్వర ప్రతిమను సర్వసామగ్రీయు క్రమయిన క్రొత్త మంచము పై నుంచి దానిని బ్రాహ్మణ దంపతులకు దానమీయవలెను. యథాశక్తిగ మరికొందరు బ్రాహ్మణ దంపతులకు వస్త్రములు ధాన్యము ఆభరణములు గోవులు మొదలైనవి దాన మీయ. వలెను. ధనమున క్రే లోభించ రాదు. అహంకారముతో చేయరాదు.
ఇట్లు చేసిన స్త్రీ కాని పురుషుడు కాని కుమారీ కాని అన్ని కోరికలును తీరి అనంతఫల మందుదురు. . కీర్తి సౌభాగ్యారోగ్య రూపాయుర్వసాలంకరణ భూషణములు లభించును. మూడువందల అర్బుదముల సంవత్సరములు రాజత్వ మందును. ఇ బ్లీ వ్రతమున వరుసగా పండ్రెం డేండ్లు కాని పదునెనిమిదేండ్లయినను చేసినవారు పది వేల కల్పముల పాటు దేవతల సేవల నందుకొనుచు కైలాసమున వసింతురు.
దీనిని వినినను వినిపించినను వారికి కూడ విద్యాధరత్వమును స్వర్గలోక చిరనివాసమును లభించును.
దీనిని పూర్వము బ్రహ్మదేవుడు కార్తవీర్యార్జునుడు వరుణుడు నంది.వీరు చేసిరి. మిగిలినవారి మాట చెప్పవల సిన పనీయే లేదు.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున సౌభాగ్యశయన వ్రతమను అరువదియవ అధ్యాయము.
