మత్స్య మహా పురాణము
133 - నారదుడు త్రిపుర దుర్గము నుండి శిపుని కడకు వచ్చుట - దేవదానవ యుద్దము
(*ప్రకీర్ణాథభీమైస్తై స్సదైవైః పార్షదాం గణైః)
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనా-గెను: అనంతరము నారదుడు త్రిపుర దుర్గమునుండి దేవబలముకడకు వచ్చి సభయందు కూర్చుండెను. ఆ దేవ సేనాసాసము అద్భుతమగు ఇలావృత వర్షము. ఆచ్చటనే బలి యజ్ఞ మాచరించెను. అచ్చటనే అతడు వసిండు వాడు. అది దేవతల (ప్రాచీనార్యుల) యజ్ఞభూమిగా త్రిలోకప్రసిద్ధము. దేవతలు వివాహములు క్రతువులు జాత కర్మాది క్రియలు కన్యాదానములు ఇచ్చటనే జరుపుకొనిరి. శివుడిచ్చటనే తగ్, సహాయు లగు పారడులతో కూడ సతతము ఆనందించను. లోక పాలురును అచ్చటనే మేరుపర్వతమందువలె కొలువు తీరేడి వారు. ఇపుడు అచ్చట కూర్చుండి తేనెవరే పిగళ నేత్రములుకల దేవాధిపుడు మహేశ్వరుడు దేవతలతో ఇట్లు పలి కెను: ఇదిగో! గగన సంచారియగు దానవుల త్రిపుర దుర్గము కనబడుచున్న దే? అది విచూశములతో పతాకలతో ధ్వజములతో అలంకరింపబడియున్నది. ఇదీ అందరు గినది.ప్రసిద్ద నది - అగ్నివంటిది.నిరుపమాన మైనది. వీరుగో! కాటుక కొండలవంటి దానవులు కుండలములు కిరీటములు ధరించి ప్రాకార గోపురాగములయందు నిలిచి కన బడుచున్నారు. వీరుగో! మేఘములవలె ప్రకాశించు ఏకృతముఖులగు దైత్యులును దానవులును విజయాభిలాషులై త్రిపుర దుర్గమునుండి వేలికి వచ్చుచున్నారు. ఇందా? ఇట్టి స్థితిలో నిపును వాహనముల నెక్కి వరాయుధధారులే న దేవశ తముల తోను నా దృష్యులు ప్రసథులతోను కూడి మహాసురుల చంపుము. మరి నేనో! రథ మారోహించి సైన్యమును వేటగోని నిశ్చలుడనే ఈ దుర్గ మును గేలిచి మీకు విజయము కలిగింప అనుకూలమగు అవకాశమున కై నిరీక్షించుచుందును. పుష్య యోగమున ఈ త్రిపుర దుర్గము ఒకటిగా ఐనపుడు నేను ఈ పురమును ఏకశరముతో నిర్దహింతును.
రుద్ర భగవానుడిట్లు చెప్పగా సురేంద్రుడు ఆ సైన్యముతో కూడి త్రిపుర విజయమునకై వెడలెను. అతని సైనికు లెల్ల కొందరు రథారోహులు మరికొందరు పదాతులు; అందరును మేఘములను కొండలను పోలినవారు; సింహ ధ్వనులు చేయుచున్న వారు; పిడుగులు కక్కుచు ఉరుముచున్న మేఘముల వంటి వారు.
దేవదానవయోర్యుద్ధం
ఆ నాదము విని రెచ్చిపోయి త్రిపుర దానవులు యుద్ద లాలసులయి సంచరింపసాగిరి; అం తేకాదు; యుద్దము నకై దేవతల కభిముఖులై పరుగేత్తిరి. ఆకాశమందలి గణేశ్వరులతో తలపడి యుద్ధము చేసిరి. వారిలో కొందరు మేఘ ములవంటి ఆకారములు కలవారు; మేఘములవలే ధ్వనులు చేయువారు నయిరీ; సింహనాదములను కూడ చేసిరి; లేచి నిలిచి వాద్యములను కూడ మోగించిరి. దేవతల సింహనాదమును సర్వ వాద్యముల ధ్వనియును గొప్పదిగా నయ్యెను. ఇన్ని విధములను దేవతల చేత త్రిపుర దుర్గము మేఘముల చేత చంద్రబింబమువలె క్రమ్మి వేయబడెను. చంద్రోదయ మున ఉదేకింపజేయబడి నింపబడిన సముద్రమువలె భయంకర రూపులగు సురాసురులచేత త్రిపుర దుర్గము నిండిపోయి ప్రకాశించెను. వారిలో కొందరు విలాసవంతులు ప్రాకారములపై మరికొందరు గోపుర ముల పై ఇంకను కొందరు అట్టాల కముల పై (బురుజులపై మేడల పైఅంతస్తుల పై) నిలువబడిరి. ఆ విలాసవంతు లందరును సువర్ణహారములను దాల్చిన వారును పదును పెట్టి మెరుగులు తీర్చగా తళతళ మెరయు కృపొణికలను ధరించిన శూరులును కాని సామాన్యులు కారు. వారిలో కొందరు జలపూర్ణ మేఘములవలె గర్జించుచుండిరి. మరికొందరు వస్త్రముల నెగురవేయుచు ఇటు నటు పరుగెత్తు చుండిరి. ఇంకను కొందరు ఇండ్లలోనుండి బయటికి వచ్చి.ఇది యేమి జరుగుచున్నదని పరస్పర మడుగుచుండిరి. ఇది యేమో నాకు తెలియుట లేదు. నా తెలివియంతయు మరుగుపడి పోయినది. అమ్మా ! నేను ఎవరివాడనో నాకు తెలియుట లేదు. ఇడుగో! ఇక్కడ చాల గొప్ప వ్యక్తి ఎవరో కనబడుచున్నాడు. ఇతడు కాలు యము) డే మో! సింహములు లాగు రథము నారోహించి కనబడుచున్న ఈ రాజెవ్వరో! దేహమును పీడించు వ్యాధివలె తిపుర దుర్గమును పీడించుచు పైకి విజృంభించుచున్నా డిత డెవరు? ఇతడు ఎవరైన నగును గాక! తందరలాడు ఈ తడబాటు సమయములో ఈ ప్రశ్న ములతో పని యేమి? ఇక ఆయుధములు ధరించి రండు; జరుగవలసినది జరుగును. అని ఇట్లు త్రిపుర దుర్గ వాసులగు వారందరు భయా కొంతులయి పరస్పరమనుచు మాటల పై మాట లాడుచుండిరి. మరికొందరు ఒక రింకోకరి దగ్గరకు పోయి పోయి ఏమేమో అడుగుచుండిరి.
అంతలో తారకాక్షపురమునందలి అసురులును దైత్యులును కుపితులై బిలమునుండి మహానర్పములవలే బయ టకు వచ్చిరి. వారందరును ప్రమథనాయక సేనాపతులతో తలపడుట కై పరుగెత్తుచు సింహములచే అడ్డగించబడిన గజ యూథనాయకులవలె వారిచే అడ్డగించబడిరి. సంపదలచే గర్వితులును దర్పితులును నగు ఆ అసురుల రూపములు తిత్తితో గాలి ఊదుటచే మం డెడు అగ్నుల రూపములవలె ప్రజ్వలింపసాగెను. అంతటవారు భయంకర నాదములు చేయు పెద్ద చాప ములను ఆకర్షించి ప్రాణము లాహారముగా గోను బాణములతో పరస్పరము కొట్టుకొనుచుండిరి. రూప సంపదలు గలిగి గర్వితులగు దానవు లందరును పిల్లులవలే మృగములవలె భయంకర వికృత ముఖములుగల ప్రమథులను చూచి బిగ్గరగా నవ్వుచుండిరి. మే మాకరించెడు ధనుస్పులనుండి వెలువడు పరిఘలను పోలు శరములు పక్షులు తటాకములలో ప్రవే శించునట్లు ప్రవేశించును. మీరు మాకు ఎదురు నిలిచి యుద్ధము చేసితిరా.చచ్చితి రన్న మాటయే; మేము మిమ్ము చంపు దుము; వెనుకకు మరలుడు.
భయంకరరూపులు యుద్ద దుర్మదులు సగు దానవులు - దానవ శేషులు శివపారదుల నిట్లు పరుషములు పలికి సూర్యుడు తన కిరణములతో మేఘములను చీల్చి నట్లు శరములతో చీల్చిరి. సింహముల మొగములవంటి మొగములు కల వారును సింహములవలే విక్రమించువారు నగు ప్రమథులును దైత్య దానవులను గండ శైలముల శిలల వానతో నలుగ గొట్టిరి; చీల్చిరి; ఆకాశము మేఘములతోను హంసలతోను కలత చెందునట్లు ఆ సేనా సముదాయము దైత్య దానవులతో సంకులమయి ప్రకాశించెను. ఇంద్ర ధనువులతో మెరయు హృదయములుకల మేఘములు దుర్దినమును (మేఘచ్ఛాదిత మయిన ఆకాశముకల దినము దుర్గిన మనబడును. సృష్టించినట్లు దైత్య దానవులును ధనువులు లాగి విడీచిన శరము లతో దుర్దినమును సృష్టించిరి. బాణపు దెబ్బలు తగిలిన ప్రమథుల దేహములనుండి స్రవించు రక్తధారలు పర్వతముల నుండి వెలువడు సువర్ణ ధాతువులవలె కనబడుచుండెను. దైత్యులు వృక్షములతో శిలలతో శైలములతో గండ్ర గొడ్డంద్రతో శూలములతో ప్రమథులను కొట్టి చూర్ణము చేయుచు చచ్చితిరి-చచ్చితీరి- అని కేకలు వేయుచుండిరి. ఇడుగో! తార కాకుడే జయించినాడు. అని దైత్య దానవు లుప్తోషించగా ఇంద్రరుద్రుల కే జయము కలిగినదని ప్రమథులు అరచుచుండిరి. ఆ బల సముద్రమునందలి ఇరుపక్షముల యోధులును పర స్పర బాణములతో చీల్చబడి వారింపబడి వర్షాకాలమందలి ప్రజల జలదములవలే ధ్వనులు చేయుచుండిరి. ఆ యుద్ధ భూమి తెగిపడిన చేతులతో శిరములతో, ధ్వజములతో కుండలములతో మాంస శోణితములతో భయంకరమయి కనబడుచుండెను. దానవులును ప్రమథులును తాటి చెట్టంత ఎత్తున ఎగిరి ఎగిరి మేలగు ఆయుధములతో పరస్పరము కొట్టుకొని - నిలువున లేచిపడుచుండిరి. ఇరు పక్షములవారికి తగులుచున్న గట్టి దెబ్బలు చూచి ఆకాశ గ తులగు సిద్దులును అప్సరసలును హరము చెంది ‘బాగుబాగు!’ అని పలుకుచుండిరి. అంతరిక్షమున నిరంతరముగా మోగించబడుచున్న దేవదుందుభుల ధ్వనులు మేఘ శబ్దములు విని రోషించి అం కెలు వేయు వృషభధ్వనులవలె వినబడుచుండెను. కిరణములు సూర్యునియందువలే- నదులు సముద్రము నందువలే. సర్పములు వల్మీకములందువలే- ప్రమథుల చేతిలో దెబ్బలు తినిన దానవులు - క్రుద్దవదనులై తమ పుర మున ప్రవేశించుచుండిరి. ప్రళయ కాలమందు పర్వతములు జెక్కలతో ఎగిరినచ్చి ప్రజల పై పడునట్లు సశస్తులే వచ్చి దేవతల పై పడుచుండిరి. ప్రమథగణ నాథులు మూడవవంతుదానవ సేనతో తలపడి ఇట్లు పోరు సాగించుచుండిరి.
(*చుక్రుశుర్దానవాప్రేక్ష్యదుద్రువుశ్చగణాధివం)
(*తేపిడ్యమానాగురుభిర్గిరిభిశ్చగణేశ్వరాః)
అంతలో విద్యున్మాలియు మయుడును తమ అనుయాయులతో కూడ అక్కడకు వచ్చిరి. వారు వచ్చి తమ మీద పడుచుండగనే ప్రమథ గణాధినాథులు వారిని చూచి భయపడిరి; వారి చేతిలో కొందరు చంపబడిరి; మరికొందరు రణరంగమున వృక్షములవలె విరిగిరి; (పారిపోయిరి.) పర్వతేంద్రమువంటి పెద్ద దేహము కలవాడును బలశాలియునగు విద్యున్మాలి దానవుడు పరిఘను తీసికొని నందీశ్వరుని కొట్టేను. నందియును ఆ దెబ్బతిని పూర్వము మధురాక్షసుని చేతి దెబ్బతినిన నారాయణుడువలె గిరగిర తిరిగి భంగమందెను. ఆ మహాయుద్ధమున సందీశ్వరుడే దెబ్బ తినగానే ప్రసిద్ధ విక్రమశాలురగు ఘంటాకర్లుడు శంకుకర్ణుడు మహాకాళుడను ప్రమథులందరును తడబాటునందుచు పారిపోసాగిరి. అంతట వదలక విద్యున్మాలి ప్రమథగణములను గణాధిపతిని గణాధిపతికంటే గొప్పవారగు పారిషద శేష్టులను చీల్చి. చెండాడి అంతరిక్షమున మేఘమువలె గర్జించెను. వాని గర్జన ధ్వని వినబడగానే సూర్యతేజస్కుడగు నందీశ్వరుడు మరల తెలివినొంది విద్యున్మా లమీదకు పరువే త్రేను. అతడు వజ్ర సదృశ దేహుడగు ఆ దానవుని మీదకు రుద్రుడు తనకిచ్చినది దీపానల సమప్రభమయి ప్రజ్వలించుచున్నది అగు వజ్రమును ఏస రెను. ముక్తాఫల విభూషితమగు ఆ వజ్రమను భీషణాయుధము నందీశ్వరుని బాహులచే విడువబడివచ్చి ఆ దానవుని వక్షము పై పడెను. వాడు వజమువలె దృఢశ రీరుడే ఆయినను ఆ వజ్రపుదెబ్బ తిని ఇంద్రుని వజ్రపుదెబ్బ తినిన పర్వతేంద్రమువలె పడిపోయెను. ప్రమథకుల మునకు ఆనందప్రదుడగు నందిచేతిలో డై త్యేశ్వరుడగు విద్యున్మాలి దెబ్బతినగానే దానవులు ప్రమథ గణాధిపతులను చూచి అరచుచు మీదకు పరువెత్తుకొని వచ్చిరి. విద్యున్మాలి పడిపోయేనే యను దుఃఖముచే కలిగిన క్రోధముతో నిండి పోయి ఆ దానవోత్తములు భూమి మీదకు పర్వత వర్షము కురిపించ నారంభించిరి. అధార్మికులగు దానవ శ్రేష్టులు అట్లు కొండలతో వృక్షములతో చావగొట్టుచుండ ఆదెబ్బలు తినుచు ప్రమథులు ఏమి చేయుటకును తోచని వారైరి.
అంతలో శోభావంతుడును ప్రతాపవంతుడునగు తారకాక్షుడు యుద్ధరంగమునకు వచ్చి పర్వతములతో వృక్షములతో సమానమగు శరీరము కలిగి భయంకరుడే కనబడెను. అతని చేతిలో తలలు పగిలి మొగములు పగిలి కాళ్ళు విరిగి ప్రమథ గణాధిపతులు మంత్రములతో స్తంభితములయిన సర్పములవలె కనబడుచుండిరి. మాయాశక్తి శాలియగు మయుని చేతిలో దెబ్బలుతిని మిగుల కేకలు వేయుచు పంజరములలోని చిలుకలవలె రొద చేయుచుండిరి. ప్రతాపవంతుడును శ్రీమంతుడు నగు తారకాక్షుడు ప్రమథగణ బలమంతయు ఎండుటడవిని అగ్నులతో కాల్చినట్లు కాల్చివేసెను. తార కామునిచే హరింపబడుచున్న ప్రమథ గణనాథులు బురదలో చిక్కుకొని తిరుగుడు పడుచున్న పనులవలె తిరుగుడు పడుచుండిరి. మయుడు మాయతో దెబ్బలు కొట్టుచుండగా దెబ్బలు తినిన ప్రమథ గణనాథులు వేళ్ళు శిథిలమయిన వృక్షములవలే నిలువచేతకాని వారైరి. అంత లో మయుడు తన మాయా బలముతో మరల మరల సముద్రమును ఆగ్ని ని సింహములను మొసళ్ళను సర్పములను గిరీంద్రములను వ్యాఘ్రములను వృక్షములను భేరుండ పనులను శరభములనెడి అష్టపాద మృగములను జలములను వాయువులను సృష్టించి తన శత్రువుల నడుమ విడువ సొగేను. తార కాకుడును మయుడును మాయతో ప్రమథ గణేశ్వరులను సం మోహనపరచుచుండ ముని తననిగ్రహ శక్తిచే అదుపులో నుంచబడిన ఇంద్రియములు ఆయా విషయములయందు ప్రవర్తిల్ల లేనట్లు వారును మనస్సుతో ఏమియు ఆలోచించనైన లేనివారైరి. మహాజలము అగ్నులు గిరులు ఏనుగులు సర్పములు సింహ శేషములు వ్యాఘములు భల్లూక ములు చిరుతపులులు రాక్షసులు దెబ్బలుకొట్టి బాధించుచుండ ప్రమథ గణాధిపతు లెల్లరును సముద్ర మధ్యమందు చిక్కుకొని బ్రదికి బయటపడు యెట్లా యని కలతపడువారివలే అజ్ఞానముతో మోహితులయిరి. ఇట్లు ప్రమథ గణేశ్వరులు మిగుల బాధింపబడుచుండ సురలు నలుగ కొట్టబడుచుండ కొందరు సుర శ్రేష్టులు వారిని రక్షణ సేయదలచి ఆయుధముల ధరించి శత్రుబలమునందు ప్రవేశించిరి. వజ్రము ఆయుధముగా గలవాడును సుర లోక పూజితుడునగు ఇంద్రుడు వజ్ర మును చేతధరించి ఐరావత గజమారోహించెను. నక్షత్రాధిపతియు గాత్రుల నేర్పరచువాడును మిగుల మనోహరమగు పశము (తన వక్షమందలి సేన - శుక్ల కృష్ణ పక్షములు) కలవాడు ప్రకాశ శీలుడునగు చంద్రుడు మహాప్రకాశము కలవా డయ్యెను. ఇట్లా ఇంద్రచంద్రులిరువురు సన్నద్ధులే శత్రుబలమున ప్రవేశించిరి. మదోద్ధతులగు ప్రమథ గణాధిపతులును శత్రు బలమును చూడదలచి దానీయందు ప్రవేశించిరి.
మదపుటేనుగు వనమును వలే పెనుగాలులు జలద సహితమయిన అంతరిక్షమును వలే సింహములు విజన ప్రదేశములందలి గోవులమందను వలె దేవ సేనలు రాక్షసుల బలమును కలవరపరచెను. తన బలమంతయు దేవతల చేతిలో దెబ్బలు తిని ఆతురమగుట చూచి మయుడు మాయతో అంధకారమును సృజించెను. గాఢమగు ఆ అంధ కార మును ఇంద్రుడు అతితీవ్రమగు ప్రకాశముగల విద్యోతనాస్త్రముతో నశింపజేసెను. రాత్రులందు చంద్రుడును పగళ్ల యందు సూర్యుడును వలె తమ సేసను ఇంద్రుడు ఆ విద్యోతనాస్త్రముతో ప్రకాశింపజేసెను. త్రిదశాధిపతి చేత ప్రకాశింప జేయబడిన ఆ జ్యోతిస్సుచే మయుడు కల్పించిన చీకటి ప్రణష్టమే శీఘ్రమే అతని మాయ నశించెను. ఇట్లు చీకటి తగ్గుచు ఇంద్ర ప్రభావమున అతని అస్త్ర ప్రభావము వృద్ధి పొందుచుండ ఒక ముహూర్తకాలము దిక్పాలురును లోకపాలురును ప్రమథగణ నాయకులును గొప్ప సింహనాదము చేసిరి. రాక్షస శేష్టులు కిరీటములు పగిలి విరిగి శిరస్సులు పగిలి తెగి అవయవములం దంతట శరములు గ్రుచ్చుకొని ఇట్లు దేవతా శ్రేష్ఠుల చేతిలో పరాభవమునంది బురదలో చిక్కుకొనిన గజేంద్రముల వలే చిక్కులలో పడిరి. ఇంద్రుడు భయంకర వజ్రముతోను మయూరధ్వజుడగు కుమారస్వామి శ క్తియను ఆయుధము తోను తన శ క్తి(బలము)తోను ధర్మరాజు భయంకర దండాయుధముతోను వరుణుడు పాశముతోను అమరుల వలేనే సుందరరూపములతో ప్రకాశించు ప్రమథ గణేశ్వరులును పూర్ణాహుతి సమయమున ఆజ్యబలముతో వెలుగు అగ్ని వలె ప్రకాశించుచును దానవులు అనెడి వృక్షములను పిడుగులు వృక్షములపై పడి నశింపజేయునట్లు నశింపజేయసాగిరి. ఆ సమ యములో మయుడును దేవతలను కాపాడుచున్న వాడును కృత్తికా నక్షత్ర కుమారుడగు దేవ శ్రేష్ఠుడును నగు కుమారస్వామిని శరముతో భేదించి మాటిమాటికిని గర్జించెను. అంతలో మయుడు తార కావునితోను రాక్షసులతోను ఇట్లనెను: “ధీరులారా! దానవ శ్రేష్ఠులారా! దేవతలను దెబ్బతీసి మనము దానవ బలమును వెంట తీసికొని పురములందు ప్రవేశింతము. అట్లు విశ్రాంతి తీసికొనుటచే మనకు బలము వృద్ధి నందును. మరల మన మందరమును కూడి వచ్చి యుద్ధము చేయుదము. మన మందరమును దెబ్బలు తిని గాయములనుండి కారు నెత్తుటితో తడిసియున్నాము. మన ఆయుధములును ధ్వజము లును డాలులును విరిగినవి పగిలినవి తెగినవి. శివ సేనాపక్షము వారు జయము పొంది ప్రకాశించుచున్నారు. ఇంకను గెలువ ఉత్సాహపడుచున్నారు. మయుని మాటవిని కాలయముని మించి భయంకర రూపుడును రక్తమువలె ఎర్రని కన్నులు కలవాడును ఆగు తార కాకుడు యుద్ధము చేయవలెనను ఉత్సాహమదములతో నిండిన దైత్యులను వెంటగొని శీఘమే త్రిపురదుర్గమును ప్రవేశించెను. అంతట శివుని సేనలో ఆనక శంఖభేరీ వాద్యములు ధ్వనులు సింహనాదములు చెల రేగెను. మహాబలశాలియగు ఆ సేన మహా సింహనాదములతో నిండినదియు భయంకరమును లోతై నదియు నగు మహా పర్వత గుహవలె ప్రకాశించెను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున దేవదానవ యుద్ధ కథనమను నూట ముప్పది మూడవ అధ్యాయము.
