మత్స్య మహా పురాణము

Table of Contents

128 - త్రిపుర నిర్మాణ కథనము

(*దైత్య స్త్రినేత్రః పుష్పకంయథా.)

దైత్యేంద్రుడగు మయుడు ఇట్లాలోచించి దివ్యోపొయ ప్రభాష ఫలముగా దివ్యమగు త్రిపుర దుర్గమును నిర్మించేను. అది దాని ఆధిపునీ మనఃసంకల్పముననుసరించి సంచరించునది. రెండేసి ప్రాకారముల నడుమ అక్కడక్కడ గోపు రములు భవనాదికముతో కూడిన విశాలరాజమార్గము ఆట్టాలక మహాభపస) ద్వారములు ఆట్టాలక గోపురములు రథ్యలు (పెక్కుబాటలు కలియు చోటు) ఉపరథ్యలు చత్వరములు ఆంతఃపురస్థానములు శివాలయములు గుంటలు చెరువులు దిగుడు బావులు సరస్సులు ఆరామములు (వి శాంతిక నువగు బయళ్ళు ఊద్యాసములు దానవులు వాహ్యాళికి పోవు మనో హర ప్రదేశములు కల త్రిపురమను దుర్గమును తాను మనసున అనుకొనినట్లే మయాసురుడు నిర్మించెను. నల్లని ఉక్కుతో నిర్మించినదానికి తార కాక్షుడును వెండితో చేయగా చంద్రునివలె ప్రకాశించు రజత దుర్గమునకు ఆకాశము నందలి మెరపుల రాశివంటి బలి విద్యున్మొలియు సువర్ణమయ దుర్గమునకు మయుడును ఆధిపతులయిరి.

తార కాక్షుని పురమునకును పిద్యున్మాలి పుర మునకును నడుమ శతయోజనములును విద్యున్మాలి పురమునకును మయుని పురమునకును నడుమ శతయోజనములును అంతరముండునట్లు మయుడు ఒక పుర మునుండి మరియొక పుర మును వెలికితీయుచు పుష్యయోగ సమయమున త్రిణే తుని పుష్పకముతో సదృశమగు త్రిపుర దుర్గము నిర్మించుచు పోవుచుండ ఆపోయిన మార్గమున అతని మాయచే ఆదుర్గము అట్లే ఏర్పడెను.

వానియందు నూరులకొలది వేలకొలదిగా అసురుల భవనములు శోభించసాగెను. ఆవియన్నియు కామ రూపములు -రత్నవంతములు వందలకొలది ప్రాసాదములు కూటాగారములు ఉద్యానములు దిగుడు బావులు తామర కొలకులు అశోకవనములు కోకిలారావములు విశాలములగు చిత్రశాలలు ఉ త్తమములగు చంద్రశాలలు పెక్కు బంగరు పతాక లు పూలమాలలు చిరుగంటల మువ్వల గుంపులు సుగంధములు చక్కగ కలయంపి చల్లి అలికిన ఆలుకులు పుష్పోపహారములు నేతితో వేసిన పొగల చీకట్లు పూర్ణకలశములు కలిగి సర్వలోకమయము లే రామ గమనములై ఏడెనిమి దంత స్తులు కలవిగా మయుడా అసుర భవసముల నిర్మించేను. అవి ఆకాశావరణమున హంస పంక్తులవలే (త్రిపుర దుర్గాంతర్గత పురములందు బారులు తీరి రాజిల్లుచుండెను. మల్లె జాజిపూలతో అలంకృతములయి ధూపగంధములతో వాసన వేయబడి సత్పురుషులవలే త్రోవను పోవు వారికి ఇంద్రియ సుఖము కలిగించుచు చంద్రుని శోభను పరిహసించుము తైపు బౌలరులతో ఆ భవనములు శోభిల్లుచుండెను.

ఆ త్రిపుర దుర్గమందలి ప్రతియొక పురమును బంగారుతో వెండితో ఇసుముతో చేసి మణులతో రత్నములతో కూర్పుకలపై కొండల గములవంటి ప్రాకారములు వందలకొలదిగ నుండెను. అవి పతాకాధ్వజ వస్త్రములతో కూడి కొండ కొమ్ములవలే కానవచ్చుచుండెను. దానియందలి ఆంతఃపురములు అందెల రవళులతో రమ్యములు. కన్యాపుర ముల శోభ స్వర్గ శోభను మించియుండెను. ఆరామములు విహార ప్రదేశములు చెరువులు గుంటలు చెలమలు సరస్సులు నదులు వనములు ఉపవనములు ఆటనుండెను. దివ్యములగు భోజ్య పదార్థములు నానారత్నము (శేషపదార్థము)లతో కూడిన ఉపభోగ సాధనములు కలిగి పుష్పరాసులతో హాయి గొల్పుచుండు వాహ్యాళి ప్రదేశములతో ఒప్పుచుండునట్లా మాయావియగు మయుడు వందలకొలది లోతైన అగడలతో సురక్షితమగు ఆ త్రిపుర దుర్గమును నిర్మించేను.

అద్భుత కార్యనిపుణుడగు మయుడు ఇట్టి యు తమ దుర్గ నిర్మాణము నొనరించిన సమాచారమును విని ఆనంత విక్రమ సంపన్నులగు దైత్యవరులు పేలకొలదిగ ఆటకు చేరిరి. గర్విత వేరి నాశ కులును కరీంద్ర మృగేంద్ర సమానులునగు ఆసురులతో ఆతీపుర దుర్గము-ఆకాశము మేఘ సహములతో నిండినట్లు స్కందాధాచారము పేర భటులతో నిండినట్లు నిండిపోయెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున  త్రిపుర నిర్మాణ కథనమను నూట ఇరువది ఎనిమిదవ అధ్యాయము.