మత్స్య మహా పురాణము

Table of Contents

201 - అగ స్త్యగోత్ర ప్రవరాను కీర్తనము.

మత్స్య జనార్దనుడు వైవస్వతమనువునకు ఇట్లుచే ప్పెను: అగస్త్యుడు కరంభుడు కౌసల్యుడు కరటుడు సుమేధ సులు మయోభువులు గాంధార కాయణులు పౌలస్త్యులు పౌలహులు క్రమవంశ భవులు. ఈ ఋషుల (గోత్రముల వారల)కు ఆగస్త్యుడు మహేంద్రుడు మయోభువుడు అనువారు ప్రవర ఋషులు; వీరు తమలో తాము వివాహసంబంధములు చేసి కొనరాదు.

పౌర్ణమాసులు పురాణులు అను ఋషుల (గోత్రముల వారల)కు ఆగస్త్యుడు పొర్ణమాసుడు పారణుడు అను ముగ్గురు ప్రవర ఋషులు; వీరు తమలో తాము వివాహసంబంధములు చేసికొనరాదు..

ఇట్లు చెప్పి మత్స్యనారాయణుడు నీకింతవరకును ఉత్తమ పురుషులతో ఏర్పడిన ఋషుల వంశమును తెలిపితిని; ఇక మీదట మరి ఇంకేమి చెప్పుదునన మనువు - పులస్త్య “పులహక్రతువుల వంశములకు కూడ ఆగ స్య వంశమను పేరేల పచ్చనో తెలుపుము.” అనెను. మత్సుడిట్లు చెప్పెను :

 వైవస్వత మన్వంతరమున క్రతుప్రజాపతి అనపత్యుడై ఆగ స్త్య పుత్తడును ధర్మజ్ఞుడునగు ఇద్మవాహుని తన కుమారునిగా గ్రహించెను. ఇందుచే క్రతు సంతతి వారును అగస్త్యులయిరి.

పులహుని పుత్తులు ముగ్గురు; వారి విషయమున ఇకముందు చెప్పెదను. ఏమయినను వారి విషయమున పులహునకు మన సృప్తి కలుగక ఆగస్త్యుని కుమారుడగు దృథాస్యుని తన కుమారునిగా తీసికొనెను. అందుచే ఈ పుల హుని సంతతి వారును అగస్త్యులయిరి.

పులస్త్యుడు వంశమువారు రక్షోజాతి యగుట చూచి ఆగస్త్యుని కుమారుని (ఒక నిని) తన కుమారునిగా చేసి కొనెను. అంతటి నుండి పులస్త్యుని సంతతివారును అగస్త్యులయిరి.

ఇట్లు వీరందరును నగోత్రులు కావున వీరు తమలో తాము వివాహసంబంధములు చేసికోనరాదు.

మహానుభావులును గోత్రకారులునునగు ఏప్రఋషుల పేర్కొంటిని; వీరి నామములు స్మరించినను పాపము క్తి యగును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున అగస్త్య గోత్ర ప్రవరాను కీర్తనము గోత్రప్రవరాను కీర్తన సమా ప్తియను రెండువందల ఒకటవ అధ్యాయము.