మత్స్య మహా పురాణము

Table of Contents

16 - శ్రాద్ధ కల్పము - నిమంత్రణాధివిధి

సూతుడు ఋషులకు ఇంక ను ఇట్లు చెప్పనారంభించేను. ఈ విషయమంతయు నిరవశేషముగా విని మనువు కేశ వుని మరల ఇట్లు ప్రశ్నించెను. “శ్రాద్దమును జరుపదగిన వివిధమగు కాలవి శేషమును వివిధములగు శ్రాద్ద విశేషము లను శ్రాద్ధమునందు భుజింపజేయదగిన వారిని భుజింపజేయదగనివారిని పితృ శ్రాద్ధ మాచరింపదగిన కాలమును ప్రదే శములను పితృదేవతలు ప్రీతి చెందుట కే శ్రాద్ధమాచరింపవలసిన విధానమును ఈ విషయములను అన్నిటినీ నాకు తెలుపుడు.”

మత్స్య నారాయణుడిట్లు మనువుతో చెప్పనారంభించెను. అన్నము మొదలగు పదార్థములతో కాని ఉదకముతో గానీ ప్రతిదినమునను శ్రాద్ధమును చేయవలెను. అన్నము లభ్యము కాని పక్షమున పాలుపండ్లు -దుంపలు. వీనితోనైన శ్రాద్ధము జరిపి పితరులకు ప్రీతి కలిగించవలెను.

నిత్యము నైమిత్తికము కామ్యము అని శ్రాద్దము మూడు విధములు. మొదటిది ప్రతిదినమును చేయవలసినది. మొదట దీనిని తెలి పెదను. దీనియందు అర్యము ఆవాహనము విశ్వదేవార్చనము ఉండనక్కరలేదు.  నిమి త్త్రము అనగా కాలవి శేష రూపమయిన హేతువు. ఆయా కాలవి శేషములందు చేయవలసినది నై మి త్తిక శ్రాద్ధము. ఇది మరల పార్వణ శ్రాద్ధము సాధారణ శ్రాద్దము అభ్యుదయ శ్రాద్దము అని మూడు విధములు. వీనిలో శుక్లకృష్ణ పక్షములందలి చతుర్థినాడును అష్టమినాడును పూర్ణిమ అమావాస్యలయందును చేయవలసినది పార్వణ పర్వదినములలో చేయదగిన) శ్రాద్ధము. (ఇచట పార్వణ శ్రాద్దము మూడు విధములు అని మూలములో ఉన్నది. కాని సందర్బమునుబట్టి ఇది నే మిత్త్ర శాద్దము -ని ఉండవలెను.) , శ్రాద్ధమునందు చేయవలసినవి మూడు-హోమము - బ్రాహ్మణభోజనము.పిండదానము అనునవి. అని ఆప సంబధర్మ సూత్ర వ్యాఖ్యానములో హర దత్తులవారు చెప్పినారు. ఆప-ధర్మ-ప్రశ్న-1. పటల-1.కండి. 16: సూతం-2: తర్పణము పిండదానములో చేరును. ఆవాహనాదికము బ్రాహ్మణ భోజనములో చేరును. హోమము తెలిసినదే. వానిలో భోజనమునకై పిలువదగిన బ్రాహ్మణులను తెలి పెదను. వినుము. పంచాగ్ని హోత్ర కర్మములను అనుష్టించువాడు (!.. అన్వాహార్యపచన లేక దక్షిణ. . గార్హపత్య శ్రీ ఆహవనీయ. 4. సభ- 6. ఆవసథ్య-అనునవి పంచాగ్నులు) వేదాధ్యయనము యథాశాస్త్రముగా ముగించి స్నానవ్రతము జరుపుకొనినవాడు త్రిసుపర్ణములను (ఋగ్వేదమునందలి 'చతుష్కపర్దా' ఇత్యాదిగా చూడు ఋక్కులను గాని యజుర్వేదమునందలి 'బ్రహ్మమేతుమాం' మొదలగు మూడు అనువాకములుగాని) ఆధ్యయనము చేసినవాడు ఆరు వేదాంగములను అధ్యయనము చేసినవాడు శ్రోత్రియుడు (వేదమును బాగుగా అధ్యయనము చేసిన వాడు శ్రోత్రియుని కుమారుడు (వేద శాస్త్రములందలి) విధి వాక్యము (లర్గము)లను బాగుగ ఎరిగినవాడు అన్ని విషయములను ఎరిగినవాడు సత్రయాగములను ఆచరించినవాడు అందరకును తెలిసిన ప్రసిద్ద కులమున వంశమున పుట్టిన వాడు పురాణములను ధర్మ శాస్త్రములను ఎరిగినవాడు స్వాధ్యాయములను ఎల్లప్పుడును శ్రద్ధతో చేయుచుండువాడు శివ భక్తుడు పితృభక్తుడు సూర్య భక్తుడు విష్ణుభక్తుడు బ్రహ్మతత్వమును ఎరిగినవాడు యోగ విద్య నేరిగినవాడు శాస్త్రుడు ఆత్మయోగము నెరిగిన వాడు మంచి శీలము కలవాడు దౌహిత్రుడు తన భార్యకు తండ్రి తన గురుడు తన కులము వారిలో పెద్దవీరినే ఆంధ్రదేశ మున సభాపతి అందురు.కులపు పెద్ద. మేనమామ బంధువు ఋత్విక్ ఆచార్యుడు (ధర్మశాస్త్రాదిక మును బోధించగలవాడు , సోమ యాజి వాక్కును (భాషలను) వ్యాకరించగలవాడు (వ్యాకరణ తత్వమును ఎరిగినవాడు-A great linguist) యజ్ఞ ప్రక్రియను శాస్త్రీయముగా చర్చించి వివరించగలవాడు సామవేద స్వర ప్రక్రియను బాగుగా ఎరిగినవాడు ఇడ్రి పంక్తిని పావనము చేయు వారిలో శ్రేష్ఠులు. సామవేదము నేర్చినవాడు బ్రహ్మ చారి భగవద్భక్తుడు బ్రహ్మత త్వవేత్త్ర ఏశ్రాద్ధమున భుజింతురో ఆశ్రాద్ధము సార్థకమయి పరమార్థఫలమును ఇచ్చును. కనుక శ్రాద్ధమునందు భోక్తలుగా ఇట్టివారినే నియమించవలేను.

ఇక భోక్తలుగా పిలుచుటలో విడువవలసినవారిని తెలి పెదను. వినుము. సతీతుడు పతితుని కుమారుడు నపుంసకుడు కొండెములు చెప్పువాడు; అంగహీనుడు రోగి పప్పి గోళ్ళవాడు పచ్చవారిన దంతములు కలవాడు స్త్రీకి భర్త ఉండగాగాని మరణించిన తరువాత గాని పరునివలన పుట్టినవాడు గుర్రములను పోషించి జీవించువాడు అన్న కు పెండ్లి కానిదే పెండ్లి చేసికొన్న వాడు లేదా తన కంటెముందే పెండ్లి చేసికొన్న వాని అన్న తనకు తానే కోరి ఇతరుల సేవకు పాల్పడి జీవించువాడు తాగుడు మొదలై నవానిని ఉపయోగించి మ తతలో ఉండు వాడు వెర్రివాడు కూరుడు పిల్లివలె కొంగవలే మోసముచే జీవించువాడు కపటి గొప్పలు చెప్పుకొనువాడు పూజారి కృతఘ్నుడు నా స్త్రీకుడు మ్లేచ్చ దేశములలో నివసించు (చిన్న వాడు త్రిశంకు బర్బర ఉత్కల ఆంధ్ర చీన ద్రవిడ కొంకణ దేశ ములవారు తన సంప్ర దాయ చిహ్నములను ఎల్లప్పుడు ధరించి తిరుగు వారు ఇట్టివారిని కర్మానుష్టాన ధర్మమును ఎరిగినవారు శ్రాద్ధమున భోక్తలుగా నియమించకూడదు. వేదతత్వము నెరిగి కర్మల ననుష్ఠించువారు వీరిని అందరను శ్రాద్ధ సమయములందు భో కలనుగా పిలువక విడువవలయును.

  శ్రాద్ధమునకు ఒక నాడుగాని రెండునాళ్ళుగాని ముందుగా భోక్తలగు బ్రాహ్మణులను వినయముతో నిమంత్రణము నేను అనుష్టించు శ్రాద్ధమునందు మీరు భోక్తలుగా ఉండవలెనని ప్రార్థన- చేయవలెను. చేసి అంగీకరింపజేసి తన ఇంటికి పిలిచికొనిరావలెను. అట్లు నీమంత్రించినచో పితృదేవతలు ఆ బ్రాహ్మణులందు ప్రవేశించి నిలుతురు. పితృదేవతలు వాయురూపులయి ఆ బ్రాహ్మణుల దగ్గరకు పోవుదురు. వారు భోజనమున కై కూర్చుండినప్పుడు వారియందుండి వారితో పాటు తామును కూర్చుందురు.

శ్రాద్ధకర్త భో ర్తయొక్క కుడి మోకాటిని తాకుచు 'అయ్యా! ఈ శ్రాద్దమునందు భోక్తగా నేను మిమ్ములను నిమంత్రించుచున్నాను, అని నియంత్రించవలెను. తరువాత అతడు పితృదేవతలయందు భక్తి తో ఈ నియమమును వారికి వినిపించవలెను. “మీరు ఈ ! శ్రాద్ధ కాలములో ఆరంభమునుండి చివర వర కును క్రోధము విడిచి శాచము కలిగి దేవతాత విషయమునే మాటలాడుచు ఉండవలెను. మీరే కాదు. శ్రాద్ధ కర్తనగు నేనును అట్లే యుండవలెను.” ఆని ఈ నియమ మంత్రము నకు అర్థము.

 పార్వణ శ్రాద్దమును జరుపు నిత్యాగ్ని హోత్రియగు గృహస్థుడు అమావాస్య మొదలగు పర్వములయందు యథా విధిగా పితృయజ్ఞమును జరిపి పిండముల అన్వొహార్యకసును-పితరులకు పిండములను ఆహారముగా సమర్పించుటను నిర్వర్తించవలెను. రౌద్దమును జరుపవలసిన ప్రక్రియాక్రమము ఇది. గోశాలా ప్రదేశమున గానీ సర స్సులు నదులు మొదలగు జల సమీపమునందుగాని దక్షిణము వైపునకు వాలుగా ఉన్న ప్రదేశములను గోమయముతో అలికి అచ్చట భ క్తితో శ్రాద్ధ మాచరించుట ఆరంభించవలెను. అగ్నిహోత్రమును ఏర్పరచుకొనవలయును. చరువును (పితృదేవతలకు అర్పించుటకై పక్వము చేసిన పదార్థమును) సమ పరిమాణము కల పిడికిళ్ళుగా పాత యందు వడ్డించుకోనవలెను. “అయ్యా! ఇది పితృ దేవతలకై వడ్డించుచున్నాను. మీరును నేనును సావధానతతో ఉండవలయును!” అని భో క లను ప్రార్థించుచు అదియంతయు దక్షిణమున ఉంచవలేను! తరువాత దాని పై నేతితో అభిఘారణము చేసి తనముందు మూడు వడ్డనలను చేయవలెను. ఆ వడ్డించు చరు పిండ పరిమాణము పం డేండు అంగుళముల పొడవుతో నాలుగంగుళముల వెడల్పు నాలుగు అంగుళముల మందము కలిగి ఉండవలెను. (1 భార తీయాంగుళము - 34 బ్రిటిషు అంగుళము. చండ్రకొయ్యతో మూడు దర్వులను { తెడులను) చేయవలెను. వాటిలో వెండి రేకు నమర్చవలేను. అవి పిడికిలి మూసిన మూర పొడవున నున్న నే చేతిముందు భాగపు ఆకారములో ఉత్త్రమమై ఉండవలెను. కంచుతో చేసిన నీటి పాత్ర. మేక్షణము . వైదిక కర్మము లందుపయోగించు ద్రవమును వడ్డించు ఉపకరణము) సమిధలు.కుశలు-తిలపాత్రములు.మడుగు వస్త్రములు గంధ మ లు ధూపద్రవ్యములు అనులేపనములు. (పూసికొను సుగ ధ వస్తువులు . ఈ మొదలగునవి సేకరించుకొనవలెను. వీటిలో ప్రతి ఒక్కటియు అపసవ్యముతో నెమ్మదిగా దక్షిణపు వైపుగా తెచ్చుకొని ఉంచుకొనవలెను.

ఇట్లు ఈ వస్తువులలో ప్రతి ఒక్కటియు సమకూర్చుకొని తన భవనమునకు (ఇంటికి ముందు ప్రదేశమున గోమూత్రముతోను గోమయముతోను అలికిన చోట గోమయముతో మండలము చేయవలెను. ఆ ప్రదేశమున అపసవ్య ముతో బ్రాహ్మణులను ఆక్షతలతోను పుష్పములతోను అర్చించవలెను. తరువాత వారిని మాటిమాటికి అభివందనము చేసి వారి పాదములను ప్రక్షాళనము చేయవలెను. తమ పాద ప్రక్షాళ నానంతరము ఆ బ్రాహ్మణులు ఆచమనము ఉద కోపస్పర్శ నము చేయవలెను. అట్టి వారిని చక్కగా అమర్చబడి దర్భలు పరచిన ఆసనముల పై శాస్త్ర విధానమున కూర్చుండ పెట్టి ఆనుమంత్రణము (మరల ఆహ్వానించుట-దయచేయుడు -కూర్చుండుడు అనుట) చేయవలెను, విశ్వదేవ స్థానమున ఇద్దరను - పితృ స్థానమున ముగ్గురనుసంభవము కాని యెడల రెండు స్థానముల లోను ఒక్కొక్కరినే కాని-భు ఇంపజేయ వలెను. శ్రాద్ధకర్త తాను ఎంత ధనవంతుడై నను ఇంతకంటే ఎక్కువ మందిని శ్రాద్ధమున భోక్తలుగా చేసి భుజింప జేయరాదు.

శ్రాద్ధకర్తయగు విప్రుడు భోక్తలుగా కూర్చున్న విప్రులను అర్యము మొదలగు వాటితో దేవ పూర్వకముగా (మొదట విశ్వ దేవ స్థానమున తరువాత పితృ స్థానమున) అర్చనము జరుపవలెను. తరువాత ఆవిప్రుల అనుమతి పొంది తరువాత చరువు (హోమమున కై ఉంచిన ద్రవ్యము)ను కంచు పాత్రలోనికి తీసికొని దానిని తన గృహ్య సూత్రములందు చెప్పబడియున్న విధమున అగ్నౌ కరణము చేయవలయును. సంప్రదాయమును ఎరిగి , వాడు అగు గృహస్థుడు) ఈ అగ్నౌ కరణముచే అగ్నీ షోమయములకు తృప్తి కలిగించవలయును. శ్రాద్ధకర్తయగు ద్విజోత్త్రముడు ఏకాగ్ని (వాన ప్రస్థుడు) ఐనచో దక్షిణాగ్ని ని (దీనినే అనాహార్య పచనాగ్ని యనియు లౌకి కాగ్ని అనియు వ్యవహరింతురు.) ప్రణ యనము (ప్రజ్వలనము) చేసి దానియందు ఈ అగ్నౌ కరణము జరుపవలెను. ఈ సందర్భములో పరులక్షణము అమంత్రక ముగా ఏ ఇతర ప్రక్రియ లేకుండ అగ్ని హోత్రుని చుట్టును నీటిని చిలుక రించుట) మొదలగునవి యజ్ఞోపవీతి (ఎడమ భుజము మీదుగా సవ్యముగా జం దేముధరించినవాడు) అయి చేయవలెను. మిగిలినది అంతయు ప్రాచీనావీతి కుడి భుజము మీదుగ జందెముధరించినవాడు. అప సవ్యముగా) అయి చేయవలెను.

అగ్నౌ కరణము చేయగా మిగిలిన హవిః శేషము నుండి ఆరు పిండములను చేయవలెను. ఎడమ చేతితో నూపు లతో కూడిన ఉదక పాత్రను పట్టుకొనవలెను. పిమ్మట అపసవ్యము చేసికొని దర్భలతో రేఖను (నిలువుగా దక్షిణాగ్రము లుగా దర్భలను పరచుట) చేయవలెను. పిమ్మట చేతితో దర్విని పట్టుకొని దానితో ఆ చోటు అవనేజనము (నీటితో తడు పుట) చేయవలెను. ఇది యంతయు దక్షిణ ముఖముగా తిరిగియే చేయవలెను. తరువాత దర్బల పై ఒక్కొక్క పిండ మునే వారివారి నామ గోత్రములను చెప్పుచు ఉంచవలెను. తరువాత లేపభాక్కుల చేతికి అంటుకొనిన పిండపు అంటు అర్పించుటతోనే తృప్తిపడవలసిన వారు.) నిమిత్త్రమై శ్రాద్ధకర్త ఆదర్భల పై తన చేతులను కొద్ది నీటితో కడుగుకొన వలెను. తరువాత మరల ప్రత్యవనేజనము (మరల నీటితో తడుపుట) చేయవలెను. గంధ ధూపములు దీపము నైవేద్యము మొదలగు అర్చనలతో పిండములను అర్చించి వాటిని నమస్కరించవలెను. ఇది యంతయు వారివారి గృహ్య సూత్రము లందు చెప్పబడిన విధమున బ్రాహ్మణులందు విశ్వదేవులను పితృదేవతలను ఆవాహనము చేసి జరుపవలెను. ఏకాగ్ని యగు (వాన ప్రస్థుడగు) శ్రాద్ధకర్త మాత్రము ద్వితో ఒకే వడ్డన చేసిన చాలును.

ఇట్లు పురుషులగు పితరులకు పిండదానము చేసిన తరువాత వారి పత్నులకు దర్భలు మొదలైన వాటిని ఆ పిండములు మొదలైన వానిని ఆవాహనమును విసర్జనమును జరుపవలెను. తరువాత పిండముల నుండి అల్పాంశములను తీసికొని ప్రతియొక భాగమును భోక్తలచే తినిపించవలెను. ద్విజులయినవారు ఆగ్నియందు వేల్చగా మిగిలిన శేషమునే అగ్నౌ కరణము కానీ హోమము కాని చేసిన తరు వాతనే ఆహారమును తిందురు. కావున 'అట్టి అగ్ని హవన శేషమునకు ఆన్వాహార్యకము అని పేరు. కనుక భోక్తలకు హవన శేషము కాని ఆన్న మును తినిపించరాదు. మొదట భోక్తల హస్తమున పవిత్రముతో కూడ తీందక మును విడువవలెను. తరువాత ఆ పిండ మాతను పిండపుతునుకను) 'స్వధా ఏషాం అస్తు' అని చెప్పుచు వారి చేతియందుంచవలేను. ఎల్లప్పుడును అన్నము పవిత్రముగాను, ఉష్ణముగాను ఉండునట్లు చూచి ఆ విషయమును వర్ణించుచు భోక్తలచే భుజింపజేయవలెను. త్వర పెట్టుట కాని క్రోధము కాని లేకుండ హరినామస్మరణ చేయుచు భోక్తలను భుజింపజేయవలెను. వారు భుజించి తృప్తి నొందినట్లు తెలిసిన తరువాత వికి నాన్న మును వారి దగ్గర (సమంత్రకముగా) ఉంచ వలెను. ఉదకముతో కూడ అన్నము తీసికొని నీటిని మాత్రము భూమి పై వదలవలేను. వారు భుజించి హస్తములు పాదములు కడుగుకొని) ఆచమించిన తరువాత మరల జలముతో కూడిన పుష్ప ములను అక్ష తోదకమును వారి హ సములందు వదలవలేను.

ఈ స్వస్తి వాచ నిక ము (శుభమును కలిగించుట కే చేయు ప్రక్రియ) అంతయు పిండముల మీద చేయవలెను. శ్రాద్ధ ప్రక్రియ అంతయు వి శ్వేదేవులతో ఆరంభించి వారితోనే ముగియునట్లు జరుపవలేను. లేనిచో శ్రాద్ధ నాశము జరుగును.

 భోక్తలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పవలెను. వారికి ప్రదక్షిణము చేయవలెను. తరువాత దక్షిణ దిశగా తిరిగి పితృ దేవతలను ఉద్దేశించి ఇట్లు వేడుకొనవలెను. “తమంతట తామే ఇచ్చు) మా దాతలు వృద్ధి నొందుదురు గాక ! మా వేద సంతతి పరంపర) వర్ధిల్లుగాక ! మా చిత్త్రములందు శ్రద్ధ (ఆస్తికతా బుద్ది తొలగక నిలిచియుండుగాక ! మేము అధికముగా దానము చేయుదుముగాక ! మాకు అన్నము అధికముగా లభించుగాక ! మా ఆతిథ్యము అందు కొనుటకు అతిథులును మాకు లభింతురుగాక ! మమ్ములను యాచించు వారు (చాల మంది) ఉందురుగాక ! మేము ఎవ్వ రిని యాగింపకుందుముగాక  అయాచితముగా వచ్చిన దానితో తృప్తి నొందెదము గాక !)”

ఇది అన్యాహార్య పూర్వకమగు పార్వణ శ్రాద్ధ విధానము. ఈ ప్రక్రియ అమావాస్య నాడు జరుపవలసిన శ్రాద్దమునకు సంబంధించినది. ఇతర పర్వ దినములందును పార్వణ శ్రాద్దము ఇట్లే జరుపవలెను. ద్దము అంతయు ముగిసిన తరువాత పిండములను గోవులకో మేకలకో బ్రాహ్మణులకో తినుటకు ఈయ వలేను. లేదా అగ్ని లోనో నీటిలోనో వేయవలెను. బ్రాహ్మణుల ముందయినను వెద జల్లవలేను. పక్షుల కై న ఆహారముగా వేయవలెను. శ్రాద్ధ కర్తయొక్క భార్య మాత్రము నడిమి పిండమును వినయముతో తినవలెను. తినునప్పుడు “ఓ పితృ దేవతలారా ! నా గర్భమున పద్మ మాలికల ధరించు కుమారుని కలుగ జేయుడు." భో కలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పి పంపువరకు ఉచ్ఛేషణమును (ఎంగిళ్ళను) ఉంచవలెను. తరువాత అది తీసి శుద్ది చేయవచ్చును.)

ఇట్లు పితృ కార్యము ముగిసిన తరువాత వైశ్వ దేవమును జరుపవలెను. తరువాత కర్త తన ఇష్టులతో కలిసి పితృ శేషమును భుజించవలెను శాద దినమున ( శ్రాద్ధకరగాని శ్రాద్దమున భోక్తగా ఉండువారు కాని ఈ చెప్పబోవు పోనిని చేయరాదు: మరల భోజనము చేయుట-దారి ప్రయాణము చేయుట-వాహనముల పై పయనించుట శ్రమ కలిగించు పనులు -శ్రీ సంగమము-స్వాధ్యాయము కలహము-విరోధపు పనులు-పగటి నిద్ర- ఇవి చేయకూడదు. ప్రత్యాబ్దిక శ్రాద్ధమును కూడ ఇదే విధముగా జరుపవలెను. సూర్యుడు కన్యా కుంభ వృషభ రాసులలో ఉండ గాను ఏ కృష్ణ పక్షమునందే కాని సపిండికరణము జరుపు సందర్భములందు కాని అగ్ని మంతుడు అగువాడు (సంన్యాసి కాక మిగిలిన ఆశ్రమముల వారు) ఇట్లే శ్రాద్దము జరుపవలేను.

ఇది శ్రీమత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున కొద్ది కల్పమున నియంత్రణాది కథనమను షోడశాధ్యాయము.