మత్స్య మహా పురాణము

Table of Contents

207 - సావిత్ర్యుపాఖ్యానము-సావిత్రి సత్యవంతునితో వనమునకు పోవుట.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: అనంతరము అమిత విక్రముడగు మనురాజు పతివ్రతల మాహాత్మ్యమును తత్సంబంధినియగు కథను తెలుపుమని దేవేశుడగు మత్స్యుని ఇట్లడిగేను: పతివ్రతలలో శ్రేష్ట ఎవరు? ఏ పతివ్రత మృత్యు వును జయించెను? ఏ పతివ్రతా నామమును నరులు సదా కీర్తించదగును? సర్వ పాపక్షయకరమగు ఈ విషయమును నాకు తెలుపుము: ఆనగా మత్యుడు ఇట్లు చెప్పెను; ధర్మరాజు కూడ పతివ్రతలగు స్త్రీలకు ప్రతికూలమాచరించడు; ధర్మజ్ఞా? ఆతనికి కూడ వారు పూజ్యలే; ఈ విషయమున నీకు పాప ప్రణాశనమును స్త్రీ తన భర్తను మృత్యు పాశము నుండి విడిపించిన తీరును తెలుపునదియునగు కథను తెలుపుదును; పూర్వము మద్రదేశములందు శాకల వంశమున అశ్వ పతియను రాజుం డెను; ఆతడు ఆపుత్తుడై సంతాపమందుచు పుత్తారియై సర్వకామ ప్రదాయినియు ద్విజులచే రక్షించ (ఆరాధించ) బడునదియునగు సావిత్రి నారాధించెను; నూరుమంది ద్విజులు పది మాసములపాటు తెల్లని ఆవలతో ఆమె నుద్దేశించియజించిన తరువాత ఒక చతుర్థి తిథినాడు ఆమె రాజునకు సాక్షాత్కరించెను; రాజన్! నీవు నిరంతరముగా నాకు భక్తుడవయియుంటివి; నీకు ఉత్తమయగు పు తొని ఇత్తును; ఇట్లు నా ప్రసాదముచే ఈయబడిన శోభనయగు పుత్తిని నీవు పొందగలవు; ప్రణతుడగు ఆ రాజుతో ఈమాత్రము చెప్పి ఓ మను చక్రవర్తీ! . ఆదేవి మరపువలె అదృశ్య అయ్యెను; ఆ రాజునకు మాలతీయను పతివ్రతయగు పత్ని యుండెను! ఆమె రూపమున సావిత్రీ దేవిని పోలు సుతను కనెను; సావిత్రి ప్రీతితో ఈయబడిన సుత ఆమెవలె రూపవతి యగుట ఉచిత మేక దా! అందుచే ఈమె పేరు సావిత్రి అగుగాకయని నృపతి విప్రులతో ననేను; వారును ఆమె పేరు సావిత్రియని అంగీకరించిరి.

ఆమె యౌవనవతి యగుటచూచి తండ్రి ఆమెను సత్యవంతునకిచ్చెను; తరువాత నారదుడు దీ ప్రతేజస్కుడగు ఆ రాజుతో ఈ నృప పుత్రుడు ఇక సంవత్సరములో క్షీణాయుడు (మృతుడు) ఆగును; రాజా! కన్యను బాగుగా ఆలో చీంచియే (వరునకు) ఈయవలెను. అనేను; అయినను ఆనరాధిపుడు శుభుడు అని ఆద్యుమత్సేన పుత్తునకు (సత్యవంతునకు) తన కన్యనిచ్చెను; సావిత్రియును తనభర్త దగ్గరకుపోయి ఆద్యుమత్సేన రాజగృహమున (నగరమందు కాదు) వసమందే. తాను నారద వచనములతో మనస్సునందు బాధపడుచుండియు.ఆ త్తమామలకు శుశ్రూష చేయుచుండెను; నరాధిపుడగు ద్యుమత్సేనుడు రాజ్యభ్రష్టుడును కండ్లు లేని వాడునునై రాజపుత్తియగు ఈ కోడలిని పొందియు నంతుష్టుడు కాకపోయెను; (ఈమెయు తమతోపాటు క్లేశ పడుచున్నందులకతడు బాధనందుచుండెను;) ఋషులారా! ఇక నాలుగవవాడు సత్యవంతుడు మరణించుననగా ఆ రాజపుత్రి సావిత్రి ధర్మజ్ఞ కావున మూడహోరాత్రములు ఉపవసించెను; ఇక ఆ (నాలుగవ) దినమున ఆమె మనోహర ములగు పూలుదాల్చి ఫలములు తిని వనమునకు పోయెను; అడిగినది కాద నినచో ఆమే ఏమనుకొనునో యని భయపడు మామగారి అనుమతితో సావిత్రి ఆర్త అయియు తన మనస్సునందలి మహాభయమును బయలుపడనీయక బాధనందు మనస్సుతోనే భర్తతో కలిసి మహా వనమునకు పోయెను; వనమందామె వృక్షచ్ఛాయ నాశ్రయించి కూర్చున్న భర్తను (మీకు ఎట్లున్నదని ఆడిగెను; నృవీరుడగు అతడును వనమందుండి శ్రమనందిన - పంకజ పత నేత్రయగు ఆ రాజపుత్తిని ఆమెకు వనమందలి వృక్షములను చూపుచు ఓదా ర్చెను; (మనస్సునకుల్లాసము కలిగించేను.)

ఇది శ్రీమత్స్యమహాపురాణమున సావిత్ర్యుపాఖ్యానమున సావిత్రితో కూడి సత్యవంతుడు వనమున కేగుట యను రెండువందల ఏడవ యధ్యాయము.