మత్స్య మహా పురాణము

Table of Contents

246 - వరాహావతారము - దైనందిన ప్రళయ కథనము.

అర్జునుడు శౌనకునిట్లడిగెను; ఆమిత తేజస్కుడగు విష్ణుని ప్రాదుర్భావ (అవతారములను పురాణముల యందుండి చెప్పుచుండిన పెద్దలవలన ‘వారాహ' మను దానిని కూడ వినియుంటిమి; మనీషి (సర్వజ్ఞుడు) అగు ఆవరాహుని చరిత మును విధానమును విస్తర మును కర్మగుణ సంస్థానమును నేను ఎరుగను; వరాహుడు కిమాత్మకుడు? వరాహుని ఆత్మ తత్వము మూర్తి దేవతా ప్రమాణము ప్రభావము ఈతడు పూర్వము చేసిన కృత్యములు ఈ మొదలగు వరాహోత్పత్తి విస్తరమును యాథార్థ్యముతో నాకును విశ్లేషించి ఇట కూడి యున్న బ్రాహ్మణులకును తెలియజెప్పుము. అన శౌనకుడిట్లనెను: అద్భుత కర్ముడగు కృష్ణుడు మహా వరాహు డై చేసిన చరితములను తెలుపు వేదసమానమగు పురాణ కథను ఇదిగో! నీకు తెలుపుచున్నాను; రాజన్! ఈ నారాయణుడు ఉదార ములగు శ్రుతులు అనబడు ఛందోమయ వాక్కులతో అలంకృతుడు; ఈతడు వారాహ దేహమాశ్రయించి సముద్రస్థయైయున్న భూమిని తన కోరతో పైకెత్తెను; విజయాః ఇపుడు అది ప్రసన్న మగు మనస్సుతో వినీ ఎరుగుము; ఈ వరాహ వృత్తాంతము పురాణము (ప్రాచీనతమము) పర మము పుణ్యము వేద సమానము; నానా శ్రుతి ప్రతిపాదితార్థములతో సమాయుక్తము; ఈ మహా వరాహ చరితార్థమును అఖిల పురాణములతో కూడ వేదమును కృత్స్న (నిః శేష)ముగ విధాన సహితముగా సాంఖ్యమును యోగమును ఎరిగినవాడు మాత్రమే చెప్పగలడు.

విశ్వ దేవులు సాధ్యులు రుద్రులు ఆదిత్యులు అశ్వినులు ప్రజా పతులు సప్త మహర్షులుకి పసువులు మరుతులు గంధర్వ యక్షరాక్షస పిశాచ నాగులు పరమాత్ముని మనః సంకల్పమున కలిగిన పూర్వజులగు ఋషులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర మ్లేచ్ఛులు చతుష్పాత్తులు వందల కొలది తిర్యగ్యోవిగత ప్రాణులు జంగమములు (సంచారులు) అగు సకల ప్రాణులు జీవసంజ్ఞగల ఇతర సకల ప్రాణి వర్గమును ఇందలి దేహులును.ఏదికలదో-దానినంతటిని దివ్య యుగ సహస్రాంత కాలాంతము ముగియగానే బ్రహ్మ దీసము గడువగానే సర్వభూత నిర్వాణ (నాశ)ము తెలుపు సర్వోత్పాతము లును కలుగగానే వృషా కపి (ధర్మ రక్షకుడు) అగు విష్ణుడు జ్వాలాత్రయ యుక్తుడగు ఆగ్ని యయి తన జ్వాలతో దహిం చును; అంతట ఉన్న తములగు ఆతని తేజోరాశులచే దహింపబడుచు, వివర్ణములును దగ్ధంగములును జ్వాలా యు కము లగు ఆ అగ్ని నోళ్లతో హతములును నగుచు వేద వేదాంగో పనిషత్పురాణేతిహాస ప్రముఖ సర్వ విద్యలును సర్వ క్రియ లును నర్వ ధర్మ పరాయణులు త్రయస్త్రింశత్కోటి సర్వదేవ గణములును విశ్వతో ముఖుడును లోక ప్రభవ (జన్మ) హేతువునునగు బ్రహ్మను ముందుంచుకొని ఆ అహము సృష్టి కాలావధియగు బ్రహ్మ దినము) ముగియగానే మహాతత్వ రూపుడును అక్షరుడును మహాత్ముడును ప్రభుడును నారాయణుడు జీవులకు ఆశ్రయుడు)ను నగుహరియందు ప్రవేశించును.

ఆవి మరల ప్రవృత్తినందగానే ఆ ప్రవృత్తి సృష్టియనబడును; ఇట్టి నిధనము (నాశము) ఉత్పత్తి ఈ రెండును సూర్యుని ఉదయాస్తమనముల వంటివి; దివ్య యుగ సహస్రాంతమగు కల్పము పూర్ణముకాగా సర్వము నిః శేషమగును; అనగా నిః శేషమగు జీవ జాతకర్మ జాతము పరమాత్మునందు ప్రవేశించి నిలుచును; అపుడు జగత్పతియగు భగవానుడు దేవాసురనాగాది నకల జీవులనుపసంహరించి తన యందుంచుకొని తానొక్కడే ఉండును; సర్వభూత స్రష్ట అవ్య యుడు శాశ్వతుడునగు ఆ దేవుడు ఆయా కల్పాంతములందు పునః పునః ఈ జగమునంతటిని ఇట్లు చేయుచునే యుండును; ఇట్లు లోకమందు ఆర్క కిరణములు చంద్రాది గ్రహములు ధూమము అగ్ని పవనుడు యజములు వషట్కారములు పక్ష్మి గణ సంఘాతము లేక పోగా మార్గములన్నియు సర్వప్రాణి హర ములుకాగా జగము రౌద్ర రూపమును మర్యొద్ రహిత మునై కల్లోలితము కాగా అంతయు అంధకారావృతముకాగా సర్వలోక మదృశ్యముకాగా సర్వకర్మలు అభావమందగా సర్వ సంఘర్షములు ప్రశాంతములుకాగా వైరము లందుటయు నశించగా లోకమంతయు నారాయణాత్మకమయి తన స్వస్వ భావమున నిలిచి యుండగా పరమేష్ఠి (ఉన్నత స్థానమందుండువాడు)హృషీ కేశుడునగు హరిశయనించ నారంభించె(చు)ను; అతడు పీతాంబరుడు రక్త నేత్రుడు మేఘ సమాన నీలవర్ణుడు జ్వాలా సహస్ర వికాసియగు జటా భారము కలవాడు శ్రీవత్స లాంఛనముతో రక్త చందనముతో భూషితము అగు వక్షము కలవాడు మహా బాహుడు మెరపులతో అలంకృతమగు మేఘము వంటివాడు; అపుడతని శరీరము వేలకొలదిగ పద్మములతో కూర్చిన మాలతో ప్రకాశించు చుండును; అతని పత్ని యగు లక్ష్మీదేవి ఆతని దేహ మావరించి యుండును.

అంతట శాంతాత్మురు సర్వలోక సుఖావహుడు అమిత యోగాత్ముడుఅగు అతడు నిద్రారూపయోగ మాశ్రయించి సుపుడగును; ఆంతట మరల దివ్యయుగ సహనము ముగియగా విబుధులకు (దేవతలకు మహా జ్ఞానులకు) అధిపతియగు ఆవిభుడు స్వయముగానే విభుడు (విశేషముగా ప్రకాశించువాడు) అయి మేల్కాంచును: లోకకర్తయగు ఆతడు మరల లోక సృష్టి సాలోచించును; తన పర మేష్టి కార్యమునక నువుగా సర్వదేవ గణములను నరులను సమితింజయుడు (సర్వ యుద్ద విజేత)గా వారివిషయమున తాను చేయవలసిన కృత్యములను ఆలోచించి సజ్జనులకు గమ్యస్థానమగు ఆ ప్రభువు నర్వలోక సంభవమును (సృష్టిని) ఆచరించును; ఆ నారాయణుడే సృష్టి కర్తవికర్త (మార్పునొందించువాడు, పోషించువాడు) సంహరించువాడు ప్రజాపతియును పరమసత్యమును పరమపదమును పరమయజ్ఞమును ఆతడేయని శాస్త్రప్రమాణములతోను ఆనుభవముతోను తెలియవలయును; దేవతలును ఎరుగవలసినదితనినేయనీయు ఆతని ఏతత్వము - నెరుగవలయునో దానిని ఎరుగకున్నారనియు దేవతలును సర్వప్రజాపతి ఋషులును ఆతని అంతము నేరుగకున్నారనియు. వేదాదిశాస్త్రములు చెప్పుచున్న వి; ఈతని పరమ (తాత్త్విక) రూపమును దేవతలును చూడకున్నా రు; వారును ప్రాదుర్భావ ముల (అవతారములందు అతడ్ముచూపు రూపము నేకానీ చూపని వాస్తవ రూపమును చూడజాలరు; అట్టిదానినెవరు వెదకి చూడగలరు? అతడు నర్వభూతగ్రామణి (శ్రేష్టుడు); అగ్ని వాయువులకును ఆశ్రయుడు-తేజమునకును అంధకారమునకును నిధానరూపుడు; ఆశ్రమచతుష్టయ ధర్మాధిపతి; చాతురోత్రయజ్ఞ ఫలముననుభవించువాడు - అనుభవింపజేయువాడు - చతుస్సాగర పర్యంతుడు చతుర్యుగ (దివ్యమహాయుగ)నివర్తకుడు సృష్టినిలయమందించువాడు); అట్టి ఇతడు జగత్సంహార మొనర్చి దానిని తనయందు నిలుపు కోని మహాయోగియై తనయందట్లు దివ్యవర సహస్రకాలము నిలుపుకొన్న ఆండ మును మరల వదలు(లే)ను; ఇదియేసృష్టి. ప్రజాపతియు ప్రభుడునగు అతడు తనకుతానై (ఆసహాయుడై ) సురాసుర విప్రనాగాప్సరో వృఔషధి పర్వత యక్షగుహ్యక సంకులమగు ఈ జగమంతయు నృజించె(చు)ను.

ఇది శ్రీమత్స్యమహాపురాణము వరాహ చరిత్రమున ప్రళయ ప్రతిపాదనమను రెండు వందల నలువదియారవ అధ్యాయము.