మత్స్య మహా పురాణము

Table of Contents

138 - విద్యున్మాలి వధాది కథ

మేరు పర్వతపు కాంతులవంటి కాంతుల మొలకలతో సహస్ర కిరణుడు రవి ఉదయించెను. దేవ దానవుల బలములు రెండును ప్రళయకాల సాగరములవలె ధ్వనింపసాగెను. అంతట సహ స నేత్రుడును శతుపురముల భేదించిన పొడును మహాశక్తిశాలియు నగు ఇంద్ర దేవుడును త్రిపుర దాహమునకు సన్నద్ధుడయ్యెను. హరుడును మహేంద్రునితో వరుణునితో కూడి త్రిపుర దుర్గమునకు బయలుదేరెను. శత్రువులను మిగుల మథించగల వారును నానా విధ రూపులు నగు ప్రమథులు భయంకర సింహనాదములతో వాద్య ధ్వనులతో యుద్ధమునకు బయలు వెడలిరి. మ్రోగుచున్న వాద్యములతో ఛత్తములతో ధ్వజములతో ఒప్పు ఆ దివ్య దేవతా సేన వనమే కదలిపోవుచున్నట్లు కనబడెను. భయంకరమగు ఆ రుద్ర సేన వచ్చి పడుచుండుట చూచి దానవ శ్రేష్ఠులును సముద్రమువలె సంక్షోభిల్లసాగిరి. వా రెల్లరును ప్రాసములు ఖడ్గములు పట్టనములు శ క్త్యాయుధములు శూలములు గండ్ర గొడ్డండ్రు బాణములు ఖడ్గ విశేషములు ధనువులు వజ్రములు బరువైన ఇనుప రోకళ్లు తీసికొని కోపముతో కండ్లెర్ర చేసి రెక్కలుగల కొండలవలే కనబడుచుండిరి. ఆ దానవులు ఏనుగులవలె వర్షాకాల మేఘములవలె బయలుదేరి విద్యున్మాలి కడకు వచ్చి తగిన సమయమున ఆతని నమస్కరించి 'నమస్తే' అని పలికి సింహగర్జనలు చేసిరి. దేవతల నుద్దేశించి అర చిరి. వారందరును పూర్వము ఇంద్రుని ఎదుర్కొన సిద్దపడిన పర్వతముల వలే మరణించుటకై న జయించుటకైన సిద్దపడి దృఢ నిశ్చయముతో నుండిరి. వారు భయంకరముగ గర్జిల్లు మేఘముల వలె నుండిరి. వా రెల్లరు మేఘముల కాంతులవంటి కాంతిక లవారు; బుద్ధిశాలురు; యుద్ధమున నేర్పరులు. ఇంతలో దేవ దానవుల నడుమ యుద్ధ షరంభ మాయెను. వా రొకరి కొకరు ఆయుధములతో అపకారము చేసికొనసాగిరి. చంద్రుని వలే ప్రకాశించుచు ప్రజ్వలించుచున్న ఆయుధములు చేతుల దాల్చి పొగలు గ్రక్కు చున్న అగ్నులవలె నుండిరి. కోపము తోను యుద్ధమునందలి పేరాసతోను ఒకరి సింకొకరు చూర్ణము చేసికొనుచుండిరి. వారు వజ్రపు దెబ్బలతో చక్రాయుధాఘాత ములతో బాణ ప్రయోగములతో ముక్కలయి చీలిక లు సముద్ర జలమున పడిపోవుచుండిరి. ప్రమథులును దేవతలును కూడ మాలిక లు దండలు హారములు తెగి వస్త్ర భూషణములు జారిపడి సముద్రములో తిమితి మింగిల నకాది జల జంతు పుల నోళ్లలో పడుచుండిరి.

నందికేశ్వర విద్యున్మాలినోర్యుద్దమ్

(*సాగరంలజ్ఘయేద్దోర్భ్యాం)

గదలు ముసలములు తోమరములు ప్రాసములు గుర్రములు వజ్రములు బాలములు, ఋషులు (చిన్న ఖడ్గములు) కొండరాళ్లు దేవతలచే దానవులచే ప్రయోగింపబడి రవి సమాన కాంతులను పొగలను కక్కుచు మహారాసులై సముద్రములో పడు చుండెను. అవి పడునపుడు వేగము తగ్గుచు పోయి జల జంతువులపై పడి వాటిని నశింప జేయు చుండెను. ఇది ఏనుగుల పోరిలో వాటి నడుమ అల్ప జంతువులు సలిగి చచ్చినట్లుండెను.

అంతలో మెరపులతో మెరయు మేఘము అదే విధమగు మేఘము నేదుర్కొన్నట్లు విద్యున్మాలి నందిని ఎదుర్కొనుటకై అతనివైపునకు పరుగున పోయేను. యుద్ధమున నిశ్చితాభిప్రాయముకల ఆదానవుడు తన పేరు తెలుపుచు శీలాద పుత్రుడగు నందీశ్వరునితో “ఓయీ! నాకు యుద్ధమనిన మక్కువ ఎక్కువ; బలవంతుడనగు నేను యుద్దా కాంక్షినై నీతో పోరవచ్చితిని. నీవు ఇపుడిక ప్రాణాలతో పోజాలవు.' అనెను. అతని ఈ పలుకులు విని మహా తపస్వియగు నందీశ్వరుడు నవ్వుచు వాక్యాలంకార భూషితమగు వాక్యమిట్లు పలికెను: “ఓయీ! మీరు దానవులు కదా! మావంటివారు దమము (ఇంద్రియశాంతి) కోరువారమయినను అట్టి దానికిది సమయము కాదు. నీజాతి సహజ స్వభావముతో బడాయి మాటలు పలుకుచున్నా వేకాని నీవు నన్ను చంపగలవాడవా? ఇదివరకే యుద్ధములో ఎందర నో దానవుల చంపిన నేను నీవంశమునే నాశము చేయ పుట్టిన నిన్ను చంపక ఎట్లు విడువగలను?' అనగా విద్యున్మాలి నందితో ఓయీ! ఆకాశమును భుజములతో పట్టగలవాడును సూర్యుని క్రింద పడగొట్టగలవాడును గూడ నన్ను కన్నులతో చూడనై న జాలడు.' అనుచునే-నందితో బలమున సాటికానీ ఆ దానవుడు. ఏనుగు తన తొండముతో మేఘమును చీల్చినట్లు ఒక బాణముతో నందిని గ్రుచ్చెను. ఆ బాణము-రవి తన కిరణములతో సముద్ర జలమును త్రావినట్లు. నంది రక్తమును త్రావెను. ఆ దెబ్బతో రోషించిన నంది గజేంద్రుడువలె వృక్ష మొకటి పెకలించి విద్యున్మాలి పై విసరెను.

ఆ వృక్షము నంది హ సమునుండి విద్యున్మాలి దగ్గరకు వచ్చులోపుగనే వాడు ప్రయోగించిన బాణపు దెబ్బలతో దాని పూవులన్నియు రాలిపోయేను. వాని బాణముతో ఛిన్న మయి ఆది మహావేగమున గరుడునివలె కింద పడెను. ఆది చూచి ఉత్తమ చూర్తిగల నందీశ్వరుడు మిగుల కోపించి రవికర నదృశమగు తన కరమే శ్రీ మహిషము మీదికి పరుగెత్తు గజేంద్రునివలె విద్యున్మాలి మీదకు పరుగే తేను. వేగమున వాయు సమానుడును బలశాలియునగు. ఆ విద్యున్మాలి మహావేగమున తన పైకి వచ్చు నందీశ్వరుని వందలకొలది శరములతో నింపేను. అట్లు గాయపడి నంది. తన శరీరమంతయు ఆ బాణములతో గగుర్పాటు చెందినదివలే కనబడుచుండ మహావేగమున వచ్చి విద్యున్మాలి రథమును తీసికొని మహావేగమున ఆటనుండి పోయి గిర గిర తిప్పివే నెను. దానిచే ఆ రథము ముని శాపమున సూర్యునితో కూడ పడిపోయిన రవి రథము వలే పడిపోయేను. విద్యున్మాలియును పడిపోవుచున్న ఆ రథమునుండి తన మాయా బలమున తప్పించుకొని బయటపడి అచ్చటనే నిలిచియున్న నందీశ్వరుని శ క్త్యా యుధముతో కొట్టి గాయపర చేను. ప్రమథ శ్రేష్టుడగు ఆనందియును తన గాయపు నెత్తుటితో తడిసిన ఆశ క్తినే లాగి ఆ దానవుని పై విసరగా వాని కవచమును హృదయమును, బ్రద్దలయి పాడు వజపుదెబ్బ తినిన పర్వతమువలె క్రింద పడిపోయేను. అది చూచి సిద్దులును చార ణులును కిన్నరులును 'సాధు-సాధు' 'బాగు-బాగు' అని పలికి శివునికడకు పోయిరి. విద్యున్మాలి మృతి విని కోపించి మయుడు ప్రజ్వలించు అగ్ని ఎండుగడ్డిని వలె ప్రమథ సేనను కాల్చేను. శూలముతో రొమ్ములు చీలిక లయి గదలతో తలలు పగిలి గాఢముగా బాణపు దెబ్బలుతిని ప్రమథలు సముద్రమున పడుచుండిరి. ఆది చూచి ఇంద్రయను కుబేర నంది షణ్ముఖులు దానవ పర శ్రేష్టుడగు ముయుని వివిధ శస్త్ర గణములు ప్రయోగించి కొట్టిరి. నాగాధిపతి గరుత్మంతుని చీల్చినట్లు మయుడు శ్రేష్ట బాణములతో యము: కుబేరుని చీల్చి గంభీర మేఘమువలె ప్రకాశించెను. అంతట ప్రమ థులును దేవతలును ఏక మే దానవులను కొట్టగా వారు తామెంత ఉత్తమ దర్పము విక్రమము కలవారయినను ఆయుధపు దెబ్బల వ్యథ అధికము కాగా పూర్వము విష్ణుని చేతిలో దెబ్బలు తినిన అసురులవలెనే యుద్దము వదలి త్రిపురదుర్గమున ప్రవేశించిరి. అంతట దేవ సేనలోనుండి శంఖములు తప్పెటలు సరాలు ఢంకలు సింహనాదములు ఆక సమునుండి పడుచున్న పిడుగుల మోతలు వెలువడి దానవుల గుండెలు బద్దలు చేయసాగెను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున త్రిపుడోపాఖ్యానమున విద్యున్మాలి వధ వృత్తాంతమును నూట ముప్పది ఎనిమిదవ అధ్యాయము.