మత్స్య మహా పురాణము

Table of Contents

277 - గోసహస్ర ప్రదాన విధానము.

శ్రీమత్యుడు మనువుతో నిట్లు చేప్పెను: ఇపుడిక క్రమములో రావలసిన గోసహ న ప్రదానమను సర్వ పాప హరమును శుభకరము నగు అను (మహో)త్తమ మహాదానమును తేలి పెదను; యుగాది మన్వంతరాదుల వంటి పుణ్యకర శుభతిథియందు పయోవ్రతుడై (క్షీర మాత్రాహారుడై) త్రిరాత్రముకాని ఏక రాత్రముకొని ఉండవలెను; తరువాత తులా వురుష దానమందువలే లోకపాలా వాహనము జరుపవలెను; అట్లే పుణ్యాహవాచన హోమములు జరుపవలెను; ఋత్విజులను మండపమును సంభారములను వస్త్రభూషణాదిక మును సమకూర్చు కోనవలెను; వేదికా మధ్యమందు లవణనంయుక్తమగు వృక్షముననే దేవతామూర్తికివలె) అధివాసనము జరుపవలేను; దానమునకై నిర్ణయించుకొన్న వేయి గోవులనుండి పదింటిని వేరుగ తీసికొనుచు మిగిలిన వానిని బయట నిలువబెట్టవలయును; వీనిని వస్త్రమాల్య విలేపన సువర్ణ శృంగా భరణములతో వెండి కాలిగిట్టలతో అలంకరించి లోపల ప్రవేశింపజేసి వానిని వస్త్రమాల్యములతో పూజించవలెను; బంగరు. చిరుగంటలు పాలు పిదుకు కంచు పాత్రలు బంగరు తిలకములు బంగరు మొగపు పట్టేలు అలంకరించి పట్టు వస్త్రములతో వానిని కప్పి మాల్యములు చుట్టి గంధములు పూసీ కనకరత్నమయ శృంగము అలంకరించి చామరపు కుచ్చులు కొమ్ముల నడుమ కట్టి అలంకరించవలయును; పాదుకలు పాదరక్షలు ఛత్రములు పాత్రలు ఆసనములు ఈపదింటిలో ప్రతియొక దానితో పాటు వేరువేరుగ నుంచవలయును; వీని నడుమ కాంచన నంది కేశ్వరు డుండవలెను; అతనిని నూరు, పలములకు -మూడు వేల వలములకు నడుమనుండు తూకపు బంగారుతో చేయించవలేను; మిగిలిన పొనిలో మరి నూరు గోవులకును నడుమ ఇందు పదియవవంతు తూకముతో ఇదియంత యు చేయించవలెను; ఈ నందిని పట్టు బట్టలతో చుట్టి నానా భరణములతో భూషించి పూలతో చెరకు గడలతో ఫలములతో ద్రోణ (తూమెడు)పరిమాణమగు ఉప్పు కల పాత్రయందు పై భాగమున (నూతన వస్త్రము పై) ఉంచవలెను.

శుభసమయమున (ముహూర్తమునందు) యజమామడు మంగళ వాద్య గీత వాద్య ధ్వనుల నడుమ వేద పారంగతు లగు బ్రాహ్మణ శ్రేష్టులచేత సర్వౌషదీ జలములతో స్నానము చేయించబడి దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్రము నుచ్చ రించవలెను.

“విశ్వమూర్తులను విశ్వమాతలును లోకాధివాసినులు (ఆన్ని లోక భాగ ములను అధిష్టించియుండువారును) నగు రోహిణీ రూపలగు ధేనువులకు (మీకు) నమస్సు; *ఇరువది యొక లోకములును బ్రహ్మాది దేవతలును గోవుల ఆవయవము లందుండును; ఇటువంటి రోహిణీ మాతలు మమ్ము రక్షింతురు గాక! [‘రోహిణి’ ఆనగా ఆయా ఓషధులను. పుష్టి నిచ్చు ఆహారతత్వములను. మొలపించి వృద్ధి నందించగల చంద్ర స్థితశక్తి; గోవులయందును ఆ రోహిణీశ క్తి రూపొంది యున్నది.] గోపులు నాకు ముందుండు గాక ! గోవులు నా వెనుక నుండుగాక! గోవులు నా శిరమందుండు గాక! నేను గోవుల నడుమనే వసింతును (వసించుచున్నాను.) వృష రూపముతో నున్న గోవా! నీవు సనాతన(శాశ్వత)ధర్మ మవు! కావున ఇటువంటి నీవు అష్టమూర్తి పంచభూతములు రవిచంద్రులు యజమానుడు నను ఎనిమిది రూపులతో నున్న శివు నకు ఆశ్రయమయి (వృషభ రూపమున వాహనమవయి) యున్నావు; కావున సనాతనా! నన్ను రక్షించుము.”

ఇట్లామంత్రించి తరువాత ఆచార్యునకు (గురునకు-ప్రధాన ఋత్విజునకు నంది కేశ్వరుని సర్వోపకరణములను ఒక గోవును ఈయవలెను; పది గోవులలోను ఒక్కొక్క దానిని ఒక్కొక్క ఋత్విజునకు ఈయవలయును; మిగిలిన వానిలో ఒక్కొక్క బ్రాహ్మణునకు నూరేసియో ఏబదేసియో ఇరువదేసియో ఐదేసియో ఆచార్యు ననుమతితో ఈయవలెను; ఒక గోపు ననేకులకు కలిపి ఈయరాదు; అది బహు దోషకరము; ఒకనికే అనేక గోవుల నీయవచ్చును; అది ఆరోగ్యమును శ్రీని వృద్ధిపరచును; ఇట్లు గోసహస్రదానమయిన తరువాత దాత ఒక నాడంతయు పయోవ్రతుడై (క్షీర మాత్రాహారుడై) యుండవలయును:  

(*ఇరువదియొక లోకములను ఏవి ఏవి గ్రహించవలయును-అనునది సంప్రదాయము ఎరిగినవారినుండి గ్రహించవలయును. దీని వ్యవస్థ బహు విధములుగానున్నది.)

దాత ఆనాడు మహాదానాను కీర్తనమును తాను వినవలయును; ఇతరులకు వినిపించవలయును; దాన దినమున బ్రహ్మచర్యముతో నుండవలయును: దీనిచే విపుల కలుగును; ఎవరు ఆ విధానమున గోసహస్ర ప్రదులగుదురో వారు సర్వపాప వినిర్ముక్తులయి సిద్ద చారణ సేవితులై చిరుమువ్వలగములు మాలలుగా వ్రేలాడుచుండు రవి ప్రకాశ విమానము పైకెక్కి సర్వలోక పాల లోకములకును ఏగి అందు నర్విమర పూజితుడగుచు పుత్త పౌ త సమన్వితుడై ఒక్కొక్క లోక పాల లోకమందొక్కోక్క మన్వంతర కాలముండును: తరువాత ఊర్ధ్వసప్త లోకములలో ఒక్కొక్క దాని యందొక్కొక్క మన్వంతరముండి యనంతరము శివపుర మేగును; తన నూటొక్కమంది పితరులను తరింప జేయును; అందు పూర్ణముగ నూరు కల్పములుండి ఆనంతరము భూలోకమున శివధ్యాన పరాయణుడగు చకవ రియై జనించి నూరశ్వమేధములాచరించి తుదకు విష్ణులోకమును చేరి బంధముక్తుడగును.

“గోసహస్ర ప్రదానమును తానే చేసికొని ఆ కార్యమునందు తానును కర్మకరుడే పాలుగొని కాని అది ఎవరైన చేయుచుండగా చూచి కాని మమ్ము ఈ సంసార సాగరమునుండి తరింపజేయు వాడు మావంశమున పౌతడో దౌహితుడో పుట్టినచో బాగుగా నుండును.” అని పితరులు గోసహన ప్రదాతను అభినందించుచుందురు; ఈ గోనహస ప్రధాన విధాన మును పఠించినను సం స్మరించుచుండినను చూచికను విష్ణులోక ప్రాప్తుడగును; సంతోషములనందును; ముక్తినందును; కలుషములు బోత్తుగా ఏమియు లేకుండ నశించగా నిర్మలదేహు (జన్ము)డై ఇంద్రలోక మున కేగి సుఖమందును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున గోసహస్ర ప్రధానిక మను రెండు వందల డెబ్బది యేడవ అధ్యాయము.