మత్స్య మహా పురాణము
15 - దానవాదులును నాలుగు వర్ణములవారును అర్చించు పితరుల వృత్తాంతము - (బర్హిషద్-సుకాలి-హవిష్మత్-ఆజ్యప-సోమప-పితరుల చరితము)
సూతుడు ఇంకను ఇట్లు చెప్పనారంభించెను: ద్యులోకమునందు శోభనమగు వర్చస్సు (కాంతి కలిగిన మరి కొన్ని లోకములు గలవు. వాని పేరు విభాజములు. వానియందే సువతులు ఉత్త్రమ నియమానుష్టాన పరులు) అగు బరి షదులు అను " పితరులు నివసింతురు. వానియందు నెమళ్ళచే మోయబడు విమానములు వేలకొలదిగా ఉండును. ఈ పితరులు వానియందు కూర్చుండి సంచరింతురు. (బరి -సద్ జబర్హిషద్ - నెమిళ్ళపై కూర్చుండువారు. ఆ లోకముల యందలి పితృ దేవతల విషయములో చక్కగా ఆచరింపబడిన యజ్ఞములు (శ్రాద్ధములు) బ ర్టిస్-యజ్ఞము) విశేషముగా ఫలములను ఇచ్చునవియగును. వారినుద్దేశించి శ్రాద్ధములను ఆచరించిన వారు అభ్యుదయ శాలల ప్రాపంచిక సుఖముల నిచ్చెడు గృహముల) జ ందు ఆనందింతురు. వీరిని అసుర దానవ గంధర్వాపరో యక్షర క్షోగణముల వారును ద్యులోకమునందలి దేవతలను ఆరాధింతురు. వీరు పులస్త్య ప్రజాపతి కుమారులు. తపస్సు చేతను యోగసాధనము చేతను కలిగిన నూర్ల కొలది శక్తులు కలవారు. మహాత్ములును మహాభాగులును భక్తులకు అభయమును ఇచ్చువారును, వీరి మానసీకన్య పీవరి అను పేరుతో ద్యు ---కమున ప్రసిద్ధయైయున్నది. ఈమె యోగమున కే తల్లి అనదగిన యోగిని. ఈమె మిగల భయంకరమగు తపస్సాచరించెను. భగవానుడగు హరి ఆమె ననుగ్రహి) చెను. , పురుషోత్త్రమా! నీకు నా యందు అనుగ్రహము కలిగినచో నాకు యోగసిద్ధి కలవాడును సుందరుడును విజితేంద్రియుడును అగు భర్తను ఇమ్ము! ఆని ఆమె వరము కోరెను. హరి ఇట్లు పలి కెను. “ముందుముందు వ్యాసునకు శుకుడను కుమారుడు కలుగును. అతడు యోగాచార్యుడు. నీవు ఆచరించిన ఈ సుతపోవ్రతముకు ఫలముగా నీకు అతడు భర్తయగును. యోగిని కాగల కృత్రి ఆను కూతురు నీకు కలుగును. నీవామెను మానవుడగు పాంచాల దేశ రాజునకు ఇమ్ము . ఆమెకు బ్రహ్మదత్తుడను కుమారుడు కలుగును. అతనికినీ యోగసిద్దులగు కుమారులు కలుగుదురు. నీకు కృష్ణుడు గౌరుడు ప్రభుడు శంభుడు అను కుమారులు కలుగుదురు. వారు మహాత్ములును మహాభాగులునే పరమపదమును చేరుకొందురు. ఇట్టి కుమారులకు తల్లివే నీవు నీ భర్తతో కూడ మోక్షమును పొందుదువు.”
ఇది అమూర్తులు-మూర్తి లేనివారు) ఆగు పితృ దేవతా గణముల విషయము.
[ ఇచట మూలములో పండ్రెండవ శ్లోకమున మొదట "అమూర్తి మంత:” అని యున్నది. ఇది తప్పు. యే మూర్తి మంతః' అని ఉండవలెను. అనువాదకుడు. ఇక మూర్తి మంతులగు పితృదేవతల విషయము. సుకాలిన్ అను పేరుగల పితృదేవతల గణమువారు వసిష్ఠుని మానసపుత్త్రలు. వారందరును ధర్మమూర్తులు. వారు ద్యులోక మునకు పైగా ఉన్న 'జ్యోతిర్భాసి' (నక్షత్రాది జ్యోతిస్సులతో ప్రకాశించు) లోకములందు నివసింతురు. తమ పూర్వులనుద్దేశించి శ్రాద్ధము లను జరిపిన శూద్రులై నను ఈ లోకములందు విమానముల పై ప్రకాశించుచు క్రీడించుచు వివిధ భోగములను అనుభవించు చుందురు. ఇక భ క్తిమంతులై సరిగా కర్మలను అనుష్టించువారై శ్రాద్ధములను జరుపు బ్రాహ్మణుల విషయము చెప్ప వలసిన దేమున్నది? గౌః అను పేరుకల వారి మానసపుత్రి డ్యులోకమున ప్రకాశించుచుండును. ఆమె శుక్రునకు ప్రియ భార్యయయ్యెను. ఆమె సాధ్యులను దేవతలకు కీర్తిని వర్ధిల్లజేయునది. ( ఈ పితృదేవతా గణమును విప్రులారాధింతురు.)
సూర్యమండలమునందు 'మరీచి గర్బములు’ తమ అంతర్భాగమునందు కిరణములు కలవి) అను లోకములు గలవు. అంగిరః ప్రజాపతికి పుత్రులగు బర్హిష్మంతులను పితృ దేవతలు ఈ లోకములందు వసింతురు. తీర్థ శ్రాద్ధములను జరుపు క్షత్రియ । శేషులు ఈ లోకములకు పోవుదురు. ఈ పితరులు క్షత్రియులకు స్వర్గ మోక్షఫలములను ఇత్తురు. వీరి మానసపుత్రి యశోద అను పేర లోకప్రసిద్ధురాలు. ఈమే పంచ జనుని కుమారుడగు అంశుమంతుని భార్య. దిలీపుని తల్లి. భగీరథుని నాయనమ్మ.
కోరిన భోగఫలములను ఇచ్చు 'కామదుఘములు' అను లోకములు కలవు. సత్కర్మములను అనుష్ఠించువారు ఆజ్యపులు అను పితృదేవతలు ఈలోకములందు వసింతురు. వీరు కర్దమ ప్రజాపతి కుమారులును పులహుని కుమారులును. వీరినీ వైశ్యులారాధింతురు. వీరిని ఆరాధించినవారు ఈ లోకములకు పోయి అచ్చట తమ పూర్వమృతులగు తల్లులు సోదరులు మేనత్త్రలు మిత్రులు వియ్యాలవారు ఇతర బంధువులు మొదలగువారు. అప్పటికి పదివేల జన్మలను ఎత్తిన వారే నను వేలకొలది ఏయే విధములుగా పోరిని తాము చూచి అనుభవము పొందియున్నారో అదే విధములుగా వారిని చూడగలుగుదురు. వీరి మానసపు తి విరజ అను పేర ప్రసిద్ధురాలు. ఈమె తరువాత నహుషుని భార్య. యయాతికి తల్లి ఆయ్యెను. ఈమె బ్రహ్మలోకమునకు చేరిన తరువాత “ఏకాష్టక' అను పేర ప్రసిద్ధురాలయ్యేను. ఇట్లు మూర్తిమంతము లగు మూడు పితృగణముల వృత్తాంతము చెప్పుటయైనది నాలుగవ గణము విషయము వినుడు.
బ్రహ్మదేవుని నగరమునందు మానసములు అనులోకములు కలవు. నర్మద అను మానసపు కి తండ్రులగు సోమపులు అను పితృదేవతలు ఈ లోకములందు నివసింతురు. వీరు అందరును ధర్మచూర్తిని ధరించినవారు. శాశ్వతులు, బ్రహ్మకు పైస్థానమునందుండు వారు. వీరు ‘స్వధ'నుఁ డి జనించిరి. యోగసిద్ధిచే బ్రహ్మత్వమును పొందిరి. సృష్టి మొదలగు వ్యాపారములను నిర్వహించి ఇప్పుడు మానస లోక ముందున్నారు. వారి మానసపు తియగు నర్మద నీటిని ప్రవ హింపజేయుచు నదిగానై నది. ఆమే దక్షిణాపథము (వింధ్యకు దక్షిణమునందు ఉన్న భారత దేశము) నందు ప్రవహించుచు ప్రాణులను పవిత్రులనుగా చేయుచున్నది..
ప్రజాపతులు తాము చేసిన ప్రజా సృష్టులలో ఈ పితృదేవతల నుండియే మనువులనందరను సృజించిరి. ఈ విషయమును ఎరిగి జనులు ఏ యజ్ఞయాగాది ధర్మము నైనను ఆచరించినను ఆచరించకున్న ను ఎల్లప్పుడును శ్రాద్ధము లను మాత్రమాచరించవలెను. వారి అనుగ్రహమువలననే మరల ప్రజలు యోగసిద్ధిని నిరంతరముగా (అవిచ్చిన్న ముగా) పొందగలరు. ఏలయన ఆదిసృష్టియందు జనులు అనుష్ఠింపవలసిన కర్మముగా పితృశ్రాద్ధమే విధింపబడినది.
అన్ని వర్ణములవారు పెట్టు శ్రాద్ధములందును రజత (వెండితో చేసి ) పాత్ర మే పితృప్రీతికరము. పితృ దేవతలనుద్దేశించి సమర్పించు ఏపదార్తమునై నను ఏవర్ణము వారైనను రజత పాత్రమునందే సమర్పించవలెను.) పితరుల నుద్దేశించి ఏది సమర్పించినను స్వధాకార పూర్వకముగా ఈయవలెను. సంప్రదాయమును . ఎరిగినవారు ఆగ్నీషోములకును యమునకును (అగ్ని ష్వాత్తులకు అని మరియొక విధముగ పాఠము) శ్రాద్దదానము చే తృప్తిని కలిగించవలెను. ఇది అగ్ని యున్న చో అగ్నియందును లేనిచో విప్రుని చేతియందో జలమునందో మేక చెవియందో గుర్రపు చెవియందో గోవులు నిలుచు స్థానమునందో శివ సన్నిధియందో చేయవచ్చును. దక్షిణదిశ పితరులకు ప్రశస్తమయిన స్థానము (దిక్కు).
ప్రాచీనావీతము (కుడి భుజము మీదకు ధరించిన యజ్ఞోపవీతము) ఉదకము నూవులు సవ్యమయిన (ఎడమవై పు) అవయవము దర్భలు కూర్మమాంసము ఆవుపాలు మధురరస ద్రవ్యములు ఖడ్గమృగపు మాంసము తేనే చామలు అను వడ్ల బియ్యము వరిబియ్యము యవలు నివ్వరి బియ్యము పెసలు చెరకు బెల్లము పూవులు నేయి ఇవి ఎల్లపుడును పితృ దేవతలకు ప్రియములై నవియు ప్రశస్తములై నవియును. కనుక శ్రాద్ధమున ఇవి గ్రహించదగినవి. విడువదగినవి - ప్పెదను వినుము. చిరు సెనగలు నెనగలు అనుషులు బొబ్బరలు ఉలవలు తామర పూవు బిల్వము జిల్లేడు ఉమ్మెత్త్ర వేప అడ్డసరము మేకల గొర్రెలపాలు కొర్రలు అడవి కొర్రలు దానిమ్మ వెలగ ఇప్ప అవిసె గింజలు ఇవి శ్రాద్ధమునందు వినియోగించకూడదు. అట్లు చేయుటచే వారి అనుగ్రహము కలుగదు. శోభ సిరి తగ్గును. భ క్తిచే పితరులను తృప్తిపరచిన వానిని పితరులును సంతృప్తి పర తురు. పితరులు తుష్టి చెందినచో వారు కర్తకు గూడ తుష్టిని స్వర్గమును ఆరోగ్యమును సంతానమును ఫలముగా ఇతురు.
దేవకార్యముకం టెసు పితృకార్యము విశిష్టతరమయినది. దేవతలను తృప్తిపర చుటకంటెను ముందు పితరులను తృప్తి పరచవలయును. పితృదేవతలు శీఘ్రముగా అనుగ్రహించు పొరును క్రోధము లేనివారును మిగుల శాంతులును స్థిరముగా నిలిచియుండు సుహృద్భావము ( అనుగ్రహము) కలవారును శుద సత్వగుణ ప్రధానమగు చిత్త్రవృత్తి కల వారును దేహమునను చిత్త్రమునను శుచిత్వమునందు శ్రద్ధ కలవారును ఎల్లప్పుడు ప్రీతికరముగా మాటలాడు వారును భక్తులయందు ప్రీతికలవారును వారికీ సుఖమును ఇచ్చువారును ఐయున్నారు. ఇంత ఏల? వారు దేవతలలో మొదటివారు. సూర్యుడు హవిష్మంతులు అను పితృదేవతల ఆధిపతిత్వము కలవాడును శ్రాద్ధ కర్మానుష్టానమునకు అధిష్టాన దేవతయునై యున్నాడు.
మహర్షులారా! మీకు నేను పితృవంశాను కీర్తనము అంతయు చెప్పితిని. ఇది పుణ్యకరము.పవిత్రమయినది. ఆయుష్యమును వృద్ధి చేయునది. మానవులు ఎల్లప్పుడును కీర్తింపదగినది.
ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున పితృగణ గణనమను పంచదశాధ్యాయము.
